ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైజాగ్ వెళ్ళిపోవాలని ఉత్సాహంగా ఉన్నా, అమరావతి రైతులకు ఇచ్చిన చట్టబద్ధ అగ్రిమెంట్ ప్రకారం, ఇక్కడ రాజధాని నిర్మించకుండా వేరే చోటుకు వెళ్ళిపోవటం పై, కోర్టులో కేసు వెయ్యటంతో, విశాఖ వెళ్ళే పని వాయిదా పడుతూ వస్తుంది. అయితే ప్రభుత్వం మాత్రం, విశాఖకు ఇప్పటి నుంచే కొన్ని హంగులు ఏర్పాటు చేస్తుంది ఇందులో భాగంగా కాపులుప్పాడ ప్రాంతంలో, దాదాపుగా 30 ఎకరాల్లో ఒక వీఐపి గెస్ట్ హౌస్ నిర్మాణం చేస్తున్నారు. దీనికి భూమి పూజ కూడా సైలెంట్ గా జరిగిపోయిందని, పది రోజుల క్రిందట వార్తలు కూడా వచ్చాయి. అయితే దీని పై ఇప్పుడు కొత్త వివాదం రాజేసుకుంది. విశాఖలో మొదటి భావనానికే వ్యతిరేకత వస్తూ ఉండటంతో, ఇది మరో తల నొప్పిగా మారింది. సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా, ఈ విషయమై కేంద్రానికి లేఖ రాసారు. ప్రభుత్వం కాపులుప్పాడ ప్రాంతంలో ఒక గెస్ట్ హౌస్ నిర్మాణం చేస్తుందని, కానీ అది తొట్లకొండ బౌద్ధారామం ఉన్న ప్రాంతం అని, ఎంతో విశిష్టత కలిగిన ప్రదేశం అని కేంద్రానికి రాసిన లేఖలో తెలిపారు. తొట్లకొండను ఎప్పుడో 1978లో ఒక పెద్ద చారిత్రాత్మిక ప్రదేశంగా గుర్తింపు వచ్చిందని, అలాగే సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం కూడా, ఆ ప్రదేశాన్ని బఫ్ఫర్ జోన్ గా గుర్తిస్తూ, 300 మీటర్ల దూరంలో రక్షిత ప్రాంతంగా గుర్తించాలని ఆదేశాలు ఇచ్చినట్టు కేంద్రానికి రాసిన లేఖలో రఘురామకృష్ణం రాజు వివరించారు.

vizag 240820202 2

ఎంతో విశిష్టత కలిగిన ప్రదేశంలో, రాష్ట్ర ప్రభుత్వం గెస్ట్ హౌస్ లు కడుతుందని, వెంటనే దాన్ని ఆపెసేలా చర్యలు తీసుకోవాలని, కేంద్ర సాంస్కృతిక శాఖకు రాసిన లేఖలో రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఇక మరో పక్క, ఈ విషయం పై బౌద్ధ సంఘాలు కూడా ఉద్యమ బాట పట్టాయి. తోట్లకొండకు చెందిన 3300 ఎకరాలు ప్రొటెక్టెడ్ ఏరియాగా నోటిఫై చేసి ఉందని, అక్కడ ఇప్పుడు 30 ఎకరాల్లో ప్రభుత్వం గెస్ట్ హౌస్ కడుతుందని, దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని అన్నారు. గతంలో ఇక్కడ ఈ భూమి ఫిలిం క్లబ్ కి కేటాయిస్తే, తాము చంద్రబాబు వద్ద ఈ విషయం గురించి చెప్తే ఆయన వెనక్కు తీసుకున్నారని, అలాగే వైఎస్ఆర్ కూడా నేవీకి ఇక్కడ భూమి ఇస్తే, తాము చెప్తే, ఆయన కూడా వెనక్కు తీసుకున్నారని బౌద్ధ సంఘాలు అంటున్నాయి. ఇక్కడ ప్రభుత్వమే కంచే చేను మేస్తే అన్న చందాన తయారు అయ్యిందని ఆరోపిస్తున్నాయి. మరో పక్క ఈ వివాదం పై ప్రభుత్వం స్పందించిన. మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆ భూమికి, ఇక్కడ గెస్ట్ హౌస్ స్థలానికి సంబంధం లేదని అన్నారు. దానికి దీనికి కిలోమీటర్ దూరం ఉందని చెప్తున్నారు.

