విజయవాడలో నిత్యం రద్దీగా ఉండే కనకదుర్గమ్మ వారిధీ పై వెలిసిన ఫ్లెక్సీలు చూసి అందరూ అవాక్కయ్యారు. ఈ ఫ్లెక్సీలు ఎవరిని టార్గెట్ చేసి పెట్టినవి ? ఇది ఎవరికీ అయినా వార్నింగ్ ఇస్తున్నారా అనే అనుమానాలు కలుగక మానవు. ఇంకా విడ్డూరం ఏమిటి అంటే, ఈ ఫ్లెక్సీలు పెట్టింది అధికార పార్టీ నేతలే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టియుసి నాయకులు పేర్లు, ఫోటోలతో ఈ ఫ్లెక్సీలు వెలిసాయి. ఇందులో వైసీపీ ముఖ్య నాయకుడు, ఎమ్మెల్యే జోగి రమేష్ ఫోటోలు కూడా ఉండటం కొస మెరుపు. అయితే ఆ వివాదాస్పద ఫ్లెక్సీలు చూసి అందరూ అవాక్కయ్యారు. అందులో ఏమి ఉంది అంటే, రాజ్యాంగ వ్యవస్థల పేరుతో మా ప్రభుత్వానికి సంకెళ్ళు వెయ్యాలని ప్రయత్నాలు చేస్తే మేము ఊరుకోం. మా ప్రభుత్వం ప్రజల అభిమానం ఆమోదం పొంది గెలిచింది, మా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు మీకు ఎవరు ఇచ్చారు అంటూ, ఆ ఫ్లెక్సీల్లో ఇది రాసి విజయవాడ వారధి పై అనేక ఫ్లెక్సీలు పెట్టారు. అయితే ఇప్పుడు ఈ ఫ్లెక్సీలు చర్చనీయంసం అయ్యాయి.
ఏకంగా జగన్ మోహన్ రెడ్డి ఫోటో కూడా ఆ ఫ్లెక్సీల్లో ఉంది. వైసిపీ టియుసి నాయకుడు మాడు శివరామ కృష్ణ ఈ ఫ్లెక్సీలు తన పేరిట పెట్టారని తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ ఫ్లెక్సీల్లో ఉన్న మాటలు పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వ్యాఖ్యలు ఎవరిని టార్గెట్ చేసి పెట్టారు ? మా ప్రభుత్వాన్ని అడ్డుకుంటే ఊరుకోం అంటే, వార్నింగ్ ఇస్తున్నారా ? ఎవరిని బెదిరించటానికి ఇంత బహిరంగంగా, ఈ ఫ్లెక్సీలు పెట్టారు అనే చర్చ మొదలైంది. రాజ్యాంగా సంస్థ అని చెప్పి మరీ, వార్నింగ్ ఇస్తున్నారు. మా ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచింది, మేము ఏమైనా చేస్తాం, మీరు ఎవరు ప్రశ్నించటానికి అనే ధోరణి కరెక్ట్ ఏనా ? ప్రతిపక్ష పార్టీని అయితే డైరెక్ట్ గా తిట్టే వారని, ఇది కేంద్రాన్ని కానీ, లేకపోతే కోర్టులను కానీ ఉద్దేశించి రాసినట్టు ఉందని, విశ్లేషకులు అంటున్నారు. ఇలాంటి అత్యుత్సాహంతో పెట్టే ఫ్లెక్సీలను వైసీపీ అధిష్టానం కానీ, ప్రభుత్వ పెద్దలు కానీ ఖండించాలని, లేకపోతే ఈ ధోరణి ఎక్కువ అయితే, చాలా దూరం వెళ్తుందని విశ్లేషకులు అంటున్నారు.