మోడీ మీద ఉన్న విశ్వాసం, తన సొంత ఎమ్మల్యేల మీద లేకుండా పోయింది... జగన్ ఎంత అభద్రతా భావంలో ఉన్నాడో చెప్పటానికి ఇదొక ఉదాహరణ... జగన్ అంటే, తన సొంత పార్టీ ఎమ్మెల్యేలకే నమ్మకం లేదు అని చెప్పే ఉదంతం... తన సొంత పార్టీ ఎమ్మెల్యేలకు, తన మీద భరోసా లేదని తెలిసిన జగన్, చివరకు ఈ పని చేస్తున్నారు... సొంత పార్టీ ఎమ్మెల్యేలనే కంట్రోల్ చెయ్యలేని జగన్, ఇక రాష్ట్రాన్ని ఏమి చెయ్యగలడు... జగన్ మీద విశ్వాసం లేక ఇప్పటికే 23 మంది ఎమ్మెల్యేలు వచ్చేశారు... ఇంకా దాదాపు 25 మంది వచ్చేయటానికి రెడీగా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి... అయితే, రాజ్యసభ ఎన్నికలు వస్తున్న తరుణంలో, జగన్ కు ప్రస్తుతం ఉన్న 44 మంది ఎమ్మెల్యేలకు, ఒక రాజ్యసభ సీటు వస్తుంది... అయితే, జగన్ పై విశ్వాసం లేక, ఇప్పటికే కొంత మంది టిడిపిలో చేరి పోవటానికి రెడీగా ఉన్నారు..

jagan 10032018 2

ఈ నేపధ్యంలో, జగన్ ఇప్పటికే రాష్ట్ర బీజేపీ ఎమ్మల్యేలతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు... ముగ్గురు ఎమ్మెల్యేల టిడిపిలోకి వెళ్తే, టిడిపి రాజ్యసభ సీటు గెలుస్తుంది... అందుకే ముగ్గురు వెళ్ళినా, బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మల్యేలతో, క్రాస్ వోటింగ్ కి జగన్ ప్లాన్ చేసారు... మరో బీజేపీ ఎమ్మల్యే జగన్ కు వోట్ వెయ్యటానికి ఒప్పుకోలేదని సమాచారం... అయితే, ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం, దాదాపు 12 మంది వైసిపీ ఎమ్మల్యేలు, టిడిపిలో చేరతారనే వార్తలు వస్తున్నాయి... దీంతో, ఎలాగైనా ఒక్క రాజ్యసభ సీటు గెలిచి, మోడీ ముందు తాను బలవంతుండని అని జగన్ నిరుపించుకోవటం కోసం, క్యాంప్ రాజకీయాలకు తెర లేపారు...

jagan 10032018 3

ఇందులో భాగంగా పార్టీకి చెందిన 44 మంది ఎమ్మెల్యేలను విదేశాలకు తీసుకువెళ్తున్నాం అంటూ ముందుగా లీక్ ఇచ్చారు... దీంతో ఎమ్మెల్యేలు హాయిగా ఏ అమెరికానో, యూరప్ దేశాలకో, లేకపోతే ఏ సింగపూరో వెళ్ళవచ్చని కలలు కన్నారు... ఢిల్లీలో ధర్నా అంటూ అందరినీ పిలిపించి, మిమ్మల్ని విదేశాలకు తీసుకు వెళ్తున్నాం అని, పక్కనే ఉన్న నేపాల్ దేశానికి తీసుకు పోయారు... దీంతో ఎమ్మల్యేలు అవాక్కయ్యారు.. కొంత మంది జగన్ కు నమ్మిన బంట్లు అయిన ఎమ్మల్యేలు తప్పితే, దాదాపు 35 మంది ఎమ్మల్యేలు క్యాంపులో ఉన్నారు... అందరి దగ్గర, సెల్ ఫోన్ లు కూడా లేకుండా చేసారని తెలుస్తుంది... వేరే దేశాలు అయితే ఖర్చు ఎక్కువ అవుతుందని, అదీ చివరకు అందరూ తన వైపే ఉంటారనే నమ్మకం లేక, ఖర్చు తక్కువ అవుతుందని, నేపాల్ తీసుకుపోయినట్టు లోటస్ పాండ్ వర్గాలు చెప్తున్నాయి...

