ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి విస్తరిస్తుంది. వస్తున్న కేసులు చూస్తే, కరోనా ఎలా వచ్చిందో కూడా అర్ధం కావటం లేదు. విదేశీ ప్రయాణం, ఢిల్లీ ప్రయాణం లేకపోయినా, అలాంటి వారితో కాంటాక్ట్స్ లేకపోయినా, కరోనా పాజిటివ్ వచ్చిన కేసులు కూడా ఉన్నాయి. మరో పక్క మొన్నటి దాకా, కొంత మంది డాక్టర్లకు కూడా వచ్చిన కరోనా, మొన్న అనంతపురంలో ఒక ప్రభుత్వ ఉద్యోగి కూడా వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా, ఇప్పుడు ఏకంగా విజయవాడలో ఒక ప్రాముఖ సీనియర్ ఐఏఎస్ సతీమణికి కరోనా పాజిటివ్ రావడంతో రాష్ట్రంలో, ముఖ్యంగా విజయవాడలో కలకలం చలరేగితోంది. కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ కావడంతో అధికారవర్గాలు ఉలిక్కి పడుతున్నాయి. ఆమె తండ్రి కర్నూల్ లో వైద్యుడుగా పనిచేస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. కర్నూల్ జిల్లా అంతటా ఆ వైద్యునికి పేదల పెన్నిధిగా పేరుంది. అతి తక్కువ రుసుము తీసుకుని చాలాకాలంగా వైద్యం చేస్తూ ఆదర్శనీయ వ్యక్తిగా గుర్తింపు పొందారు.

అయితే ఇటీవల సదరు వైద్యుడుకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. కోరానాతో బాధపడుతూ ఆయన కొద్దిరోజుల క్రితమే మృతి చెందారు కూడా. దీంతో ఆయన కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించారు. ఆరుగురుకి పాజిటివ్ ఉన్నట్లుగా నిర్ధారించారు. తండ్రిని పరామర్శంచ డానికి వెళ్లిన ఐఏఎస్ భార్య కు పరీక్షలు నిర్వ హించగా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆమెను క్వారంటైన్ కు తరలించారు. దీనికి సంబంధించి అన్ని ప్రధాన పత్రికల్లో కూడా వార్తలు వచ్చాయి. అయితే అదృష్టవశాత్తు ఆ ఐఏఎస్ కు మాత్రం కరోనా నెగిటివ్ రిపోర్టు వచ్చింది. ఆయన విషయం తెలుసుకున్న వెంటనే, టెస్ట్ చేయించుకున్నారు. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఆయన ప్రతి రోజు రివ్యూలు చేస్తూ, సిబ్బందికి తగిన సూచనలు ఇస్తున్నారు.

ఇక మరో పక్క, విజయవాడలోని కొత్తపేట ప్రాంతానికి చెందిన, వార్డు సచివాలయ వాలంటీర్ కు కూడా కరోనా వైరస్ పాజిటివ్ తేలినట్టు అధికారులు ప్రకటించారు. ఈ వార్డ్ వాలంటీర్, మహిళ అని తెలుస్తుంది. ఇటీవల ప్రభుత్వం రేషన్ షాపుల్లో ఇచిన బియ్యం కూడా, పంపిణీ చేసినట్టు చెప్తున్నారు. అయితే ఆమెకు కోరనా ఎలా వచ్చింది అనే దాని పై, రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ఆమె, అస్వస్థతకు గురి కావటంతో, ఆమెను హాస్పిటల్ కు తీసుకు వెళ్లారు. అక్కడ కరోనా టెస్ట్ చెయ్యగా, పాజిటివ్ అని రిపోర్ట్ రావటంతో, ఆమెను క్వారంటైన్ కు తరలించారు. ఆమె కుటుంబ సభ్యులను కూడా క్వారంటైన్ కు తరలించారు. గత 15 రోజులుగా ఆమె ఎవరిని కలిసారు, విధ నిర్వహణలో ఎక్కడెక్కడికి వెళ్లారు అనే దాని పై అధికారులు ఆరా తీస్తున్నారు.

