ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, 70వ జన్మదినం నేడు. కరోనా మహమ్మారి నేపధ్యంలో, ఈ సారి పుట్టిన రోజు జరుపుకోకూడదు అని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. తన పుట్టిన రోజుని, ప్రజల కోసం పని చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన డాక్టర్లు, పోలీసులు, పారిశుధ్య కార్మికులు, పని చేస్తున్న ఇతరులకు, తన పుట్టిన రోజు తరుపున, సహాయం చెయ్యాలని చంద్రబాబు పిలుపిచ్చారు. అలాగే లాక్ డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకోవాలని కోరారు. దీంతో, ఆయన ఈ సారి, తన పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉంటున్నారు. అయితే మరో పక్క సోషల్ మీడియాలో చంద్రబాబుకి తెలుగుదేశం కార్యకర్తలు, నేతలు, అలాగే వివిధ రాజాకీయ పార్టీలకు చెందిన నేతలు, సినీ ప్రముఖులు విషెస్ చెప్తూ, తెలుగుదేశం అధినేత చంద్రబాబుకి సోషల్ మీడియా ద్వారా విషెస్ చెప్తూ వస్తున్నారు.

ఈ సందర్భంగా, మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా చంద్రబాబు పై ప్రశంసలు కురిపించారు. ఇటీవలే ట్విట్టర్ లోకి వచ్చిన చిరంజీవి, చంద్రబాబుతో సరదాగా ఉన్న ఒక ఫోటో షేర్ చేస్తూ, చంద్రబాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. "అహర్నిశం ప్రజా సేవలో దశాబ్దాలుగా కొనసాగుతున్న మీ సంకల్పబలం అనితరసాధ్యం. కలకాలం మీకు సంతోషం, ఆరోగ్యం ప్రసాదించమని ఆ భగవంతుని కోరుతున్నాను. Wishing you a happy 70th Birthday Sir @ncbn Your vision, your hard work, your dedication are exemplary" అంటూ చిరంజీవి ట్వీట్ చేసారు.

అలాగే కేంద్ర మంత్రి, నితిన్ గడ్కారీ కూడా చంద్రబాబుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. "Birthday greetings to Telugu Desam Party President and Former Chief Minister of Andhra Pradesh Shri N Chandrababu Naidu Ji. @ncbn" అంటూ ట్వీట్ చేసారు. మరో పక్క సినీ హీరో రాణా దగ్గుబాటి కూడా చంద్రబాబు ఫోటుని, అలాగే తాను చంద్రబాబు గా ఆక్ట్ చేసిన ఫోటోను షేర్ చేస్తూ ట్వీట్ చేసారు "Happy birthday sir @ncbn was so exciting and an honor to portray a bit of you. Wishing you great health and happiness." అంటూ ట్వీట్ చేసారు.

రెండు రోజుల క్రితం, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, మేము దక్షిణ కొరియా నుంచి, స్పెషల్ ఫ్లైట్ లో, లక్ష కరోనా టెస్టింగ్ కిట్లు తెప్పించాం అని, దక్షిణ కొరియా నుంచి నేరుగా కొన్నాం అనే విధంగా, స్పెషల్ ఫ్లైట్ లో తెచ్చాం అంటూ, ప్రచారం చేసారు. ఈ ప్రచారాన్ని తారా స్థాయికి తీసుకు వెళ్తూ, మార్గాదర్శకాలు పక్కన పెట్టి మరీ, జగన్ మోహన్ రెడ్డి కూడా టెస్టింగ్ చేపించుకుని, మేము తెచ్చిన కిట్లు ఇవీ అంటూ, విస్తృత ప్రచారం చేసారు. అయితే, కిట్లు తేవటం మంచిదే కదా, అని అందరూ అనుకున్న సమయంలో, ఛత్తీస్‌గఢ్‌ వైద్య ఆరోగ్య మంత్రి టి.ఎ్‌స.సింగ్‌ దేవ్‌ చేసిన ట్వీట్ తో, అసలు బండారం బయట పడింది. కరోనా టెస్టింగ్ కిట్ల విషయంలో, ఏపి ప్రభుత్వం ఎక్కువ రేట్లు పెట్టి, కొనుగులు చేసినట్టు, ఆరోపణలు వచ్చాయి. ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం కూడా కొరియా నుంచి, ఇదే ప్రోడక్ట్, ఇదే కంపెనీ నుంచి, రూ.337కే కొనుగోలు చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం, దీనికి రెట్టింపు రేటు పెట్టి మరీ, రూ.700కు పైగా ఖర్చు చేసి కొనుగోలు చేసినట్టు బయట పడింది.