సీఎం చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభమైన తెదేపా వ్యూహ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా ముఖ్యనేతలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా గ్రామస్థాయి నేతలందరితోనూ సీఎం చంద్రబాబు సుమారు రెండున్నర గంటల పాటు టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. వ్యూహ కమిటీ భేటీలో భాగంగా సీఎం చంద్రబాబు 13 జిల్లాలకు చెందిన సుమారు 15వేల మంది నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చడంలో కేంద్రం వైఫల్యం చెందిన నేపథ్యంలో తెదేపా తీసుకున్న నిర్ణయంతో తలెత్తిన రాజకీయ పరిణామాలను వారందరికీ వివరించారు. అలాగే, కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలిగిన కారణాలను సైతం వారికి వివరించారు.

cbn tele conference 09032018 2

కేంద్రమంత్రి పదవులకు సుజనా చౌదరి, అశోక్‌గజపతిరాజు రాజీనామాలు చేసిన నేపథ్యంలో నేతల స్పందనను చంద్రబాబు కోరగా.. అధిక శాతం మంది నేతలు సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. అలాగే ప్రజల నుంచి కూడా సానుకూలమైన స్పందన వస్తోందని సీఎంకు వివరించినట్టు సమాచారం. అయితే, ఇంకా ఎన్డీయేలో కొనసాగడంపై వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని వారు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీనికి సీఎం స్పందిస్తూ సందర్భానుసారం నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక సాయం విషయంలోనూ బీజేపీ అన్యాయం చేసిందని సీఎం దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ మన కన్ను పొడవాలనుకుని, తన రెండు కళ్లను పోగొట్టుకుందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి న్యాయం చేస్తుందనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని గుర్తుచేశారు.

cbn tele conference 09032018 3

"రెండు జాతీయ పార్టీలు ఏపీ ప్రజల మనోభావాలను అర్థంచేసుకోలేదు. అందువల్ల రెండు జాతీయ పార్టీలు చేసిన అన్యాయాన్ని ప్రజలకు వివరించండి. తెదేపా తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. పార్లమెంట్‌లో తెదేపా ఎంపీలు పోరాడుతుంటే.. వైకాపా ఎంపీలు కూర్చుంటున్నారు. విజయసాయిరెడ్డి వైఖరే ఇందుకు నిదర్శనం. రాష్ట్ర విభజన సమయంలో జగన్‌ పార్లమెంట్‌లో సోనియాకు కనబడకుండా తిరిగారు. ఇప్పుడు మోదీ ప్రాపకం కోసం ఆయన పాకులాడుతున్నారు. ఎంపీలు రాజీనామాలు చేస్తే పార్లమెంట్‌లో ఏపీ ప్రజల గళాన్ని ఎవరు విన్పిస్తారు? ఎంపీలంతా రాజీనామాలు చేస్తే భాజపాకు లాభం చేకూర్చడమే అవుతుంది. వైకాపా వైఖరి చూస్తుంటే ఇలాగే కనబడుతోంది’’ అని సీఎం అన్నారు.

A2 విజయసాయి రెడ్డి ఏమో, మోడీ మీద విశ్వాసం ఉంది, కాన్ఫిడెన్సు ఉంది అంటూ, గట్టిగా బల్ల గుడ్డి, నేషనల్ మీడియాలో ఊదరగొడుతున్నాడు... A1 జగనే మో, కేంద్రం పై అవిశ్వాసం పెడుతున్నా, చంద్రబాబు కూడా రావాలి అంటూ ఛాలెంజ్ అంటాడు... ఇంతకీ ఏంటి ? మోడీ పై విశ్వాసమా ? మరి అవిశ్వాసం ఎందుకు ? రాజీనామాలు ఎందుకు ? ప్రజలు మరీ అంత బకరాలు లాగా కనిపిస్తున్నారా ? ఇలా అనుకుని, మీరే బకరాలు అయిపోతున్నారు అనే విషయం మర్చిపోతున్నారు... రాష్ట్ర ప్రయోజనాలని ఒక ప్రతి పక్ష పార్టీగా మంట గలిపి, కేవలం వ్యక్తిగత ప్రయోజనం కోసం పాకులాడుతున్నారు...

jagan modi 09032018 2

తెలుగుదేశం మంత్రులు, కేంద్రం నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి, విజయసాయి రెడ్డి నేషనల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నారు.. తద్వారా బీజేపీ పెద్దల కళ్ళలో పడటానికి చూస్తున్నారు.... కాంగ్రెస్ పార్టీ పై నమ్మకం లేదు, రాహుల్ గాంధీ మోసం చేస్తాడు అని చెప్తూ, స్పెషల్ స్టేటస్ ఇచ్చేది మోడీ మాత్రమే, ఆయన మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది, నమ్మకం ఉందీ అంటూ, విజయసాయి రెడ్డి, నేషనల్ మీడియాలో ఊదరగొడుతున్నాడు... అంటే ఈయనకు పూర్తిగా మోడీ పై విశ్వాసం ఉంది అని చెప్తున్నారు...