జగన్ మోహన్ రెడ్డి, నిన్న ఆదరాబాదరాగా, దక్షిణ కొరియా నుంచి లక్ష టెస్టింగ్ కిట్లు వచ్చాయని, ఇక నుంచి రాష్ట్రంలో కరోనా టెస్ట్ లు వేగం పుంజుకుంటాయని, ప్రచారం చేసారు. ఈ ప్రచారానికి, ఇంకా కొంచెం, ఎక్కువ చెయ్యటానికి, ఏకంగా జగన్ మోహన్ రెడ్డి చేత కూడా, ఈ టెస్టింగ్ చేపించి, అందరికీ ఫోటోలు విడుదల చేసారు. అయితే ప్రభుత్వం ప్రచారం కోసం చేసిన హడావిడితో, కేంద్రం సీరియస్ అయ్యింది అంటూ, టైమ్స్ అఫ్ ఇండియాకు చెందిన, బెంగుళూరు మిర్రర్ అనే పత్రిక సంచలన కధనం ప్రచురించింది. జగన్ మోహన్ రెడ్డి పై నిర్వహించిన రాపిడ్ కోవిడ్ -19 పరీక్ష ఐసిఎంఆర్ జారీ చేసిన తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా ఉందా అని ప్రశ్నలు సంధించింది. జగన్ చేయించుకున్న కరోనా టెస్టు పై, అన్ని రాష్ట్రాల ఆరోగ్య అధికారుల మధ్య, అలాగే, కేంద్ర, ఐసిఎంఆర్ అధికారులు మధ్య చర్చ జరిగిందని చెప్తున్నారు. ఈ కధనం ప్రకారం, కేంద్రంలో ఉన్న ఒక కీలక అధికారి, జగన్ చేయించుకున్న టెస్టు గురించి, ప్రచారం జరిగిన వెంటనే, ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య కార్యదర్శికి మెసేజ్ పెడుతూ, టెస్టింగ్ ప్రోటోకాల్స్ గురించి సిఎం కార్యాలయానికి తెలియపరచాలని కోరారు.

ఇది ఇలా జరుగుతూ ఉండగానే, ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ్ నిన్న, రాపిడ్ యాంటీబాడీ టెస్ట్ కిట్ల గురించి తాజా మార్గదర్శకాలను విడుదల చేశారు. "చాలా రాష్ట్రాలు ఈ కిట్‌లను హాట్ జోన్ ప్రాంతాల్లో ఉపయోగించాలని భావిస్తున్నట్టు తెలిసింది. అయితే , ఐసిఎంఆర్ నేషనల్ టాస్క్ ఫోర్సు, వివిధ దేశాల్లో, వాడుతున్న ఈ టెస్ట్ కిట్ల గురించి సమాచారం తెప్పించుకుంది. ఆ వివరాలు ప్రకారం, కరోనా టెస్టింగ్ కి సంబంధించి, తాజా మార్గదర్శకాలను సవరించాము. ర్యాపిడ్ యాంటీబాడీ పరీక్షలను ఉపయోగిస్తున్నప్పుడు ఈ క్రింది ముఖ్య విషయాలను అర్థం చేసుకోవడం చాలా అవసరం. " అంటూ కొన్ని మార్గదర్శకాలను, నిన్న కేంద్రం విడుదల చేసింది.