కృష్ణాజిల్లా గన్నవరం నియోజిక్వర్గంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వెళ్ళిన వంశీ వైసీపీలోకి అధికారికంగా చేరకపోయినా, వైసిపీలనే ఉంటున్నారు. ఉప ఎన్నిక వస్తే ఇక్కడ వైసిపీ టికెట్ నాకే అని ప్రకటించుకున్నారు కూడా. అంతే కాదు, ఇక్కడ ఇంచార్జ్ కూడా నేనే అని రెండు రోజుల క్రిందట ప్రకటించారు. అయితే ఇప్పటికే ఇక్కడ వైసీపీలో రెండు గ్రూపులు ఉన్నాయి. ఒకటి సీనియర్ నేత దుట్టా రామచంద్రరావు, అలాగే రెండోది మొన్న ఎన్నికల్లో పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావ్. అయితే వీరిని కాదని వంశీ చేస్తున్న హడావిడితో అనూహ్య పరిణామాలు గత కొన్ని రోజులుగా జరుగుతున్నాయి. అయితే నిన్న సీనియర్ నేత దుట్టా ఓపెన్ అవ్వటంతో, ఈ విషయం రచ్చకు ఎక్కింది. మొట్టమొదటి నుంచి కూడా వైసిపీ పార్టీలో కీలక నేతగా ఉన్నటువంటి దుట్టా, నిన్న కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. వంశీ తీరు పై ఆయన పూర్తీ స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసారు. వల్లభనేని వంశీ గురించి ప్రత్యక్షంగా ఆయన బహిరంగంగా మాట్లాడుకోవటం జరిగింది. మళ్ళా ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు నేను వస్తాను అంటూనే, 15 రోజుల్లోనే మీరు ఒక శుభవార్త వింటారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.

dutta 24082020 2

ఈ సంచలన వార్తా ఏమిటా అని ఇప్పుడు గన్నవరంలో హాట్ టాపిక్ అయ్యింది. ఇటీవల కాలంలో, వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, జరిగిన కార్యక్రమంలో దుట్టా వార్గాన్ని పూర్తిగా పక్కన పెట్టి, వంశీ వర్గీయులు చేసిన హడావిడి పట్ల ఆయన పూర్తీగా అసంతృప్తి చెందారు. మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడిన నాయకులుని, కార్యకర్తలని, వంశీ వ్యవహరిస్తున్నారు అనే తీరులో ఆయన మాట్లాడారు. దుట్టా రామంచంద్రరావు ఈ విషయం పై మీడియాతో కూడా మాట్లడారు. ఆయన మాట్లాడుతూ " వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గన్నవరంలో గత 10 ఏళ్ళ నుంచి జెండా మోస్తూనే ఉన్నాం. వైఎస్ఆర్ పార్టీలో కష్టపడిన వారిని పక్కన పెట్టి, నిన్నా మొన్న వచ్చిన వారికి, నీ వెనకాల ఉండే భజన పరులని పార్టీ ముందు పెట్టి, గన్నవరంలో పార్టీని నడుపుతాం అంటే మేము అంగీకరించం. గతంలో మా పై కేసులు పెట్టిన వాళ్ళని, మమ్మల్ని ఇబ్బంది పెట్టే వారికి, స్థానిక ఎన్నికల్లో టికెట్లు ఇచ్చారు. మేము అడిగినా ఇవ్వలేదు. ఎమ్మెల్యే చేస్తున్నాడు ఇదంతా."

dutta 24082020 3

"మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే మేము చూస్తూ కూర్చోవాలా ? కచ్చితంగా దీన్ని ఎదుర్కుంటాం. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. నా అల్లుడు నుంచుటారు అంటున్నారు. అవును టికెట్ ఇస్తే, నేనే ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసేది. 15 రోజుల్లో మా కార్యకర్తలకు ఒక మంచి వార్త చెప్తాను."అని దుట్టా అన్నారు. మొత్తం మీద రెండు వర్గాల మధ్య జరిగిన ఈ వివాదం హాట్ టాపిక్ గా మారింది. వైసిపీలోకి వంశీ వెళ్ళటంతో మొదటిగా యార్లగడ్డ వెంకట్రావ్ ఎదురు తిరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను యార్లగడ్డ గమనిస్తున్నారు. ఆయన ఈ గొడవ పై ఇప్పటి వరకు స్పందించలేదు. మరో పక్క దుట్టా వర్గం, యార్లగడ్డను కలుపుకుని వెళ్లేందుకు సిద్ధం అయ్యింది. దుట్టా రామచంద్రరావు వైఎస్ఆర్ కి అత్యంత సన్నిహితుల్లో ఒకరు. అలాగే దుట్టా అల్లుడు కూడా కడప జిల్లాకు చెందిన వ్యక్తి, ఆయనకు జగన్ భార్య భారతితో బంధుత్వం ఉందని కూడా తెలుస్తుంది. మొత్తంగా ఇప్పుడు వంశీ తరువాత స్టెప్ ఎలా ఉంటుందో చూడాలి. దుట్టా, యార్లగడ్డ వర్గాలు వంశీకి వ్యతిరేకంగా ఉండటం, మరో పక్క రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన చంద్రబాబుని, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న వంశీని ఎలా అయినా ఓడించాలని తెలుగుదేశం పట్టుదలగా ఉండటంతో, అన్ని వైపుల నుంచి వంశీకి ఇబ్బందులే కనిపిస్తున్నాయి. మరి ఇది ఎలా దాటుకుని ముందుకు వెళ్తారో, జగన్ ఇది ఎలా పరిష్కరిస్తారో చూడాలి.

