బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు 9 పేజీల లేఖ రాశారు... తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ నుంచి బయటకు వస్తూ చంద్రబాబు రాసిన లేఖకు అమిత్‌షా సమాధానం అంటూ, ఈ లేఖ మీడియాకు విడుదల అయ్యింది... అయితే, ఈ లేఖలో స్క్రిప్ట్ చూస్తే, ఇది ఒక జాతీయ అధ్యక్షుడు, అవగాహన ఉండి రాసిన లేఖలా లేదు... మన రాష్ట్రంలో ఉండే సోము వీర్రాజు, పురంధేశ్వరి లాంటి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయో, అమిత్ షా రాసిన లేఖ అలా ఉంది... వాస్తవానికి దూరంగా, ప్రజల అభిప్రాయం ఏంటో తెలుసుకోకుండా, ఎవరో రాష్ట్రం నుంచి రాసిచ్చిన లేఖ పై, అమిత్ షా సంతకం పెట్టారా అనే అభిప్రాయం కలుగుతుంది...

amitshah 24032018 2

ముందుగా, తెదేపా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నా అని లేఖలో పేర్కొన్నారు. మీరు తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు... ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు, చంద్రబాబు ఎందుకు బయటకు రావట్లేదు అని గత సంవత్సరం నుంచి అడుగుతున్నారు... చంద్రబాబు మంత్రి వర్గం నుంచి బయటకు రావాలని, ఎన్డీఏ నుంచి బయటకు రావాలని, పవన్, జగన్, ఇలా అందరూ హడావిడి చేసారు... చంద్రబాబు ఒక పద్దతి ప్రకారం, కేంద్రం రియాక్ట్ అవ్వటానికి టైం ఇచ్చారు.. ముందుగా బడ్జెట్ అవ్వగానే కేంద్రం పై విరుచుకుపడ్డారు... నెల రోజులుకు పైగా సంప్రదింపులు జరిపారు... తరువాత మంత్రులు రాజీనామా చేసారు... అప్పటికీ కేంద్రానికి టైం ఇచ్చారు... చివరకు ఏది జరగకపోతే, ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు...

amitshah 24032018 3

ఇక పొతే, అన్ని నిధులు ఇచ్చాం, ఇన్ని నిధులు ఇచ్చాం అంటూ, ఇన్నాళ్లు రాష్ట్ర బీజేపీ నేతలు ఏదైతే చెప్పారో, అదే సోది ఈ లేఖలో చెప్పారు... మరో పక్క యుసిలు ఇవ్వలేదు అంటూ, అందుకే సహాయం చెయ్యలేదు అని అమిత్ షా అన్నారు... యుసిలు ఏ రోజు ఇచ్చింది, చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు... దాంట్లో తప్పు ఉంటే, చంద్రబాబు సభను తప్పుదోవ పట్టించారని విష్ణు కుమార్ రాజు, స్పీకర్ కు నోటీసు ఇవ్వచ్చు... సరే, యుసిలు ఇవ్వలేదు అనే అనుకుందాం... ప్రత్యేక హోదా హామీకు, మరో 18 విభజన హామీలకు, యుసిలతో సంబంధం ఏముంది ? మీకు అంత చిత్తసుద్ధి ఉంటే, చట్టంలో పెట్టిన ఈ 18 హామీలు ఎందుకు నెరవేర్చలేదు ? ఇదే విషయం, మీకు స్క్రిప్ట్ రాసిచ్చిన వాడిని అడగండి, అమిత్ షా గారు... ఈ సారి, స్క్రిప్ట్ రైటర్ ని మార్చండి... కొంచెం వాస్తవాలు రాయండి... మేము మీరు ఆట ఆడుకున్న అన్ని రాష్ట్రాల వారి లాంటి వాళ్ళం కాదు.. ఆంధ్రులం... మాకు అన్నీ ఎక్కువే... మా మీదకు వచ్చే ముందు, కొంచెం పర్ఫెక్ట్ గా హోం వర్క్ చేసుకు రండి... అప్పుడు యుద్దం బాగుంటుంది...

