ఆంధ్రప్రదేశ్ లో వేల మంది పాస్టర్లకి, నెల నెలా ప్రభుత్వం 5 వేల రూపాయల చొప్పున జీతాలు ఇస్తున్నట్టుగా ఉన్న ఆ జాబితాను తప్పుబడుతూ, అనేక మంది దళిత ఎస్సీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారని, వాళ్ళు పాస్టర్లగా మళ్ళీ ప్రభుత్వం దగ్గర డబ్బు తీసుకుంటున్నారు అంటే, వాళ్ళు రిజర్వేషన్ కోల్పోవాలని గత కొన్ని రోజులుగా కొంత మంది వ్యక్తులు, కొన్ని సంఘాలు ఈ విషయం పై పోరాటం చేస్తున్నాయి. ఫోరం ఫర్ లీగల్ రైట్స్ అనే సంస్థ, అందప్రదేశ్ లో నెల నెలా ప్రభుత్వం వద్ద నుంచి సొమ్ము తీసుకుంటున్న పాస్టర్ల జాబితా సేకరించి, అందులో 65 శాతం మంది, రిజర్వేషన్లు పొందుతూ, వాళ్ళు మళ్ళీ పాస్టర్లగా డబ్బులు తీసుకుంటున్నారు, వాళ్ళు మతం మారారు అంటే రిజర్వేషన్ కోల్పోవాలని, వివరాలు తెలుపుతూ కేంద్రానికి లేఖ ద్వారా ఫిర్యాదు చేసారు. కేంద్రం సోషల్ జస్టిస్ మినిస్ట్రీ నుంచి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ లేఖ అందింది. ఇలా క్రీస్టియన్ లు గా మతం మారి కూడా, అటు రిజర్వేషన్ ఫలాలు, ఇటు పాస్టర్లకు ఇచ్చే డబ్బు నుంచి, రెండు వైపులా లబ్ది పొందుతున్న వారి పై చర్యలు తీసుకోవాలని కేంద్రం, రాష్ట్రాన్ని ఆదేశించింది. నకిలీ సర్టిఫికేట్ ల తో, ఈ లబ్ది పొందతున్న వారి పై చర్యలు తీసుకోవాలని కోరింది. క-రో-నా లాక్ డౌన్ సమయంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, పూజారులకు, మౌజన్లకు, పాస్టర్లకు 5 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.
అయితే పాస్టర్ల విషయంలో రెండు వైపులా లబ్ది పొందతున్నారని, వీరిని నిలువరించాలని ఫిర్యాదు అందింది. దీంతో వారి పై చర్యలు తీసుకోవాలని, ఆ వివరాలు మాకు పంపాలి అంటూ, కేంద్రం, రాష్ట్రాన్ని ఆదేశించింది. మొత్తం 29,800 మంది పాస్టర్లకు 5 వేలు ఇస్తుంటే, అందులో దాదాపుగా 70 శాతం, ఎస్సీ, ఓబీసి రిజర్వేషన్ల సర్టిఫికేట్ లు కలిగి ఉన్నారని, వారు రెండు వైపులా డబ్బులు తీసుకుంటున్నారని, పూర్తి వివరాలతో కేంద్రానికి నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక పైనే కేంద్రం స్పందించి, చర్యలు తీసుకోమని ఆదేశాలు ఇచ్చింది. 1950 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం, ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి, క్రైస్తవ మతం కానీ, ఇస్లాం మతం కానీ తీసుకుంటే, ఎస్సీ హోదా కోల్పోయి, ఎస్సీ రిజర్వేషన్ ద్వారా వచ్చే అన్ని కోల్పోతారు. అయితే రాష్ట్రంలో మతం మారినా, ఎస్సీ అని చెప్పుకుంటూ, ఆ ఫలాలు అనుభవిస్తూ, ఉద్యోగాలు, వివిధ పధకాలు పొందుతున్నారు అనేది ఆరోపణ. అయితే దీని పై వైసిపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు కూడా, ఇటీవిల ఈ అంశం పై పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. ఇదే అంశం పై ప్రధానికి కూడా లేఖ రాసారు. మరి దీని పై రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.