భారతీయ జనతా పార్టీ అధ్యక్ష్యుడు జేపీ నడ్డా, తన కొత్త టీంని ప్రకటించారు. ఈ రోజు బీజేపీ కొత్త కార్యవర్గాన్ని, 70 మంది పేర్లతో ప్రకటించారు. ఇందులో సీనియర్లు, జూనియర్లకి సమ ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే అన్ని రాష్ట్రాల నుంచి ఈ కార్యవర్గంలో ప్రాధాన్యత ఉండేలా చూసుకున్నారు. అయితే తమిళనాడు నుంచి ఎవరూ లేకపోవటం మరో గామించాల్సిన అంశం. దాదాపుగా 12 మంది ఉపాధ్యక్షులతో పెద్ద టీంని జేపీ నడ్డా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పురందేశ్వేసరి జాతీయ ప్రధాన కార్యదర్శిగా, సత్య ప్రసాద్ జాతీయ కార్యదర్శిగా నియమితులు అయ్యారు. ఇక తెలంగాణ రాష్ట్రం నుంచి డీకే అరుణ ఉపాధ్యక్షురాలిగా, డాక్టర్ లక్ష్మణ్ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా నియమితులు అయ్యారు. ఇక కర్ణాటక రాష్ట్రానికి చెందిన యువ ఎంపీ తెజేస్వి సూర్య, యువ మోర్చా అధ్యక్షుడిగా నియమితులు అయ్యారు. గత కార్యవర్గంలో ఉన్న చాలా మందిని, ఇప్పుడు జేపీ నడ్డా తొలగించారు.

