దేశంలో కరోనా మహమ్మారి, రోజురోజుకు ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. అయిత టెస్టింగ్ విషయంలో మాత్రం, కొన్ని రాష్ట్రాలు వెనుక బడి ఉన్నాయి. కరోనా ఉందో లేదో తెలుసుకోవటానికి, వాడే టెస్టులు కాకుండా, కరోనా లక్షణాలు కనుక్కోవటానికి, రాపిడ్ టెస్టింగ్ చెయ్యవచ్చు అంటూ కేంద్రం కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. అయితే, కరోనా నిర్ధారణకు, ఈ రాపిడ్ టెస్టులు మార్గం కాదని, ఇది కేవలం కరోనా లక్షణాలు కనుక్కోవటానికే అని చెప్పింది. దీంతో, కొన్ని రాష్ట్రాలు, రాపిడ్ టెస్టింగ్ కిట్లు తెప్పించుకున్నాయి. రాజస్తాన్, తమిళనాడు, కర్నాటక, ఛత్తీస్‌గఢ్ ఇలా కొన్ని రాష్ట్రాలు ఈ రాపిడ్ టెస్టింగ్ కిట్లు తెప్పించుకున్నాయి. మన రాష్ట్రం కూడా, మధ్యవర్తి ద్వారా కొరియా నుంచి ఇవి తెప్పించుకోవటం, కొనుగోలులో స్కాం జరిగింది అంటూ, ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆరోపణలు, నడుస్తూ ఉండగానే, వివిధ రాష్ట్రాలు, రెండు మూడు రోజులుగా ఈ కిట్లను వాడుతున్నాయి. కరోనా టెస్టింగ్ చేస్తున్నాయి.
అయితే రాజస్తాన్ ప్రభుత్వం, ఈ రాపిడ్ టెస్టింగ్ కిట్లలో లోపాలను గుర్తించింది. టెస్టింగ్ కిట్లతో చేస్తున్న పరీక్షల్లో, కచ్చితత్వం లేదని, రాజస్తాన్ ప్రభుత్వం తేల్చింది. 90 శాతం కచ్చితత్వం వస్తుంది అని అంచనా వేస్తె, కేవలం, 5.4 శాతం మాత్రమే కచ్చితంగా చూపిస్తుంది అని రాజస్తాన్ ప్రభుత్వం తేల్చింది. ఇదే విషయం, భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) దృష్టికి తీసుకు వెళ్ళింది. మరో రాష్ట్రం కూడా, ఇలాగ్ రాపిడ్ టెస్టింగ్ లో తేడాలు ఉన్నాయని,ఐసీఎంఆర్ కు చెప్పింది. రాజస్తాన్ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి రఘు శర్మ, ఈ కిట్ల వల్ల ఉపయోగం లేదు అని కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లినట్టు చెప్పారు. మా సలహా కమిటీ సూచనల ప్రకారం, టెస్టింగ్ నిలిపివేసినట్టు చెప్పారు.
కరోనా పాజిటివ్ ఉన్న పేషంట్ కు టెస్ట్ చేసినా, నెగటివ్ అనే ఈ కిట్ చూపిస్తుంది అని చెప్పారు. ఈ రాపిడ్ టెస్ట్ కిట్ల వల్ల ఉపయోగం లేదని చెప్పారు. దీంతో, ఈ విషయం పై, ఐసీఎంఆర్ ఈ రోజు స్పందించింది. రాపిడ్ టెస్ట్లు ద్వారా తప్పుడు ఫలితాలు వస్తున్నాయని, తమకు వివిధ రాష్ట్రాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, అందుకే కొన్ని రాష్ట్రాలు ఈ కిట్లు ఉపయోగించటం లేదని తమకు తెలిసింది అని అన్నారు. అందుకే ప్రస్తుతానికి, ఈ రాపిడ్ కిట్లు ఉపయోగించ వద్దు అంటూ, అన్ని రాష్ట్రాలను కోరినట్టు, ఐసీఎంఆర్ అంటువ్యాధుల విభాగం చీఫ్ డాక్టర్ రమణ్ ఆర్ గంగాఖేడ్కర్ ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కిట్లను, పరీక్షించి, ధ్రువీకరించాల్సి ఉందని, రెండు రోజుల్లో ఏ విషయం రాష్ట్రాలకు చెప్తాం అని అన్నారు.