ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకీ దళితుల పై దాడులు పెరిగిపోతున్నాయి అంటూ, దళిత సంఘాలు ప్రతిపక్షాలు ఆరోపిస్తునే ఉన్నాయి. గత వారం, విజయవాడలో దళితలు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగిన తరువాత, ఆ సమావేశంలో పాల్గున్న జడ్జి రామకృష్ణ, ప్రభుత్వం పై ఘాటు వ్యాఖ్యలు చేసారు. అయితే ఆ తరువాత రోజే జడ్జి రామకృష్ణ సోదరుడు పై, మదనపల్లిలో దాడి జరిగింది. ఈ దాడి మంత్రి పెద్ది రెడ్డి చేపించారని, జడ్జి రామకృష్ణ ఆరోపించారు. అయితే పోలీసులు మాత్రం, ఇది తెలుగుదేశం నేతలు చేసారు అంటూ, కొత్త విషయం చెప్పారు. అయితే ఇది విశ్వసించని దళిత సంఘాలు, ఆ దాడికి నిరసనగా ఈ రోజు చలో మదనపల్లికి పిలుపు ఇచ్చాయి. దీంతో నిన్నటి నుంచే, రాష్ట్రం నలు మూలల నుంచి దళితులు మదనపల్లి బయలు దేరారు. అయితే ఈ క్రమంలో అక్కడ చిన్న ర్యాలీ చేసి, ఒక బహిరంగ సభ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనికి ప్రభుత్వం, పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో ఉదయం నుంచి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

న్యాయవాది శ్రావణ్‍కుమార్‍, రామకృష్ణలను పోలీసులు హోటల్ లోనే నిర్బంధించారు. హోటల్ గది నుంచి వారిని బయటకు రానివ్వలేదు. దీని పై వారు మండి పడ్డారు. నిరసన తెలిపే హక్కు లేదా అని ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రతిపక్షంలో ఉండగా, ఇదే పని చేసి ఉంటే, జగన్ మోహన్ రెడ్డి పాదయత్ర చేసే వారా అని ప్రశ్నించారు. అయితే చలో మదనపల్లె భగ్నానికి పోలీసుల విఫలయత్నం అయ్యారనే చెప్పాలి. ఆంక్షల వలయాన్ని ఛేదించుకుని వేలాదిగా మదనపల్లె దళితులు చేరుకున్నారు. అడుగడుగునా పోలీసుల అడ్డంకులు, అరెస్టులు చేసారు. మదనపల్లిలోని, అంబేద్కర్ చౌరస్తా, సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద పోలీసులు అనేక మందిని అరెస్ట్ చేసారు. మరో పక్క, తిరుపతి హోటల్‍లోనే అడ్వకేట్ శ్రవణ్ ఆమరణ దీక్ష చేస్తున్నారు. హోటల్ బయట కొద్ది సేపు ఉద్రిక్త వాతవరణం నెలకొన్నా, పోలీసులు వెంటనే వారిని అరెస్ట్ చేసారు. పోలీసులు ఎన్ని అడ్డంకులు పెట్టినా, అరెస్ట్ లు చేసినా, వారి నిరసనను గట్టిగా తెలపటంలో సఫలం అయ్యారు. జడ్జి రామకృష్ణ, జడ్జి శ్రవణ్ కుమార్ ని నిర్బంధించిన దృశ్యాలు ఇక్కడ చూడవచ్చు https://youtu.be/C7aWiXwb3cw

