రాష్ట్రం మొత్తం ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం పై ఎదురు తిరిగింది... చివరకు ఎంతో సహనంతో ఉండే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా, మిత్రపక్షం అనే ఇది కూడా లేకుండా, మోడీ చేస్తున్న పనులు అసెంబ్లీ వేదికగా ఎండగట్టారు... చివరకు టిడిపి మంత్రుల్ని రాజీనామా చేపించారు కూడా... ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. ఢిల్లీ పై ఒక యుద్ధమే చేస్తున్నారు.. ప్రధాన ప్రతిపక్షం జగన్ కాని, మరో ప్రతిపక్షం పవన్ కాని, ఈ పోరాటంలో ఎక్కడా అడ్డ్రెస్ లేరు. అడ్రెస్ లేకపోతే లేకపోయారు కానీ, చేస్తున్న వారిని బలహీన పరుస్తున్నారు. మోడీ అనే పేరు పలకటానికి ఇద్దరికీ భయం. తాజాగా దీనికి బలం చేకూరుస్తూ, జగన్ మోహన్ రెడ్డి టైమ్స్ నౌలో వ్యాఖ్యలు చేసారు.

jagan 18082018 2

ఎక్కడా మోడీని ఒక్క మాట కూడా విమర్శ చెయ్యలేదు. ఒక పక్క మోడీ హోదా ఇవ్వను అని తెగేసి చెప్తున్నా, జగన్ మాత్రం, చాలా కామెడీగా సమాధానం చెప్తున్నారు. కాబోయే ప్రధాని మోదీనా? లేక రాహుల్ గాంధీనా? అనేది తమకు అనవసరమని... ఏపీకి ఎవరు ప్రత్యేక హోదా ఇస్తే, వారినే బలపరుస్తామని టైమ్స్ నౌ తో చెప్పారు. ఇప్పటికీ మోడీ నేను హోదా ఇవ్వను అని చెప్తే, అనేకసార్లు మోడీకి మద్దతు ఇచ్చింది జగన్ పార్టీ, ఇక విజయసాయి రెడ్డి చేసే ఊడిగం అయితే చెప్పే పనే లేదు. జగన్ మాత్రం, ప్రత్యేక హోదాను ప్రకటిస్తే, వారికి మద్దతు తెలుపుతామని అంటున్నారు. మరి ప్రత్యెక హోదా ఇవ్వను అనే మోడీ పై ఒక్క మాట కూడా ఎందుకు అనలేరు ? నేషనల్ మీడియాలో ఎమన్నా అంటే, అమిత్ షా ఉతుకుతాడనా ?

jagan 18082018 3

మరో కామెడీ కూడా పండించాడు జగన్... ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, నాకు ఏంటో అనుభవం ఉందని చెప్పారు.తాను రెండు సార్లు ఎంపీగా గెలిచానని, ఇప్పుడు శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నానని... ఎవరైనా సరే తన అనుభవాన్ని ఎలా తక్కువ చేసి చూపుతారని ఆయన ప్రశ్నించారు. కుటుంబం కంటే ప్రజలతోనే ఎక్కువ కాలం గడుపుతున్న తనకు చాలా అనుభవం ఉందని చెప్పారు. అయితే, జగన్ వ్యాఖ్యలు కామెడీ అనేది ఇందుకే. ఎంపీగా ఏమి చేసాడో, కడప ప్రజలు చెప్తారు, ప్రతిపక్షంగా ఏమి చేసారో ఏపి ప్రజలకు తెలుసు. కనీసం అసెంబ్లీకి కూడా రాని అనుభవం ఈయనిది. ఒక్క సమస్య ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వం వద్దకు తెచ్చాడా ? ఇక ఇంటర్వ్యూ ముగిస్తూ, చంద్రబాబు పని అయిపొయింది అని, నెక్స్ట్ నేనే సియం అంటూ, కామెడీ ముగించారు.

ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో కింగ్ మేకర్ అవ్వాలి, చంద్రబాబుని దించాలి, అందుకోసం ఇప్ప‌టి నుండే స్కెచ్ వేస్తున్నారు అమీత్ షా. ఆంధ్రప్రదేశ్ విభజన హామీల విషయంలో, రాష్ట్ర ప్రజలకు హ్యాండ్ ఇచ్చినందుకు, ఏపీలో బీజేపీ దోషిలా మిగిలిపోయింది. గత ఎన్నికల్లో టీడీపీతో కలిసి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఆ పార్టీ. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బలపడాలని భావించింది. అయితే, ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ.. ఎన్డీయే నుంచి బయటికి వచ్చినప్పటి నుంచి బీజేపీకి కష్టాలు మొదలయ్యాయి. టీడీపీ నేతలు కేంద్ర ప్రభుత్వం ఏపీకి చేసిన ద్రోహాన్ని వివరించడంలో సక్సెస్ అవడంతో ఆ పార్టీ మనుగడను కోల్పోయే ప్రమాదంలో పడింది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ దిద్దుబాటు చర్యలకు దిగింది.

