ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ రోజు ఇచ్చిన ఒక తీర్పులో సంచలన కామెంట్స్ చేసింది. బిల్డ్ ఏపి కేసు సందర్భంగా, జస్టిస్ రాకేశ్ కుమార్ ఆ కేసు నుంచి తప్పుకోవాలి అంటూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ వాదిస్తూ, తాను అనని మాటలు అన్నట్లుగా చెప్తూ, తప్పుడు అఫిడవిట్ ఇచ్చిన కారణంగా, ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ మీద కేసు నమోదు చేయాలని, క్రిమినల్ కేసు పెట్టాలని, ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ సందర్భంగా ఇచ్చిన తీర్పులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదే పదే రాజ్యాంగ వ్యవస్థలతో ఎలా వ్యవాహరిస్తుందో ప్రస్తావించారు. అయితే ఇదే సందర్భంలో జగన్ మోహన్ రెడ్డి తీరు పై కూడా నిప్పులు చెరిగారు. తనకు జగన్ మోహన్ రెడ్డి అంటే ఎవరో తెలియని టైంలో, ఎవరో ఒక నెంబర్ కొడితే చాలు, అతని వివరాలు వస్తాయని చెప్తే, గూగుల్ లో ఆ నెంబర్ కొడితే, తన హిస్టరీ తెలిసింది అని, రకరకాల చరిత్రలు తెలిసాయని అన్నారు. రాజ్యాంగ వ్యవస్థలతో ఆడుకునేలా ప్రభుత్వం తీరు ఉందని జస్టిస్ రాకేశ్ కుమార్ వ్యాఖ్యానించింది. అంతే కాదు, సుప్రీం కోర్టు తీరు పై కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేసారు. అమరావతి కేసు విచారణలో ఉండగా, సుప్రీం కోర్టు, చీఫ్ జస్టిస్ లను బదిలీ చేయటం గురించి ప్రస్తావిస్తూ, హైకోర్టు జడ్జిలు కూడా రాజ్యాంగపరమైన హక్కులు ఉంటాయని గుర్తించాలని ఆ తీర్పులో తెలిపారు.
సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణ బెంచ్, ప్రజాప్రతినిధుల పై కేసులు విషయంలో విచారణ చేయాలని ఆదేశాలు ఇచ్చిన తరువాత, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని జగన్ మోహన్ రెడ్డి పై ఏడు కేసులు కొట్టేసారని, ఇదేమి న్యాయం అని తన తీర్పులో తెలిపారు. ముందుగా కౌన్సిల్ ని రద్దు చేసారని, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పై చేసిన విషయాలు, ఇప్పుడు కోర్టు మీదకు కూడా వచ్చారని అన్నారు. 55 పేజీల సుదీర్ఘ తీర్పులో అనేక సంచలన విషయాలు ఈ ఆర్డర్ కాపీలో ఉన్నాయి. ముఖ్యంగా జగన్ పై చేసిన వ్యాఖ్యలు, గూగుల్ లో ఆయన ఖైదీ నెంబర్ కొడితే వచ్చిన వివరాలు, ఈ ఆర్డర్ కాపీలో పెట్టారు. ఇది కాక, ఎన్వీ రమణ ఆదేశాలు తరువాత, జగన్ పై ఉన్న ఏడు కేసులు తొలగించటం పై, ఇందులో ప్రత్యేకంగా ప్రస్తావించారు. తాను చేయని వ్యాఖ్యలు చేసినట్టుగా చెప్తూ, ఎలా చేసింది, అసలు ఈ పరిణామాలు ఎందుకు వచ్చాయో చెప్తూ, సుదీర్ఘంగా తన 55 పేజీల ఆర్డర్ కాపీలో తెలిపారు. జస్టిస్ రాకేశ్ కుమార్, రేపు రిటైర్డ్ అవుతారని తెలుస్తుంది. రిటైర్డ్ అయ్యే ముందు, ఆయన ఇచ్చిన ఈ తీర్పు, ఇప్పుడు ప్రకంపనలు రేపుతుంది. మరి ఎప్పటి లాగే అధికార పార్టీ ఎదురు దాడి చేస్తుందో, లేక సరి చేసుకుంటుందో చూడాలి.