విశాఖ ఉక్కును కాపాడుకుంటామని జాతీయ యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నూరు శాతం ప్రైవేట్పరం చేస్తామన్న కేంద్రప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా శనివారం విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటకమిటీ ఆధ్వర్యంలో ఉక్కునగరం త్రిష్ణా మైదానంలో నిర్వహించిన ఉక్కు కార్మిక గర్జన పూర్తిస్థాయిలో విజయవంతమైంది. ఈ భారీ బహిరంగ సభకు దేశవ్యాప్త జాతీయ యూనియన్ ప్రముఖులు ఇంటర్ నుంచి జి సంజీవరెడ్డి, సిఐటియు నుంచి తపస్సేన్, ఏఐటియుసి నుంచి అమర్ జిత్ కౌర్, హెచ్ఎమ్ఎస్ నుంచి రియాజ్ అహ్మద్, బిఎమ్ఎస్ఎస్ నుంచి డికె పాండే, టిఎన్‌టియుసి నుంచి జి రఘురామరాజు తదితర జాతీయ కార్మిక నాయకులు ముక్తకంఠంతో ఉక్కు పరిరక్షణ కోసం నినాదించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ యాజమాన్యానికి అమ్మాలనుకోవడం కేంద్రానికి సరికాదని, 32 మంది ప్రాణత్యాగాలతో ఏర్పడిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నష్టాల పేరుతో అమ్మాలని చూస్తున్నారని, సొంత గనులుంటే విశఋఖ ఉక్కు లాభాల బాటలో నడుసుందన్నారు. దేశంలోని కార్మిక సంఘాలన్నీ ఉక్కు పరిరక్షణకు సహకరిస్తాయని బరోసా ఇచ్చారు. ప్రభుత్వ 112 రంగ సంస్థల ప్రైవేటీకరణలో రాజ్యాంగ బద్దంగా వచ్చిన రిజర్వేషన్లను తొలగించే దురాలోచన కేంద్రానికి ఉందని నేతలు విమర్శించారు.

steel plant 21032021 2

ఇంకా ఈ బహిరంగ సభలో విశాఖ ఉక్కు పరిరక్షణకమిటీ నాయకులు సిహెచ్ నరసింగరావు, జె అయోద్యరాం, మంత్రి రాజశేఖర్, డి ఆదినారాయణ, గంధం వెంకటరావు, బొడ్డు పైడిరాజు, వై మస్తానప్ప, విల్లా రామ్మోహన్‌కుమార్, వరసాల శ్రీనివాసరావు, స్టీల్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్, ఉక్కు ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ ఉక్కు పరిరక్షణ ఉద్యమానికి ఢిల్లీ దగ్గర ఉద్యమం చేస్తున్ రైతు నేతల మద్దతు కోరామని, ఈ నెల 28 నగరంలో జరిగే బహిరంగ సభకు ఆ నేతలు కూడా వస్తారని తెలిపారు. క్షణికావేశంలో ఎవరూ కూడా కర్మాగార పరిరక్షణ కోసం ఆత్మ--హ--త్య--లు వంటి వాటికి పాల్పడవద్దని కోరారు. దైర్యంగా అందరం పోరాడదామని పిలుపునిచ్చారు. ఈ భారీ బహిరంగ సభకు ఉక్కు ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, కాంట్రాక్టు కార్మికులు, ఉక్కునగర వాసులు అందరూ అధిక సంఖ్యలో హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ప్రదర్శించిన ఒక ఫోటోతో, వైసీపీ నేతలు షాక్ తిన్నారు. నిన్నటి వరకు, కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, నేతలు తమ చుట్టూ తిరిగారని, ఎన్నికలు అయిన తరువాత, ఒక్కడు కూడా అడ్డ్రెస్ లేరు అంటూ, తమ ఎంపీలు కనిపించటం లేదు అంటూ, ఫ్లెక్సీ ప్రదర్శించారు.

