టీడీపీ కేంద్రమంత్రులు ఎన్డీయే నుంచి తప్పుకుంటారని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు... ఈ సందర్భంలో కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు తన కార్యాలయానికి చేరుకున్నారు... అయితే, ఇక్కడ ఒక అరుదైన సంఘటన చోటు చేసుకుంది... ఆయన తన కార్యాలయంలో తన సీటులో కూర్చోకుండా, పక్కనేఉన్న విజిటర్ కుర్చీలో కూర్చుని తన రాజీనామా లేఖ రెడీ చేసుకుంటూ కనిపించారు... కొన్ని టీవీ చానల్స్ లో పదే పదే అశోక్ గజపతి రాజు గారి క్రెడిబిలిటీ దెబ్బతీస్తూ కధనాలు వెయ్యటం చూసాం... కాని ఇది ఆయనకు ఉన్న విలువలు, మంత్రులురాజీనామా చేయమని చంద్రన్న చెప్పగానే, మంత్రి రాజుగారు తన కార్యాలయం లొనే, విజిటర్ కుర్చీలో కూర్చున్నారు. అది నీతంటే....
మరో పక్క ప్రధానమంత్రి నరేంద్రమోదీ అపాయింట్‌మెంట్ కోసం కేంద్ర మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనాచౌదరి ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రధాని మోదీ ప్రస్తుతం రాజస్థాన్ పర్యటనలో ఉన్నారు. సాయంత్రం 4గంటలకు పార్లమెంట్ కు రానుండడంతో అప్పుడే తమ రాజీనామాలను ప్రధానికే ఇవ్వాలని మంత్రులు నిర్ణయించారు. విభజన హామీలను నెరవేర్చడంలో కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై టీడీపీ తరపున కేంద్రమంత్రి వర్గంలో కొనసాగుతున్న ఇరువురు తమ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు.
ఇప్పటికే ఏపీ రాష్ట్ర మంత్రివర్గంలో బీజేపీ తరుపున కొనసాగుతున్న కామినేని శ్రీనివాసరావు, మాణిక్యాలరావు ఇప్పటికే మంత్రి పదవుకు రాజీనామాలు చేశారు. అయితే... కేంద్రంలో కొనసాగుతున్న ఇరువురు టీడీపీ మంత్రులు కూడా రాజీనామా చేసేందుకు లేఖలను సిద్ధం చేశారు... కేంద్రం నుంచి బయటకు రావటం మొదటి అడుగు అని, ఇప్పుడు కేంద్రం ఏమన్నా స్పందిస్తుందో లేదో చూస్తామని, అదీ కాకుండా, ఎన్డీఏ నుంచి కూడా వైదొలుగుతామని చెప్పిన సంగతి తెలిసిందే...