ప్రముఖ దుబాయి కంపెనీ లూలు గ్రూప్, విశాఖపట్నంలో, అతి పెద్ద కన్వేషన్ సెంటర్ పెట్టాలని, నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత, అందులో అవకతవకలు జరిగాయని, అందుకే వారితో ఒప్పందం రద్దు చేసుకున్నామని చెప్పారు. అయితే, ఈ చర్య పై లూలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మేము ఆంధ్రప్రదేశ్ లో తప్ప ఎక్కడైనా పెట్టుబడి పెడతాం అని, చెప్పి వెంటనే పక్క రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టారు. దీంతో ఒక పెద్ద కంపెనీ, ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోయినట్టు అయ్యింది. అయితే ఇది పక్కన పడితే, ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న పనితో అందరూ అవాక్కయారు. పెట్టుబడిదారులకు ఇవ్వాల్సిన స్థలం, అమ్ముకుంటున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. విశాఖపట్నం నగరంలోని లులు గ్రూపుతో ఒప్పందం రద్దు చేసిన తరువాత ఎపిఐఐసి ఆధీనంలో ఉన్న, సర్వే నెంబర్ 1011 లోని 13.83 ఎకరాల భూమిని అమ్మి, డబ్బులు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బిల్డ్ ఏపి కింద, ఈ స్థలం అమ్మకానికి పెడుతున్నామాని, 30 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది, తరువాత చదరపు అడుగుకు 6,800 రూపాయలకు విక్రయించనుంది.
సీతమ్మధారలో ఉన్న, ఆరోగ్య శాఖకు చెందిన సర్వే నెం 39 లోని సర్వే నంబర్ 8 మరియు 11లో ఉన్న, మూడు ఎకరాలు భూమిని కూడా అమ్మేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే , మాజీ కేంద్ర ఇంధన కార్యదర్శి ఇ.ఎ.ఎస్ శర్మ శనివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, అటువంటి విలువైన పట్టణ భూములను విక్రయించాలనే నిర్ణయం ప్రజా ప్రయోజనానికి విరుద్ధమైనందుని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల తరపున ప్రజా ఆస్తుల ధర్మకర్త మాత్రమేనని, , ఆ ఆస్తుల యాజమాన్యాన్ని ప్రైవేటు వ్యక్తులు లేదా సంస్థలకు ఇచ్చే హక్కు లేదని ఆయన అన్నారు. అయితే విశాఖలో విలువైన భూమిని అమ్మటం పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి భూములు ఇప్పుడు వదులుకుంటే, తరువాత చాలా కష్టం అని, ప్రభుత్వం ఇలాంటి భూముల్లో, ఏదైనా పెట్టుబడులు పెట్టించాలి కాని, ఇలా అమ్మేయటం ఏమిటి అనే విమర్శలు వస్తున్నాయి.