గత ప్రభుత్వ హయంలో చంద్రబాబు తన సొంత కంపెనీ హెరిటేజ్ కి, ప్రభుత్వ సొమ్ము అకారణంగా దోచి పెట్టారని, హెరిటేజ్ విషయంలోనే రూ.40 కోట్ల అవినీతి జరిగింది అంటూ, ఈ రోజు క్యాబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్, క్యాబినెట్ ముందు పెట్టటం, క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ పై, సిబిఐ ఎంక్వయిరీ చేయించాలి అంటూ, క్యాబినెట్ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. అయితే దీని పై హెరిటేజ్ పూర్తి వివరాలతో ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఏపి ప్రభుత్వం నుంచి గత 5 ఏళ్ళలో మాకు జరిగిన చెల్లింపులే అంత లేవని, మరి 40 కోట్ల అవినీతి అంటూ చెప్పటం ఆశ్చర్యంగా ఉందని హెరిటేజ్ పేర్కొంది. తమకు గత 5 ఏళ్ళలో ఏపి ప్రభుత్వం నుంచి జరిగిన చెల్లింపులు, రూ.22.68 కోట్లగా పేర్కొంది. 2015 - 2019 మధ్య మజ్జిగ సప్లై చేసినందుకు, ఏపి ప్రభుత్వం చెల్లించింది, రూ.1.49 కోట్లు అని తెలిపింది. ఇది కూడా టెండర్ ప్రాసెస్ ద్వారా, వివిధ గుడిల దగ్గర, బ్రహ్మోత్సవాలకు, శ్రీరామనవమి, వైకుంఠ ఏకాదశి, మొదలగు పండుగల సమయంలో ఇచ్చిన ఆర్డర్ అని, హెరిటేజ్ ఒక్కరికే ఈ ఆర్డర్ ఇవ్వలేదని తెలిపింది. అదే రేటుకి, మిగిలిన డైరీల నుంచి కూడా, ఆర్డర్ తెప్పించారని, అందులో హెరిటేజ్ ఒక కంపెనీ అని, హెరిటేజ్ కి మాత్రమే, ఏ కాంట్రాక్టు ఇవ్వలేదని తెలిపింది.

ఇక 2014 - 2017 మధ్య, అంటే 3 ఏళ్ళకు, నెయ్యి సప్లై చేసినందుకు, ఏపి ప్రభుత్వం చెల్లించింది, రూ.21.19 కోట్లు అని హెరిటేజ్ పేర్కొంది. ఇది కూడా టెండర్ ప్రాసెస్ ద్వారా జరిగిందని చెప్పింది. అది కూడా కొన్ని జిల్లాలకు మాత్రమే నెయ్యి సప్లై చేసామని, మిగతా జిల్లాలకు, అదే రేటుకి, మిగిలిన డైరీల నుంచి, ఆర్డర్ తెప్పించారని తెలిపింది. 2014-15లో కడప జిల్లాలో, 2015-2016లో ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, కడప, కర్నూల్, చిత్తూరు, కృష్ణా జిల్లాలో, 2016-17లో శ్రీకాకుళం జిల్లాలో నెయ్యి సప్లై చేసామని, దానికి మాకు ప్రభుత్వం చెల్లించిన మొత్తం రూ.21.19 కోట్లు అని, మిగతా డైరీలకు ఇచ్చినట్టే మాకు చెల్లించారని తెలిపింది. గత 28 ఏళ్ళుగా, నిజాయితీగా, రైతుల సహకారంతో, వినియోగదారుల మద్దతుతో, ఎదిగామని, ఎన్నడు తప్పు చెయ్యలేదని హెరిటేజ్ పేర్కొంది. కావాలని ఇలా కుట్ర చేస్తే, కంపెనీ మీద ఆధారపడి జీవిస్తున్న వివిధ వర్గాల వారు, ముఖ్యంగా రైతులు ఇబ్బంది పడతారని హెరిటేజ్ పేర్కొంది. 28 ఏళ్ళుగా విలువలతో నడుపుతున్న కంపెనీ అని, భవిష్యత్తులో కూడా ఇలాగే నడుపుతాం అని పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షల నిర్వహణ పై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. తెలంగాణా, తమిళనాడుతో పాటుగా, వివిధ రాష్ట్రాలు, పదవ తరగతి పరీక్షలు రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ పరిస్థతి ఏమిటి అని అందరూ ఎదురు చూస్తున్న వేళ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టతనిచ్చారు. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, తెలంగాణ, చత్తీస్ గఢ్ తదితర రాష్ట్రాలు పదో తరగతి పరీక్షల ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్ లో నిర్వహణపై సందే హాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో బుధవారం స్పందించిన మంత్రి సురేష్, రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు జరుగుతాయని తేల్చి చెప్పారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూలై పదోతేదీ నుంచే పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు. అయితే ప్రతి ఏటా నిర్వహిస్తున్నట్లు 11 పేపర్లకు బదులుగా ఆరు పేపర్లకు కుదించి నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రకటించకుండా అనవసర ప్రచారాలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులను గందరగోళానికి గురి చేయొద్దని సూచించారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో పటిష్ట రక్షణ చర్యలతో పరీక్షలు జరిపేందుకు కసరత్తు చేస్తున్నామని, విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రతలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.

అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటన పై, పలువురు అభ్యంతరం చెప్తున్నారు. కరోనా వ్యాధి తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా తీసుకోవల్సిన అనేక జాగ్రత్తల్లో భాగంగా పదవ తరగతి పరీక్షలు రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు వైఎస్ జడగన్మోహన రెడ్డికి ఏపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజా నాథ్ బుధవారం లేఖ రాశారు. జూలై -పదవ తేది నుంచి పదవ తరగతి పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ మంత్రి ప్రకటించడం కరోనా విజృంభిస్తున్న ఈ తరుణంలో విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని ఆయన లేఖలో కోరారు. ఇప్పటికే తెలంగాణా, తమిళనాడు ప్రభుత్వాలు పదవ తరగతి పరీక్షలు రద్దు చేస్తు తీసుకున్న నిర్ణయాన్ని ఆయన జగన్ దృష్టికి తీసుకు వెళ్లారు. పరీక్షలను రద్దు చేసి విద్యార్థులు అందరిని పై తరగతులకు ప్రమోట్ చేయాలని కోరారు. ఇలా చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం లేదని, ప్రభుత్వం వెంటనే తగు నిర్ణయం తీసుకుని అమలు చేయాలని తమ పార్టీ భావిస్తోందని లేఖలో శైలజానాథ్ పేర్కొన్నారు.

జగన్ మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి మధ్య ఎదో జరుగుతుందని, గతంలో ఎంతో సన్నిహితంగా ఉన్న ఇద్దరి మధ్య, కొంచెం గ్యాప్ వచ్చింది అంటూ, వార్తలు వచ్చిన టైంలో, జరిగిన కొన్ని సంఘటనలతో, ఈ ప్రచారానికి బలం చేకూర్చుటం, ప్రతిపక్షాలు విమర్శలు చెయ్యటం చూసాం. జగన్ మోహన్ రెడ్డి ఎల్జీ పాలిమర్స్ పర్యటనకు వెళ్తున్న సమయంలో, విజయసాయి రెడ్డిని కారు దించేయటం, తరువాత తెలుగుదేశం, జనసేన విజయసాయి రెడ్డి పై విమర్శలు చెయ్యటం, సోషల్ మీడియాలో విజయసాయి రెడ్డికి అనుకూలంగా కొంత మంది పోస్టులు పెట్టటం తెలిసిందే. అయితే, ఇవన్నీ గిట్టని వారు చేస్తున్నారని, నాకు జగన్ కు మధ్య ఎలాంటి గ్యాప్ లేదని, చనిపోయేంత వరకు జగన్ తోనే అంటూ, ఏకంగా విజయసాయి రెడ్డి మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పారు. ఇది నిజంగానే సోషల్ మీడియా ప్రచారం అయితే, విజయసాయి రెడ్డి స్థాయి వ్యక్తులు స్పందించరు. మరి ఆయన ఎందుకో స్పందించి, మా ఇద్దరి మధ్య ఎలాంటి గ్యాప్ లేదని చెప్పారు. ఇక ఇక్కడ నుంచి విజయసాయి రెడ్డి, ఆయన అనుచరులు, టిడిపి పై ఎదురు దాడి మొదలు పెట్టారు. లోకేష్, రామ్మోహన్ నాయుడు పై పోస్టులు పెడుతూ, ఇద్దరి మధ్య చిచ్చు పెట్టె ప్రయత్నం మొదలు పెట్టారు.

