ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, శాసనమండలిలో మోడీని, జగన్ పార్టీని, పవన్ కళ్యాణ్ చేస్తున్న పనులని ఎండగట్టారు... విజయసాయి రెడిని అయితే, ఒక ఆట ఆడుకున్నారు... నిన్న విజయసాయి రెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబుని జైలుకి పంపిస్తా అని, అందుకోసం మోడీని, కలుస్తూనే ఉంటా అని, రోజు కలుస్తా అని, ఏమి చేస్తారో చేసుకోండి అంటూ, రెచ్చిపోయిన సంగతి తెలిసిందే... ఈ విషయం ప్రస్తావిస్తూ, చంద్రబాబు విజయసాయిని ఎండగట్టారు... పీఎంవోలో కూర్చోవడం, ప్రెస్ వారికి కనపడకుండా దాక్కోవడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని చంద్రబాబు అన్నారు. నేరస్తులకు పీఎంవో గస్తీ కాస్తుందా? అని వ్యాఖ్యానించారు.

cbn assembly 22032018 2

పీఎంవో చుట్టూ తిరిగే విజయసాయి రెడ్డి తనను బోనులో పెట్టిస్తానంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎంపీలు పీఎంను కలవొచ్చని బాబు ప్రసంగానికి మాధవ్‌ అడ్డుతగిలే ప్రయత్నం చేయగా.. అవినీతిపరులకు పీఎంవో గస్తీ కాస్తుందా? అని చంద్రబాబు మండిపడ్డారు. అవినీతిపరులతో పీఎంవోలో కాపురం పెట్టుకున్నా తమకేం నష్టంలేదని అడిరిపోయే పంచ్ వేసారు.. అవసరం అయితే కాపురం పెట్టుకోండి అయ్యా, నాకేంటి, అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు... అవినీతి కేసుల్లో ఉన్న వ్యక్తి సీబీఐ మాజీ డైరెక్టర్‌ను కలిస్తే కేసులు పెట్టారనే విషయాన్ని సీఎం గుర్తుచేశారు. తాను, తన కుటుంబం ఎలాంటి అవినీతికి పాల్పడలేదని స్పష్టంచేశారు.

cbn assembly 22032018 3

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేయడం తన జీవిత ఆశయమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాత్రింబవళ్లు కష్టపడి దాని నిర్మాణం చేపడుతుంటే బురద చల్లే కార్యక్రమాలు చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పోలవరం ప్రాజెక్టు కోసం పనిచేస్తుంటే దానిలో అవినీతి జరిగిపోతోందని, వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని మండిపడ్డారు. తానే రోజూ లాలూచీ పడలేదని స్పష్టంచేశారు. పోలవరం కోసం ఇప్పటి వరకు రూ.13,201 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. దేశంలోని 16జాతీయ ప్రాజెక్టుల్లో 11 ప్రాజెక్టుల పనులే ప్రారంభం కాలేదు. కేంద్రం చేపడితే ప్రాజెక్టు త్వరగా పూర్తికాదనే మేం బాధ్యత తీసుకున్నాం అని చెప్పారు.

2015లోనే చంద్రబాబు బయటకు ఎందుకు రాలేదు అంటే, ఇదే కారణం... ఇలా కక్షసాధించి, చంద్రబాబుని, తద్వారా రాష్ట్రాన్ని ఇబ్బంది పెడతారని తెలిసే, చంద్రబాబు జాగ్రత్తగా అడుగులు వేసారు... పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు నుంచి రూ.1400 కోట్లు విడుదల చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ రెండు రోజుల కిర్తం అనుమతిచ్చింది. ఇక ఇక్కడ బీజేపీ నాయకులు చూసారా అంటూ, తొడలు కొట్టారు... అయితే, ఇచ్చిన డబ్బులని కూడా ఈ రోజు కోత పెట్టారు... కేంద్రం మరో షాకిచ్చింది. పోలవరానికి రూ.311 కోట్లు కోత పెట్టింది. రెండు రోజుల క్రితం చెప్పినట్టు, రూ.1400 కోట్లు ఇవ్వము అంటూ, రూ.1,089 కోట్లు మాత్రమే ఇవ్వాలని జలవనరులశాఖ ఆదేశించింది.

