ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాల పై అనేక సంఘటనలు జరుగుతున్నాయి. చిన్న చిన్న దేవాలయాలతో పాటు, అంతర్వేది, కనకదుర్గమ్మ గుడిలో కూడా కొనసాగాయి. అయితే ఏవో చిన్న సంఘటనలు తప్ప, పెద్దగా ఎవరినీ పట్టుకుంది లేదు. ఇక నాలుగు రోజులు క్రిందట రామతీర్ధంలో, రాములోరి తలని దుండగులు పెకిలించి, దగ్గరలోనే ఉన్న సరస్సులో ఆ తల పడేసారు. అయితే ఆ తల దొరకటానికి కూడా రెండు రోజులు పట్టింది. ఎవరు చేసారో ఇప్పటికీ తెలియదు. అయితే ఈ ఘటన జరిగిన తరువాత కూడా, మళ్ళీ నిన్న రెండు సంఘటనలు జరిగాయి. ప్రభుత్వం సీరియస్ గా తెసుకోకపోవటం, పోలీసులు దుండగులని పట్టుకోకపోవటంతో, చంద్రబాబు రంగంలోకి దిగారు. రామతీర్ధం ఘటనను సీరియస్ గా తీసుకున్నారు. నేరుగా రంగంలోకి దిగితే ప్రభుత్వం మీద ఒత్తిడి వస్తుందని, అటు పోలీసులు మీద కూడా ఒత్తిడి పెరిగి, ఇలాంటి ఘటనలు జరగకుండా చూడవచ్చు అని అనుకున్నారు. ఈ రోజు చంద్రబాబు విజయనగరం పర్యటనకు వెళ్లనున్నారు. ఇప్పటికే ఆయన అమరావతి నుంచి బయలు దేరి వైజాగ్ వెళ్లారు. వైజాగ్ నుంచి బై రోడ్డు ఆయన వెళ్లనున్నారు. అయితే చంద్రబాబు పర్యటనకు వస్తున్నారని తెలుసుకుని, ఎందుకో కానీ విజయసాయి రెడ్డి బుజాలు తడుముకోవటం మొదలు పెట్టారు. ఆయన ఎందుకు ఇలా చేస్తున్నారో ఎవరికీ అర్ధం కావటం లేదు.

vsreddy 02012021 2

నిన్న చంద్రబాబు పర్యటన ఖరారు అవ్వగానే, విజయసాయి రెడ్డి మాట్లాడుతూ, రామతీర్ధం ఘటన చంద్రబాబు, లోకేష్ చేపించారని అన్నారు. అయితే ఇదేదో రాజకీయ ఆరోపణలే, చంద్రబాబు వస్తున్నారని ఇలా చేసి ఉంటారని అందరూ అనుకున్నారు. అయితే ఈ రోజు అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. చంద్రబాబు కంటే ముందే రామతీర్ధం వెళ్ళటానికి విజయసాయి రెడ్డి ప్లాన్ చేసుకోవటం అందరినీ ఆశ్చర్య పరిచింది. చంద్రబాబు వస్తున్నారని తెలిసి, ఇప్పటికిప్పుడు ఇలా రావటం ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఇంత దారుణంగా రాజకీయాలు ఉంటాయా అనే విధంగా విజయసాయి రెడ్డి ప్రవర్తన ఉందని టిడిపి నేతలు అంటున్నారు. ఇప్పటి వరకు అనేక చోట్ల దేవాలయాల పై ఘటనలు జరిగితే, ఈ రోజు మాత్రమే విజయసాయి రెడ్డి ఎందుకు వస్తున్నారో ఎవరికీ అర్ధం కావటం లేదు. అసలు ఈ ఘటన మొత్తంలో విజయసాయి రెడ్డి ఎందుకు ఇంత ఓవర్ రియాక్ట్ అవుతున్నారు అనేది కూడా ప్రజల్లో చర్చకు దారి తీసింది. మరి చంద్రబాబు పర్యటన సవ్యంగా సాగుతుందో లేదో చూడాలి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలవరం మేము పూర్తి చేస్తాం, బట్టలు పెడతాం, టేపు పెట్టి కోలుసుకోండి, అదీ ఇదీ అంటూ, అసెంబ్లీలో, బయట ప్రెస్ మీట్లలో చేసే హడావిడి అందరూ చూస్తున్నాం. ముఖ్యంగా చంద్రబాబు హయాంలో 72 శాతం పోలవరం పనులు అయితే, అప్పుడు అయ్యింది కేవలం 30 శాతం, మేమే ఈ 20 నెలల్లో పూర్తీ చేసాం అంటూ చెప్పుకొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఇలా ఉంటే పునరావాసం పై కూడా ఎన్నో కబ్రులు చెప్పారు. గతంలో జగన్ ప్రతిపక్షంలో ఉండగా, చంద్రబాబు సరైన ప్యాకేజి ఇవ్వటం లేదని, తాను ముఖ్యమంత్రి అయితే, ఎకరానికి 10 లక్షలు ఇస్తానని చెప్పారు. ఇలా ఎన్నో మాటలు చెప్పారు. అయితే ఈ 20 నెలల్లో ఒక్కరికి కూడా రూపాయి ఇచ్చింది లేదు. గతంలో చంద్రబాబు హయాంలో కట్టిన కాలనీలు పనులు కూడా ఆపేశారు. అక్కడ కూడా పనులు ఏమి జరగటం లేదు. పునారవాసం ఆగిపోయింది, భూసేకరణ లేదు, ఇలా మొత్తం ఎక్కడికక్కడ ఆగిపోయినా, మేము చేసేస్తాం, నీళ్ళు ఇచ్చేస్తాం, ఇదీ అదీ అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్తూ, ప్రతిపక్షం గొంతు నొక్కేసింది అధికార పక్షం. అయితే పై నుంచి వచ్చిన పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మాత్రం, అసలు గుట్టు విప్పేసింది. మీరు చెప్పే దానికి, గ్రౌండ్ లో జరుగుతున్న పనులకు సంబంధం లేదు కదా అని కడిగి పారేసింది.