కరోనా వైరస్‌ను గుర్తించేందుకు, ప్రస్తుతం అమలులో ఉన్న పీసీఆర్ టెస్ట్ మాత్రమే చేయాలని అన్నారు. ర్యాపిడ్ యాంటీబాడీ టెస్టులు చేయొద్దని ఆదేశాలు ఇచ్చారు. ర్యాపిడ్ యాంటీబాడీ టెస్టుల్లో, వైరస్ వ్యాప్తి తీవ్రత మాత్రమే తెలుస్తుందని, అంతే కాని, ఇది రోగ నిర్ధారణ పరీక్ష కాదని చెప్పారు. లక్షణాలు ప్రారంభమైన కనీసం ఏడు రోజుల తర్వాత మాత్రమే రాపిడ్ యాంటీబాడీ పరీక్ష ఉపయోగపడుతుంది. అంతే కాని, ఈ పరీక్ష చెయ్యగానే, కరోనా ఉన్నట్టు, లేనట్టు తెలియదు అని చెప్పారు. ఇదే విషయన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెప్తూ, కన్ఫ్యూషన్ కు గురి చెయ్యవద్దు అని, సరైన సమాచారం బయటకు ఇవ్వాలని, ఆ సీనియర్ అధికారి కోరినట్టు, ఆ కధనంలో వచ్చింది. మరి దీనికి, రాష్ట్ర ప్రభుత్వం, ఏ విధంగా సమాధానం చెప్తుంది ? రియల్‌టైమ్‌ పాయింట్‌ ఆఫ్‌ కేర్‌ టెస్ట్‌ (ఆర్టీ-పీసీఆర్‌) చెయ్యాల్సిన చోట, ర్యాపిడ్ టెస్టులు పేరుతో, ప్రభుత్వం సరి పెడుతుందా ? చూడాలి మరి.

మాజీ ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ విషయంలో, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మొదటి నుంచి కుట్ర పూరితంగా, కక్ష పూరితంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా ఆయన ఎన్నికలు వాయిదా వేసారని, కక్ష కట్టి, వరుస పెట్టి, 60కి పైగా ప్రెస్ మీట్లు ఒక్క రోజులో పెట్టి, ఆయనకు కులానికి అంటగట్టి, తిట్టి పోశారు. తరువాత, ఆయన కరోనా సహాయం కోసం ప్రభుత్వం ఇచిన వెయ్యి రూపాయలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులు, అందరికీ ఇస్తూ ఉండటాన్ని, విపక్షాలు ఈసీ దృష్టికి తేగా, దాని పై స్పందిస్తూ, కలెక్టర్లని ఆక్షన్ తీసుకోమని కోరారు. అంతే ఇక్కడ నుంచి కుట్ర మొదలైంది. ఆర్దినెన్స్ తేవటం, వెంటనే గవర్నర్ ఆమోదం పాడటం, ఆ వెంటనే రమేష్ కుమార్ ని తప్పిస్తూ రహస్య జీవో ఇవ్వటం, తరువాత కొత్త ఎన్నికల కమీషనర్ ను నియమించటం, ఇవన్నీ కొన్ని గంటల్లోనే జరిగిపోయాయి. చాలా వేగంగా, ఈ ప్రక్రియ అంతా కొనసాగింది. ప్రభుత్వం ఇంత వేగంగా, ఒక నిర్ణయం తీసుకుని, అమలు చెయ్యటం అంటే నిజంగానే వింత అనే చెప్పాలి.

ముఖ్యంగా ఈ నిర్ణయం వెనుక, అనేక వాదనలు ఉన్నాయి. ఏప్రిల్ 14 తరువాత లాక్ డౌన్ ఎత్తేస్తారని, వెంటనే ఎన్నికలు పెట్టేయాలని, అందుకే ప్రభుత్వం ఇలా చేసిందని అంటున్నారు. మరో పక్క ఎకగ్రీవాలు కూడా, రద్దు చేసే అవకాసం ఉందని, అందుకే హడావిడిగా కొత్త ఎన్నికల కమీషనర్ ని నియమించారు అనే వాదనలు కూడా ఉన్నాయి. అయితే, ఇప్పుడు ఈ వ్యవహారం కోర్ట్ కు చేరింది. ఇలా ఆర్దినెన్స్ తెచ్చి మరీ, ఒక ఎన్నికల కమీషనర్ ను, ఆరోపణలు ఎదుర్కుంటున్న వారే తొలగించటం పై, అభ్యంతరాలు వస్తున్నాయి. అలాగే రాజ్యాంగానికి కూడా ఇది వ్యతిరేకం అని వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే, ఈ కేసు హైకోర్ట్ వద్దకు చేరుకుంది. దీని పై హైకోర్ట్ స్పందిస్తూ, మూడు రోజుల్లోగా ప్రభుత్వాన్ని కౌంటర్ వెయ్యమంది.

