ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు ఎన్ని తనిఖీలు చేస్తున్నా, అక్రమ మద్యం మాత్రం దొరుకుతూనే ఉంది. కొన్ని సార్లు పెద్ద పెద్ద వ్యక్తుల వద్ద కూడా అక్రమ మద్యం దొరుకుంతుంది. అయితే ఈ సారి అక్రమం మద్యం పట్టుకున్న వారిని చూసి పోలీసులతో పాటుగా, మీడియా , ప్రజలు కూడా అవాక్కయ్యారు. ఈ రోజు కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో, అక్రమ మద్యం పట్టుకున్నారు పోలీసులు. అయితే పట్టుబడింది దుర్గగుడి పాలకమండలి సభ్యురాలు చక్క నాగ లక్ష్మి కారులో. దీంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. తమకు వచ్చిన సమాచారంతో, సీతారాంపురంలో ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌ వద్దకు చేరుకొని, అక్కడ పార్క్‌ చేసి ఉన్న కారులో సోదాలు చెయ్యగా, అక్రమ మద్యం బయట పడింది. దీంతో ఆకారం మద్యం స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అదుపులోకి తీసుకుని, కేసు బుక్ చేసి, పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉంటూ, దేవుడికి సేవ చేస్తూ, ఇలా అక్రమ మద్యం సరఫరా చెయ్యటం పై, అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి.

అధికార పార్టీ నేతలు కావటం, అలాగే చీఫ్ విప్ సామినేని ఉదయభాను అనుచరులు కావటంతో, తెలుగుదేశం పార్టీ కూడా, విమర్శలు బాణాలు ఎక్కు పెట్టింది. దేవాలయాల పై దాడులతో అపవిత్రం చేస్తుందే కాక, ఇప్పుడు ఇలాంటి పనులు చేపిస్తూ, దుర్గమ్మ గుడికే కళంకితం తెచ్చారని వాపోతున్నారు. అయితే తెలంగాణాలోని ఖమ్మం నుంచి, ఈ మద్యం తీసుకు వచ్చినట్టుగా భావిస్తున్నారు. ఇవన్నీ చాలా ఖరీదుగల మద్యం సీసాలుగా పోలీసులు గుర్తించారు. వీటి విలువ కూడా భారీగా ఉంటుందని చెప్తున్నారు. అయితే ఆ కారు పై, దుర్గామల్లేశ్వర స్వామి పాలకమండలి సభ్యులు అని పెద్ద బోర్డు పెట్టి ఉంది. తమను ఎవరూ ఆపకుండా, ఇలా పెట్టుకుని ఉంటారని భావిస్తున్నారు. అయితే ఇది ఎప్పుడు నుంచి చేస్తున్నారు, ఎక్కడ నుంచి మద్యం తెచ్చి, ఎక్కడ అమ్ముతున్నారు ? దీని వెనుక ఇంకా ఎవరు ఉన్నారు అనే అంశం పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి, పోలీసులు పట్టుకున్న వీడియో ఇక్కడ చూడవచ్చు.... https://youtu.be/U8MNbYjO2N8

జగన్ మోహన్ రెడ్డి తిరుమల పర్యటన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. అన్యమతస్తుడు అయిన జగన్ మోహన్ రెడ్డి, తిరుమల దర్శనానికి వెళ్తే, తనకు వెంకన్న పై నమ్మకం ఉందని సంతకం చెయ్యాలని, వివాదం మొదలైంది. ఇది కాస్త పట్టు వస్త్రాలు ఇవ్వాలి అంటే, ఒక్కరే ఇవ్వ కూడదు అని, ధర్మ పత్నితో కలిసి ఇవ్వాలని, హిందూ ధర్మంలో మగవాడు ఒక్కడే చేసేది కీడు కార్యక్రమాలు మాత్రమే అని, జగన్ కు ఇష్టం లేక పొతే, వేరే వారితో ఇప్పించాలి కానీ, ఇలా ఒక్కరే వెళ్ళ కూడదు అని వివాదం పెద్దది అయ్యింది. అయితే వివాదం తగ్గించాల్సిన ప్రభుత్వ పెద్దలు, వివాదాన్ని పెద్దది చేసారు. మంత్రి కొడాలి నాని, అసలు డిక్లరేషన్ పెట్టింది ఎవరు, ఎత్తేయండి అంటూ, కొత్త చర్చకు దారి తీసారు. ఒక వ్యక్తి కోసం, తిరుమల రూల్స్ ని, సంప్రదాయాలను, చట్టాలను మార్చమని, అడగటం పై పెద్ద వివాదం రేగింది. అయితే ఇంత వివాదం జరిగినా, జగన్ మోహన్ రెడ్డి మాత్రం, డిక్లరేషన్ ఇవ్వకుండానే, పట్టు వస్త్రాలు సమర్పించి, దర్శనం చేసుకున్నారు. అయితే ఈ వివాదం ఇప్పటికీ రేగుతూనే ఉంది.