అయితే ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీలో ఆక్టివ్ గా ఉన్న రాం మాధవ్ కు, ఈ సారి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి దక్కక పోవటం, చర్చకు దారి తీసింది. అలాగే మురళీధర్ రావు పేరు కూడా కొత్త కార్యవర్గంలో లేకపోవటం చర్చకు దారి తీసింది. ఇద్దరికీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి లేకపోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక మరో పక్క జాతీయ స్పోక్స్ పర్సన్ నుంచి జీవీఎల్ నరసింహరావు పేరుని కూడా తొలగించారు. అయితే బీజేపీ వర్గాలు మాత్రం, వీరికి త్వరలో క్యాబినెట్ మంత్రి పదవి లభించే అవకాసం ఉందని చెప్తున్నారు. మరి వీరిని కావాలని దూరం పెట్టారా ? లేక మంత్రి పదవులు కోసం దూరం పెట్టారా అనేది తొందరలోనే తెలిసే అవకాసం ఉంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సోలార్, విండ్ ఎనర్జీకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి, ఈ రంగంలో దేశ విదేశీ పెట్టుబడులు తీసుకోవచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రయత్నాలకు దేశ వ్యాప్తంగా కూడా మంచి పేరు వచ్చింది. అంతే కాదు, సోలార్, విండ్ ఎనర్జీ తక్కువగా ఉత్పత్తి అవుతూ ఉండటంతో, యూనిట్ ధర కూడా తగ్గుతూ వస్తుంది. దీని ప్రభావంతో, వినియోగదారులకు కూడా కరెంటు చార్జీలు తగ్గేవి. అయితే ఇదంతా గతం. 2019 ఎన్నికల్లో ప్రభుత్వం మారిన తరువాత, గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు అన్నీ సమీక్ష చేస్తాం అంటూ, జగన్ ప్రభుత్వం కొత్త విధానంతో ముందుకు వచ్చింది. ఒకసారి పెట్టుబడి పెట్టిన కంపెనీలు సమీక్ష కుదరదని, అటు కేంద్రం, ఇటు కోర్టు చెప్పినా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏదో ఒక విధంగా తాను అనుకుంది చేస్తూనే ఉంది. కేంద్రం కూడా ఈ విషయంలో సీరియస్ అవ్వటంతో, అన్ని ఒప్పందాలు సమీక్ష చెయ్యం అని, ఏది అయితే తేడాగా ఉందో అవే సమీక్ష చేస్తాం అని, కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అయితే అప్పటి నుంచి, ఈ విషయం పై పెద్దగా వార్తలు లేకపోయినా, ఇప్పుడు మళ్ళీ ఈ విషయం వార్తల్లోకి ఎక్కింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాము ఉత్పత్తి చేసిన విద్యుత్ ని కొనటం లేదని, తాము భారీగా నష్టపోతున్నాం అంటూ, అయన్‌ అనే సంస్థ, విద్యుత్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ లో ఫిర్యాదు చేసింది. అనంతపురం జిల్లాలో అయన్‌ సంస్థకు, 250 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఉంది. ఇందులో 50 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. అయితే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, విద్యుత్ పీపీఏల సమీక్ష పేరిట, కొన్ని సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు చెయ్యటంలేదు. అందులో ఈ కంపెనీ కూడా ఉంది. ప్రభుత్వం తాము ఉత్పత్తి చేస్తున్న విద్యుత్ ని కొనటం లేదని, అత్యవసర పిటీషన్ గా ట్రిబ్యునల్ లో కేసు వేసారు. దీని పై విచారణ చేసిన ట్రిబ్యునల్, వెంటనే ఆ కంపెనీ ఉత్పత్తి చేస్తున్న విద్యుత్ ని, ఆలస్యం చేయకుండా, వెంటనే తీసుకోవాలని, ఆంధ్రప్రదేశ్ డిస్కం, ట్రాన్స్‌కో సంస్థలకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. ఇక ఈ కేసు తదుపరి విచారణను, వచ్చే నెల 20వ తేదీకి వాయిదా పడింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మంత్రుల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఇదేదో విభజన హామీలకు సంబందించో, లేక నీటి పంపకాల విషయంలోనో, లేక ఒక రాష్ట్రం వల్ల ఇంకో రాష్ట్రం ఇబ్బంది పడుతుందనో కాదు. బీజేపీ విషయంలో మీరు వంత పడుతున్నారు అంటే, మీరు అంటూ, ఇరు రాష్ట్రాల మంత్రుల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. దేశంలోనే మొదటి సారిగా, కేంద్రం కొత్తగా పెట్టిన షరతులకు తలొగ్గి, ఎక్కువ అప్పు పడుతుంది అనే ఉద్దేశంతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రైతులు వాడుతున్న కరెంటు మోటార్లకు మీటర్లు బిగుంపు చేపట్టింది. రైతులు వాడే కరెంటుకు మీటర్లు పెడితే అదనపు అప్పు ఇస్తాం అని కేంద్రం షరతు పెట్టింది. ఇదేదో ప్రోత్సాహకం కూడా కాదు, అదనపు అప్పు మాత్రమే. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ షరతుకు తలొగ్గిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ మీటర్లు బిగింపు కోసం రాష్ట్ర ఖజానా పై దాదపుగా 750 కోట్ల భారం కూడా పడనుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రైతుల పై ఒక్క పైసా భారం కూడా వెయ్యం అని , ఎప్పటి లాగా ఉచిత విద్యుత్ ఇస్తాం అని, రైతులు ఎంత వాడితే అంత నగదు బదిలీ చేస్తాం అని చెప్తుంది.