ఈ ప్రచారాన్ని, అటు రామ్మోహన్ నాయుడు, లోకేష్ కూడా, పేటీయం ప్రచారం అని, ఖండించారు కూడా. అయితే ఈ రోజు మళ్ళీ ఏకంగా విజయసాయి రెడ్డి, ఒక పోస్ట్ పెట్టారు. కొడుకుకి తినటం తప్ప ఏమీ రాదని, సీనియర్లు చేతులు ఎత్తేయటంతో, చంద్రబాబు ఎవరు అయితే ఏమిటిలే అని, 32 ఏళ్ళ రామ్మోహన్ నాయుడుకి, అధ్యక్ష పదవి ఇచ్చి, ఉత్తరాంధ్ర ప్రజలను బుజ్జగించాలని చూస్తున్నారని, అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేసారు. అయితే దీని పై రామ్మోహన్ నాయుడు కూడా అదే విధంగా విజయసాయి రెడ్డి ట్వీట్ కి స్పందించారు. అవినీతి తిమ్మరాజు, చేతకాని పాలనకు, పార్టీలో వాళ్ళే ఛీ కొడుతున్నారు. కారు దించిన కక్షతో, అప్రూవర్ గా మారి, ఎప్పుడు కుర్చీ లాక్కుందామా అని ధ్యాసే కాని, హోదా, రైల్వే జోన్ లాంటి వాటిని అడగలేక, మూడు ముక్కల రాజధానితో మూతి కాల్చుకుని, ఢిల్లీలో కాళ్ళు మొక్కుతూ, ట్విట్టర్ లో రెచ్చిపోవటం తప్ప, మీరు చేసేది ఏమిటి, రాష్ట్రానికి ఉపయోగ పడే పని చెయ్యండి అంటూ, విజయసాయి రెడ్డికి కౌంటర్ ఇచ్చారు రామ్మోహన్ నాయుడు.

నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడానికి దేశ అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఆర్డినెన్స్ తేవటం తద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసి నిమ్మగడ్డను ఎన్నికల కమిషనరుగా తొలిగించింది. ఈ వ్యవహారంలో నిమ్మగడ్డతో పాటుగా, మాజీ మంత్రి బిజెపి నేత కామినేని శ్రీనివాసరావుతో సహా పలువురు ఏపీ హైకోర్టులో ఫిర్యాదు చేసారు. దీనిపై హైకోర్టు ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టివేసింది. నిమ్మగడ్డనే ఎస్ఈసీగా కొనసాగింపచేయాలని ఆదే శించింది. దీంతో ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరిగింది. రమేష్ కుమార్‌ను ఎన్నికల కమిషనర్‌గా కొనసాగించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ ఆం ధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఏపీ ప్రభుత్వ పిటీషన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ బోట్టే, న్యాయమూర్తులు జస్టిస్ ఎ. ఎస్. బోప్పన్న, జస్టిస్ హృషీకేశ్ రాయ్ లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. తొలుత రాష్ట్ర ప్రభుత్వ తరుపున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహిణీ, రాకేశ్ ద్వివేది వాదనలు ధర్మాసనానికి వినిపించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ తరుపు న్యాయవాదులు కోరారు. దీనిపై సు ప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాజే స్పందిస్తూ, రాజ్యాంగ పదవిలో వున్నవారిని ఎలా తొలిగిస్తారని ప్రశ్నించినట్లు సమాచారం.

ఇలాంటి వ్యవహారాలు మంచివి కావని ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యా ఖ్యలు చేసినట్లుగా కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ప్రతి వాదులకు నోటీసులు ఇచ్చి, రెండు వారాల తరువాత మొత్తం వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ కేసులో ప్రతివాదులు అనేకమంది ఉన్నారని, వారందరికి నోటీసులు జారీ చేస్తున్నట్లు సుప్రీం కోర్టు తెలిపింది. ఈ కేసు విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది. అయితే ఈ వ్యవహారం పై నిమ్మగడ్డ ఎలా వ్యవహరిస్తున్నారు అనే దాని పై ఆసక్తి నెలకొంది. సుప్రీం స్టే ఇవ్వకపోవటంతో, హైకోర్టు తీర్పు ప్రకారం, ఆయనే ఇప్పుడు ఎలక్షన్ కమీషనర్. దీంతో గవర్నర్ కు జరిగిన విషయం మొత్తం చెప్పి, మళ్ళీ విధుల్లో చేరే అంశం పై, నిమ్మగడ్డ ఆలోచిస్తున్నట్టు సమాచారం. దీని పై న్యాయ నిపుణలతో చర్చిస్తున్నారు. ఎలక్షన్ కమీషనర్ ను నియమించేది గవర్నరే కాబట్టి, ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి ప్రమేయం ఉండదు కాబట్టి, గవర్నర్ వద్దకు వెళ్లి, ఆయనకు ఒక మాట చెప్పి, హైకోర్ట్ తీర్పు ప్రకారం, మరోసారి ఎన్నికల కమీషనర్ గా విధుల్లో చేరనున్నట్టు తెలుస్తుంది.

Advertisements

Latest Articles

Most Read