సిక్కోలులో బలమైన నేత, తెలుగుదేశం పార్టీకి ఢిల్లీలో వాయిస్ గా ఉండే కింజరాపు ఎర్రంనాయుడుని, గుర్తు చేస్తూ, ఆయన వారసుడు కింజరాపు రామ్మోహననాయుడుకు ఇప్పటీకే మంచి పేరు వచ్చేసింది. వెనుకబడిన ప్రాంతమైన శ్రీకాకుళం నుంచి, ఢిల్లీలో అడుగుపెట్టిన రామ్మోహన్ నాయుడు, ఇప్పటికే రెండు సార్లు ఎంపీ అయ్యారు. తండ్రి మరణం తరువాత, చిన్న తనంలోనే రాజకీయల్లోకి వచ్చి, తండ్రిని మరిపిస్తూ,మంచి పేరు తెచ్చుకున్నారు. అందరి వారసుల్లా కాకుండా, కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యల పై, ఢిల్లీ పార్లమెంట్ లో, రామ్మోహన్ నాయుడు చేసిన గర్జన, ఆంధ్రప్రదేశ్ ప్రజలనే కాదు, దేశం మొత్తం ప్రశంసలు అందుకుంటుంది. ముఖ్యంగా 2019లో మోడీ ప్రభుత్వం పై టిడిపి అవిశ్వాసం పెట్టిన సమయంలో, రామ్మోహన్ నాయుడు ఇచ్చిన స్పీచ్, చరిత్రలో నిలిచిపోయింది. ఎర్రంనాయుడుని గుర్తు చేసే విధంగా,హిందీలో గడగడలాడించి, మన హక్కులు అడుగుతూ, ప్రధాని మోడీని నిలదీస్తూ రామ్మోహన్ చేసిన ప్రసంగం, ఇప్పటికీ ప్రజలకు గుర్తుంది. చంద్రబాబు నమ్మకాన్ని నిలబెడుతూ, చిన్న వయసులోనే రామ్మోహన్ నాయుడు, మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన పని తనానికి గుర్తింపు లభించింది.

rammohan 21032021 2

శ్రీకాకుళం లోకసభ నియోజకవర్గ సభ్యులు కింజరాపు రామ్మోహననాయుడుకు 2019-20 సంవత్సరానికి గాను ఉత్తమ పార్లమెంటేరియన్ గా గుర్తించి సంసద్ రత్న అవార్డును భారత ముఖ్య ఎన్నికల కమీషనర్ సునీల్ అరోరా, భారత సుప్రీమ్ కోర్టు మాజీ న్యాయమూర్తి పట్నాయిక్ చేతుల మీదుగా అందుకున్నారు. గత సంవత్సరం పార్లమెంటులో ఎంపి రామ్మోహననాయుడు అత్యుత్తమపనితీరు కనబరచినందుకు గాను ఈ అవార్డుకు ఎంపికయ్యారు.శనివారం ఢిల్లీలో ఈ అవార్డును ఆయన అందుకున్నారు. ఈ అవార్డుకు తననకు ఎంపిక చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఈసందర్భంగా ఎంపీ రామ్మోహననాయుడు శనివారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయం నుంచి విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. తనను ఈ అవార్డుకు ఎంపిక చేసినందుకు ఆయన కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో తాను మరింతగా కష్టపడి పనిచేయడానికి, ప్రజా సమస్యలపై పోరాటం సాగించడానికి కృషిచేస్తానని, ఈ అవార్డు తనపై మరింత బాధ్యతలను పెంచిందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ అవకాశాన్ని తనకు రావడంతో జిల్లా ప్రజలు ఎంపిగా తనను గెలిపించడం వల్లనే సాధ్యపడిందని ఆయన పేర్కొంటూ, జిల్లా ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఒక పక్క అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రుల రాజధాని అమరావతిని వ్యంగ్యంగా, అది అమరావతి కాదు, భ్రమరావతి అని హేళన చేస్తుంది. అమరావతి ముందుకు సాగకుండా ప్రతి రోజు, అమరావతి పై ఏదో ఒక బురద చల్లుతూనే ఉంది. 2019 దాకా అమరావతిలో పది వేల కోట్లు ఖర్చు పెడితే, 2019లో జగన్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. అమరావతి నెమ్మదిగా ఒక శిధిల నగరం అయిపొయింది. ఇది ఒక ఎత్తు అయితే, అమరావతిని కేవలం శాసన రాజధాని అంటూ, ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన ముందుకు తెచ్చింది. చెప్పేది మూడు రాజధానుల అయినా, అమరావతి, కర్నూల్ కు చేసేది ఏమి లేదని అందరికీ తెలిసిందే. దీని కోసం, అమరావతి పై రకరాకాలుగా బురద చల్లుతున్నారు. ఇప్పుడు తాజాగా చంద్రబాబు ఇందులో ఏదో చేసారు అంటూ, ఆయన పై సిఐడి కేసు నమోదు చేసారు. ఆధారాలు లేకుండా కేసులు పెట్టారు. ఇలా అమరావతి పై రాష్ట్ర ప్రభుత్వం, అన్ని విధాలుగా సవతి తల్లి ప్రేమ చూపిస్తుంటే, కేంద్రం మాత్రం అమరావతికి సై అంటుంది. అమరావతి అభివృద్ధి కోసం, వచ్చే 5 ఏళ్ళలో, ఆర్ధిక సంఘం సిఫారుసు మేరకు వెయ్యి కోట్లు నిధులు ఇస్తాం అంటూ, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ ప్రకటన చేసారు.

