పాదయాత్ర అంటే ఈయనగారికి ఎంత జోక్ గా ఉందో ఇక్కడే అర్ధమవుతుంది... ఒక రాజకీయ నాయకుడు పాదయత్ర చేస్తే, అది ఎంత పవిత్రంగా చేస్తారో, మనం మన రాజకీయాల్లో చూసాం... రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు ఎలా పాదయాత్ర చేసారు అన్నది, మనకు ఇంకా గుర్తు ఉంది... ఈ జగన్ మాత్రం, ఏంటో తెలియదు... వారినికి రెండు రోజులు కోర్ట్ కు వెళ్ళాలని సెలవు పెట్టి, ఫ్లైట్ ఎక్కి, హైదరాబాద్ లో దిగుతాడు... పోనీ కోర్ట్ కు వెళ్తాడా అంటే, ఇంటికి వెళ్లి, మసాజ్ లు, ఫేషియల్ లు చేపించుకుని, రెస్ట్ తీసుకుని, హాయగా రెండు రోజులు ఎంజాయ్ చేసి, మళ్ళీ పాదయాత్ర అంటాడు...
అయితే గత మూడు రోజులుగా జగన్ పాదయాత్ర చూసిన సొంత పార్టీ నేతలే విసుగు చెందుతున్నారు. ప్రస్తుతం జగన్, విశాఖ జిల్లా నాతవరం మండలం డి.యర్రవరంలో పాదయాత్ర చేస్తున్నారు. అయితే చెప్పా పెట్టకుండా ఆగష్టు 15 వంకతో, పాదయత్రకు బుధవారం సెలవు ఇచ్చారు. అన్ని ఏర్పాట్లు చేసి, జనాలని తరలించటానికి ఏర్పాట్లు చేసిన లోకల్ నాయకులు, ఈ పరిణామంతో అవాక్కయ్యారు. కనీసం మాకు సమాచారం ఇవ్వకుంటే ఎలా అంటూ, ఆగ్రహం వ్యక్తం చేసారు. దీంతో, పార్టీ ముఖ్య నాయకులు సముదాయించి, రేపు పూర్తి స్థాయిలో యాత్ర జరుగుతుందని, రెడీ అవ్వమని భరోసా ఇచ్చారు.
గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పాదయాత్ర కేవలం 45 నిమిషాల్లోనే ముగించారు. యర్రవరం నుండి ములగపూడి వరకు ఒకటిన్నర కిలో మీటర్లు పాదయాత్ర చేసి ముగించారు. 10 గంటలకు శిబిరం వద్ద నుండి హైదరాబాద్ వెళ్ళేందుకు వాహనంలో రాజమండ్రి విమానాశ్రయానికి తరలి వెళ్ళారు. ఈ పరిణామంతో, మరోసారి, అక్కడి నేతలు అవాక్కయ్యారు. ఇదేమి పాదయాత్ర, ఇదేమి తీరు, ఎన్నాళ్ళు ఇలా సాగదీస్తారు, అంటూ మండిపడ్డారు. సమాచారం కూడా ఇచ్చే పని లేదా, అంటూ నిర్వాహుకుల పై మండి పడ్డారు. రాజమండ్రి నుంచి కాని, వైజాగ్ నుంచి కాని, హైదరాబాద్ కు ఫ్లిట్ ఎక్కితే గంటలో ఉంటారని, దానికి గురవారం ఉదయం 10 గంటలకే వెళ్ళిపోవటం ఏంటి అంటూ, మండిపడ్డారు. ఈ రోజు శుక్రవారం జగన్ కోర్ట్ లో ఉంటారు, ఇక ఈ రోజు కూడా సెలవు. మొత్తానికి, మూడు రోజుల్లో, ఆ వంకా, ఈ వంకా చెప్పి, 1.5 కిమీ మాత్రమే నడిచి, డైలీ సీరియల్ లాగా, విసుగు తెప్పిస్తున్నాడు.