ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ఇచ్చినతీర్పుని టీడీపీ స్వాగతిస్తోం దని, తీర్పువెలువడనప్పటినుంచీ ముఖ్యమంత్రికి వణుకు మొద లైందని, ఆయన ముఖంకళ తప్పిందని టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి మరియు పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య స్పష్టం చేశారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు "స్థానికఎన్నికలు నిర్వహించే సత్తా, ధైర్యంలేని ముఖ్యమంత్రికి లేవని తేలిపోయింది కాబట్టి, ఆయనతక్షణమే తనపదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాను. సింగిల్ జడ్జి తీర్పు వెలువడినప్పుడు నిమ్మగడ్డను రాజీనామా చేయాలని కోరిన వ్యక్తి కి, నిజంగా నైతికవిలువలుంటే, ఆయన తక్షణమే రాజీనామా చేయాలి. ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికినైతిక విలువలున్నాయని ఎవరూ అనుకోవడం లేదు. హైకోర్టు తీర్పుని ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా స్వాగతించాడు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధంగానే ఉన్నామని ఆయనచెప్పారు. ముఖ్యమంత్రేమో గడపగడపకు పరిగెత్తుతూ, గవర్నర్ ని కలుస్తూ, ఎన్నికల నిర్వహణకు వెనకడుగు వేస్తూ, పారిపోతున్నారు. అంజాద్ బాషా సమర్థుడిలా కనిపిస్తున్నాడు కాబట్టి, అతనికి ముఖ్యమంత్రి పీఠం అప్పగించండి. ఎందరో పెద్దపెద్దరెడ్లు గతంలో ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు కోర్టుతీర్పులను గౌరవించారు. ఈయనే నవ్విపోదు రుగాక, నాకేంటి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు రమేశ్ కుమార్ కు మార్గం సుగమైంది కాబట్టి, ఆయన డీజీపీ సవాంగ్ ను తొలగించాలి. అడుగుడుగునా అధికారపార్టీకి వత్తాసుపలుకుతున్నాడు కాబట్టి, పోలీస్ బాస్ గా, ఎన్నికల నిర్వ హణకు సవాంగ్ సమర్థుడు కాడని స్పష్టంచేస్తున్నాను. డీజీపీగా సవాంగ్ ను నేడే తొలగించి, ఎన్నికలయ్యేవరకు ఆయన రాష్ట్రంలో ఉండకుండా చూడాలని విజ్ఞప్తిచేస్తున్నాను. "
"గతంలో ఎన్నికల కమిషన్లు చీఫ్ సెక్రటరీని తొలగించిన దాఖలాలు ఉన్నాయి. గతఎన్నికలకు ముందు చీఫ్ సెక్రటరీగా ఉన్న పునేఠా, ఇంటిలిజెన్స్ డీజీలను తొలగించడం జరిగింది. ఇప్పుడు డీజీపీగా ఉన్న సవాంగ్ తొలినుంచీ టీడీపీపై వ్యతిరేకతతోనే ఉన్నారు. తొలినుంచీ ఆయన టీడీపీవారిపై ఒకలా, వైసీపీవారితో మరోలా వ్యవహరిస్తున్నారని ఆయనచేష్టలతోనే అర్థమవుతోంది. దేవాలయాలను పడగొట్టారంటూప్రెస్ మీటు పెట్టినప్పుడే, డీజీపీ ఎంతలా ప్రభుత్వానికి వత్తాసుపలుకుతున్నారో అర్థమవుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఛలో ఆత్మకూరు కార్యక్రమం తలపెట్టినప్పుడు, ఆయన వ్యవహారశైలిని కోర్టులుకూడా తప్పు పట్టాయి. డీజీపీ సవాంగ్ విషయం ఒక ఫిట్ కేసు. ఎన్నికల వ్యవహారం పూర్తయ్యేవరకు నిమ్మగడ్డ రమేశ్ కుమార్, డీజీపీని తొలగించాలని కోరుతున్నాను. కోర్టులతో అనేకసార్లు చీవాట్లు తిని, స్వామిభక్తి పరాయణుడిగా ప్రవర్తిస్తున్నడీజీపీ ఉంటే, ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగవని స్పష్టంచేస్తున్నాను. చంద్రబాబునాయు డు రామతీర్థం వెళితే, అక్కడ ఆయన్ని 151కింద అరెస్ట్ చేస్తామని నోటీసులిస్తారా? ఆచర్యను కోర్టుతప్పుపట్టి, పకపకా నవ్వింది వాస్త వం కాదా? 