తాజాగా సినీ నటి కల్యాణి, జగన్ మోహన్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేసారు. జగన్ మోహన్ రెడ్డి శ్రీవారి పై నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇవ్వకుండా, చాలా పెద్ద తప్పు చేసారని మండి పడ్డారు. ముఖ్యమంత్రి అయినా, ప్రధాన మంత్రి అయినా ఎవరైనా సరే, తిరుమల ఆచారాలను బ్రేక్ చేసే అధికారం ఎవరికీ లేదని అన్నారు. భారత దేశ పౌరురాలుగా, జగన్ ని ప్రశ్నించటం తన హక్కు ని, కళ్యాణి ధ్వజమెత్తారు. జగన్ మోహన్ రెడ్డి క్రీస్టియన్ ని అందరికీ తెలుసు అని, అలాంటి అప్పుడు, తిరుమల దర్శనానికి వెళ్లి, సంతకం పెట్టలేదు అంటే, తనను ఎవరూ ఏమి చెయ్యరనే ధీమానా అని, ప్రశ్నించారు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ, నా ఇష్టం వచ్చినట్టు చేస్తానని అనటం ఎంత వరకు సమంజసం అని, సామాన్య ప్రజలకు ఎలాంటి సంకేతం ఇస్తున్నారని, ఆమె ప్రశ్నించారు. నిబంధనలు పాటిస్తూ అన్ని మతాలను గౌరవించాలని ఆమె అన్నారు. అయితే ఈమె ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేసింది అనే దాని పై చర్చ జరుగుతుంది. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఏమైనా ఉందేమో అనే వాదన వినిపిస్తుంది.

ఎంతటి వారికైనా కూర్చుని తింటూ ఉంటే, కొండలు అయినా తరిగిపోతాయని అంటారు. అలాంటిది అప్పులు చేసి నెట్టుకుని వచ్చే వారికి, చివరకు ఆ అప్పు కూడా పుట్టని పరిస్థితి వస్తే, మొత్తం గందరగోళం అవుతుంది. అది ఒక కుటుంబం అయితే, ఏదో ఒక విధంగా బయట పడతారు, మరి అది ఒక రాష్ట్రం అయితే ? సరిగ్గా ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. రోజు రోజుకీ ఆర్దిక పరిస్థితి దిగజారి పోతుందని, కాగ్ లెక్కలు చెప్తున్నాయి. మరో పక్క ఆదాయం లేదు, ఖర్చులు పెరిగిపోతున్నాయి. అసలకే లోటుతో ప్రారంభం అయిన రాష్ట్రం, గత ప్రభుత్వం 5 ఏళ్ళలో లక్ష కోట్లు అప్పు చేస్తే, ఈ ప్రభుత్వం 16 నెలలుకే లక్ష కోట్ల అప్పు చేసింది. పోనీ ఆదాయం పెరిగిందా అంటే లేదు. పోనీ తెచ్చిన అప్పులతో, ఆస్తులు పోగేసి, ఆదాయం వచ్చే మార్గాలు చూస్తున్నామా అంటే అదే లేదు. అప్పు తెచ్చి, పంచి పెడుతున్నాం. ఇది రాజకీయ పార్టీలకు ఓటు బ్యాంకుకు పనికి వస్తుందని కానీ, రాష్ట్ర ప్రజలకు మాత్రం, భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు తప్పవు.

