ఢిల్లీ స్క్రిప్ట్ పర్ఫెక్ట్ గా నడుస్తుంది... ఢిల్లీ అయినా, గుజరాత్ అయినా, తెలంగాణా అయినా, ఏదైనా పరవాలేదు... చంద్రబాబుని ఇబ్బంది పెట్టాలి, తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనిశ్చితి నెలకొల్పాలి, దీని కోసం ఎవరినైనా తీసుకోవటానికి రెడీ... జగన్, పవన్, ఐవైఆర్, ముద్రగడ, ఉండవల్లి, పోసాని, ఇప్పుడు మోత్కుపల్లి... చంద్రబాబు మీద కోపంతో రాష్ట్రం నాశనమైనా పర్వాలేదనే మూడ్ లో ఉన్నారు ఆపరేషన్ గరుడ టీం... అందుకే తెలంగాణా నాయకుడిని కూడా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకువచ్చి, చంద్రబాబుని తిట్టించే ప్లాన్ వేసారు... మొన్న పోసాని, జగన్ ను పాదయాత్రలో కలిసి వెళ్ళిన తరువాత ఎలా అయితే, బూతులు తిట్టాడో, అలాంటి బూతులే ఇప్పుడు మోత్కుపల్లి చేత తిట్టించే ప్లాన్ వేసారు. ఇందుకోసం, మన A2 రంగంలోకి దిగాడు.. ఆపరేషన్ గరుడలోకి, మోత్కుపల్లిని ఆహ్వానించి, చెయ్యాల్సిన పనులు చెప్పారు.

motkupalli 14062018 2

ఈ నెల 11న కూడా మోత్కుపల్లి ఇంటికి విజయసాయిరెడ్డి వచ్చారు. అయితే మీడియాను చూసి మోత్కుపల్లిని కలవకుండానే ఆయన వెళ్లిపోయారు. వెంటనే బుధవారం మీడియాతో మాట్లాడిన మోత్కుపల్లి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. తిరుమల వెంకన్నను దర్శించుకుని చంద్రబాబును ఓడించమని కోరతానన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఏపీ ప్రజలు గుణపాఠం చెబుతారని మోత్కుపల్లి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వచ్చే చంద్రబాబును ఓడించాలని ఏపీ ప్రజలు పిలుపునిచ్చారు. చంద్రబాబుపై నిన్న ఘాటు వ్యాఖ్యలు చేసిన మోత్కుపల్లిని నేడు విజయసాయి కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

motkupalli 14062018 3

అంతే కాదు, మోత్కుపల్లి తిరుమల యాత్రకు వైసీపీ మద్దతు తెలుపింది. భవిష్యత్తులో కలిసి పని చేస్తామని విజయసాయి రెడ్డి ప్రకటించారు. ఇటీవల మోత్కుపల్లి నర్సింహులును కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కలిశారు. మోత్కుపల్లికి ముద్రగడ సంఘీభావం తెలిపారు. తాజా రాజకీయాలపై మోత్కుపల్లితో ముద్రగడ మంతనాలు జరిపారు. టీడీపీ నుంచి మోత్కుపల్లిని బహిష్కరించిన తర్వాత ముద్రగడ, విజయ్‌సాయిలు కలవడం వెనుక భారీ వ్యూహం దాగి ఉందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదంతా అమిత్ షా స్కెచ్ లో భాగమే అని, విజయసాయి రెడ్డి పెర్ఫార్మన్స్ ఇరగదీస్తున్నాడని, ఆంధ్రప్రదేశ్ ని నాశనం చెయ్యటానికి, ఇలాంటి సైతాన్ లు అందరూ ఏకమవుతున్నారని, వీరికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని అంటున్నారు.

చంద్రబాబుని ఎదుర్కోవటం ఎలా ? నాలుగు నెలలు నుంచి, అదిగో ఇదిగో, మీ అంతు చూస్తాం, మీకు చుక్కలు చూపిస్తాం, మీ సియంని జైల్లో పెడతాం, మీ సియం పై సిబిఐ వేస్తాం, మీ పని అయిపోయింది అంటూ, బీజేపీ నాయకులు చేస్తున్న హడావిడి చూస్తున్నాం... అదేదో మంగళవారం సామెత లాగా, కర్ణాటక ఎన్నికలు అవ్వాలి అన్నారు, ఎండాకాలం పోవాలి అన్నారు, అయినా ఇప్పటి వరకు వీళ్ళు చంద్రబాబు నీడను కూడా తాకలేకపోయారు సరి కదా, చంద్రబాబు దెబ్బతో రోజు రోజుకీ దిగజారి పోతున్నారు. ఈ క్రమంలో, ఇక ప్రధానే రంగంలోకి దిగుతున్నారు. దీనికి సంబంధించి ఒక ప్రముఖ వార్తా పత్రిక, ఒక సంచలన కధనం ప్రచురించింది. 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవటం ఎలా, టైపులో, చంద్రబాబుని ఎదుర్కోవటం ఎలా అనే కాన్సెప్ట్ తో, రేపు, అంటే జూన్ 15 న ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశం జరగనుంది.

