ఆళ్ల రామకృష్టారెడ్డి పెట్టిన కేసు, ఈ రోజు కోర్టు నుంచి వచ్చిన ఆదేశాల పై, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, కింజరాపు అచ్చెన్నాయుడు స్పందించారు. ఆయన మాటల్లోనే "చంద్రబాబు నాయుడపై సీఐడీ పెట్టిన అక్రమ కేసుపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతోనైనా వైసీపీ కళ్లు తెరవాలి. రైతులెవరూ తప్పుడు ఫిర్యాదులు ఇవ్వడానికి ముందుకు రాకపోవడంతో రామకృష్ణారెడ్డి ఆఫీసులో పనిచేసే జాన్సన్ అనే వైసీపీ కార్యకర్త చేత తప్పుడు కేసులు సృష్టించారు. ఏ ఆధారం లేకుండానే చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేసింది. రుజువులు వుండి వుంటే నేడు కోర్టులో సీఐడీ ప్రవేశపెట్టేది. నిత్యం రాజధానిపై నిందలు వేస్తూ అమరావతి బ్రాండ్ ను వైసీపీ దెబ్బ తీస్తోంది. రాజధానికి భూములిచ్చిన రైతులకు వైసీపీ తీరని ద్రోహం చేస్తోంది. నిరాధారమైన కేసులు వేయడం రాజశేఖర్ రెడ్డి కాలం నుండి వస్తోంది. అసైన్డ్ భూముల అక్రమాల గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదు. అసైన్డు రైతుల నుండి భూములు లాక్కున్న ఘనులు వైసీపీలో చాలా మంది ఉన్నారు. ఇళ్ల పట్టా పేరుతో 6 వేల ఎకరాల అసైన్డు భూములు గుంజుకుని కోట్లకు అమ్ముకున్నారు. జీ.ఓ నంబర్ 41లో ఎలాంటి తప్పులు లేవు కాబట్టే హైకోర్టు స్టే ఇచ్చింది. వైసీపీ పెట్టిన అక్రమ కేసు కోర్టులో నిలబడదు. అర్ధం లేని ఫిర్యాదులు చేసి ప్రతిష్టను దిగజార్చాలనుకున్న వైసీపీ నేతలు మరోసారి ప్రజల్లో నవ్వుల పాలయ్యారు. రాజధానికి స్వచ్ఛందంగా భూములు ఇచ్చామని, తమ భూములు ఎవరూ లాక్కోలేదని సీఐడీ ఎదుట అసైన్డు రైతులు చెప్పారు. "

alla 19032021 2

"ఆళ్ల రామకృష్టారెడ్డి తన విలక్షణ నటనకు తెరదింపాలి. మంత్రిపదవి కోసం పడుతున్న ఆరాటం చూస్తే జాలేస్తోంది. ఆళ్ల వేసిన కేసులు దళిత ప్రయోజనాల కోసమో.. వైసీపీ ప్రయోజనాల కోసమో తెలుసుకోలేని అమాయక స్థితిలో దళితులు లేరు. ఆర్కేకు చిత్తశుద్ధి వుంటే దళితులు అధికంగా ఉన్న అమరావతి నుండి రాజధాని మార్చి దళితులను మోసం చేయాలని చూస్తున్న జగన్ రెడ్డిపై కోర్టులో కేసులు వేయాలి. రైతులను బెదిరించి తప్పుడు ఫిర్యాదులు ఇప్పించాలని వైసీపీ ప్రయత్నించింది. కానీ రైతులు ప్రభుత్వ ఒత్తిడిలకు లొగ్గలేదు. తక్షణమే వైసీపీ రాజధాని రైతులకు, చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలి. కక్షలు, దౌర్జన్యాలు, అరాచకంతో జగన్ రెడ్డి పాలన సాగిస్తున్నారు. అహంకారంతో ప్రభుత్వం పంతానికి పోయి, తప్పులు సరిదిద్దుకొనే ప్రయత్నం చెయ్యకుండా సమస్యలు కొని తెచ్చుకొంటోంది. ప్రజా ప్రయోజనాలకు పెద్ద పీట వెయ్యాల్సిన ప్రభుత్వం స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకు పెద్ద పీట వేయడం వల్లనే కోర్టులతో ప్రభుత్వం తలంటించు కోవాల్సి వచ్చింది."

ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయాణ, తమకు ఇచ్చిన సిఐడి నోటీసులు పై, అలాగే తమ పై ఎటువంటి ఆధారాలు లేకుండా నమోదైన సిఐడి కేసు పై హైకోర్టుకు వెళ్ళిన సంగతి తెలిసిందే. ఇటు చంద్రబాబు, నారాయణ, అంటూ ప్రభుత్వం, సిఐడి తరుపు న్యావాదుల వాదనలు విన్న హైకోర్టు, కేసు పై స్టే వేధిస్తూ, నాలుగు వారాలు పాటు ఎటువంటి ఆక్షన్ వీరి పై తీసుకోకూడదు అంటూ, కేసు పై స్టే విధించిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు క్వాష్ పిటీషన్ వేస్తే, కోర్టు స్టే మాత్రమే ఇచ్చింది అంటూ, వైసీపీ చేసిన ఆరోపణలకు వెంటనే సమాధానం లభించింది. అసలు ఈ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి కాబట్టి, ఆయన వాదనలు కూడా వినాలని కోర్టు నిర్ణయం తీసుకుంది. ఆయన వాదనలు కూడా విన్న తరువాత క్వాష్ పిటీషన్ పై , కోర్టు ఒక నిర్ణయం తీసుకోనుంది. ఈ కేసుని నాలుగు వారాలకు వాయిదా వేసారు కాబట్టి, ఆప్పుడే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి వాదన కూడా కోర్టు వినే అవకాసం ఉంది. అయితే దీనికి సంబంధించి, కోర్టు ఆళ్ళ రామకృష్ణా రెడ్డికి ఈ రోజు నోటీసులు పంపించింది.

alla 119032021 2

ఇందులో కొన్ని కీలక వ్యాఖ్యలు కోర్టు చేసింది. సిఆర్డీఏ చట్టం సెక్షన్ 146 ప్రకారం, ప్రధమిక ఆధారాలు ఏమి లేకుండా, సీఆర్డీఏకు సంబందించిన జీవో పై విచారణ చేపట్టకూడదు అని స్పష్టంగా ఉంది కదా అని కోర్టు ఆ నోటీసులో ప్రశ్నించింది. అలాగే తాము సిఐడిని, చంద్రబాబు, నారాయణ నేరం చేసినట్టు మీ వద్ద ప్రాధమిక విచారణలో, ఏమి ఆధారాలు ఉన్నాయంటే, ఏమి సిఐడి చూపించలేకపోయిందని, హైకోర్టు ఆ నోటీసులో తెలిపింది. కేవలం జీవో జారీ చేసారని, సిఐడి కేసు ఎలా నమోదు చేస్తుంది అంటూ కోర్టు ప్రశ్నించింది. సిఆర్డీఏకి నష్టం కలిగితే వారు ఎందుకు ఫిర్యాదు చేయలేదు అంటూ కోర్టు ప్రశ్నించింది. దీంతో ఇప్పుడు ఆళ్ళ ఏమి సమాధానం చెప్తారు అనే దాని పై ఆసక్తి నెలకొంది. రెండేళ్ళలో సంపాదించలేని ఆధారాలు, ఈ నాలుగు వారాల్లో ఆళ్ళ కాని, ప్రభుత్వం కాని, సిఐడి కాని సంపాదించి, కోర్టు ముందు పెడతారా ? అలా ఆధారాలు పెడితేనే ఈ కేసు నిలబడే అవకాసం ఉంది. ఆధారాలు చూపించకుండా, కేవలం రాజకీయ ఆరోపణలు చేస్తే, ఈ కేసు సుప్రీం కోర్టుకు వెళ్ళినా ప్రభుత్వానికి భంగపాటు తప్పదు.