నిన్నటితో మూడు రోజులు గడువు ముగుస్తుంది. అయితే, ప్రభుత్వం అనూహ్యంగా, కౌంటర్ దాఖలు చెయ్యలేదు. తమ వద్ద సరిపడా సిబ్బంది లేరని, అందుకే కౌంటర్ దాఖలు చేయ్యలేకపోతున్నామని అని అన్నారు. తమకు మరో రెండు రోజులు వరకు గడువు కావలి అంటూ, అడ్వకేట్ జనరల్, కోర్ట్ ని కోరారు. శనివారం సాయంత్రం లోపు కౌంటర్ దాఖలు చేస్తామని, కొత్తగా మరి కొన్ని వ్యాజ్యాలు దాఖలైన నేపథ్యంలో, తమకు సమయం కావాలని అన్నారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వ వాదన పై, విమర్శలు వస్తున్నాయి. ఒక పక్క రమేష్ కుమార్ ని తప్పించటానికి, కొన్ని గంటల్లో ఆర్దినన్సు, గవర్నర్ వద్ద ఆమోదం, జీవో ఇచ్చి మరీ, తప్పించిన ప్రభుత్వం, ఇక్కడ మాత్రం అఫిదివిట్ దాఖలు చెయ్యటానికి, మరి కొన్ని రోజులు కావాలి అని కోరటం గమనార్హం.

జగన్ మోహన్ రెడ్డికి, చంద్రబాబు లేఖ రాసారు. ఆరు అంశాల పై చంద్రబాబు ఈ లేఖ రాసారు. న రాష్రంలో సిఎంఆర్ ఎఫ్ కోసం బలవంతపు వసూళ్లు-రైతు సహకార సంఘాలు, మహిళా సంఘాలు, వ్యాపారుల్లో తీవ్ర వ్యతిరేకత-పేదలకు సహాయం అందించడంలో రాజకీయాలు చేయడం-ప్రధాని పిలుపును అపహాస్యం చేయడం-సాయం చేసే దాతలను మనస్తాపానికి గురిచేయడం-సాయం వారితో పంపిణీ చేయనీకుండా మేమే చేస్తామనడం-ప్రభుత్వ నిర్లక్ష్యం వైద్యులు, ప్రజల ప్రాణాలను బలిగొనడం-రక్షణ పరికరాల్లేక, పూర్తి స్థాయి జీతాలందక పారిశుద్య కార్మికులు, ఆశా వర్కర్లు ఇతర ఫ్రంట్ లైన్ వారియర్ల ఆవేదన-పరస్పర విరుద్దంగా హెల్త్ బులెటిన్లు, డ్యాష్ బోర్డు, ఆరోగ్య కార్యదర్శి చెప్పే అంకెలు-అసత్య ప్రచారం ఫలితంగా ప్రజల ప్రాణాలకే ముప్పుగా పరిణమించడం గురించి, చంద్రబాబు ఈ లేఖ రాసారు. అయితే ఈ సందర్భంగా, చంద్రబాబు చెప్పిన ఒక విషయం చూస్తే, ఆశ్చర్యం కలగుతుంది.