రాజధాని అమరావతి ఉద్యమం 250 రోజులకు చేరుకుంది. ఈ రోజు రాజధాని రణభేరీ పేరుతో, కార్యక్రమాలు ప్లాన్ చేసింది అమరావతి జేఏసి. అయితే ఈ నిరసనల్లో ఉదయం నుంచి పెద్ద ఎత్తున రాజధాని రైతులు పాల్గున్నారు. తమ ఆవేదన వినండి అంటూ, డప్పులు మోగిస్తూ నిరసన తెలిపారు. 250 రోజులుగా శాంతియుత నిరసన చేస్తున్నామని, ప్రభుత్వం ఇప్పటికైనా మనసు మార్చుకోవాలని కోరుతున్నారు. ఇక మరో పక్క పోలీసులు రాజధాని ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేసారు. అమరావతి గ్రామాలకు బయట వారిని పంపించటం లేదు. వేరే ప్రాంతాల నుంచి వచ్చి మద్దతు పలికే వారికి ఈ పరిణామంతో, ఇబ్బంది ఏర్పడింది. పోలీసులు ఐడి కార్డులు చెక్ చేసి, ఆ గ్రామాల వారు అయితేనే గ్రామాలకు అనుమతి ఇస్తున్నారు. గుంటూరు, విజయవాడ నుంచి వచ్చి కొంత మంది ఈ పరిణామంతో నిరాస చెందారు. కరకట్ట వద్ద పోలీసులు వచ్చే పోయే వాహనాలకు చెక్ చేసి పంపిస్తున్నారు. తనిఖీలు చేసి, ఏదైనా ఐడి కార్డు ఉంటేనే, వారు రాజధాని ప్రాంత వాసులు అయితేనే లోపలకు అనుమతి ఇస్తున్నారు. స్థానికులను మాత్రమే వదిలి పెడుతున్నారు. స్థానికులు కాని వారిని మాత్రం, వెనక్కు పంపిస్తున్నారు. స్థానికులు కాని వారు, 250 రోజులు ఉద్యమంలో పలు పంచుకుందాం అనుకున్న వారికి నిరాస ఎదురు అయ్యింది.

amaravati 2382020 2

ఇక అలాగే అమరావతి గ్రామాల్లో దీక్షా శిబిరాల దగ్గర కూడా, పోలీసులని మోహించారు. వచ్చే పోయే వాహనాలు మానిటర్ చెయ్యటంతో పాటుగా, పరిస్థితిని ఆరా తీస్తున్నారు. బయట నుంచి వచ్చే వారు ఎవరైనా ఉన్నారా అనేది పోలీసులు చూస్తున్నారు. మొత్తానికి ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. అయితే అమరావతి వాసులు మాత్రం, ఇన్నాళ్ళు మా ఉద్యమం ఎప్పుడు లైన్ దాటలేదని, బయట నుంచి వచ్చి మాకు మద్దతుని ఇచ్చే వారికి అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. మరో వైపు రాజధాని రణభేరీ, దగా పడ్డ దళిత బిడ్డ, అమరావతి వెలుగు, ఆంధ్రప్రదేశ్ వెలుగు లాంటి అనేక కార్యక్రమాలను అమరావతి రైతులు చేస్తున్నారు. సాయంత్రం కాగడాల ప్రదర్శనకు కూడా జేఏసి పిలుపు ఇచ్చింది. అలాగే ఈ మొత్తం కార్యక్రమాలను కో-వి-డ్ నిబంధనలు పాటిస్తూ, ఎలాంటి నిబంధనలు అతిక్రమించకుండా క్రమశిక్షణతో చేస్తూ వస్తున్నారు. రాజధాని గ్రామాల్లో అనుమతి లేకపోవటంతో, వివిధ పార్టీల ప్రతినిధులు ఆన్లైన్ లో తమ మెసేజ్ పంపించారు. అలాగే విజయవాడలో ఉన్న జేఏసి కార్యాలయంలో, అఖిలపక్ష నేతలు అమరావతికి మద్దతుగా ప్రెస్ మీట్ పెట్టారు. మొత్తంగా, కేవలం అమరావతి ప్రాంత రైతులే పాల్గునేలాగా, పోలీసులు జాగ్రత్త తీసుకున్నారు.