ఇక ఇక్కడ మరో విషయం ఏమిటి అంటే, "Random Medicaids Private Limited" అనే కంపెనీ కొరియా నుంచి సప్లై చేసింది అని ప్రెస్ కి చెప్పారు. అయితే బయట పడిన పర్చేజ్ ఆర్డర్ లో, "సండోర్ మెడీసైడ్స్ ప్రైవేటు లిమిటెడ్" అనే పేరు మీద ఉండటం, అలాగే, కొరియా నుంచి వచ్చిన కిట్లు, "Random Medicaids Private Limited" అనే కంపెనీ ద్వారా తెప్పించినట్టు, ఆ కంపెనీ డైరెక్టర్ మురళీధర్, సియంకు అందచేసినట్టు చెప్పారు. నిజానికి ఆ కంపెనీ పేరు, "సండోర్ మెడీసైడ్స్ ప్రైవేటు లిమిటెడ్", ఆ కంపెనీ డైరెక్టర్ పూర్తీ పేరు, వెంకట మురళీధర్ రెడ్డి అని తరువాత తేలింది. ఇలా ప్రభుత్వం ఈ వివరాలు పై గందరగోళం సృష్టించటంతో, తెలుగుదేశం, బీజేపీ పార్టీలు, ఈ విషయం జగన్ స్కాం చేసారని, ఆరోపణలు గుప్పించాయి. నిన్న ఉదయం దీని పై స్పందించిన ప్రభుత్వం మేము 700 రూపాయలకు కొన్నామని చెప్పగా, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి మాత్రం రూ.640 కొన్నామని అన్నారు. ఇలా పరస్పర విరుద్ధ ప్రకటనలు వచ్చాయి.

అంతే కాదు, మా పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, లీగల్ ఆక్షన్ తీసుకుంటామని, వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇలా ఉదయం నుంచి జరుగుతూ ఉండగా, నిన్న సాయంత్రం, ప్రభుత్వం మరో వివరణ ఇచ్చింది. "సండోర్ మెడీసైడ్స్ ప్రైవేటు లిమిటెడ్" అనే కంపెనీకి ఉత్తరం రాస్తూ, మాకు కూడా ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం కొనుగోలు చేసిన రేటు రూ.337కే ఇవ్వాలని లేఖ రాసింది. మొత్తం డెలివరీ తీసుకున్న తరువాత కూడా, మేము వారితో బెరం ఆడుతున్నాం, రేటు ఇంకా తగ్గుద్ది అని, ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం ఇచ్చిన రేటుకే కొంటాం అని చెప్పారు. ఇది మా కాంట్రాక్టు లో కూడా ఉందని, ఎక్కడ తక్కువ రేటుకి ఇస్తే, మాకు అదే రేటుకు ఇవ్వాలని కోరినట్టు ప్రభుత్వం చెప్తుంది. అయితే, డెలివరీ తీసుకున్న తరువాత, బెరం కుదురుతుందా ? అలాగే ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం డైరెక్ట్ గా దక్షిణ కొరియాలోని ఆ కంపెనీ నుంచి తెప్పించుకుంటే, మన ప్రభుత్వం మాత్రం, మరో మధ్యవర్తి, హైదరాబద్ కంపెనీ ద్వారా తెప్పించుకోవటంతోనే, ఈ రేటు ఇలా పెరిగింది అని, దీని వెనుక ఉన్నది కేంద్రం విచారణ చెయ్యాలని, విపక్షాలు కోరుతున్నాయి. ప్రభుత్వం నిన్న రాసిన లేఖతో, తామే డబల్ రేటు పెట్టి కొన్నాం అని ఒప్పుకుని, ఇప్పడు బయట పడటంతో, తప్పక రేటు తగ్గించేలా చూస్తాం అంటుందని, ప్రభుత్వమే తప్పు ఒప్పుకుందని, విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