మంత్రి పెద్దిరెడ్డి, బొత్సా ఇచ్చిన ఫిర్యాదు పై, నిన్న అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ , రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డకు, నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనికి రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ, ఈ రోజు రాతపూర్వకంగా, వివరంగా లేఖ రాస్తూ, రాష్ట్ర ప్రభుత్వానికి ఘాటుగా రిప్లై ఇచ్చారు. నిన్న అసెంబ్లీ కార్యదర్శి, నిమ్మగడ్డకు నోటీస్ పంపించిన విషయం తెలిసిందే. దీనికి సంబధించి నిమ్మగడ్డ రమేష్ కుమార్, అసెంబ్లీ కార్యదర్శికి రిప్లై ఇచ్చారు. దానిలో ప్రివిలేజ్ కమిటీ తనకు పంపించిన నోటీసులకు, తాను ఆ విచారణ పరిధిలోకి రానని స్పష్టంగా తెలియచేసారు. శాసనసభ హక్కులకు, శాసనసభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు, వీళ్ళ హక్కులకు భంగం కలిగించే విధంగా తాను ఏమి వ్యవహరించలేదని, చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అసెంబ్లీ అయినా, శాసనమండలి అయినా, తనకు పూర్తి స్థాయిలో గౌరవం ఉందని, ఆ రిప్లై లో నిమ్మగడ్డ స్పష్టం చేసారు. ఇంత చెప్పిన తరువాత కూడా, దీని పై మరింత ముందుకు వెళ్ళాలని భావిస్తే మాత్రం, కచ్చితంగా సరైన సమయంలో, తగిన ఆధారాలతో తాను స్పందిస్తానని చెప్పి, ఆయన స్పష్టంగా, ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఇది వివరణ అని చెప్పటానికి కూడా లేదని, ఆయన అభిప్రాయాన్ని, చాలా ఘాటుగా ప్రభుత్వానికి చెప్పారని, భావిస్తున్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో తాను కవిడ్ టీకా తీసుకున్నానని అన్నారు.

nimmagadda 19032021 2

తాను ప్రయాణం చేయలేని పరిస్థితిలో ఉన్నానని, ఫిసికల్ గా ప్రయాణం చేయాలంటే, తనకు కొంత సమయం అవసరం అని, విషయాన్ని స్పష్టం చేసారు. మొత్తం మీద, నిమ్మగడ్డకు ప్రివేలేజ్ కమిటీ నుంచి, అసెంబ్లీ కార్యదర్శి పంపించిన నోటీస్ తో,చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ, తాను ఎవరి హక్కులకు భంగం కలిగించలేదని, అసలు తాను ఈ విచారణ పరిధిలోకి రాను అని స్పష్టం చేసారు. అంతే కాకుండా, ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే, తాను స్పష్టమైన ఆధారాలతో వస్తాను అని చెప్పటం, అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు ఏమి ఆధారాలతో వస్తారు, ఎందుకు ఇంత స్ట్రాంగ్ గా చెప్పారు అనే విషయం ఇప్పుడు చర్చనీయంసం అయ్యింది. సరైన సమయంలో, ఆధారాలు ఇస్తాను అని చెప్పటం చూస్తుంటే, చాలా గట్టిగానే ప్రభుత్వంతో సై అనే విధంగా, ఆయన స్పందించారు. దీని పై మరి ప్రభుత్వం, ప్రివిలేజ్ కమిటీ ఎలా స్పందిస్తుందో చూడాలి. ప్రభుత్వం స్పీడ్ చూస్తుంటే, మరోసారి నోటీసులు ఇవ్వటం, తరువాత ఏదైనా దూకుడు నిర్ణయం తీసుకుంటుందా అనే చర్చ కూడా జరుగుతుంది.