amitshah 18082018 2

తెలుగుదేశం పార్టీని ఎలాగైనా త‌రిమేయాలి..! అదే ల‌క్ష్యంగా ప‌ని చేయాలి..! కొన్నాళ్ల క్రితం రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడిని నియమించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగేలా ఆ పార్టీ నేతలను సన్నద్ధం చేసింది బీజేపీ అధిష్టానం. ఇందులో భాగంగానే కొన్ని వ్యూహాలను సిద్ధం చేసుకుంది ఆ పార్టీ. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకి గట్టి పోటీ ఇవ్వాడంతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీల నుంచి ఎదుర‌య్యే పోటీని ధీటుగా ఎదుర్కోవాలని భావిస్తున్న ఆ పార్టీ అభ్యర్ధుల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించుకుంది. దీనికోసం జాతీయ నేతలతో చర్చలు కూడా జరిపారని, అందులోని ముఖ్య నేతలు ఇచ్చిన సూచనల మేరకు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

amitshah 18082018 3

ఇందులో భాగంగానే రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఎలా ఉండబోతుందనే దానిపై ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా ఏపీలో రహస్య సర్వే నిర్వహించినట్లు సమాచారం. ఆ సర్వే ఆధారంగానే రాష్ట్రంలోని బీజేపీ పోటీ చేయబోయే నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉంటుందని కూడా తెలుస్తోంది. ఈ సర్వే ఫలితాల విషయంలో ఆ పార్టీలో టికెట్ ఆశిస్తున్న నేతలు తెగ టెన్షన్ పడుతున్నారట. సర్వే ఫలితాల ఆధారంగానే, జనసేన, వైసిపీతో పొత్తు పై ముందుకెళ్ళనున్నారు. ముగ్గురూ కలిసి పోటీ చెయ్యటమా, లేక ఏదైనా ఒక పార్టీతో వెళ్లి, మరో పార్టీతో ఓట్లు చీల్చటమా, అనే విషయం పై నిర్ణయం తీసుకోనున్నారు.

రాజకీయ పరిణామాలను అంచనా వేయడంలో... ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా ముందు చూపుతో వ్యవహరిస్తూంటారు. అందుకే.. ఎన్డీఏలో ఉన్నప్పటి నుంచే ఆయన కచ్చితంగా డిసెంబర్‌లో ముందస్తు ఎన్నికలొస్తాయనే అంచనాలతో ఉన్నారు. అలా వస్తే.. వాటితో పాటు అసెంబ్లీ ఎన్నికలకూ వెళ్లడానికి సిద్ధంగానే ఉన్నారు. పార్టీ పరంగా కసరత్తు కూడా ప్రారంభించారు. డిసెంబర్ అంటే.. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందనేదే ఏపీ అధికార పార్టీ భావన. ఇటీవలి కాలంలో చంద్రబాబు పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టారు. సమన్వయ కమిటీ సమావేశం ఎప్పుడు జరిపినా ముందస్తు ఎన్నికల ప్రస్తావన తెస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు కూడా సూచిస్తున్నారు.

cbn 18082018 2

జిల్లాలు, నియోజకవర్గాల వారీ సమీక్షను మూడు నెలల కిందటే ప్రారంభించారు. వరుసగా సర్వేలు చేయిస్తున్నారు. మరో పక్క, వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కొన్ని స్థానాలకు ముందుగానే అభ్యర్థుల పేర్లను ప్రకటించాలని తెలుగుదేశం నాయకత్వం యోచిస్తోంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో అభ్యర్థుల ముందస్తు ప్రకటనకు తొలి ప్రాధాన్యం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. 30-40 మంది పేర్లనైనా మొదట ప్రకటించే వీలున్నట్లు తెలిసింది. సాధారణంగా నామినేషన్లకు కొంత ముందు టీడీపీలో అభ్యర్థుల ప్రకటన ఆనవాయితీ. ఈసారి కొంత ముందుగా ప్రకటిస్తే మంచిదని పార్టీ వర్గాల నుంచి వినతులు అందుతున్నాయి. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నచోట ముందుగా అభ్యర్థిని గుర్తిస్తే వారు నియోజకవర్గంపై పట్టు సాధించడం తేలికని పార్టీ వర్గాల వాదన.

