చిత్తూరు జిల్లా, తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఉన్న బి.కొత్తకోటలో ఈ రోజు దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. జడ్జి రామకృష్ణ తమ్ముడు, రామచంద్ర పైన, కొంత మంది దుండగులు హత్యాయత్నం చేసారు. ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా కొట్టారు. దాదాపుగా అయుడుగురు దుండగులు ఒకేసారి ఆయన పై దాడి చేసి పారిపోయారు. బి.కొత్తకోట మెయిన్‌రోడ్‌ సెంటర్ లో సరుకులు కొనటానికి, జడ్జి రామకృష్ణ తమ్ముడు, రామచంద్ర బయటకు రాగా, ఒక కారులో వచ్చిన అయుదుగురు దుండగులు, ఒక్కసారిగా దాడి చేసారు. దాడి చేసి అక్కడ నుంచి పరారు అయ్యారు. దాడిలో రామచంద్ర తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ రామచంద్రని, ప్రాధమిక చికిత్స చేయించి, మదనపల్లిలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. గత కొంత కాలం నుంచి, జడ్జి రామకృష్ణ వైసీపీ పై ఆరోపణలు చేస్తున్నారు. అలాగే లోకల్ గా ఉన్న మంత్రి పెద్దిరెడ్డి పై కూడా ఆరోపణలు చేస్తూ వచ్చారు. దీంతో తరుచూ పెద్దిరెడ్డి మనుషులు తనని వేధిస్తున్నారని, రామకృష్ణ చెప్తూ వస్తున్నారు.

ఈ నేపధ్యంలోనే ఈ రోజు, కొంత మంది వచ్చి రామచంద్ర తమ్ముడి పై దాడి చేసారు. ఇప్పటికే రామచంద్ర పై అనేక కేసులు కూడా పెట్టి వేధిస్తున్నారు. మరో పక్క రామకృష్ణ పై కూడా అన్ని వైపుల నుంచి ఒత్తిడి తెస్తున్నారు. అయితే నిన్న దళితులు అందరూ కలిసి, దళితులు అందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టారు. అందులో జడ్జి రామకృష్ణ, ప్రభుత్వం పై, పెద్ది రెడ్డి పై అనేక ఆరోపణలు చేసారు. ఇది కక్ష పెట్టుకుని, ఈ రోజు జడ్జి రామకృష్ణ తమ్ముడి పై దాడి చేసారని, రామకృష్ణ ఆరోపిస్తున్నారు. ఎన్ని చేసినా, ఎంత ఇబ్బంది పెట్టినా, ఈ ప్రభుత్వం పై పోరాటం మాత్రం ఆపనని జడ్జి రామకృష్ణ అంటున్నారు. అయితే ఈ ఘటన పై తమకు సంబంధం లేదని, పెద్ది రెడ్డి అనుచరులు చెప్తున్నారు. వాళ్ళు అందరితో గొడవ పడతారని, ఎవరు దాడి చేసారో పోలీసులు తేలుస్తారని పెద్దిరెడ్డి అనుచరులు చెప్తున్నారు. ఈ ఘటన వీడియో, ఇక్కడ చూడవచ్చు.. https://youtu.be/nHO2Q3uF_0M

జగన్ మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడు లేఖ రాసారు. తెలుగు జాతి ఖ్యాతిని నలు దిక్కులా వ్యాప్తించిన దివంగత బాల సుబ్రమణ్యం దివ్యస్మృతికి నివాళిగా, ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు చెయ్యాలని చంద్రబాబు సూచించారు. బాలు పుట్టిన గడ్డ అయిన నెల్లూరులో సంగీత యూనివర్సిటీ ఏర్పాటు చెయ్యాలని ప్రభుత్వాన్ని కోరారు చంద్రబాబు. అలాగే స్తానిపించే సంగీత యూనివర్సిటీలోనే, కాంస్య విగ్రహం ఏర్పాటు చెయ్యాలని, ఆ ప్రాంతాన్ని బాల సుబ్రమణ్యం సంగీత కళాక్షేత్రంగా అభివృద్ది చేయాలని చంద్రబాబు ప్రభుత్వాని విజ్ఞప్తి చేసారు. ప్రభుత్వ సంగీత అకాడమీకి ఎస్పీ బాల సుబ్రమణ్యం పేరుపెట్టడం ద్వారా సంగీతం, ఇతర లలిత కళల్లో యువతని ప్రోత్సహించడం ద్వారా బాల సుబ్రమణ్యం కల నెరవేర్చాలని, ప్రాచీన తెలుగు కళా సారస్వతాన్ని గౌరవించడం ద్వారా మన సంస్కృతీ సంప్రదాయాలను సమున్నత స్థాయిలో నిలబెట్టడమే బాలసుబ్రమణ్యంకు మనం అందించే నిజమైన నివాళని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.