ఈ రోజు హైకోర్టులో, రాష్ట్ర ప్రభుత్వానికి చిక్కు ఎదురయింది. ఎలా అయినా చంద్రబాబుని ఒక్క రోజు అయినా జైల్లో పెట్టాలని, ప్రభుత్వం పెట్టిన కేసులో పస లేకపోవటం, ప్రాధమికంగా హైకోర్టు అడిగిన బేసిక్ ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పకపోవటంతో, హైకోర్టులో ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. రాజధాని అమరావతి అసైన్డ్ భూములకు సంబంధించి ఈ రోజు ఉదయం నుంచి హైకోర్టులో వాదనలు జరిగాయి. చంద్రబాబు, నారాయణ తరుపున లాయర్లు ఉదయం వాదనలు వినిపించారు. మధ్యానం నుంచి ప్రభుత్వం తరుపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు, కేసు పై, సిఐడి విచారణ పై స్టే విధించింది. నాలుగు వారాల పాటు, ఈ కేసు పై స్టే విధించింది. ఈ సందర్భంగా కంప్లైంట్ ఇచ్చిన ఆళ్ళకు నోటీసులు ఇచ్చి, ఆయన వాదన కూడా విననుంది. తరువాత చంద్రబాబు వేసిన క్వాష్ పిటీషన్ పై కోర్టు నిర్ణయం తెసుకునే అవకాసం ఉంది. అయితే ఈ సందర్బంగా హైకోర్టు, కొన్ని కీలక ప్రశ్నలు సంధించింది. ప్రధానంగా హైకోర్టు, సిఐడికి వేసిన ప్రశ్నతో, సిఐడి ఇచ్చిన సమాధానంతో,మొత్తం కేసు నీరుగారిపోయింది. కోర్టు ప్రశ్నిస్తూ, ఎఫ్ఐఆర్ లో ఏమి ఆధారాలు లేవు కదా, మీరు చేసిన ప్రాధమిక విచారణలో, మీరు ఎలాంటి ఆధారాలు సేకరించారు అంటూ కోర్టు సిఐడి ని ప్రశ్నించింది.

hc questions 19032021 2

మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటో చెప్పాలని కోర్టు, సిఐడిని ప్రశ్నించింది. దీనికి స్పందిచిన సిఐడి, ప్రాధమిక విచారణ దశలో తమ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని, కేసు పూర్తిగా దర్యాప్తు చేస్తే అప్పుడు ఆధారాలు అన్నీ సమర్పిస్తాం అంటూ సమాధానం చెప్పటంతో, కేసులో పసలేదనే వాదన అర్ధమైంది. సిఐడి చేతులు ఎత్తేయటంతో, చంద్రబాబు పిటీషన్ కు సగం బలం చేకురుంది. తరువాత కోర్టు మరో ప్రశ్న వేసింది. బాధిత రైతులు ఎందుకు ఫిర్యాదు చేయలేదు, మీరు ఎందుకు ఫిర్యాదు చేసారు అంటూ కోర్టు ప్రశ్నించింది. అలాగే సెక్షన్ 146 సీఆర్డీఏ ప్రకారం, ఎలాంటి ప్రాధమిక ఆధారం లేకుండా, ఎలా విచారణ చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. ఇలా కోర్టు అడిగిన అనేక ప్రశ్నలకు సిఐడి దగ్గర సమాధానం లేకుండా పోయింది. దీంతో హైకోర్టు ఒక అంచనాకు వచ్చి, నాలుగు వారాల పాటు ఎలాంటి ఆక్షన్ తేసుకోకూడదు అంటూ స్టే విధించింది. ఈ లోపు ఆళ్ళ కు నోటీసులు పంపించింది. ఆయన వాదన కూడా విని, క్వాష్ పిటీషన్ పై నిర్ణయం తీసుకునే అవకాసం ఉంది.

Advertisements

Latest Articles

Most Read