కరోనా మహమ్మారితో, ప్రపంచం అంతా, లాక్ డౌన్ అయిపొయింది. అమెరికా లాంటి చోట్ల కూడా, అందరూ తలో చేయి వేసి, దాతలు సహాయాలు చేస్తే కాని, గడవలేని పరిస్థితి. మన దేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు లేవని, సహాయం చెయ్యమని కోరుతున్నారు. దాతలు ముందుకు వచ్చి, సహాయం చెయ్యాలని కోరుతుంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రధాని నరేంద్ర మోడీ కూడా, ఇదే విషయన్ని చెప్పారు కూడా. ఈ క్లిష్ట సమయంలో, అందరూ ఒకరికొకరు సహాయంగా ఉండాలని కోరుతున్నారు. అందరూ చేతనైన సహాయం చేస్తున్నారు కూడా. ఎక్కడిక్కడ దాతలు పెద్ద ఎత్తున వచ్చి, సహయం చేస్తున్నారు. మన రాష్ట్రంలో, ప్రభుత్వం కంటే, అత్యధింగా దాతలు సహాయం చేస్తున్నారని, ఒక రిపోర్ట్ కూడా ఈ మధ్య విడుదల అయ్యింది. అలాగే, మిగతా రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సహాయం చేస్తుంటే, ఆర్ధిక పరిస్థితి బాగోలేదు కాబట్టి, తక్కువ సహాయం చేస్తున్నామని, ప్రభుత్వమే చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం.

అలాంటిది, ఎంతో విలువైన సహాయం, ఒక సీనియర్ తెలుగుదేశం నాయకుడు చేసారని, దాన్ని తిప్పి పంపించే పరిస్థితి వచ్చింది. ఎప్పుడు కరోనా వస్తుందో, ఎప్పుడు పోతామో తెలియని పరిస్థితిలో ఈ రోజు ఉన్నా కూడా, ఇప్పుడు కూడా రాజకీయం ఆడుతున్నారు. కరోనా వైరస్ మహమ్మారితో పోరాటంలో భాగంగా, 12 వేల లీటర్ల సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని, అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపాలిటీలోనూ, అలాగే తన నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లో పిచికారి చేసే విధంగా, మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు నిర్ణయం తీసుకున్నారు. దీని కోసం, ముందుగానే, అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు అనుమతి తీసుకున్నారు. శుక్రవారం ప్రత్యేక ట్రక్కు లో, సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని రాయదుర్గం నియోజకవర్గానికి తెప్పించారు.

దీన్ని స్థానికంగా ఉన్న రాయదుర్గం మున్సిపల్ కమిషనర్ కు అందచేయాలని, తన అనుచరులు అయిన, టిడిపి నాయకులు గాజుల వెంకటేసులు, టంకశాల హనుమంతు, పసుపులేటి రాజు, బండి చిన్నను మున్సిపల్ ఆఫీస్ కు పంపించారు. ఈ లోడ్ ని, కమీషనర్ దృష్టికి తీసుకెళ్లి ద్రావణాన్ని, తగిన విధంగా వాడుకోవాలని కోరారు. అయితే, ఏ సంగతి చెప్తాను అని చెప్పిన కమీషనర్, మూడు గంటలు అయినా తిరిగి రాలేదు. అయితే ఏమైందో ఏమో కానీ, కొద్ది సేపటి తరువాత, ఇది మాకు అక్కరలేదంటూ నోటీసులు ఇచ్చి ట్రక్కు డ్రైవర్ ను వెనక్కి వెళ్లి పోవాలని రాయదుర్గం సిఐ తులసీరాం ద్వారా ఆదేశాలు జారీచేశారు. అయితే, ఈ పరిణామం పై, విమర్శలు వస్తున్నాయి. ఇలా ముందుకు వచ్చిన దాతలని, రాజకీయం నెపంతో, వెనక్కు పంపటం పై విమర్శలు వస్తున్నాయి.