polavaram 010120201 2

41.15 మీటర్లకు, 17600 ఇళ్లు నిర్మించాల్సి ఉండగా, గతంలో 11, 000 గృహాలు అయ్యాయి. మిగతా 6,600ఇళ్ళలో, 2,600 వరకు చివరి స్టేజ్ లో ఉన్నాయి. అయితే మిగతా నాలుగు వేల ఇళ్లు, మార్చి నాటికి పూర్తీ చేస్తాం అంటూ, ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి చెప్పింది. అయితే ప్రభుత్వం చెప్పిన లెక్క పై పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ నమ్మలేదు. మూడు నెలల్లో నాలుగు వేల ఇళ్లు ఎలా కట్టగలరని ప్రశ్నించింది. వాటి గురించి మీ ప్రణాలికి ఏమిటి అని అడిగితే , ఇప్పటి వరకు ఇవ్వలేదని, ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించింది. సహాయ, పునరావాస పనులు పూర్తి చేస్తే తప్ప, కఫార్ డ్యాం అనుమతులు ఇవ్వమని తేల్చి చెప్పింది. అలాగే, 45.72 మీటర్లకు, 1,67,339.33 ఎకరాలు సేకరించాల్సి ఉండగా, ఇంకా 56 వేల ఎకరాలు పెండింగ్ లో ఉందని, ఇవన్నీ డిసెంబర్ నాటికి పూర్తి చేస్తారా అని ప్రశ్నించింది. అలాగే 1,05,601 కుటుంబాలకు ఇళ్లు కట్టాలని అంటున్నారని, కానీ ఇప్పటికి 3,110 ఇళ్లు మాత్రమే కట్టారని, మిగతావి డిసెంబర్ నాటికి ఎలా కడతారని ప్రశ్నించింది. అలాగే నిధులు పై కూడా చర్చ జరిగింది. మొత్తానికి ప్రభుత్వం చెప్తున్న దానికి, వాస్తవానికి చాలా తేడా ఉంది.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి, రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ కు మరోసారి పిలుపు వచ్చింది. ఒక కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. గతంలో మూడు సార్లు డీజీపీకి హైకోర్టు రమ్మని ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒకసారి చంద్రబాబుని వైజాగ్ లో అడ్డుకున్న సమయంలో, ఆ సమయంలో డీజీపీని కోర్టులోనే ఆ సెక్షన్ కు సంబంధించిన వివరాలు చదవమని ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఒకసారి హెర్బ్స్ కార్పస్ పిటీషన్ల విషయంలో కూడా డీజీపీ ఒకసారి హైకోర్టుకు హాజరు అయ్యారు. ఇకమరో కేసులో కూడా డీజీపీ హైకోర్టు ముందుకు వచ్చారు. అయితే ఇప్పుడు మరో కేసులో డీజీపీని రమ్మని హైకోర్టు ఆదేశాలు ఇవ్వటం చర్చనీయంసం అయ్యింది. మంగళవారం హైకోర్టులో ఒక కేసు విచారణ సందర్భంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రామారావు అనే ఒక ఏఎస్ఐని సిఐగా ప్రమోషన్ ఇచ్చే విషయంలో ఆయన కోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా కోర్టులో వ్యాజ్యం వేయగా, కోర్టు సిఐగా ప్రమోషన్ ఇచ్చే ప్యానెల్లో ఆయనకు అవకాసం ఉందొ లేదో అనే అంశం పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పోలీస్ సఖ అమలు చేయలేదు అంటూ, ఏఎస్ఐ రామారావు మరోసారి కోర్టు ముందుకు వచ్చారు.

