రాష్ట్రప్రభుత్వ చేతగానితనం, బాధ్యతరాహిత్యంతో పాటు, తన అధోగతి పాలనగురించి పార్లమెంట్ సాక్షిగా అందరికీ తెలిసేలా జగన్ వ్యవహరిస్తున్నాడని, ఎయిమ్స్ నిర్మాణంలో జరుగుతున్న జాప్యానికి, ఇసుక లభించకపోవడమే కారణమన్న కేంద్రమంత్రి అశ్వినీకుమార్ చౌబే వ్యాఖ్యలు, జగన్మోహన్ రెడ్డి పాలన ఏస్థాయి లో ఉందో చెప్పకనేచెప్పాయని టీడీపీ నేత, తెలుగురైతు విభాగం రాష్ట్రఅధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రప్రజానీకం యొక్క ఆరోగ్యానికి సబంధించి అతికీలకమైన ఎయిమ్స్ నిర్మాణాన్ని సకాలంలో పూర్తిచేయలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉండటం, అందుకుకారణం జగన్ తీసుకొచ్చిన నూతన ఇసుకపాలసీకావడం నిజంగా దారుణమ న్నారు. టీడీపీ ప్రభుత్వం అమలుచేసిన ఉచిత ఇసుకపాలసీని కాదని, మెట్రిక్ టన్నుఇసుక రూ.475చొప్పున ధరనిర్ణయించి, కొత్తపాలసీని తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి నిర్మాణరంగాన్ని కుదేలు చేశాడన్నా రు. భవననిర్మాణ రంగానికి చెందిన కూలీలు పదుల సంఖ్యలో ఉపాధిలేక ప్రాణాలు కోల్పోయారని, నిర్మాణరంగంతోపాటు, దాని అనుబంధ రంగాలపై ఆధారపడి బతికుతున్న దాదాపు 30లక్షల మందికి పనిలేకుండా పోయిందన్నారు. ఇసుకను ఆన్ లైన్లో బుక్ చేసుకుంటే, చాలాచోట్ల ఇసుకకన్నా అధికంగా మట్టిరాళ్లు వస్తు న్నాయని, అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులే తమకు నాణ్యమైన ఇసుక లభించడంలేదని గగ్గోలు పెట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయన్నారు. సామాన్యప్రజలు ఎప్పుడు ఇసుక బుక్ చేసుకోవడానికి ప్రయత్నించినా వారికి ఆన్ లైన్లో నోస్టాక్ బోర్డే కని పించిందన్నారు. పులివెందుల పంచాయతీల మాదిరి, ఇసుక కోసం పంచాయతీలు జరిగే దుస్థితిని ప్రజలు పలుమార్లు చవిచూడ టం జరిగిందన్నారు. అధికారపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఏ2సహా అందరునేతలు ఇసుకవ్యాపారం తో లక్షలకోట్లు దోచేశారన్నారు. రాష్ట్రంలోని ఇసుకంతా పొరుగు రాష్ట్రాలకు ఇబ్బడిముబ్బడిగా తరలిపోతోందన్నారు.
ఎయిమ్స్ నిర్మాణంలో జరుగుతున్న జాప్యానికి ఇసుక అందుబాటులో లేకపోవడమే ప్రధానకారణమన్న కేంద్రమంత్రి వ్యాఖ్యలతోనైనా ముఖ్యమంత్రి సిగ్గుపడాలని శ్రీనివాసరెడ్డి సూచించారు. ఇప్పటికైనా ఆయన తానుతీసుకొచ్చినఇసుక పాలసీ ఎవరికి మేలుచేస్తోందో ఆలోచిస్తే మంచిదన్నారు. ఇసుక వ్యాపారాన్ని మాఫియాకు అప్ప గించడానికే ముఖ్యమంత్రి ఇష్టానుసారం ఇసుక (టన్ను)ధరను పెంచుతున్నారన్నారు. తమప్రభుత్వం నవరత్నాలు అమలు చేయబట్టే, వారంతా తమపార్టీకి అధిక పంచాయతీలను కట్టబెట్టారని చెబుతూ, సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి ప్రజలను మోసగిస్తున్నాడన్నారు. తనను, తనప్రభుత్వాన్ని మోసగించుకుం టూ, సజ్జల చేస్తున్న వ్యాఖ్యానాలు ప్రజల ఆలోచనలకు చాలా దూరంలో ఉంటున్నాయనే వాస్తవాన్ని ఆయన గ్రహిస్తే మంచిదని శ్రీనివాసరెడ్డి హితవుపలికారు. వైసీపీప్రభుత్వం అబద్ధాలు, మోసాల తోనే ప్రజలను నమ్మించడానికి ప్రయత్నిస్తోందన్నారు. విజ్ఞులైన తెలుగుప్రజలంతా ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి, వైసీపీ పాలెగా ళ్లకు తగినవిధంగా బుద్ధిచెప్పాలని, ఫేక్ ప్రభుత్వాన్ని, ఫేక్ ముఖ్యమంత్రిని పంచాయతీఎన్నికల్లో కోలుకోలేనివిధంగా దెబ్బకొట్టాలని మర్రెడ్డి సూచించారు. వైసీపీ మద్ధతుదారులమని చెప్పుకుంటూ, తమమందుకు వచ్చేవారిని ప్రజలు నిలదీయాలని, వైసీపీప్రభుత్వ మోసపూరితహామీలపై వారినిచొక్కాపట్టుకొని అడగాలని టీడీపీనేత పిలుపునిచ్చారు. ప్రజలంతా విజ్ఞతతో ఆలో చించి, వైసీపీ మద్ధతుదారులను చిత్తుచిత్తుగా ఓడించాలన్నారు.