ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యల నుంచి పక్కదోవ పట్టించాలంటే, ఎదో ఒక ఎమోషనల్ ఇష్యూ బయటకు తెచ్చి, వారితో ఆడుకోవాలి. గత దశాబ్దాలుగా పాలకులు చేస్తున్నది ఇదే. 21వ శాతాబ్దంలో కూడా ఇవే డ్రామాలు ప్రభుత్వాలు ఆడుతూ ఉన్నాయి. మన రాష్ట్రం విషయానికి వస్తే, ఏపి రాష్ట్రానికి కృష్ణా జలాలు రాను రానూ తగ్గిపోతున్నాయి. ఎదో వరదలు వచ్చిన ఆ పది, పదిహేను రోజులు తప్పితే, మిగతా అన్ని రోజులు కృష్ణా నుంచి వచ్చే నీరు పెద్దగా ఉండదు. అందుకే కృష్ణా గోదావరి పెన్నా, మహా అనుసంధానం, మొదలు పెట్టారు చంద్రబాబు. గోదావరి నీటిని, శ్రీశైలం వరకు తీసుకు వెళ్ళే ప్రాజెక్ట్ ఇది. తరువాత వచ్చిన జగన్ గారు, ఇలా కాదు, మేము తెలంగాణా భూభాగంలో నుంచి నీటిని తీసుకు వెళ్తాం, మాకు కేసిఆర్ మంచి దోస్త్ అంటూ, మేము అక్కడ నుంచే నీళ్ళు తీసుకువెళ్తాం అని చెప్పిన విషయం తెలిసిందే. కేసిఆర్ గుణం గురించి తెలిసిన వారు ఎవరూ, అతన్ని నమ్మరు. కానీ వివిధ కారణాలతో, నమ్మాల్సిన పరిస్థితి జగన్ ది. అయితే సరిగ్గా ఇక్కడే, రెండు రాష్ట్రాల మధ్య, కాదు కాదు ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక డ్రామా మొదలు పెట్టారు. రెండు నెలల క్రితం మొదలైన ఈ డ్రామా, ఇప్పుడు మళ్ళీ వెలుగులోకి వచ్చింది.
పోతిరెడ్డిపాడు సామర్ధ్యం పెంచే కొత్త ఎత్తిపోతల పధకం అంటూ జగన్ గారు జీవో ఇవ్వటం, ఏయ్ అలా ఎలా ఇస్తారు అంటూ, కేసిఆర్ హడావిడి చెయ్యటం రెండు నెలల క్రితం చూసాం. ఇప్పుడు ఈ రోజు ఈ ప్రాజెక్ట్ పై టెండర్లు పిలుస్తున్నారు. దీంతో ఏపి పై యుద్ధం చేద్దాం అంటూ తెలంగాణా హడావిడి. సుప్రీం కోర్టుకు వెళ్తాం, కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం, అపెక్స్ కౌన్సిల్ లో ఫిర్యాదు చేస్తాం, ఉద్యమాలు చేస్తాం అంటూ, హడావిడి మొదలు పెట్టింది తెలంగాణా. ఎలాగైనా ఈ ప్రాజెక్ట్ ఆపేస్తాం అంటూ తెలంగాణా, మేము కట్టేస్తాం అంటూ ఆంధ్రా, మళ్ళీ హడావిడి మొదలు పెట్టారు. అసలు కృష్ణా మీద అదీ ఒక ఒక 4-5 టియంసి తీసుకు వెళ్ళే ప్రాజెక్ట్ పై, ఈ హడావిడి ఏంటో ఎవరికీ అర్ధం కావటం లేదు. చేసేది ఏదో గోదావరి నీరు, కృష్ణాకు తెచ్చే ఏర్పాటు చెయ్యవచ్చు కదా అంటే, దాని పై సమాధానం లేదు. అసలు పోతిరెడ్డి పాడు సామర్ధ్యం పెంచుకుంటున్నాం అంటే, కేసిఆర్ అభ్యంతరం చెప్పే వీలు ఉండదు. ఇదేదో కొత్త ప్రాజెక్ట్ అన్నట్టు, ఏపి ప్రభుత్వం చెప్పటంతో, లేని వివాదం రేపినట్టు అయ్యింది.
గతంలో చంద్రబాబు ముచ్చుమర్రి కట్టినా, పోతిరెడ్డి పాడు కులువలు పెంచినా, కేసిఆర్ నుంచి అభ్యంతరం రాలేదు. మరి ఇప్పుడు జగన్ విషయంలో ఎందుకు అంత ఇబ్బంది ? అందులోనూ, నాకు కేసిఆర్ అత్యంత ఆప్తులు అని చెప్తూ, కేసిఆర్ తో మాట్లాడి, ఈ విషయం పై క్లారిటీ తెచ్చుకోవచ్చు కదా ? అలాగే కేసిఆర్ కూడా, మా మధ్య కిరికిరి పెట్టె దమ్ము ఎవరికీ లేదు అన్నప్పుడు, ఈ ఫిర్యాదులు ఎందుకు ? కేసిఆర్ ని నీటి విషయంలో ఎవరూ మోసం చెయ్యలేరు అనే మాటలు ఎందుకు ? ఈ డ్రామా చూస్తుంటే, నువ్వు కొట్టినట్టు నటించు, నేడు ఏడ్చినట్టు నటిస్తా, అనే సామెత గుర్తుకు వస్తుంది. ఇద్దరికీ అంత మంచి సంబంధాలు ఉన్నప్పుడు, రెండు రాష్ట్రాల మధ్య, లేని వివాదం సృష్టించి మరీ, ఎందుకు ఈ హడావిడి ? ఇప్పటికైనా ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు, ఫోటోలు కోసం కాకుండా, రాష్ట్ర సమస్యల పై కూర్చుని, ఇలాంటి సమస్యలు పరిష్కరించుకుంటే అందరికీ మంచిది.