ఒక పక్క అధికార వైసీపీ పార్టీ నేతలు, ప్రభుత్వ పెద్దలు, ఈ రాష్ట్రాన్ని సుందరవనంగా మార్చేస్తున్నాం, ఈ రాష్ట్ర రూపు రేఖలు మార్చేస్తున్నాం అని చెప్తుంటే, ఏకంగా ఒక మంత్రి నుంచే ఫిర్యాదు రావటం, అది కూడా ఒక అధికారి సహకరించటం లేదు అని చెప్పటం సంచలనంగా మారింది. ఇది నెల్లూరు జిల్లాలో జరిగిన విషయం. అక్కడ మంత్రి అనిల్ కుమార్ తో పాటుగా, కమీషనర్ దినేష్ కుమార్, నెల్లూరు జిల్లాలో పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం అని, వివిధ కార్యక్రమాలు ప్రకటించారు. అయితే ఓ మున్సిపల్ అధికారి మాత్రం, ఏకంగా మంత్రి గారు చెప్పిన మాట కూడా వినటం లేదు అంట. ఆ మంత్రి రాష్ట్ర ఐటి శాఖా మంత్రి మేకపాటి గౌతం రెడ్డి. ఇదే విషయాన్ని ఆయన, జిల్లా కలెక్టర్ కు లేఖ రాసి, జరిగిన విషయం చెప్పారు. గత కొన్ని రోజులుగా తన క్యాంప్ ఆఫీస్ దగ్గర, పారిశుధ్యం సరిగా ఉండటం లేదని, దాని పై తగు చర్యలు తీసుకోవాలని ఎంత చెప్పినా, అధికారి స్పందించటం లేదని, మేకపాటి గౌతం రెడ్డి, విషయాన్ని కలెక్టర్ వద్దకు తీసుకు వెళ్లారు. దీనికి సంబంధించి, ఆయన కలెక్టర్ కు లేఖ రాసారు.

నెల్లూరులో ఉన్న పొదలకూరు రోడ్డులో, మంత్రి మేకపాటి గౌతం రెడ్డికి క్యాంపు కార్యాలయం ఉంది. అయితే అక్కడ గత కొన్ని రోజులుగా శుభ్రత సరిగ్గా లేదని, పరిసరాలన్నీ అధ్వాన్నంగా ఉన్నాయని, మంత్రి కార్యాలయ సిబ్బని, మున్సిపల్ హెల్త్ అధికారి వెంకట రమణకు ఫిర్యాదు చేసారు. ఒకసారి కాదు, అనేక సార్లు ఆ అధికారికి, జరిగిన విషయం చెప్పారు. అయినా ఆ అధికారి నుంచి ఎలాంటి స్పందన కానీ, అక్కడ గ్రౌండ్ లో ఆక్షన్ కానే లేదు. అయితే విషయం మంత్రి మేకపాటికి తెలియటంతో, ఆయనే స్వయంగా, ఆ అధికారికి ఫోన్ చేసి, తన వద్దకు రావాలని ఆదేశించారు. అయినా మంత్రి మాట కూడా పట్టించుకోక పోవటంతో, చివరకు మంత్రి మేకపాటి, కలెక్టర్ కు ఫిర్యాదు చేసి, జరిగిన విషయం చెప్పారు. ఇది రాష్ట్రంలో తీరు. ఒక మంత్రికే ఈ పరిస్థతి ఉందంటే, పరిస్థితి ఎలా ఆందో అర్ధం చేసుకోవచ్చు. కొంత మంది అధికారుల వల్ల, నిజంగా కష్టపడే నాయకులకు కూడా ఇబ్బంది అవుతుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాల పై దాడులు జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు ముందు జాగ్రత్తలు తీసుకున్నామని చెప్తున్నా, ప్రతి రోజు ఎక్కడో ఒక చోట, దేవాలయాల పై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇవి ఆకతాయలు చేస్తున్నారో, లేక ఏదైనా అజెండా పెట్టుకుని ఎవరైనా చేస్తున్నారో కాని, ఈ చర్యలతో హిందువుల మనోభావాలు మాత్రం దెబ్బ తింటున్నాయి. గత నెల రోజులుగా ఈ దాడులు మరీ ఎక్కువ అయిపోయాయి. పోలీసులు కఠిన చర్యలు తీసుకుని, ఈ దాడుల చేస్తున్న వారిని శిక్షిస్తే కానీ, ఇవి ఆగేలా లేవు. అలాగే ప్రభుత్వం కూడా, ఈ దాడులు పై సమీక్ష చేసి, తగు చర్యలు తీసుకుని, పోలీసులకు తగు సూచనలు ఇచ్చి, ఈ దాడులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజు కాలిపోయిన అంతర్వేది రధం స్థానంలో నూతన రధం ఏర్పాటు అవుతుందని, అందరూ సంతోషిస్తున్న సమయంలో, ఈ రోజు కూడా మరో దాడి దేవాలయాల పై జరగటం దౌర్భాగ్యం. చిత్తూరు జిల్లా, గంగధర నెల్లూరులో, ఉపముఖ్యమంత్రి నారాయాణస్వామి నియోజకవర్గంలో, ఈ రోజు మరో సంఘటన జరిగింది.

గంగధర నెల్లూరు నియోజకవర్గంలోని, ఆగరమంగలం ఆలయంలో, నంది విగ్రహాన్ని, గుర్తు తెలియని వ్యక్తలు ధ్వంసం చేసారు. నంది విగ్రహాన్ని పెకలించి, విగ్రహాన్ని రెండు భాగాలుగా చేసారు. సంఘటన తెలుసుకున్న గ్రామస్తులు, పోలీసులకు సమాచారం ఇవ్వటంతో, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. ఈ ఘటన పై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఇది ఆకతాయల పనా ? లేక రాజకీయ అజెండాతో చేసారా ? మరే కారణాలు అయినా ఉన్నాయా అనే విషయం పై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. త్వరలోనే ఈ ఘటన చేసిన వారిని పట్టుకుంటామని పోలీసులు చెప్తున్నారు. మరో పక్క ప్రతిపక్షాలు ఈ విషయం పై ఆందోళన వ్యక్తం చేసాయి. ప్రతి రోజు ఏదో ఒక ఘటన జరుగుతున్నా, ప్రభుత్వం నిలువరించలేక పోతుందని, దీని పై వెంటనే ఒక ఆక్షన్ ప్లాన్ విడుదల చేసి, వీటిని అరికట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘటన వీడియో ఇక్కడ చూడవచ్చు https://youtu.be/XyuGDJnyR7A

Advertisements

Latest Articles

Most Read