కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో, తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీ, అనధికారికంగా వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే అప్పటి నుంచి గన్నవరం వైసీపీలో ఎక్కడో ఒక చోట వివాదం చోటు చేసుకుంటూనే ఉంటుంది. ఎందుకంటే అంతకు ముందు, గన్నవరం నుంచి పోటీ చేసిన యార్లగడ్డ, అలాగే సీనియర్ నెట్ దుట్టా రామచంద్రరావు ఒక వర్గంగా అవ్వటంతో, వంశీ వైసీపీలోకి వెళ్ళిన దగ్గర నుంచి వర్గ విబేధాలు ఎక్కువ అయిపోయాయి. తమను గత 10 ఏళ్ళుగా వేధించిన వంశీ రాకను, వైసీపీ క్యాడర్ అంగీకరించలేక పోతుంది. దీంతో వంశీ వర్గం, దుట్టా వర్గం ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవటంతో పాటు, ఇరు వర్గాలు చాలా సార్లు బాహాబాహీకి దిగాయి. అయితే వైసీపీ అధిష్టానం వైవీ సుబ్బా రెడ్డిని పంపించి, ఇద్దరి మధ్య సయోధ్యకు ప్రయత్నం చేసింది కానీ, ఎక్కడా ఇరు వర్గాలు మాత్రం శాంతించటం లేదు. అయితే ఈ నేపధ్యంలోనే, ఈ రోజు మరోసారి ఇరు వర్గాలు బాహా బాహీకి దిగాయి.
ఈ సారి ఏకంగా వంశీ సమక్షంలోనే కొట్టుకున్నారు. బాపులపాడు మండలం కాకులపాడులో రైతు భరోసా కేంద్రం శంకుస్థాపనకు వంశీ వెళ్లారు. అయితే అక్కడ దుట్టా వర్గం, వంశీ వర్గం రెండూ వచ్చాయి. దుట్టా వర్గం మేము శంకుస్థాపన చేస్తాం అంటూ ముందుకురావటం, వంశీ వర్గం శంకుస్థాపన చెయ్యటంతో, నువ్వు ఎవడివిరా అంటూ, వంశీ ముందే దాడి చేసుకున్నారు. చివరకు ఈ గొడవ పెద్దది అయ్యి రాళ్ళు రువ్వుకునే దాకా వెళ్ళింది. వంశీ ఇరు వర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా, వంశీ మాట వినే పరిస్థితి లేదు. వంశీ బ్యానర్లను దుట్టా వర్గం చిమ్పెసింది. అయితే కాకులపాడు నుంచి గన్నవరం దండగుంట్ల మీదుగా వెళ్తున్నారని తెలుసుకుని, దండిగుంట్లలో వంశీని అడ్డుకోవటానికి దుట్టా వర్గం ప్రయత్నం చేస్తుందని తెలుసుకుని, పోలీసులు అలెర్ట్ అయ్యారు. అయితే ఈ అంశం పై వైసీపీ అధిష్టానం ఏమి చేస్తుంది అనేది చూడాల్సి ఉంది. గొడవకు సంబధించిన విజువల్స్ https://youtu.be/qLY_fbabqHA