సహజంగా క్వారీలలో గొడవలు, ఆధిపత్యం కోసం, ఆర్ధిక లావాదేవీల విషయంలో జరుగుతూ ఉంటాయి. ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు ఉంటూ ఉంటారు. సహజంగా ఇలాంటి వార్తలు మనం చూస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు మనం వింటున్న వార్త, ఆ క్వారాల్లో పని చేసే వారు ఆధిపత్యం కోసం గొడవ పడిన వార్త. కృష్ణా జిల్లా, కంచికచర్ల మండలంలో, అనేక రాళ్ళ క్వారీలు ఉన్నాయి. ఈ మధ్య అక్రమ మైనింగ్ కూడా జరుగుతుంది అంటూ తెలుగుదేశం పార్టీ నేతలు గొడవ చేసింది ఈ ప్రదేశంలోనే. అయితే అది వేరే వివాదం. దీనికి దానికి ఏమి సంబంధం లేదు. కంచికచర్ల మండలంలోని పరిటాలలో ఉన్న రాళ్ళ క్వారీలో ఈ రోజు గొడవ జరిగింది. ఇసుక స్టాక్ పాయింట్ సమీపంలో, ఈ రాళ్ల క్వారీ ఉంది. అయితే సీరియల్ లు, క్యు లైన్ల విషయంలో, టిప్పర్ల డ్రైవర్ల మధ్య గొడవ జరిగింది. చిన్నగా ప్రారంభం అయిన ఈ గొడవ, పెద్ద గొడవగా మారి, పోలీసులు వచ్చి, కలుగ చేసుకునే దాకా వచ్చింది.

సీరియల్ విషయంలో గొడవ జరగటంతో, డ్రైవర్లు రెండు గ్రూపులుగా విడిపోయారు. ఒకరి పై ఒకరు పిడి గుద్దులు గుడ్డుకున్నారు. తరువాత క్వారీలో ఉన్న రాళ్ళు రువ్వుకుంటూ , గందరగోళం సృష్టించారు. దీంతో పలువురు డ్రైవర్లకు గాయాలు అయ్యాయి. ఎంత సేపటికీ గొడవ సద్దుమణగక పోవటం, అలాగే అక్కడ ఉన్న నిర్వాహుకుల మాట వినకపోవటంతో, పోలీసులను పిలవాల్సి వచ్చింది. పోలీసులు వచ్చి, ఇరు వర్గాలను శాంతింప చేసారు. అయితే వారి పై కేసులు పెడతారా, లేదా అనే విషయం తెలియదు కానీ, గొడవ అయితే సద్దుమణగటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన వివరాలు, గొడవ జరిగిన తీరు, ఈ వీడియోలో చూడవచ్చు https://youtu.be/u3cWHjMnm0s

తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే మూల స్థంభాలనీ, ఏ కష్టం వచ్చినా అందుకోవడానికి ఎప్పుడు ముందుంటానని, అధైర్యపడవద్దని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో అనంతపురం లోని కోడూరు ఎస్సీ కాలనీకి చెం దిన టీడీపీ నాయకుడు నరసింహప్ప మృతిచెందగా ఆ కుటుంబానికి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అండగా నిలిచారు. బుధవారం మృతుడి కుటుంబ సభ్యులను ఫోనులో పరామర్శించి మనోధైర్యాన్ని అందించి రూ.1.5 లక్షలు సాయం అందించారు. ఎమ్మెల్యే బాలకృష్ణ ఆదేశాలతో బుధవారం చిలమత్తూరు మాజీ జడ్పీటీసీ లక్ష్మినారాయణరెడ్డి, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి దేమకేతపల్లి అంజినప్ప, కన్వీనర్ రంగారెడ్డి, బాలాజీ, డీఎన్. పాపన్న, బేకరీ గంగా ధర్, రజనీకాంత్, వెంకటేష్, అశ్వర్ణ, నంజుండ, సూ ర్యనారాయణ, గాజుల కిష్టప్ప, గంగాధర్, నరేష్, భాస్కర్, నరసింహులు తదితరులు బాధితుని ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఎమ్మెల్యే అందించి రూ.1.5 లక్షల ఫిక్సిడ్ డిపాజిట్ బాండును కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా మృతుడు కుటుంబ సభ్యులతో ఎ మ్మెల్యే బాలకృష్ణ ఫోన్లో మాట్లాడుతూ పిల్లలను బాగా చదివించుకోవాలని, అందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని అభయమిచ్చారు. అదే విధంగా స్థానిక నాయకులు ఆ కుటుంబానికి తమవంతుగా ఆర్థిక సాయం అందించారు. కుటుంబానికి అండగా నిలిచి నందుకు బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకి, స్థానిక టీడీపీ నాయకు లకు కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా తుమ్మలకుంటపల్లిలో అనా నాయకులు రోగ్యంతో బాధపడుతున్న టిడిపి నాయకుడు కోళ్ల గంగాధరప్ప ఇంటికి వెళ్లి పరామర్శించారు. వైద్యం ఖర్చుల కోసం ఎమ్మెల్యే అందించిన రూ. 10వేలను అందజేశారు. కష్టాల్లో ఉన్న ప్రతి కార్యకర్తను ఆదుకునేందుకు మా నాయకుడు ఎమ్మెల్యే బాలకృష్ణ సిద్ధంగా ఉంటాడని ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. ఆ ఫోన్ సంబాషణ ఇక్కడ వినవచ్చు. https://youtu.be/6HghgmExM0A

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో మరోసారి చుక్కు ఎదురైంది. అమరావతి ప్రాంతంలో ఉన్న తుళ్ళూరు మాజీ తహసీల్దార్ సుధీర్‍బాబు గతంలో, ఏపి రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని ఎంపిక చేసిన తరువాత, అక్కడున్న కొన్ని అసైన్డ్ భూములను, బ్రహ్మానందరెడ్డి అనే వ్యక్తికి అక్రమంగా కట్టబెట్టారని, ఈ మొత్తం కుట్రలో తుళ్ళూరు మాజీ తహసీల్దార్ సుధీర్‍బాబు కు భాగస్వామి అంటూ, ఏపి ప్రభుత్వం, ఆయన పైన కేసు నమోదు చేసింది. సిబిసిఐడి కేసు నమోదు చేసింది. అయితే సిఐడి నమోదు చేసిన కేసు పై హైకోర్టుకు వెళ్ళగా, ఈ కేసులో తదుపరి విచారణ వరకు, ఎటువంటి ఆక్షన్ తీసుకోవద్దు అంటూ, హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. అయితే హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాల పై, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే ఈ రోజు దీని పై సుప్రీం కోర్టు న్యాయస్థానం ముందు, పిటీషన్ విచారణకు వచ్చింది.

అయితే దీని పై వాదనలు వినిపించిన మాజీ తహసీల్దార్ సుధీర్‍బాబు తరుపు న్యాయవాది, ఈ విషయం పై హైకోర్టు కేవలం మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే ఇచ్చిందని, పూర్తి స్థాయి ఆదేశాలు ఇవ్వలేదు కాబట్టి, ఈ పిటీషన్ సుప్రీం కోర్టు ముందు విచారణ చెయ్యాల్సిన అవసరం లేదని, వాదించారు. న్యాయవాది వ్యాఖ్యలతో ఏకీభవించిన సుప్రీం కోర్టు, స్టే ఎత్తివేయటానికి నిరాకరించింది. అయితే దీని పై హైకోర్టుకు మాత్రం కొన్ని కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ విషయం పై ఒక వారం రోజుల్లో తుది నిర్ణయం తీసుకోవాలని, హైకోర్టుని సుప్రీం కోర్టు ఆదేశించింది. హైకోర్టు ఇచ్చే ఆదేశాలు తరువాత, ఆ విషయం పై అబ్యంతరాలు ఉంటే తమ వద్దు వస్తే, అప్పుడు ఈ సమస్య పై తగు ఆదేశాలు ఇస్తామని, అప్పటి వరకు స్టే ఎత్తివేయటం కుదరదని, ప్రభుత్వం వేసిన పిటీషన్ ను సుప్రీం తోసి పుచ్చింది. ఒక వేళ హైకోర్టు వారం రోజుల్లో ఏ నిర్ణయం తీసుకోకపోతే, ఈ కేసు మేము పరిష్కరిస్తామని సుప్రీం కోర్టు చెప్పింది.