విజయవాడలో అక్రమ మద్యం కేసులో పట్టుకున్న అజయ్ అనే వ్యక్తి పోలీస్ కస్టడీలో చనిపోవటం, సంచలనంగా మారింది. సందీప్ అనే వ్యక్తి వద్ద, అజయ్ అనే వ్యక్తి గత కొన్నాళ్ళుగా, డ్రైవర్ గా పని చేస్తున్నారు. అయితే ఆర్టీసి బస్ స్టాండ్ లో తనకు ఒక పార్సెల్ వచ్చిందని, దాన్ని తెసుకుని రావాలని అజయ్ ని ఆదేశించారు. అయితే ఈ నేపధ్యంలోనే అజయ్ వెళ్లి ఆ పార్సిల్ తీసుకుని వచ్చారు. ఈ నేపధ్యంలో ఎస్ ఈ బి పోలీసులు అజయ్ ని అదుపులోకి తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ క్రమంలోనే అజయ్ చనిపోవటంతో ఈ కేసు సంచలనం అయ్యింది. అజయ్ ని హాస్పిటల్ కు తీసుకు రావటంతో, ఆయన చనిపోయాడని డాక్టర్లు దృవీకరించారు. అయితే అజయ్ ని పోలీసులు కొట్టటంతోనే చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు వేధింపుల వల్లే తమ బిడ్డ చనిపోయాడని వాపోయారు. అయితే పోలీసులు మాత్రం, విచారణ చేస్తున్న సమయంలో, అజయ్ కు చెమటలు పట్టి, ఫిట్స్ లాగా వచ్చాయని, హాస్పిటల్ కి కూడా తీసుకుని వెళ్ళమని, కానీ అప్పటికే ఆయన చనిపోయారని చెప్తున్నారు.

అయితే ఈ కేసుకు సబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావలసి ఉంది. వాస్తవాలు మొత్తం కప్పి పుచ్చుతున్నారని, అజయ్ కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. అజయ్ ను అదుపులోకి తీసుకోవాల్సిన బలమైన కారణం ఏమిటి అనే ప్రశ్నలు ఉన్నాయి. పోలీసులు అజయ్ ని ఎందుకు తీసుకు వచ్చారు ? అజయ్ కి అక్రమ మద్యానికి సంబంధం ఏమిటి అని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ కేసుని తీవ్రతను తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారని, కొంత మంది ప్రజా ప్రతినిధులు కూడా ఎంటర్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయం పై దళిత సంఘాలు, ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ కేసు పై పూర్తి వాస్తవాలు వెల్లడించాలని, వారు కోరుతున్నారు. అసలు అజయ్ ని ఏ సెక్షన్ కింద అదుపులోకి తీసుకున్నారు, ఆయన ఎలా చనిపోయారో చెప్పాలని వాపోతున్నారు. ఆ వీడియో ఇక్కడ చూడవచ్చు. https://youtu.be/fj5xK9pc8ng

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు పైన, జడ్జిల పైనా, న్యాయమూర్తులు పైన ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టిన వారి కేసు విషయంలో, వైసీపీ కార్యకర్తలు, నాయకులు, కొంత మంది ప్రజా ప్రతినిధులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన విషయం పై దాఖలు అయిన పిటీషన్ విషయంలో, హైకోర్టు విచారణకు తీసుకుని, సుమారుగా వంద మంది పేర్లు చెప్పి, వారిని అరెస్ట్ చెయ్యమని చెప్పటంతో, సిఐడి ఈ కేసు తీసుకుంది. అయితే ఈ 90 మందిని ఇప్పటి వరకు అదుపులోకి తీసుకోలేదు. ఈ కేసు విషయం పై సిఐడి, కోర్టుకు చెప్తూ, వారు నోటీసులు తీసుకోవటానికి అందుబాటులో లేరని తెలిపారు. అయితే దీని పై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూల్ అఫ్ లా సరిగ్గా అమలు కాకపోతే, మేమే ఇతర నిబంధనల మేరకు, ఇతర అధికారాలు ఉపయోగిస్తాం అంటూ, హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించింది. అసలు రాష్ట్రంలో రూల్ అఫ్ లా ఉందా లేదా అని నిలదీసింది.