69ఏళ్ల వయసున్న కళా వెంకట్రావుని అంతరాత్రివేళ, హడావుడిగా ఎందుకు అరెస్ట్ చేశారు? ఆయన విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుచూశాక, డీజీపీ ఎన్నికలను నిష్ప క్షపాతంగా జరుపుతాడంటే ప్రజలు నమ్ముతారా? ఎన్నికలు సజా వుగా, సక్రమంగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తానని మీడియాసాక్షిగా చెప్పగలిగేధైర్యం సవాంగ్ కు ఉందా? కళా వెంకట్రావుని అరెస్ట్ చేసి, స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశాక, ఆయన్ని అసలు తాము అరెస్ట్ చేయలేదని సజ్జల చెబుతాడా? నిన్నటివరకు సాక్షిపేపర్లు ఏరుకున్న వ్యక్తితో నీతిపన్నాలు చెప్పించుకోవాల్సిన ఖర్మ చంద్ర బాబునాయుడి గారికి పట్టడం విధికాక మరేమిటి? ఎంపీ విజయసాయిరెడ్డిపై దాడిఘటనలో కళావెంకట్రావుని అరెస్ట్ చేసినట్లు సాక్షిపత్రికలోనే రాశారు. అరెస్ట్ చేశాకే బెయిల్ ఇస్తారనే ఇంగితంకూడా లేని వ్యక్తి , ప్రభుత్వసలహాదారా? ప్రజలసొమ్ముని దారుణంగా తినేస్తూ, సిగ్గులేకుండా సలహాదారులమని చెప్పుకుం టారా? జైలుకువెళ్లొచ్చినవ్యక్తికి ఇటువంటి వారే సలహాదారులుగా ఉంటారు మరి. సజ్జల చెప్పింది చెప్పడంతప్ప, డీజీపీ తనకు తాను ఏనాడూ ఆలోచనతో, వివేకంతో మాట్లాడిందిలేదు." ఇటువంటి వివాదాస్పదమైన డైరెక్టర్ జనరల్ గతంలో ఏనాడూలేరు, ఇకముం దు ఉండబోరు. డీజీపీ తనకు తానుగా సెలవు పెట్టి, ఎన్నికల విధుల నుంచి తప్పుకుంటే మంచిది. లేకుంటే ఎన్నికల కమిషనర్ ఆయన్ని తొలగించాలి.
"గతంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన సందర్భంలో గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లను బదిలీచేయాలని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ఆదేశిస్తే, ప్రభుత్వం ఆ పనిచేయలేదు. అలానే కొందరు డీఎస్పీలు, సర్కిల్ ఇన్ స్పెక్టర్లను బదిలీచేయాలని కూడా ఆదేశించారు. అవేవీ జరగలేదు కాబట్టి, ఎన్నికల కమిషనర్ తక్షణ మే ఆనాడు తానుఇచ్చిన ఆదేశాలు తక్షణమే అమలయ్యేలా చూడాలని విజ్ఞప్తిచేస్తున్నాను. అదేవిధంగా ఎన్నికలవేళ ఎక్కడైతే కొందరు పోలీస్ అధికారులు, అధికారపార్టికి కొమ్ముకాసి, అత్యుత్సాహంగా పనిచేశారో, వారందరిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ఎక్కడైతే గతంలో అధికంగా ఏకగ్రీవాలయ్యాయో, ఆపరిధిలోని పోలీస్ అధికారులను రేంజ్ దాటి బదిలీచేయాలని సూచిస్తున్నాను. వారు ఆరేంజ్ లో ఉంటే న్యాయం జరగదు. పోలీస్ అధికారుల పోస్టింగులన్నీ కూడా సజ్జల ఆధ్వర్యం లో జరుగుతాయని డిపార్ట్ మెంట్ మొత్తానికి తెలుసు. కాబట్టి ఎన్నికలు సజావుగా,నిష్పక్షపాతంగా సాగాలనే ఆలోచన నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు ఉంటే , ఆయన తక్షణమే తాను చెప్పినవాటిపై ఆలోచించి, అమలుచేయాలని విజ్ఞప్తిచేస్తున్నాను. ముఖ్యమంత్రి రాజీనామా చేయడంతోపాటు, డీజీపీ తొలగింపు, జిల్లాలఎస్పీలు, కలెక్టర్లు, కొందరు పోలీసు అధికారులను తక్షణమే బదిలీచేయాలి. గతంలో జరిగిన బలవంతపు ఏకగ్రీవాలను రద్దుచేసి, తాజాగా తిరిగి నోటిఫికేషన్ ఇవ్వాలని కూడా ఎస్ఈసీని కోరుతున్నాము. అధికారబలంతో గతంలో జరిగిన ఏకగ్రీవాలను రద్దుచేయకపోతే, ఆప్రభావం ఎన్నికలపై పడుతుందని ఎస్ఈసీకి స్పష్టంచేస్తున్నాను. నైతిక విలువలనేవి నిజంగా ముఖ్యమంత్రికి ఉంటే, తనకుతానుగా ఆయనే పదవినుంచి దిగిపోవాలి. అదే న్యాయం కూడా."