hc 01012021 2

ఈ సందర్భంగా ఆయన కోర్టు ధిక్కరణ పిటీషన్ వేసారు. హైకోర్టు తన పదోన్నతి విషయంలో పరిగణలోకి తీసుకోవాలని చెప్పినా, ఆ అంశం గురించి పట్టించుకోలేదు అంటూ కోర్టు దిక్కరణ పిటీషన్ దాఖలు చేసారు. ఈ వ్యాజ్యం పై, మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు ఈ వ్యజ్యంలోని ప్రతి వాదులకు నోటీసులు జారీ చేసింది. అయితే ఈ ప్రతివాదుల్లో హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, ఐజీలు, ఏలూరు రేంజ్‌ డీఐజీ ఉండగా, వీరిలో కేవలం ఏలూరు రేంజ్‌ డీఐజీ మోహన్‌రావు తరుపు న్యాయవాది మాత్రమే కోర్టు విచారణకు వచ్చారు. హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, ఐజీ తరుపు న్యాయవాదిని నియమించకపోవటంతో, న్యాయవాది రాక, ప్రతివాదులు కూడా రాకపోవటంతో కోర్టు సీరియస్ అయ్యింది. ఆ అధికారులు ముగ్గురికీ వ్యక్తిగత హాజరు నిమిత్తం ఫామ్‌-1 నోటీసు జారీచేశారు. హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్‌ విశ్వజీత్‌, డీజీపీ గౌతం సవాంగ్‌, ఐజీ మహేశ్‌చంద్ర లడ్డా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేస్తూ, కేసుని జనవరి 25కు వాయిదా వేసింది.

హైదరాబాద్ లో ఈ మధ్య ఒక ఘటన చోటు చేసుకుంది. కరణ్‌ కాన్సెప్ట్స్‌ అని, దరువు వెబ్ సైట్ అని నడిపే కరణ్‌రెడ్డి అనే వ్యక్తి పై హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. ఈ వ్యక్తిని పోలీసులు ఆర్రేస్ట్ చేసారు కూడా. అయితే ఈ కరణ్‌రెడ్డి అనే వ్యక్తి తెలంగాణాలో ఒక పార్టీకి, ఆంధ్రప్రదేశ్ లో ఒక పార్టీకి సన్నిహితుడుగా పేరు ఉంది. ఈయన ఆయా పార్టీలకు చేసిన సేవకు మెచ్చి ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో పదవి కూడా ఇచ్చారు. సహజంగా ఇలాంటి చోట పదవులకు డిమాండ్ ఉంటుంది. హేమా హేమీలు పోటీ పడుతూ ఉంటారు. అయితే అలాంటి చోట కూడా, ఇలాంటి వ్యక్తిని పంపించారు అంటే, అతని పరపతి అర్ధం అవుతుంది. అయితే ఇక్కడి వరకు ఎవరికీ అభ్యంతరం లేదు. ఎందుకుంటే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అయితే సదరు వ్యక్తి పై ఇప్పుడు హైదరాబద్ లో నమోదు అయిన కేసు చూసి అందరూ అవాక్కయ్యారు. హైదరాబాద్ తార్నాక ప్రాంతానికి చెందిన ఒక యువతితో, ఆ వ్యక్తి ఫేస్బుక్ ద్వారా సంబంధాలు పెంచుకున్నారు. తరువాత ఆమెను నమ్మించి, మోసం చేసారని, సదరు వ్యక్తితో పాటుగా, అతని భార్యా పై కూడా, ఆ యువతి బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్లో కేసు నమోదు చేసింది. దీంతో పోలీసులు పలు సెక్షన్ ల కింద కేసు నమోదు చేసారు.

ln 0101202000 2

అయితే తరువాత విచారణ చేసిన పోలీసులు, ఆ వ్యక్తిని నిన్న అరెస్ట్ చేసారు. యువతిని నమ్మించి మోసం చేసిన కేసులో, కరణ్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసారు. అయితే అతని భార్య పైన కూడా కేసు పెట్టగా, ఆమె పరారీలో ఉందని తెలుస్తుంది. బాధిత యువతికి వైద్య పరీక్షలు కోసం హాస్పిటల్ కు తరలించారు. అరెస్ట్ చేసిన కరణ్‌రెడ్డిని పోలీసులు రిమాండ్ కు తరలించారు. అయితే కరణ్‌రెడ్డి అనే వ్యక్తి టిటిడిలో మెంబెర్ కావటంతో, ఇలాంటి వ్యక్తికి తిరుమల లాంటి పవిత్రమైన చోట ఎలా చోటు ఇస్తారు అంటూ, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. అడుగడుగునా తిరుమలను అపవిత్రం చేస్తున్నారని, డిక్లరేషన్ దగ్గర నుంచి, మొన్నటి భక్తుల పై లాఠీ చార్జ్ వారకు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు అంటూ, ఆగ్రహం వ్యక్తం చేసారు. మహిళలను మోసం చేసే కామంధులకు, తిరుమల లాంటి చోట పదవి కట్టబెడతారా అంటూ లోకేష్ ప్రశ్నించారు. ఈ అరెస్ట్ అయిన కరణ్ రెడ్డి అనే వ్యక్తి టీటీడీ హైదరాబాద్ సలహా మండలి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఇప్పుడు మహిళలను మోసం చేస్తూ అరెస్ట్ అవ్వటం పై, తిరుమల లో ఇలాంటి వారికి పదవులు ఇవ్వటం పై, పలువురు ఆగ్రహం వక్తం చేస్తున్నారు.ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.

Advertisements

Latest Articles

Most Read