amarjavati 20032021 2

15వ ఆర్ధిక సంఘం, రాష్ట్రంలో ఎనిమిది కొత్త నగరాలకు, 8 వేల కోట్లు సిఫారుసు చేసిందని, ఇందులో అమరావతి కూడా ఉందని, అమరావతి వచ్చే 5 ఏళ్ళలో వెయ్యి కోట్లు నిధులు, ఆర్ధిక సంఘం సిఫారసు మీది ఇస్తాం అని తెలిపారు. ఇది కూడా వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా పార్లమెంట్ లో చెప్పారు. దీనికి సంబంధించి విధివిధానాలు త్వరలోనే చెప్తామని కేంద్రం ప్రకటించింది. అయితే కేంద్రం ఈ నిధులు ఇస్తుందా, ఇప్పటి వరకు ప్రకటించినవి ఇచ్చిందా అనే విషయం పక్కన పెడితే, ఇక్కడ అమరావతిని కొత్త నగరంగా గుర్తించటం,దానికి వెయ్యి కోట్లు నిధులు ఇవ్వటం, వైసీపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. ఒక పక్క అమరావతిని నిర్వీర్యం చేయాలని, అక్కడ రూపాయి ఖర్చు పెట్టినా దండగ అంటూ వైసీపీ నేతలు చెప్తుంటే, కేంద్రం మాత్రం ఇలా సహాయం చేస్తుంది. అయితే ఇది కేవలం కొత్త నగరాలకు అని వైసీపీ సమర్ధించుకుంటున్నా, ఇప్పటికీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన, కేంద్రం గుర్తించలేదు అనే విషయం, ఈ ప్రకటనతో అర్ధమవుతుంది.

స్టీల్ ప్లాంట్ ఉద్యోగి శ్రీనివాసరావు లాగ్ బుక్ లో ఆ--త్మ--హ--త్య చేసుకుంటున్నట్టు రాసి అదృశ్యమవ్వడంతో మిస్సింగ్ కేసు పెట్టామని ఏసీపీ పెంటారావు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అతని కోసం గాలిస్తున్నామని చెప్పారు. అతను ట్రేస్ అయ్యేవరకు అతని మృ-తిపై ఎలాంటి ఖచ్చితమైన ప్రకటన చేయలేమని తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు అతను ఆ--త్మ--హ--త్యకు పాల్పడలేదని తెలుస్తోందని చెప్పారు. శ్రీనివాస రావు కుమారుడు మహేష్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. విచారణ లో స్టీల్ ప్లాంట్ ఉద్యోగి శ్రీనివాసరావు అదృశ్యం కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నట్లు చెప్పారు. లాగ్ బుక్ లో శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకుంటున్నట్టు రాసి అదృశ్యమవ్వడంతో మిస్సింగ్ కేసు పెట్టామని అన్నారు. ఆయన కాల్ డీటెయిల్స్ తీస్తే నలుగురితో చాలా సేపు మాట్లాడినట్టు గుర్తించామని తెలిపారు. కాల్ డేటా లో ఉన్న పిలకా అప్పుల రెడ్డి, అడపా హరీష్ లను విచారించామని పేర్కొన్నారు. వారికి స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ. 50 లక్షలు తీసుకున్నట్టు విచారణలో తేలిందన్నారు. వీటికి సంబందించి ఆర్.ఎన్. ఐ.ఎల్ కి డబ్బు కట్టినట్టు ఫేక్ డీడీ లు చూపించారని చెప్పారు. అలాగే శ్రీనివాస రావు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టు కూడా గుర్తించామని అన్నారు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకుంటున్నట్టు ఇప్పుడిప్పుడే ఫిర్యాదులు వస్తున్నాయని వెల్లడించారు. అతని ఆచూకీ కోసం పోలీసులు ఇంకా గాలిస్తున్నారని తెలిపారు.అయితే స్టీల్ ప్లాంట్ నుంచి అతను బయటకు వచ్చినట్టు సీసీఫోటేజ్ ఉందని చెప్పారు. దీని పై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోందని అన్నారు. మాకున్న సమాచారం మేరకు స్టీల్ ప్లాంట్ లో అతను ఎటువంటి ఆఘాయిత్యనికి పాల్పడలేదని అన్నారు. బ్లాస్ట్ ఫర్నేస్ లో పడి ఆ--త్మ--హ--త్య చేసుకోవడం అసాధ్యం అని అధికారులు కూడా తెలిపారని పేర్కొన్నారు. అతని మానసిక పరిస్థితి కూడా సరిగా లేదని అన్నారు. గతంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఒక్కడే దేవిపురం అలాగే విజయవాడ వరకు కూడా నడిచి వెళ్లినట్లు తమకు సమాచారం ఉందని చెప్పారు.