jagan modi 09032018 3

మరో పక్క, జగన్ మోహన్ రెడ్డి మాత్రం, చాలా తెలివిగా మాట్లాడుతూ మోడీని ఒక్క మాట కూడా అనకుండా, కేంద్రం పై అవిశ్వాసం పెడుతున్నా, చంద్రబాబు కూడా రావాలి అంటూ ఛాలెంజ్ అంటాడు... ఇన్ని రోజుల పోరాటంలో, ఒక్కసారి కూడా మోడీని ఒక్క మాట అన్న పాపాన పోలేదు వైసిపీ.. ఢిల్లీలో ధర్నా అంటూ, తెలుగులో ప్లె కార్డులు పట్టుకుని, హడావిడి చేసారు.. ఎక్కడా మోడీని కాని, అమిత్ షా ని కాని, ఒక్క మాట కూడా అనలేదు.. మోడీ పైనే మాకు విశ్వాసం అంటూ ఢిల్లీలో హడావిడి చేస్తూ, ఇక్కడ మాత్రం అవిశ్వాసం పెడుతున్నాం అంటూ డ్రామాలు ఆడుతున్నారు... వీళ్ళు డ్రామాలు ఆడుతున్నారు అనే విషయం, ప్రజలకు తెలియదు అనుకుంటున్నారు...

మన ప్రతి పక్ష నాయకుడు, తన ఎంపీల చేత, కేవలం రాజకీయం కోసం, చంద్రబాబుని సాధించటం కోసం, కూలి పని చేసుకునే ఉపాధి హామీ కూలీల నోట్లో మట్టి కొట్టిన సంగతి తెలిసిందే... కొన్ని రోజుల క్రితం, పేదల కోసం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకంపై జగన్‌ ఆదేశాల మేరకు ఆ పార్టీ ఎంపీలు అవినాశ్‌ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి కేంద్రానికి లేఖలు రాసి ఉపాధి హామీ నిధులు రాకుండా నిలిపివేయించిన సంగతి తెలిసిందే... వీరికి తోడు, కేంద్రం కూడా మనకు రావాల్సిన డబ్బులు లేట్ చేస్తూ, కూలి పనులు చేసుకుని బ్రతికే వారిని కూడా ఇబ్బంది పెడుతుంది.... దీంతో చంద్రబాబు డైరెక్ట్ గా రంగలోకి దిగారు... వైసిపీ ఎంపీలు చేసిన దుర్మార్గాన్ని, చంద్రబాబు ఎలా కవర్ చేస్తున్నారో చూడండి...

cbn 09032018 1 2

ఉపాధి హామీ వేతన దారులకు రాష్ట్ర ప్రభుత్వమే ప్రస్తుతానికి వేతనాలు చెల్లించే విధంగా నిర్ణయం తీసుకుంది... కేంద్ర ప్రభుత్వం నుండి ఉపాధిహమీ పనులకు వేతనాల రూపంలో రావాల్సిన నిధుల విడుల కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నందున ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గురువారం తీసుకుంది... సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో ప్రత్యేకంగా సమావేశమైయిన పంచాయితీ రాజ్‌శాఖ మంత్రి నారా లోకేష్ పరిస్థితులను సిఎంకు వివరిచారు....

cbn 09032018 1 3

దీనికి స్పందించి పరిస్థితిని ఆర్థం చేసుకున్న సిఎం చంద్రబాబు తక్షణమే ఉపాధిహామీ వేతనదారులకు రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు చెల్లించాలని ఆదేశించారు. దీనికి సంబంధించి 241.89 కోట్ల రూపాయాలను విడుదల చేయాలని ఆదేశించారు. తక్షణమే ఈ వేతనాలను చెల్లించాలని సిఎం చంద్రబాబు పంచాయితీ రాజ్‌శాఖ అధికారులకు ఆదేశించారు. వెంటనే వేతనాలు చెల్లింపు జరిగేలా చర్యలు తీసుకున్న సిఎంకు మంత్రి లోకేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలపడంతో పాటు ఆదేశాలను వెంటనే అమలు చేయాలని అధికారులను ఆదేశించారు...

Advertisements

Latest Articles

Most Read