విజయవాడలో 40 శాతం మంది ప్రజలకు, వారికి తెలియకుండానే, వారి శరీరంలోకి క-రో-నా వై-ర-స్ వచ్చి వెళ్ళిపోయినట్టు, సిరో సర్వేలేన్స్ విశ్లేషణలో వైద్య శాఖ అధికారులు గుర్తించారు. కృష్ణా జిల్లా మొత్తంలో ఇలా కో-రో-నా తెలియకుండా తమ శరీరంలోకి వచ్చి వెళ్ళిపోయినా వారి సంఖ్య 20 శాతం వరకు ఉందని, అధికారులు గుర్తించారు. ఇక ఢిల్లీలో ఈ సంఖ్య 23 శాతం, మహారాష్ట్రలోని ఒక మురికి వాడలో 43 శాతం మంది ప్రజలకు, ఇలా వై-ర-స్ వచ్చి వెళ్ళిపోయిందని అధికారులు తమ విశ్లేషణలో తెలుసుకున్నారు. అయితే విజయవాడ నగరంలో 40.51 శాతం మందికి, క-రో-నా వై-ర-స్ వారి శరీరంలోకి వచ్చి, వెళ్ళిపోయిందని, ఈ సంస్థ చేసిన సర్వే వివరాలు తెలిసి అందరూ షాక్ తిన్నారు. అయితే ఈ 40 శాతం మందిలో ఎవరికీ క--రో-నా లక్ష్యనాలు లేవు. తమకు అసలు ఎలాంటి లక్ష్యనాలు లేవని, తాము మాములుగానే ఉన్నామని అంటున్నారు. అయితే వీరి నుంచి సేకరించిన ర-క్త నమూనాలను పరీక్షించగా, వై-ర-స్ వారికి సోకి, వెళ్ళిపోయినట్టు తేలింది. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 3709 మందికి ఈ పరీక్షలు చెయ్యగా, 19.41 శాతం మందికి ఈ వై-ర-స్ వచ్చి వెళ్లినట్టు పరీక్షల్లో తెలిసింది.

vijawayada 2308200 2

క-రో-నా వైరస్ వ్యాప్తి, ఇ-న్ఫె-క్ష-న్ సోకిన వారు ఎంత మంది ఉన్నారు, అన్న విషయాన్ని గుర్తించేందుకు, కృష్ణా, తూర్పు గోదావరి, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో, సిరో సర్వేలేన్స్ ప్రక్రియను వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించింది. ఐ-సి-ఏం-ఆర్ మార్గదర్శకాలు అనుసరించి, ఈ పరీక్షలు చేసారు. కృష్ణా జిల్లా ఫలితాలను విశ్లేషించినప్పుడు, ఆసక్తికర అంశాలు వెలుగు చూసాయి. విజయవాడ అర్బన్ లో, 933 మందికి, పరీక్షలు చేయగా, 378 మందిలో ఈ వై-ర-స్ లక్ష్యణాలు వచ్చి వెళ్లినట్టు తేలింది. విజయవాడ వన్ టౌన్ లో, మొదటి కేసు నమోదు అయిన కొత్తపేట నుంచి, అన్ని ప్రాంతాలలోనూ ఈ పరీక్షలు జరిపారు. ఈ నెల 6 నుంచి 15 వ తేదీ వరకు జరిగిన సిరో సర్వేలేన్స్ లో అనుమానిత లక్ష్యనాలు కనిపించలేదు అని చెప్పిన వారి నుంచే, నమూనాలు సేకరించి, పరీక్షించారు. విజయవాడ నగరంలో ఇప్పటి వరకు లక్షా ఎనభై వేల మందికి పరీక్షలు చెయ్యగా, 6 వేల మందికి వై-ర-స్ సోకింది. ఈ సిరో సర్వేలేన్స్ ద్వారా ఢిల్లీలో 23 శాతం మందికి వై-ర-స్ వచ్చినట్టు తేలిందని అధికారులు తెలిపారు.

Advertisements

Latest Articles

Most Read