ఒక నాయకుడు మీద నమ్మకానికి నిదర్శనం ఇది... ఒక విజన్ ఉన్న నాయకుడు రాష్ట్రాన్ని పాలిస్తే జరిగేది ఇది... చంద్రబాబు పరిపాలనా సత్తా ఏంటో చెప్పటానికి, మల్లవల్లి మోడల్‌ ఇండస్ర్టియల్‌ పార్క్‌ మరో ఉదాహరణ... మల్లవల్లి గన్నవరం దగ్గర ఉన్న, మోడల్‌ ఇండస్ర్టియల్‌ పార్క్‌ లో మొత్తం 1260.06 ఎకరాల సువిశాల భారీ మోడల్‌ ఇండస్ర్టియల్‌ పార్క్‌లో 964 ప్లాట్లు ఉండగా, కేటాయింపులకు ముందే హౌస్‌ఫుల్‌ బోర్డు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది... ఇక్కడే అశోక్‌ లేల్యాండ్‌ కంపెనీ దక్షిణ భారత స్థాయిలో వెహికల్‌ బాడీ బిల్డింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేస్తుంది... మరో పక్క ఇదే ఇండస్ర్టియల్‌ పార్క్‌ లో, మోహన్‌ స్పిన్‌టెక్స్‌ సంస్థకు ఇంటిగ్రేటెడ్‌ మెగా టెక్స్‌టైల్స్‌ పార్క్‌ ఏర్పాటుకు 81 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది.. భారీ పరిశ్రమల కేటగిరిలో ఇవి పోను గోల్డ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌తో పాటు అనేక స్పి న్నింగ్‌ మిల్లులు, ఫార్మా కంపె నీలు ఆసక్తి చూపి స్తున్నాయి.

ashok leyland 24032018 2

అయితే ఈ భారీ కంపనీల్లో ముందుగా, ప్రముఖ రవాణా వాహనాల తయారీ సంస్థ అశోక్ లేల్యాండ్ అమరావతిలో తమ యూనిట్ నెలకొల్పేందుకు రంగం సిద్ధం చేసింది. రాజధాని పరిధిలో ప్రతిష్టాత్మక పారిశ్రామికవాడగా భావిస్తున్న కృష్ణా జిల్లా మల్లవల్లిలో బస్ బాడీ బిల్డింగ్ యూనిట్ స్థాపనకు కార్యాచరణ ప్రారంభించింది. ఈనెల 31న ముఖ్యమంత్రి చంద్రబాబు దీనికి భూమిపూజ చేయనున్నారు. ఈ మేరకు శుక్రవారం ఏపీఐఐసీ వర్గాలకు సీఎంవో, అశోక్ లేల్యాండ్ నుంచి సమాచారం అందింది. ఇప్పటికే అశోక్ లేల్యాండ్ సంస్థకు ఏపీఐఐసీ 15 ఎకరాలు కేటాయించింది. ఎకరం రూ. 16. 50 లక్షల చొప్పున ధర చెల్లించి 15 రోజుల కిందట భూమిని రిజిస్ట్రేషన్ కూడా చేయించుకుంది. కేటాయించిన భూమిలో మౌలిక వసతుల కల్పన, నిర్మాణాలకు వీలుగా భూమి చదును చేయిస్తున్నారు.

ashok leyland 24032018 3

చెన్నైకి చెందిన సంస్థ ద్వారా మట్టి సామర్థ్య పరీక్షలు చేయిస్తున్నారు. ఇక్కడ నెలకొల్పే యూనిట్లో ఏడాదికి 4,800 చొప్పున బస్సు బాడీ బిల్డింగ్ రూపొందించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. తర్వాత విడతలో ఛాసిస్లు తయారుచేసే యూనిట్ ను నెలకొల్పవచ్చని సమాచారం. అశోక్‌ లేలాండ్‌ సంస్థ ఇక్కడ రూ.135 కోట్ల వ్యయంతో బస్‌బాడీ బిల్డింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయబోతోంది. రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా స్థానికంగా 2,295 మందికి ఉపాధిని ఈ సంస్థ కల్పించనుంది... చివరగా, మా ముఖ్యమంత్రి పతనం కోసం ఎదురు చూస్తున్న, ఆపరేషన్ గరుడ టీం మెంబెర్స్ అందరికీ సుస్వాగతం... మా ప్రగతిని కళ్ళారా చూసి, మరిన్ని కుట్రలు పన్నండి.. బెస్ట్ అఫ్ లక్...

మొన్న ఒక మహానుభావుడు, హైదరాబాద్ నుంచి నాలుగు రోజులు ఆంధ్రప్రదేశ్ వచ్చి, మన సియంకు మార్కులు వేసి, మళ్ళీ హైదరాబాద్ చెక్కేసాడు... ప్రతి రోజు 16 గంటలు కష్టపడి, ప్రతి రోజు సెక్రటేరియట్ కు వచ్చే చంద్రబాబుకి 2.5 మార్కులు వేసాడు, అసలు సెక్రటేరియట్ కు రాకుండా ఎక్కడ ఉంటాడో తెలియని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి మాత్రం 6 మార్కులు ఇచ్చాడు... ఎందుకు ఇంత తేడా అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జుట్టు పీక్కున్నా అర్ధం కాలేదు... ప్రతి రంగంలో, ఇద్దరి ముఖ్యమంత్రుల్ని ఒకసారి కంపేర్ చేసుకుని చూసుకున్నారు, ప్రతి దాంట్లో చంద్రబాబు ఎక్కడో ఉన్నారు... చివరకి ఈ మార్కులు వేసిన హైదరాబాద్ బాయ్ కి, ఎదో ఎజెండా ఉంది అని అర్ధమైంది...