polavaram 22032018 2

రెండు రోజుల క్రితం, నాబార్డులో ఉన్న దీర్ఘకాలిక నీటిపారుదల నిధి (ఎల్‌టీఐఎఫ్‌) నుంచి ఈ మొత్తాన్ని మంజూరు చేసినట్లు రాష్ట్ర జలవనరుల శాఖకు వర్తమానం అందింది. ఈ ప్రాజెక్టుకు రూ.1794.37 కోట్ల రుణాన్ని నాబార్డు నుంచి మంజూరు చేయాల్సిందిగా కేంద్ర జలవనరుల శాఖ కోరగా ఆర్థిక శాఖ ప్రస్తుతానికి రూ.1400 కోట్లకు మాత్రమే అనుమతిచ్చింది. అయితే వ్యయ గణాంకాల ఆడిట్‌, ఖరారు పెండింగ్‌లో ఉన్నందున మధ్యంతరంగా ఈ మొత్తాన్ని విడుదలచేస్తున్నట్లు తెలిపింది.

polavaram 22032018 3

సరే ఎదో ఒకటి వచ్చింది కదా, అనుకుంటున్న టైంలో, మరో రూ.311 కోట్లు కూడా కోత పెట్టి, రూ.1794.37 కోట్లు అడిగితే, చివరకు రూ.1,089 కోట్లు మాత్రమే ఇచ్చింది కేంద్రం... ఇలా ఇచ్చిన డబ్బులు కూడా తీసుకోవటం, కేంద్రానికి కొత్త కాదు.. 350 కోట్లు వెనుకబడిన ప్రాంతాలకు అంటూ ఎకౌంటు లో వేసి, మరీ వెనక్కు తీసుకున్నారు... ఇప్పటికే విభజన హామీలను కేంద్రం అమలు చేయలేదని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో పోలవరానికి కేంద్రం ఇవ్వాల్సిన నిధుల్లో కోత విధించడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఇలాంటివి ఇంకా ఎన్నో భవిషత్తులో ఎదుర్కోవాలి.. ఇంకా చాలా వస్తాయి.. సంవత్సరం టైం ఉంది.. ఇబ్బంది పెడుతూనే ఉంటారు... ప్రజలు మానసికంగా సిద్ధం కావలి...

పాదయాత్ర అంటే ఈయనగారికి ఎంత జోక్ గా ఉందో ఇక్కడే అర్ధమవుతుంది... ఒక రాజకీయ నాయకుడు పాదయత్ర చేస్తే, అది ఎంత పవిత్రంగా చేస్తారో, మనం మన రాజకీయాల్లో చూసాం... రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు ఎలా పాదయాత్ర చేసారు అన్నది, మనకు ఇంకా గుర్తు ఉంది... ఈ జగన్ మాత్రం, ఏంటో తెలియదు... వారినికి రెండు రోజులు కోర్ట్ కు వెళ్ళాలని సెలవు పెట్టి, ఫ్లైట్ ఎక్కి, హైదరాబాద్ లో దిగుతాడు... పోనీ కోర్ట్ కు వెళ్తాడా అంటే, ఇంటికి వెళ్లి, మసాజ్ లు, ఫేషియల్ లు చేపించుకుని, రెస్ట్ తీసుకుని, హాయగా రెండు రోజులు ఎంజాయ్ చేసి, మళ్ళీ పాదయాత్ర అంటాడు...

jagan 22032018

అయితే, ఈ రోజు మాత్రం, జగన్ చేసిన పనికి అందరూ అవాక్కయ్యారు.. గుంటూరు జిల్లాలో పాదయత్ర చేస్తున్న జగన్, ఈ రోజు ఉదయం పోలిరెడ్డిపాలెం శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించారు... అయితే ఉన్నట్టు ఉండి, జగన్ తన కార్ ను తీసుకుని రమ్మని చెప్పటంతో అందరూ ఆశ్చర్యపోయారు.. ఎందుకో అర్ధం కాలేదు... కాని అసలు సంగతి తెలుసుకుని, అక్కడ ఉన్న ప్రజలు, చివరకు జగన్ కార్యకర్తలు కూడా ఆశ్చర్యపోయారు...

jagan 22032018

పాదయాత్రను జగన్‌ నవ్వులాటగా ఎలా మార్చేశాడో మీరు చూడండి.. గుంటూరులో పాదయాత్ర చేస్తున్న జగన్‌ మధ్యలో కారులో కాసేపు చుట్టు పక్కల ప్రాంతాలు తిరిగాడు... వివిధ ప్రాంతాల్లో ధర్నాలను కారులో తిరుగుతూ సందర్శించాడు... వీకెండ్‌ కోర్టులకే కాకుండా మధ్యమధ్యలో ఇలా కారులో తిరిగే జగన్‌కి పాదయాత్రలో అభిమాని చనిపోతే మాత్రం వెళ్లాలని అనిపించలేదు... ఇది వరుస.. మనోడి పాదయాత్ర ఇలా సాగుతుంది... ఇలా కారుల్లో, విమానాల్లో తిరుగుతూ, అవలీలగా పాదయాత్ర పూర్తి చేస్తున్నాడు...