ఎందరో ప్రముఖులను అందించిన విద్యాలయమిది. విద్యావేత్తల నుంచి వ్యాపారవేత్తలు వరకు, సంఘ సంస్కర్తల నుంచి ప్రజాప్రతినిధులు, న్యాయమూర్తులు వరకు, కవులు, కళాకరులు వంటి సాహితీ పరిమళాలను అందించిన సరస్వతీ నిలయమిది. ఇంకా చెప్పాలంటే ఉత్తరాంధ్రుల చదువుల తల్లి. సుమారు 163 ఏళ్ల చరిత్రగల ఈ కళాశాల ఖ్యాతి ఖండాంతరాలను తాకింది. మాన్సాస్ (మహారాజా అలక్ నారాయణ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ సొసైటీ) ఆధ్వర్యాన నడుస్తున్న కళాశాలలను ప్రయివేటీక రించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. యాజమాన్యం ఇప్పటికే ఎంఆర్ మహిళా కాలేజీని కో ఎడ్యుకేషన్‌గా మార్చేయగా, తాజాగా ఎంఆర్ కాలేజీని ప్రయివేటీపరం చేసేందుకు శరవేగంగా పావులు కదుపుతున్నారు. . భవిష్యత్తులో మాన్సాస్ విద్యాసంస్థలన్నింటినీ ప్రయివేటీకరించేందుకు ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. దీంతో, డాక్టర్ ఏవిజి రాజు ఆశాలయాలకు తూట్లు పొడుస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇటీవల ఎంఆర్ కాలేజీలోని అన్ఎయిడెడ్ ఆధ్యాపకులు తమకు వేతనాలు చెల్లించాలంటూ ఆందోళన చేపట్టిన విషయం విధితమే. దీన్ని అవకాశంగా తీసుకున్న మాన్సాస్ చైర్మన్ సంచయిత గజపతిరాజు ఏకంగా ఈ కాలేజీనే ప్రయివేటు పరం చేసేందుకు ఈనెల 10న ప్రభుత్వానికి లేఖరాసినట్టు సమాచారం. అధ్యాపకులకు, సిబ్బందికి వేతనాలు చెల్లించుకోలేక పోతున్నామని, ఫీజులు పెంచితే వ్యతిరేకత, విమర్శలు ఎదుర్కోవాల్సివస్తుందని, ఈ నేపథ్యంలో కళాశాలను ప్రయివేటీకరిస్తే తప్ప నిర్వహణ సాధ్యమయ్యే పరిస్థితి లేదని విన్నవించినట్టు తెలిసింది. దీనిపై స్పందించిన రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రత్యేక కమిషనర్ ఎంఎం నాయక్ కళాశాలలోని మౌలిక సదుపాయాలు, ఆధ్యాపకుల వివరాలు, విద్యార్థుల సంఖ్య, ఫీజులు, నిర్వహణ ఖర్చులు తదితర అంశాలపై సమగ్ర అధ్యయనం చేసి నివేదిక పంపాలంటూ ఈనెల 25న రాజకుమార్ ఉత్తర్వులు పంపారు. విషయం తెలుసుకున్న అధ్యాపకులు ఆందోళన చెందుతున్నాయి. దీని పై స్పందించిన అశోక్‌ గజపతిరాజు, మాన్సాస్‌ ట్రస్ట్‌ ప్రైవేటు ఆస్తి కాదని, ఇలా చేయటం దారుణం అని అన్నారు.

Advertisements

Latest Articles

Most Read