hero motors 23032018 1

ఈ రోజు మరో సారి ఒక సందర్భంలో ఇద్దరి ముఖ్యమంత్రులని కంపేర్ చేసుకునే పరిస్థితి వచ్చింది... ఎందుకంటే, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఆటోమొబైల్ ఇండస్ట్రీ టాప్ ప్లేయర్ హీరో మోటార్స్ తన ప్లాంట్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొల్పటానికి శంకుస్థాపన చేసింది... దీని వెనుక చంద్రబాబు కృషి ఎంత ఉందో, హీరో మోటార్స్ చైర్మన్ స్వయంగా చెప్పారు... చంద్రబాబు ఒక్క గంట ప్రెజెంటేషన్ ఇచ్చి, వేరే రాష్ట్రంలో పెట్టాలనుకున్న ప్లాంట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా పెట్టామో చెప్పారు.. ఇది విన్న తరువాత, చంద్రబాబు కృషికి మెచ్చుకుని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, మా ముఖ్యమంత్రికి 10కి, 10 మార్కులు వేసారు... మార్కులు వేసే వాళ్ళు, కనీసం ఒక 50 మంది పని చేసే కంపెనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకువచ్చి, మార్కులు వేస్తే ఇంకా బాగుండేది...

hero motors 23032018 1

ఇక ఈ రోజు తెలంగాణ రాష్ట్రం చేసిన ఒక పని, పత్రికాల్లో బాగా హైలైట్ అయ్యింది... తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టటానికి చైనా పారిశ్రామికవేత్తలు వచ్చారు.. అయితే, ఆ రాష్ట్రం ఇచ్చిన ఆతిధ్యం, మర్యాద చూసి, తీవ్ర అసంతృప్తికి గురయ్యి, వెళ్ళిపోయారు... 3 రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రంలో పర్యటిస్తున్న తమను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించింది... ఇది తమను ఉద్దేశపూర్వకంగా అవమానించడమేనని ప్రతినిధులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత మంది చైనా ప్రతినిధులు ఒక రాష్ట్రానికి రావడం ఇదే ప్రథమమని, వేరే ఏ దేశానికి వెళ్లినా తమకు ఘనంగా స్వాగతం పలికేవారని అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణలో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వ విధానాలు, ఇక్కడి నిబంధనలు, ఎఫ్‌డీఐ గురించి చర్చిద్దామని వస్తే పట్టించుకోలేదని ఐసీఈసీ ప్రతినిధుల ముందు వాపోయారు. పెట్టుబడులపై ఇక మీదట ప్రభుత్వాన్ని సంప్రదించకూడదని నిర్ణయించినట్లు సమాచారం... ఇలాంటి పనులు చేసినందుకు, 6 మార్కులు ఇచ్చాడు ఆ పెద్ద మనిషి...

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఇద్దరు ఎలా మోడీకి లొంగిపోయారో చూస్తూనే ఉన్నాం... కనీసం మోడీ అనే పేరు ఎత్తటానికి, ఇప్పుడు రాష్ట్రం ఎదుర్కుంటున్న పరిస్థతిలో మోడీని నిలదీయటానికి, ఇద్దరికీ ధైర్యం చాలట లేదు... కారణాలు ఏంటో మనకు తెలియదు కాని, మొత్తానికి ఇద్దరూ మోడీతో కలిసి గేమ్ ఆడుతున్నారు అనే విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తుంది... మరో పక్క, మోడీ పై పోరాడుతున్న చంద్రబాబుని బలహీన పరుస్తూ, జగన్, పవన్ ఇద్దరూ చంద్రబాబునే టార్గెట్ చేస్తున్నారు... మళ్ళీ మాకు రాష్ట్రం అంటే ప్రేమ, హోదా మా హక్కు అంటూ కబుర్లు చెప్తారు.. అయితే, గత రెండు రోజులుగా జరిగిన రెండు సంఘటనలు చుస్తే, వీరిద్దరూ ఎలా మోడీకి లొంగిపోయారో అర్ధం అవుతుంది...