సినీ నటుడు శివాజీ, గత రెండు రోజుల నుంచి, ఆపరేషన్ గరుడ గురించి కొన్ని విషయాలు చెప్తానంటూ, చెప్తూ వచ్చారు... ఈ రోజు మూడు గంటలకు, మీడియాతో పూర్తి వివరాలు చెప్పారు... ఇక్కడ జరుగుతుంది ఆపరేషన్ గరుడ కాదని, ఆపరేషన్ ద్రవిడ అని, ఒక జాతీయ పార్టీ ఈ ఆపరేషన్ కోసం రూ. 4800 కోట్లతో మొదలు పెట్టింది అని చెప్పారు... దక్షినాది రాష్ట్రాలను కబలించటమే ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశం అని... దాంట్లో ఉపభాగాలే ఆపరేషన్ గరుడ అని, ఏపీ, తెలంగాణకు సంబంధించి ఆ జాతీయ పార్టీ పెట్టుకున్న పేరని ఆయన తెలిపారు. అలాగే కర్నాటకలో ఆపరేషన్‌ కుమార చేపట్టారని, తమిళనాడు, కేరళలో ఆపరేషన్‌ రావణ చేపట్టారని చెప్పారు...

sivaji 22032018 2

ఒక అజ్ఞాత వ్యక్తి ద్వారా 2017 సెప్టెంబర్‌లోనే ఈ విషయాలు తెలిశాయని శివాజీ అన్నారు... ఈ ఆపరేషన్‌ ఖర్చు మొత్తం రూ. 4800 కోట్లని..ఇందులో కొంత తరలించారన్నారు. అయితే ఆపరేషన్‌ మారవచ్చు.. విధి విధానాలు మారవచ్చునని ఆయన అన్నారు. కంటెంట్‌ మాత్రం 2019 టార్గెట్‌ ఆంధ్రప్రదేశ్‌ అని శివాజీ పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌కు సంధానకర్తగా ఒక రాజ్యాంగ శక్తి ఉన్నాడని, ఎవరైనా ఈ ఆపరేషన్‌లోకి రావడమే తప్ప బయటికి వెళ్లడం ఉండదన్నారు. దీనికి సంబంధించి, పూర్తి వివరాలు ఒక పెన్ డ్రైవ్ లో పెట్టి, మీడియాకు ఇస్తున్నా అని, ఇది ప్రజలకు చూపించండి అని చెప్పారు...

sivaji 22032018 3

అలాగే, రేపు లోక్ సభలో అవిశ్వాస తీర్మానం చర్చుకు తీసుకు వస్తున్నారని చెప్పారు... దేనికి సంబంధించి ఇప్పుడే సమాచారం అందింది అని, ఓ పక్కా ప్లాన్ ప్రకారం సభను నిర్వహిస్తున్నారని చెప్పారు... కేంద్ర ప్రభుత్వం తరపున ఆరుగురు వ్యక్తులు లోక్ సభలో మాట్లాడతారని... వారిలో ముగ్గురు ఇంగ్లీషులో, మరో ముగ్గురు తెలుగులో మాట్లాడతారని చెప్పారు... ఈ ఆరుగురు, బాగా ప్రిపేర్ అయ్యి ఉన్నారని, ధడ ధడ లాడిస్తారని చెప్పారు... వీరంతా మాట్లాడిన తర్వాత అవిశ్వాసాన్ని వ్యతిరేకించే వారు చేయెత్తాలని స్పీకర్ అడుగుతారని, అనుకూలంగా ఉండేవారు చేయెత్తాలని అడుగుతారని చెప్పారు. చివరకు అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఉండేవారే ఎక్కువగా కనిపిస్తున్నారంటూ... అవిశ్వాసం వీగిపోయిందని ప్రకటిస్తారని తెలిపారు.

Advertisements

Latest Articles

Most Read