ఆయన, నాలుగవ పాయింట్ గా, రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకాల వల్ల ఏవిధంగా వైరస్ విస్తరిస్తోందో ఉదాహరణలు అంటూ లేఖలో ఇలా రాసారు. "జగ్గయ్యపేట మండలంలో మార్చి18న ఢిల్లీనుంచి వచ్చిన వ్యక్తిని 10రోజులు యధేచ్చగా జనంలో వదిలేసి మార్చి 28న క్వారంటైన్ కు తరలించారు. పాజిటివ్ కేసుగా అది బైటపడిందని, గ్రామంలో ఈ 10రోజులు అతను ఎవరెవరిని కలిశాడో ఈ రోజు (ఏప్రిల్ 17న) విచారిస్తున్నారు. అతని ఢిల్లీ పర్యటన సమాచారం సోషల్ మీడియా ద్వారా ముందే అందించిన వ్యక్తిని గతంలో పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి కొట్టి శారీరకంగా హింసించారు. ఇప్పుడేమో ఇన్నాళ్ల తర్వాత అతని కదలికలపై ఎంక్వైరీ చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా అప్రమత్తం చేసినప్పుడే అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తం అయితే ఈ పరిస్థితి ఉండేదికాదు. వైరస్ వ్యాప్తిపై అందరినీ అప్రమత్తం చేసి, తగిన సమాచారం ఇచ్చేందుకు ఒకవైపు ప్రధాని నరేంద్రమోది ఆరోగ్యసేతు యాప్ ను తెచ్చారు. అలాంటిది సమాచారం ఇచ్చిన వ్యక్తిని స్టేషన్ లో కొట్టి, హింసించడం హేయం. ఎమ్మిగనూరుకు చెందిన ఒక వ్యక్తి ఏప్రిల్ 15 సాయంత్రం కర్నూలు ఆసుపత్రిలో చనిపోతే మృతదేహం ఇంతవరకు ఇవ్వలేదు. కరోనా వల్ల కాదని బంధువులను చెప్పమన్నారు. అతనికి పాజిటివ్ అనిగాని, కరోనా మృతుల జాబితాలో చేర్చడంగాని చేయలేదు. ఆయన బతికి ఉన్నప్పుడు గ్రామంలోఎవరెవరిని కలిశాడని ఇప్పుడు విచారిస్తున్నారు."

"రాజమండ్రిలో, విజయవాడలో, గుంటూరులో, కర్నూలులో, నెల్లూరులో ఇలాగే పాజిటివ్ కేసులను ముందే గుర్తించక పోయినందువల్ల ఆయా ప్రాంతాల ప్రజలు భారీ మూల్యం చెల్లించారు. గుంటూరులో ఒక వ్యక్తినుంచి 10మందికి వ్యాపించగా, విజయవాడలో ఒకవ్యక్తి నుంచి 8మందికి సోకడం ఈ సందర్భంగా గమనించాల్సిన అంశం. కర్నూలులో కరోనా రోగికి చికిత్స చేసినందుకు ఒక పేదల డాక్టర్ బలి అయ్యారు. సరైన రక్షణ పరికరాలు అందించివుంటే ఆ వైద్యుడిలా మరణించేవాడు కాదు. ఇప్పుడా డాక్టర్ వద్ద చికిత్స పొందిన రోగులు అందరిలో తమకు కూడా వైరస్ సోకిందేమో అనే భయాందోళనలు నెలకొన్నాయి. రూపాయికి, రూ 2 కు చికిత్స చేసే పేదల డాక్టర్ చనిపోయారనే బాధ ఒకవైపు, ఆయననుంచి తమకు అంటుకుందనే అనుమానాలు ఇంకోవైపున కర్నూలు వాసులు తల్లడిల్లుతున్నారు. నెల్లూరులో డాక్టర్ కూడా ఇలాగే బలి అయ్యారు. అనంతపురం, గుంటూరులో డాక్టర్లకు, నర్సులకు కూడా పాజిటివ్ వచ్చింది. ఇంకా ఎంతమంది డాక్టర్లు, నర్సులు, వైద్యసిబ్బంది బలి అయితే రాష్ట్ర ప్రభుత్వం అందరికీ రక్షణ ఉపకరణాలు అందిస్తుందని ఆయావర్గాలే నిగ్గదీస్తున్నాయి. బాధ్యతారహితంగా వ్యవహరిస్తే కలిగే దుష్ఫలితాలకు ఇవే ఉదాహరణలు. " అంటూ చంద్రబాబు లేఖలో ధ్వజమెత్తారు.

Advertisements

Latest Articles

Most Read