cbn 18082018 3

మరో పక్క చంద్రబాబు సర్వే కూడా చేపిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న సర్వే నివేదిక అందాక, చంద్రబాబు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలతో సమావేశం కాబోతున్నారు. ఆ నివేదికలోని అంశాలను వారి ముందుంచుతారని సమాచారం. నివేదికలో ప్రతికూల రిపోర్టు వచ్చిన ఎమ్మెల్యేల చిట్టాను వారి ముందుంచి, ప్రజల్లో వ్యతిరేకత ఉన్న వారికి తుది హెచ్చరిక చేస్తారు. ఈ పరిస్థితులను చక్కదిద్దుకోవడానికి మూడు నెలల సమయం ఇవ్వొచ్చని తెలుస్తోంది. ఆ సమయం లోగా పని తీరును మెరుగుపరుచుకోలేకపోతే టికెట్‌పై ఆశలు వదులుకోలని స్పష్టం చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అన్ని జిల్లాల సమావేశాలు పూర్తయ్యే సరికి పార్టీ పరిస్థితి ఎలా ఉందన్న విషయంపై చంద్రబాబు ఒక అంచనాకు వస్తారని పార్టీ నాయకులు చెబుతున్నారు.

గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. రాజమహేంద్రవరం, ధవళేశ్వరం ల్తో పాటు గోదావరి నది వెంబడిగల లంక గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలకు వరద ముంచెత్తుతుంది. వరద కారణంగా పోలవరం ప్రాజెక్ట్‌ పనులు ఆపేయల్సిన పరిస్థితి వచ్చినా, పనులు మాత్రం ఎక్కడా ఆపటం లేదు. పనులు మందకొడిగా సాగుతున్నాయి కాని, పనులు మాత్రం ఆపటం లేదు. మానవ సంకల్పం అంటే ఇదేనేమో. కొంచెం సమయం కూడా వేస్ట్ చెయ్యకుండా, ఏ పని, ఎంత వరకు సాధ్యమైతే, అంత వరకు చేస్తున్నారే కాని, పనులు మాత్రం ఆపటం లేదు. ముఖ్యమంత్రి సంకల్పానికి, కార్మికులు కూడా తమ వంతు సహాయం అందిస్తున్నారు. కాంట్రాక్టు సంస్థలు కూడా సహకరిస్తున్నాయి.

polavaram 18082018 2

గురువారం 2500క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు సాగితే శుక్రవారం 1500క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులే జరిగాయి. ప్రతికూల వాతావరణంలో కూడా పోలవరం పనులు నిరాటంకంగా నిర్వహిస్తున్నారు. జంగారెడ్డిగూడెం ఆర్‌డిఓ మోహన్‌కుమార్‌ను పోలవరం వద్దే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించమంటూ కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ ఆదేశించారు. గోదావరి పోటెత్తడంతో లోతట్టు గిరిజన గ్రామాలు నీటమునిగాయి. ఏజెన్సీలోని గ్రామాలకు రాకపోకలు స్థంభించాయి. మరో పక్క, ఇటీవల వరుసగా గోదావరిలో జరుగుతున్న పడవ ప్రమాదాల్ని దృష్టిలో పెట్టుకుని వరద ఉదృతి సమయంలో పడవ ప్రయాణాల్ని అధికారులు నిషేదించారు. నాటు పడవల్నుంచి లాంచీల వరకు వేటీని గోదావరిలో ప్రయాణానికి అనుమతించడంలేదు.

polavaram 18082018 3

శుక్రవారం రాత్రి 8గంటలకు ధవళేశ్వరం వద్ద నీటిమట్టం 16.6అడుగులకు చేరుకుంది. అప్పటికే ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాదహెచ్చరిక జారీ చేశారు. అదే సమయానికి భద్రాచలం వద్ద నీటిమట్టం 47.40 అడుగు లకు చేరింది. దీంతో అక్కడ రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయింది. శుక్రవారం ఉదయానికే 10లక్షల క్యూసెక్కుల నీరు ఎగువ ప్రాంతంనుంచొస్తుండగా అదే పరిమాణంలో నీటిని సముద్రంలోకి విడుదల చేయడం మొదలెట్టారు. కాగా ఉదయం 11గంటలకు ఎగువ నుంచొస్తున్న నీరు 11.86 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. రాత్రి 8గంటల సమయాని కిది 12.10లక్షల క్యూసెక్కులుగా నమోదైంది.

Advertisements

Latest Articles

Most Read