న్యాయముర్తులనే అవమానిస్తారా, వారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తారా అంటూ హైకోర్టు తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసింది. సామాజిక మాధ్యమాల్లో, కోర్టుల పై , జడ్జిల పై ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించంటం పై కుట్ర ఉందేమో అని, హైకోర్టు అనుమానం వ్యక్తం చేసింది. ఇతరుల ప్రభావం లేకుండా, ఎవరు న్యాయమూర్తులను దూషించే సాహసం చెయ్యరని, దీని వెనుక ఉన్న కుట్ర తేలుస్తాం అంటూ హెచ్చరించింది. న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చడాన్ని చూస్తూ కూర్చోం అని, సహించం అని హెచ్చరించింది. హైకోర్టు మీద నమ్మకం లేకపోతె, పార్లమెంట్ కు వెళ్లి, హైకోర్టు ముసేవేయాలని కోరండి అంటూ, తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రజా స్వామ్యం మూడు స్థంబాల పై ఆధారపడి ఉందని, న్యాయ్వస్థ బలహీనం అయితే, సివిల్ వార్ కు దారి తీసే అవకాసం ఉందని, న్యాయవ్యవస్థను రక్షించాల్సిన అవసరం అందరి పైనా ఉందని వ్యాఖ్యలు చేసింది.న్యాయ వ్యవస్థ పై నమ్మకం లేకపోతే, అందరు లా అండ్ ఆర్డర్ తమ ఆధీనంలోకి తీసుకుంటారని వ్యాఖ్యానించింది.

జగన్ మోహన్ రెడ్డి పై మరోసారి రఘురామకృష్ణం రాజు, తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. జగన్ మోహన్ రెడ్డి అమరావతి విషయంలో, ఎన్నికలకు ముందు, ఎన్నికలకు తరువాత చేసిన ప్రకటనల వీడియోని, మీడియా ముందు వేసి రఘురామకృష్ణం చూపించారు. మాట తిప్పం మడమ తిప్పం అనే భావన జగన్ మోహన్ రెడ్డి గారు సిన్సియర్ గా కలిగించారని, మీకు అదే భావం ఉంటుందని, నేను ఇప్పటికీ నమ్ముతున్నాని, ఆ నమ్మకంలో భాగంగా, మీరు గతంలో, అంటే ఎన్నికల ముందు , మీరు మాట్లాడిన ఒక మంచి మాట అంటూ, జగన్ మోహన్ రెడ్డి, ఎన్నికలకు ముందు అమరావతి ఎలా ఉండాలి అనే వీడియోని మీడియా ముందు చూపించారు. రాజధాని రాష్ట్రం మధ్యలో ఉండాలి, రాజధానికి వేల ఎకరాలు ఉండాలి, రాజధానికి నీళ్ళు ఎప్పుడు ఉండాలి, ఈ మూడు ఉంటే అదే రాజధాని అంటూ, జగన్ మోహన్ రెడ్డి గతంలో మాట్లాడిన మాటలు, వినిపించారు. మన పార్టీకి ఇంత పెద్ద విజయం అవ్వటానికి, మీరు సియం అవ్వటానికి, ఇది కూడా ఒక కారణం అని అన్నారు.

మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, రాజధాని ఎలా ఉండాలో చక్కగా చెప్పారని, అప్పుడు సౌత్ ఆఫ్రికా మోడల్ లేదని, అలాగే మీరు కూడా ఇక్కడే ఇళ్ళు కట్టుకుని, ప్రజలను ఇక్కడే రాజధాని ఉంటుందని నమ్మించారని, రఘురామకృష్ణం రాజు అన్నారు. అమరావతి అనేది చక్కటి కాన్సెప్ట్ అని, మనం దాన్ని సపోర్ట్ చేసామని, రాష్ట్రం మధ్యలో రాజధాని ఉండాలని, మీరు ప్రజలను నమ్మించారని, అమరావతిలో ఇల్లు కట్టుకొని చంద్రబాబు కన్నా, ఇక్కడే ఇల్లు కట్టుకున్న మిమ్మల్ని ప్రజలు నమ్మారని అన్నారు. మీరు ఒకసారి మీ వీడియో చూసి, మనం మాట తప్పం కదా, మనం ఇది ఎన్నో సార్లు చెప్పాం కదా, మనం చెప్పిన చోటే అమరావతి ఉంది కదా, అందుకే మనసు మార్చుకోవాలని అన్నారు. అనవసరంగా కోర్టులకు వెళ్లి, మొట్టికాయలు వేసుకోకుండా, చట్టాలు గౌరవించి, అమరావతికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే, మాట తప్పరు, మడమ తిప్పరు అనే దానికి విలువ ఉంటుందని రాజు గారు అన్నారు. ఆయన మాటలు ఇక్కడ చూడవచ్చు https://youtu.be/B11CcaZXs48

Advertisements

Latest Articles

Most Read