ఆ విధంగానే ఇప్పుడు కూడా అతను అలా వెళ్లి ఉంటాడనే భావిస్తున్నామని తెలిపారు. అయితే అతనిపై మరి కొన్ని ఆరోపణలు ఉన్నట్లు విచారణలో వెల్లడైందని తెలిపారు. ఇద్దరు నుంచి ఉద్యోగాలు ఇప్పిస్తామనిరూ. 50 లక్షలు తీసుకున్నాడని, శనివారం ఉదయం రిజల్ట్ వస్తుందని నమ్మించాడని చెప్పారు. ఉద్యోగ వ్యవహారాల కారణంగానే బాధితులకు సమాధానం చెప్పాలిసి వస్తుందనే ఆలోచనతో అతను లేఖ రాసి మరి ఎక్కడికైనా వెళ్ళిపోయి ఉండొచ్చేమోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. మరో పదహారు మందికి కూడా ఆర్.ఐ.ఎన్.ఎల్. లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మిచినట్టు ఆధారాలు లభించాయని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ లో ఫోర్ మన్ గా పనిచేస్తున్న శ్రీనివాసరావుజి లాగ్ బుక్ లో ఆ--త్మ--హ--త్య చేసుకుంటానని రాసుకున్నాడని, రాత్రి 10 గంటలకు విధులకు హాజరయ్యాడని తెలిపారు. కానీ శనివారం అతను కనిపించకుండా పోయారని చెప్పారు. శ్రీనివాసరావు అదృశ్యం పై మిస్సింగ్ కేసు నమోదు చేశామని వెల్లడించారు. పోలీసుల ఆరోపణలు అవాస్తవం... తన తండ్రి శ్రీనివాస రావు పై పోలీసులు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని శ్రీనివాస రావు కుమారుడు మహేష్ పేర్కొన్నారు. తన తండ్రి అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. కానీ పోలీసులు చెబుతున్న విషయాలు నమ్మశక్యంగా లేవని అన్నారు.మా తండ్రి ఎవరికీ అన్యాయం తల పెట్టే వ్యక్తి కాదని అన్నారు. కరోనా వచ్చినపుడు కూడా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ గురించే ఆలోచించేవారని తెలిపారు.

ఉద్యోగాలిప్పిస్తామని నమ్మించి మోసం చేశాడని పోలీసులు అంటున్నారని అందులో ఎలాంటి వాస్తవం లేదని చెప్పారు. ప్లాంట్ నుంచి సజీవంగా బైటికి వెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారని కానీ ఆ విషయం లో తమకు ఎలాంటి నమ్మకం లేదని అన్నారు. ఆయన ప్లాంట్ లోపల వున్నారా ? మరెక్కడ వున్నాడో మాకు తెలియాలని చెప్పారు. మా తండ్రి ఏమయ్యాడో పోలీసులే చెప్పాలని డిమాండ్ చేశారు. నా ప్రాణాన్ని ఉక్కు ఉద్యమం కోసం త్యాగం చేస్తున్న...32 మంది ప్రాణాలర్పించి తెచ్చుకున్న స్టీల్ ప్లాంట్ ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటుపరం చేసి స్టీల్ ప్లాంట్ నమ్ముకున్న వారందరినీ నట్టేట ముంచుతుందని ప్లాంట్ ఉద్యోగి శ్రీనివాస రావు ఆవేదన చెందారు. ఆయన ఈ ఉద్యమం లో తాను ఓ సమిధను అవుతానని చెప్పి ప్రాణ త్యాగానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు ఒక లేఖ రాసి తాను అదృశ్యమయ్యారు. ఆ లేఖలో 'ప్రియమైన కార్మిక సోదరుల్లారా మనమంతా కలిసికట్టుగా ఉంటేనే ఈ పోరాటంలో విజయం సాధించగలం. ఈ రోజు జరగబోయే ఉక్కు కార్మిక గర్జన ఒక మైలురాయిగా మొదలు కావాలి. 32 మంది ప్రాణ త్యాగాల ప్రతిఫలం ఈ ఉక్కు కర్మాగారం. ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటుపరం కానివ్వద్దు. నేను నా ప్రాణాన్ని ఈ ఉక్కు ఉద్యమం కొరకు త్యాగం చేస్తున్నాను. ఉక్కు ఫర్నిస్ లో అగ్నికి ఆహుతి కావడానికి ఈ రోజు (శనివారం) 5:49 నిమిషాలకు ముహూర్తం ఉంది. కాబట్టి ఈ పోరాటం ప్రాణత్యాగం నా నుండి మొదలు కావాలి' అంటూ సూ-సై-డ్ నోట్ లో పేర్కొన్నారు. కాగా లేఖ రాసి పెట్టిన శ్రీనివాసరావు శనివారం ఉదయం నుంచి కనిపించడంలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే పోలీసులు కూడా స్పందించారు. ఉద్యోగి శ్రీనివాసరావు కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisements

Latest Articles

Most Read