pawan jagan 23032018 2

మన రాష్ట్రానికి జీవినాడి పోలవరం గురించి మాట్లాడుకుందాం... ఇది మన రాష్ట్రానికి ఎంత ముఖ్యం అనేది అందరికీ తెలుసు.. దీని కోసం చంద్రబాబు, వారంలో ఒక రోజు కేటాయిస్తున్నారు అంటే, ఈ ప్రాజెక్ట్ ఎంత ముఖ్యమైనదో అర్ధమవుతుంది... అయితే ఈ ప్రాజెక్ట్ విషయంలో నిన్న కేంద్రం, ముందు ఇస్తాను అన్న డబ్బులు కూడా ఇవ్వకుండా, కోత విధించి డబ్బులు ఇచ్చింది.. దీని పై పవన్ కాని, జగన్ కాని నోరు మెదపలేదు.... చంద్రబాబు మాత్రం అసెంబ్లీ వేదికగా, మోడీని దులిపి పడేసారు... పోలవరం నిర్మాణానికి నాబార్డు ద్వారా రూ.1400 కోట్లు తీసుకునేందుకు తొలుత అనుమతించింది. ఆ తర్వాత రెండ్రోజుల్లోనే కేంద్రం మాట మార్చింది కేంద్రం... పోలవరానికి రూ.311 కోట్లు కోత పెట్టి కేవలం రూ.1,089 కోట్లు మాత్రమే ఇవ్వాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీని కేంద్ర జలవనరులశాఖ ఆదేశించింది.... పోలవరం లాంటి ముఖ్యమైన ప్రాజెక్ట్ విషయంలో, ఇంత అన్యాయం జరుగుతుంటే, రాష్ట్రంతో కలిసి కేంద్రం పై పోరాడాల్సింది పోయి, పవన్, జగన్, ఒక్కరు కూడా నోరు ఎత్తటం లేదు...

pawan jagan 23032018 3

ఇక ప్రత్యేక హోదా గురించి... దీని గురించి, వీరు ఇద్దరు చేసే హడావిడి అంతా ఇంతా కాదు... అసలు ప్రత్యేక హోదా పేటెంట్ మాదే అంటూ, మెడలో ట్యాగ్ వేసుకుని తిరుగుతున్నారు... అలాంటిది, నిన్న ‘హోదా’ జాబితాలోనే ఉన్న సిక్కింతోపాటు మొత్తం ఈశాన్య రాష్ట్రాలకు మరో 3వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. బుధవారం కేంద్ర మంత్రివర్గం దీనిపై నిర్ణయం తీసుకుంది. ఈశాన్య పారిశ్రామిక అభివృద్ధి పథకం-2017 కింద నూతన పారిశ్రామిక యూనిట్లకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు, పన్ను రాయితీలు కల్పిస్తారు... ‘‘ఇప్పుడు ఎవ్వరికీ హోదా లేదు. అన్ని రాష్ట్రాలూ సమానమే’’ అంటూ నవ్యాంధ్రకు మొండిచేయి చూపించిన కేంద్ర ప్రభుత్వం, ఎందుకు మా రాష్ట్రానికి అన్యాయం చేసింది అని చంద్రబాబు అసెంబ్లీలో మోడీని, కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే, పవన్ కాని, జగన్ కాని, ఈ విషయం పై కనీసం మాట్లాడరు..

pawan jagan 23032018 4

నిన్న ఈశాన్య రాష్ట్రాలకు ఏ రాయతీలు అయితే ఇచ్చారో, సరిగ్గా ఈ రాయితీలనే తమకూ కల్పించాలని చంద్రబాబు డిమాండ్‌ చేస్తే, దీని పై సరిగా సమాధానం చెప్పకుండా, అరుణ్‌ జైట్లీ తన విలేకరుల సమావేశంలో వేరే అంశాలను ప్రస్తావించారు... ఒక్క రాష్ట్రానికి ఇస్తే ఇతర రాష్ట్రాలు అడుగుతాయని వింత సమాధానం చెప్పారు. పైగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చర్చలకు రాలేదంటూ నెపం వారిపై తోశారు.... దీంతో చంద్రబాబు చివరకు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి, మోడీ పై యుద్ధం ప్రకటించి, దేశ రాజకీయాల్లోనే ఒక కుదుపు తెచ్చారు... చంద్రబాబుని పక్కన పెట్టండి, సామాన్య ప్రజలు హోదా కోసం ఆందోళన చేస్తున్నారు, విపక్షాలుగా వీరికి బాధ్యత లేదా ? వాళ్లకి ఎందుకు ఇచ్చారు, మాకు ఎందుకు ఇవ్వరు ? అని మోడీని అడిగే దమ్ము వీళ్ళకి లేదా ? ఎందుకు వీరిద్దరూ పోలవరం పై, హోదా పై మోడీని నిలదియ్యారు ? మోడీని నిలదీస్తున్న చంద్రబాబని, ఎందుకు బలహీన పరచటానికి చూస్తున్నారు ? నిలదియ్యక పోయినా పరువా లేదు, కనీసం ఒక ఖండన, ఒక ప్రెస్ నోట్ లాంటింది ఇవ్వచ్చుగా ?

Advertisements

Latest Articles

Most Read