మన హక్కులు మనకు రాకపోతే, నిగ్గదీసి అడగాలి. రాజకీయలు పక్కన పెట్టి, మన హక్కుల కోసం పోరాడాలి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం, ఎప్పుడైతే కేంద్రం మోసం చేసిందని భావించారో, వెంటనే వారి పై యుద్ధం ప్రకటించారు. హోదా దగ్గర నుంచి, వివిధ విభజన హామీల పై నిలదీశారు. అయితే ఈ పోరాటంలో రాజకీయంగా నష్టపోయారు. పొతే పోయారు, రాష్ట్రం కోసం, మోడీ, అమిత్ షా లాంటి వారి పై పోరాటం చేసి, దేశ వ్యాప్తంగా వారికి వ్యతిరేకంగా పని చేసారు అనే పేరు వచ్చింది. రాష్ట్ర ఆత్మగౌరవం నిలబడింది. అయితే ఇప్పుడు వచ్చిన జగన్ మోహన్ రెడ్డి గారు, కేంద్రం మెడలు వంచేస్తానని అన్నారు. వంచింది లేదు , చివరకు గట్టిగా అడుగుతుంది కూడా లేదు. హోదా విషయం ఎప్పుడో మర్చిపోయారు, అమరావతిని మూడు ముక్కలు చేసాం కాబట్టి, ఇది కూడా కేంద్రాన్ని అడిగే పని లేదు. విభజన హామీలు ఏమి అయ్యయో కూడా తెలియదు. చివరకు ప్రకటించిన రైల్వే జోన్ కూడా అడ్రస్ లేదు. ఇలా అన్ని రకాలుగా కేంద్రం పై ఒత్తిడి లేదు. అయితే ఇవన్నీ పొతే పోయాయి, రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ఉంటే చాలని అందరూ అనుకున్నారు. అది ఒక్కటి సాధించినా జగన్ మోహన్ రెడ్డి చిరస్థాయిలో నిలిచి పోతారని అనుకున్నారు. ముఖ్యంగా చంద్రబ్బు ఇప్పటికే 70 శాతం పై గా పూర్తి చేసారు కాబట్టి, మిగతాది కేంద్రం సాయంతో పూర్తి చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ చివరకు పోలవరం విషయంలో కూడా కేంద్రం అన్యాయం చేసేసింది. అయితే, చివరకు ఈ విషయంలో కూడా జగన్ మోహన్ రెడ్డి వైపు నుంచి మౌనమే.
కేవలం ఒక ఉత్తరం రాసి ఊరుకున్నారు. బుగ్గన గారిని రెండు సార్లు ఢిల్లీ పంపించారు. ఇక అంతే , మిగతాది అంతా చంద్రబాబు నామ స్మరణే. చంద్రబాబు వల్లే కేంద్రం పోలవరం విషయంలో అన్యాయం చేసింది అంటూ పాట మార్చేసారు. చంద్రబాబు తప్పు చేసారే అనుకుందాం, అందుకేగా ఆయన్ను పక్కన పెట్టి, మీరు మెడలు వంచుతారని గెలిపించింది అంటే సౌండ్ లేదు. అయితే ఈ రోజు ఎట్టకేలకు పోలవరం విషయం పై జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. అయితే ఎక్కడా కేంద్రం ప్రస్తావన లేదు, కేంద్రం పోలవరం ప్రాజెక్ట్ కు చేస్తున్న అన్యాయం గురించి కనీసం ప్రస్తావించలేదు. 2022 ఖరీఫ్ నాటికి పోలవరం పూర్తి చేస్తాం అని అంటున్నారు. ఒక పక్క 18 నెలల నుంచి పనులు నత్తనడకన సాగుతున్నాయి. మరో పక్క కేంద్రం నిధులు ఇవ్వకపోగా, అంచనాలను 50 శాతానికి తగ్గించి. మరి ఈ తరుణంలో, 2022 ఖరీఫ్ నాటికి పోలవరం ఎలా పూర్తి చేస్తారు ? దాదాపుగా 30 వేల కోట్లు రాష్ట్రం పెట్టుకోగలదా ? అయినా మనకు పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అనేది హక్కు, ఆ హక్కు గురించి ప్రతి వేదిక పైన కేంద్రాన్ని నిలదీయాలి కానీ, ఇలా వారిని ఒక్క మాట కూడా అనకుండా ఉంటే, కేంద్రం పై ఏమి ఒత్తిడి ఉంటుంది ? చూద్దాం, నిజంగా 2022 ఖరీఫ్ నాటికి పోలవరం పూర్తి చేస్తారేమో.