వాళ్ళు మొన్నటిదాకా స్నేహితులు. ఎన్నికల్లో చంద్రబాబుని ఎలా అయినా ఓడించాలనే ఉద్దేశంతో, తెర వెనుక చేతులు కలిపారు అంటూ, విశ్లేషకులు భావిస్తూ ఉంటారు. అది నిజం అని ప్రజలు కూడా నమ్ముతారు కూడా. ఎన్నికల తరువాత కూడా వారి తెర వెనుక స్నేహం కొనసాగినా, రాను రాను ఇద్దరికీ తేడాలు రావటం మొదలు పెట్టాయి. ఆ రెండు పార్టీలే, బీజేపీ, వైసీపీ. వైసీపీని, బీజేపీకి దగ్గర చెయ్యటానికి, తెలుగుదేశం పార్టీని దూరం చెయ్యటానికి, ప్రముఖ పాత్ర పోషించి, రకరకాల ప్లాన్లు వేసి, చివరకు సక్సెస్ చేసింది విజయసాయి రెడ్డి అనేది నిర్వివాద అంశం. అయితే ఇప్పుడు ఇదే విజయసాయి రెడ్డి వల్ల, అటు బీజేపీకి, ఇటు వైసీపీకి తేడాలు వస్తున్నాయి. గతంలో విద్యుత్ పీపీఏ ల వల్ల దేశం పరువు, ప్రపంచ వ్యాప్తంగా పోయినా, అలాగే పోలవరం రివర్స్ టెండరింగ్ గురించి బీజేపీ ఆగ్రహంగా ఉన్నా సరే, మేము అన్ని పనులు బీజేపీకి చెప్పే చేస్తున్నాం అంటూ, బాంబు పేల్చారు విజయసాయి రెడ్డి.

vsreddy 19042020

అంటే వైసీపీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల్లో, మోడీ, అమిత్ షా భాగస్వామ్యం ఉందని, వాళ్లకు మేము చెప్పే చేస్తున్నాం, ఏమి చేసుకుంటారో చేసుకోండి అనే విధంగా, మాట్లాడారు. ఈ విషయం పై బీజేపీ అధిష్టానం ఫైర్ అయ్యింది. విజయసాయి రెడ్డిని దగ్గరకు రానివ్వద్దు అంటూ అమిత్ షా చెప్పినట్టు వార్తలు కూడా వచ్చాయి. అందుకు అనుగుణంగానే, దాదపుగా మూడు సార్లు, జగన్ మోహన్ రెడ్డికి, అమిత్ షా దగ్గర అపాయింట్మెంట్ లేకుండా పోయింది. అలాగే, రాష్ట్రంలో కూడా జగన్ చేస్తున్న ప్రజా వ్యతిరేక పనులను, రాష్ట్ర బీజేపీ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తుంది. ముఖ్యంగా అమరావతి విషయంలో, ఎన్నికల కమీషనర్ ను తప్పించే విషయంలో, ఇలా అనేక విషయాల్లో బీజేపీ, జగన్ వైఖరిని ప్రశ్నిస్తూ వస్తుంది.

ఇది నచ్చని విజయసాయి రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను టార్గెట్ చేసారు. ఈ రోజు అది మరి కాస్త శ్రుతి మించి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, సుజనా చౌదరి ద్వారా, ఒక వ్యక్తికి, 20 కోట్లకు అమ్ముడు పోయాడు అంటూ, తీవ్ర వ్యాఖ్యలు చేసారు. అయితే దీని పై బీజేపీ ఈ రోజు ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించింది. విజయసాయి రెడ్డిని తీవ్ర పదజాలంతో తిడుతూ, జైలు పక్షీ, ఢిల్లీలో బ్రోకర్ అంటూ, తీవ్రంగా స్పందించింది. "@VSReddy_MP ,Ppl of AP recognize you as a corrupt jailbird and broker in Delhi. True to your character, your allegations against @klnbjp are just cheap and idiotic blabber. @PMOIndia and @HMOIndia are aware of your wily, double-faced character. We warn you to stay in your limits"

Advertisements

Latest Articles

Most Read