నిజమైన రాజకీయ నాయకుడు, వచ్చే ఎన్నికల గురించి కాదు, వచ్చే తరం గురించి ఆలోచిస్తాడు అంటూ, చెప్తూ ఉంటారు. ఇలా పని చేసే రాజకీయ నాయకులకు, గెలుపు ఓటములతో సంబంధం ఉండదు. ఎందుకంటే, వారు చేసిన పనులే, ప్రజలకు ఉపయోగపడినప్పుడు, ఇలాంటి వారికే అదే తృప్తి. అధికారం, ప్రతిపక్షం, ఇలాంటి వారికి అడ్డు కాదు. అలాంటి రాజకీయ నాయకులు మనకు అరుదుగా దొరుకుతారు. అలనాటి వారిలో ఒకరు చంద్రబాబు నాయుడు. ఆయన గుర్తులు చేరిపెయలని, ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాని, ఆయన చేసిన పనులు మాత్రం, ప్రజలకు గుర్తు వస్తూనే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, నిబంధనలు సాకుగా చూపి, 9.5 కోట్లు ఖర్చుతో, కట్టిన అతి పెద్ద ప్రజా వేదికను, రాత్రికి రాత్రి కూల్చేసారు. ఇది కేవలం చంద్రబాబు తన ఆఫీస్ గా అడిగారు అనే విషయం పైనే, దాన్ని రాత్రికి రాత్రి కూల్చేసారు అనేది, విపక్షాల ఆరోపణ.
ఈ రోజు కరోనా విజ్రుంబిస్తున్న వేళ, ఈ ప్రజా వేదిక ఉండి ఉంటే, కనీసం, 300 మందికి వైద్యం అందించే వీలు ఉండేది. కాని, ఒక నాయకుడు కక్షకి, అది రాత్రికి రాత్రి, కూల్చేయబడింది. అయితే, ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది అంటే, తెలంగాణాలో కేసీఆర్ చేసిన పని చూసిన తరువాత, ఈ విషయం చెప్పకుండా ఉండలేము. చంద్రబాబు నాయుడు, ఎప్పుడో 2002లో, 18 ఏళ్ల కిందట, హైదరాబాద్ గచ్చిబౌలిలో, కట్టిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఈ కరోనా సమయంలో, తెలంగాణ ప్రభుత్వానికి ఉపయోగపడింది. 2002ఓ జరిగిన నేషనల్ గేమ్స్ లో భాగంగా, హైదరాబాద్ లోని గచ్చిబౌలి లో స్పోర్ట్స్ విలేజ్ కట్టారు చంద్రబాబు. అందులో భగంగా,14 అంతస్థుల తో 540 గదులు ప్రభుత్వం కట్టింది.
స్పోర్ట్స్ ఈవెంట్లుకు వచ్చే వారికి, ఇక్కడ వసతి ఇచ్చేవారు. అయితే ఇపుడు ఇది, టిమ్స్ పేరుతో హాస్పిటల్ గా మార్చాలని, కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కరోనా సమయంలో, పరిస్థితి తీవ్రంగా ఉన్న నేపధ్యంలో, ఈ భవనాన్ని వాడుకోవాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, ఇప్పుడు హైదరబాద్ లో ఉన్న గాంధీ హాస్పిటల్ కూడా, అక్కడ ఉన్న జైలు తొలగించి, హాస్పిటల్ గా కట్టారు చంద్రబాబు. ఇప్పుడు గాంధీ హాస్పిటల్ ఎలా ఉపయోగపడుతుందో చూస్తున్నాం. ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం చంద్రబాబు కట్టిన భవనాలు ఇప్పుడు తెలంగాణాకు ఇలా ఉపయోగ పడుతున్నాయి. మరి, ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు కట్టిన ప్రజా వేదిక మాత్రం, రాత్రికి రాత్రి కూల్చివేతకు గురైంది.