అయితే ఈ విషయం పై అనేక సందేహాలు రైతుల్లో ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే, మూడు రోజుల క్రితం తెలంగాణా మంత్రి హరీష్ రావు, జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ, కేంద్రం పెట్టే షరతులకు తలొగ్గి, అదనపు అప్పు కోసం, జగన్ మోహన్ రెడ్డి రైతుల మెడలకు ఉచ్చి బిగిస్తున్నారని, కేసీఆర్ మాత్రం, నీ డబ్బులు వద్దు, నీ మీటర్లు వద్దు అని రైతుల పక్షాణ నిలబడ్డారని, వ్యాఖ్యలు చేసారు. అయితే దీని పై మూడు రోజుల తరువాత, రాజకీయ పరంగా లెక్కలు అన్నీ వేసుకుని, ఆంధ్రప్రదేశ్ మంత్రి బాలినేని స్పందించారు. కేంద్రం ఇచ్చే డబ్బులు తమ జేబుల్లో ఏమి వేసుకోం అని, అవి కూడా ప్రజల కోసమే ఉపయోగిస్తామని చెప్పారు. రైతుల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చెయ్యం అని అన్నారు. అయితే టీఆర్ఎస్ లాగా, బీజేపీతో మంచిగా ఉంటూ , ఒక రోజు మంచిగా, మరో రోజు గొడవ పడి ఇష్టం వచ్చినట్టు చెయ్యం అని, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సఖ్యతగా ఉంటామని, హరీష్ రావుకు కౌంటర్ ఇచ్చారు.

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు సంచలన వ్యాఖ్యలు చేసారు. తన పై భారీగా కుట్రలు పన్నుతున్నారని, దీని పై తనకు సమాచారం ఉంది అంటూ, ఈ రోజు మీడియా సమావేశంలో, కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు. ఎవరు అనేది సూటిగా చెప్పకపోయినా, తన పై దాడికి స్కెచ్ చేసారని అన్నారు. నా భీమవరంలో ఉన్న నా ఆఫీస్ లో, దళితులతో దాడి అనే కాన్సెప్ట్ ప్లాన్ చేసారని అన్నారు. దీని కోసం కొంత మంది ఎమ్మెల్యేలను అడిగారని, అయితే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు, ఇది సరైన ఆలోచన కాదని, పునరాలోచించాలని కోరారని అన్నారు. కానీ కొద్ది మంది ఎమ్మెల్యేలుగా ఓడిపోయినా ఇంచార్జులు, ఆ ఇంచార్జ్ పదవి కూడా ఉంటుందో, ఉండదో అనే భయంతో, పాలకొల్లు నుంచి కొంత మంది, ఉండి నుంచి కొంత మంది నాయకులు, నా కార్యాలయం పై దాడి చేయబోతున్నారని తెలిసిందని రఘురామ రాజు అన్నారు. ఇది బయట పెట్టాను కాబట్టి, ఒక రోజు ఆలస్యం అవుతుంది ఏమో కానీ, దాడి అయితే చేస్తారని, ఏమి చేస్తారో తెలియదని అన్నారు. ఇప్పటికే దేవాలయాల పై దాడులు చేసే వారికి, మా లాంటి వారి ఆఫీస్ ల పై దాడులు చేస్తున్నారని అన్నారు. వాళ్ళు దాడులు చేస్తే, నేను ఏమైనా ఆవేశపడి, మాట అన్నా, అనకపోయినా చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారని అన్నారు.

ఎందుకంటే, ఇలాగే తన పై గతంలో తోలు తెస్తాం అని అన్నారని, ఎందుకు తోలు తీస్తారో అని నేను ప్రశ్నిస్తే, దాన్ని ఒక జాతి పై దాడిగా చేసారని రఘురామ రాజు అన్నారు. అలాగే ఇప్పుడు ఇంకో కుట్ర పన్నారని అన్నారు. రాబోయే రెండు రోజుల్లో సాక్షి పేపర్ లో, ఛానల్ లో కూడా కొన్ని కధనాలు నా పై సిద్ధం చేస్తున్నారని, అవి కూడా మీరు చూస్తారని అన్నారు. అలాగే రఘురామ రాజు మరో సంచలన వ్యాఖ్యలు కూడా చేసారు. తన పై కరోనా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి, చివరకు కరోనా అంటించే కుట్ర కూడా చేస్తున్నారని, మరో సంచలన వ్యాఖ్యలు చేసారు. తాను ఈ కుట్రలు అన్నీ ఎదుర్కుంటానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. తాను ఏది నామ్మానో దాని కోసం నిలబడి, అన్నీ ఎదుర్కుంటానని అన్నారు.

Advertisements

Latest Articles

Most Read