ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం, జగన్ మోహన్ రెడ్డి, ఇతర మంత్రులు, మనం కరోనాను కట్టడి చెయ్యటంలో, అద్భుతంగా పని చేస్తున్నాం అంటూ చెప్తున్నారు. ఇక జగన్ మోహన్ రెడ్డి గురించి అయితే, ఆయన దేశంలోనే నెంబర్ వన్ క్రైసిస్ మ్యానేజ్మెంట్ చేస్తున్నారు అంటూ, మంత్రులు డబ్బా కొడుతుంటే, వాస్తవం మాత్రం వేరేలాగా ఉంది. జాతీయ మీడియా ఈ విషయంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైపు వేలెత్తి చూపిస్తుంది. జాతీయ మీడియా చూపించిన ఫోటోలు చూస్తూ, మన రాష్ట్రం ఎంత ప్రమాదకర స్థితిలో ఉందొ అర్ధం అవుతుంది. ప్రభుత్వం వాస్తవాలు దాస్తుంది అంటూ, తెలుగుదేశం చేస్తున్న విమర్శలు నిజం అవుతున్నాయి అనే చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం కేవలం రెండు జిల్లాలు మాత్రం రెడ్ జోన్ అంటూ కేంద్రానికి చెప్పగా, కేంద్రం మాత్రం, 11 జిల్లాలు రెడ్ జోన్ గా చూపించింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా, 85 శాతం రాష్ట్రం, రెడ్ జోన్ లో కి వెళ్ళిపోయింది. తరువాత 38 శాతంతో, మహారాష్ట్ర ఉంది అంటే, మన రాష్ట్రం ఎంత ప్రమాదక స్థితిలో ఉందొ అర్ధం అవుతంది.
ఒక పక్క వాస్తవాలు ఇలా ఉంటే, ప్రభుత్వ పెద్దలు మాత్రం, తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో 676 మండలాల్లో కేవలం 27 మండలాలు రెడ్ జోన్ లో, 44 ఆరెంజ్ జోన్లో మాత్రమే ఉన్నాయని చెప్పినప్పటికీ, కేంద్రం దీనిని నమ్మలేదు. ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 13 జిల్లాల్లో 11 జిల్లాలను రెడ్ జోన్లుగా ప్రకటించింది. కాగా, తెలంగాణలో ఎక్కువ కరోనా కేసులు ఉన్నాయని, తెలంగాణ సిఎం పూర్తి లాక్డౌన్ కోసం పట్టు బట్టారు. అయితే కేంద్రం 33 జిల్లాలలో 8 జిల్లాలను మాత్రమే రెడ్ జోన్లు గా ప్రకటించింది. కరోనావైరస్ పాజిటివ్ కేసులకు సంబంధించినంతవరకు కేంద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని పూర్తిగా విశ్వసిస్తుందని బిజెపి హైకమాండ్ అంతర్గత వర్గాలు చెప్పినట్టు, ఒక జాతీయ మీడియా ఆర్టికల్ రాసింది.
అయితే ఏపి విషయంలో మాత్రం, రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విషయాలు నమ్మలేదు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు మినహా అన్ని జిల్లాలు అంటే కర్నూలు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, కృష్ణ, కదపా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, చిత్తూరు, విశాఖపట్నం, మరియు అనంతపురం రెడ్ జోన్లుగా ప్రకటించబడ్డాయి. ఆంధ్రాలో కరోనావైరస్ వ్యాప్తికి సంబంధించినంతవరకు కేంద్ర ప్రభుత్వం, స్వంత డేటా తెప్పించుకునట్టు తెలుస్తోంది. బిజెపి నాయకుడు లంక దినకర్ ఒక జాతీయ ఛానల్ తో మాట్లాడుతూ ”ఆంధ్రప్రదేశ్లో చాలా కోవిడ్ -19 కేసులు ఉన్నాయి. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం డేటాను దాచిపెట్టి, కొన్ని కేసులను మాత్రమే విడుదల చేస్తోంది. నంద్యాలా, ఒంగోల్ వంటి పట్టణాల్లో వందలాది కేసులు ఉన్నాయి, కాని ప్రభుత్వం పారదర్శకంగా లేదు ” అని అన్నారు.