ఆగష్టు నెల కాగ్ రిపోర్ట్ చూస్తే, ఈ ఏడాది వేసిన అప్పు అంచనా, కేవలం 5 నెలలకే రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకుంది. ఇక రాబోయే రోజుల్లో అప్పులు ఏ స్థాయిలో ఉంటాయో చూస్తూనే భయం వేస్తుంది. ఈ ఆర్ధిక సంవత్సరం, 5 నెలలు కాలానికి, రూ.84,617.23 కోట్లు అప్పుగా రాష్ట్రం తెచ్చుకుంది. ఈ ఏడాది రూ.48,295.58 కోట్లు అప్పు తీసుకుంటాం అని అంచనా వేస్తే, 5 నెలల్లోనే అంత అప్పు చేసేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక రెవిన్యూ లోటు భారీగా పెరిగింది. రెట్టింపు అయ్యింది. ఈ ఏడాది రూ.18,434.15 కోట్లు రెవిన్యూ లోటు లెక్కేస్తే, 5 నెలలకు రూ.38,199.33 కోట్ల రెవిన్యూ లోటు వచ్చింది. అంటే ఇప్పటికే రెట్టింపు అయ్యింది. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఒక కారణం కాగా, కరోనా కాలంలో ఆర్ధిక వ్యవస్థ మందగించటం కూడా మరో కారణం. పరిస్థితి ఇలాగే కొనసాగితే, రాష్ట్రం ఇంకా దిగజారి పోతుంది. అప్పుల కోసం, కేంద్రం షరతులకు కూడా ఏపి తలొగ్గింది. ఇలా అనేక అప్పులు చేసుకుంటూ వెళ్తే, ఆదాయం పెరగకపోతే, రాను రాను అప్పులు ఇచ్చే వారు కూడా ఉండరు. అప్పుడు పరిస్థితి మరింత దిగాజారక మానదు.

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ, ప్రభుత్వంలో తమకు జరుగుతున్న అన్యాయం పై స్పందించారు. ఆరు నెలలుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సెక్రటేరియట్ కు రావటం లేదని అన్నారు. సమస్యల మీద వచ్చే విజిటర్స్ ని కలిసే వారే లేరని అన్నారు. ఆ రకంగా వారు వ్యవహరిస్తే, వారిని అనుసరించి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా, కేవలం 30 నుంచి 50 శాతం మంత్రి మాత్రమే సెక్రటేరియట్ కు వచ్చి విజిటర్స్ ని కలిసే పరిస్థతి ఉందని అన్నారు. కానీ క్షేత్ర స్థాయిలో పనిచేసే ఉద్యోగులకు మాత్రం, టార్గెట్లు పెట్టి మరీ ఆదేశాలు ఇస్తున్నారని, ఇది కరెక్ట్ కాదని అన్నారు. అలాగే తమకు రావల్సినే బకాయల పై, ప్రభుత్వం కూడా ఈ విషయంలో అలోచించి, విడతల వారీగా అయిన సరే, ఆర్ధిక ప్రయోజనాల విషయంలో, వెసులుబాటు ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. మార్చి, ఏప్రిల్ నెల జీతం, అలాగే మార్చి నెల పెన్షన్ రావాల్సి ఉందని, కొద్ది రోజులు సహకరించమని కోరారని, కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదని, అది కూడా తొందరగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు తెలిపారు.

తమకు ఏదో భారీగా పెండింగ్ ఉన్నట్టు ఆర్ధిక శాఖ అధికారులు జగన్ మోహన్ రెడ్డి గారిని తప్పుదోవ పట్టిస్తున్నారని, తమకు ఇప్పటికే సగం జీతం ఇచ్చారు కాబట్టి, ఇంకో సగం ఇవ్వాలని, ఆ సగంలోనే అనేక డిడక్షణ్ లు ఉంటాయని, తమకు వచ్చేది చాలా తక్కువే అని అన్నారు. ఇక అలాగే తమకు ఇప్పటికే 5 డీఏలు పెండింగ్ ఉన్నాయని, వీటిని అడుగుతుంటే, కేంద్రం రెండు డీఏలు ఇవ్వలేదు కాబట్టి, తాము ఇవ్వం అంటున్నారని, అసలు కేంద్రానికి, రాష్ట్రానికి సంబంధం లేదని, తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఇక అలాగే, తమకు వేతన సవరణ జరగాల్సి ఉందని, ఒక కమిటీ వేసారని, అది వేసి ఏడాది అయ్యిందని, ఇప్పటికీ ఆతీ గతి లేదని, దాన్ని పొడిగించుకుంటూ వెళ్తున్నారని, ఇది సరి కాదని అన్నారు. ఉద్యోగులు రిటైర్ అయితే, రావాల్సిన బెనిఫిట్స్, గత మూడు నెలలుగా ఇవ్వటం లేదని, ఇది ఎంతో దారుణమైన విషయం అని అన్నారు.

Advertisements

Latest Articles

Most Read