kanna 14062018 2

ఆ కధనం ప్రకారం, కన్నా లక్ష్మీ నారాయణ రెండు రోజుల క్రితం, ప్రధాని మోడీని కలిసిన సంగతి తెలిసిందే. అయితే కన్నాను, ఆంధ్రప్రదేశ్ వెళ్ళకుండా, ఢిల్లీలోనే మరో రెండు రోజులు ఉండాలని ఆదేశాలు వచ్చాయి. రేపు ,అంటే జూన్ 15న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నరసింహన్ కూడా ఢిల్లీ వస్తున్నారని, అందరం కలిసి, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుని ఎలా ఎదుర్కోవాలి అనే అంశం పై, చర్చిద్దామని చెప్పినట్టు ఆ కధనం చెప్తుంది. ఇప్పటి నుంచి చంద్రబాబుని ఇబ్బంది పెట్టే ప్లాన్ లు వెయ్యాలని, అందుకే కన్నాను, ఢిల్లీలోనే ఉండమన్నారని ఆ కధనం సారంశం. గవర్నర్ నరసింహన్ అన్ని విషయాలతో, ఒక రిపోర్ట్ తో వస్తున్నారని తెలుస్తుంది.

kanna 14062018 3

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయ పరిస్థితి పై, ప్రధానికి రిపోర్ట్ ఇవ్వనున్నారు. చంద్రబాబు బీజేపీ పై చేస్తున్న ఎదురుదాడి, ధర్మ పోరాట దీక్షలు, ప్రజల పై వీటి ప్రభావం, చంద్రబాబు పై ప్రజలు మొగ్గతం, ఇవన్నీ గవర్నర్ నివేదిస్తారని ఆ కధనంలో చెప్పారు. అలాగే, పవన్, జగన్ తో కలిసి బీజేపీ ఎలా వెళ్ళాలి అనే అంశం పై కూడా చర్చలు జరగనున్నాయి. పవన్, జగన్ తో కలిసి ఎక్కువ ఎంపీ సీట్లు ఎలా గెలవాలి అనే దాని పై, ఎక్కువగా చర్చించే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే రేపు కెసిఆర్ కూడా ప్రధానిని కలవటానికి ఢిల్లీ వెళ్లనున్నారు. మొత్తానికి ఢిల్లీలో వీరు అందరూ కలిసి, చంద్రబాబుని ఎలా ఎదుర్కోవాలి అనే ప్లాన్ వేసి, ఇక్కడ ఉన్న పవన్, జగన్ కు ఇవ్వనున్నారు. మరి చంద్రబాబు వీరి అందరినీ ఎలా ఎదుర్కుంటారు, ఎలా ప్రజలకు ఈ విషయాలు చెప్తారు, ఎలా బయట పడతారో, రానున్న రోజుల్లో తెలియనుంది. ఒక్కడిని ఎదుర్కోవటానికి, ఇంత మంది, ఇన్ని విధాలుగా కుట్రలు పన్నుతున్నారు..

విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్... ఆయన పేరు చెప్తే, ముందుగా గుర్తుకు వచ్చేవి సర్వే ఫలితాలు... ఆయన ఏదన్నా సర్వే చేసారు అంటే, అది నిజం అయ్యి తీరుతుంది అని అనేక సార్లు రుజువు అయ్యింది. అందుకే సోషల్ మీడియాలో అన్ని పార్టీల వారు, లగడపాటి సర్వే అంటూ, రాస్తూ ఉంటారు. అయితే వీటిని అనేకసార్లు ఖండించారు లగడపాటి. నేను ఏదైనా సర్వే చేస్తే, మీడియా ముందుకు వచ్చి చెప్తా అని, ఇలాంటి ప్రచారాలు నమ్మవద్దు అని చెప్పారు. అయితే ఇప్పుడు మళ్ళీ లగడపాటి సర్వే అంటూ సోషల్ మీడియాలో హడావిడి మొదలైంది. రాజగోపాల్‌ ఓ వారం కిందట ముఖ్యమంత్రి చంద్రబాబును వెలగపూడి సచివాలయంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా, లగడపాటి సర్వే రిజల్ట్స్ ఇవ్వటానికి చంద్రబాబు వద్దకు వచ్చారనే పుకార్లు సోషల్ మీడియాలో వచ్చాయి. అయితే, లగడపాటి సర్వే వివరాలు ఇవ్వలేదు అని, కొన్ని సూచనలు చేసారని సియం పేషీ నుంచి వార్తలు వస్తున్నాయి.

lagadapati 14062018 2

రాష్ట్రంలో టీడీపీకి.. చంద్రబాబుకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందన్నది టీడీపీ క్యాడర్‌ నమ్మకమని ..ఇదే అంశం జనంలోకి కూడా వెళ్లిందని చెప్పినట్లు తెలిసింది.. పార్టీని రక్షించుకోవాలని.. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతోనే పార్టీ క్యాడర్‌ మహానాడుకు తరలివచ్చిందని లగడపాటి విశ్లేషించారట.. రాజధాని అమరావతి...పోలవరం నిర్మాణాలను పూర్తి చేయాలంటే చంద్రబాబు మరోసారి అధికారం చేపట్టాలన్న భావన ప్రజల్లో క్రమేణా వస్తున్నదని లగడపాటి ప్రైవేట్ చర్చల్లో చెబుతున్నారు... అయితే తెలుగదేశం పార్టీ ప్రజాప్రతినిధులపై కొన్ని ప్రాంతాల్లో ఉన్న వ్యతిరేకతను అధిగమించే విధంగా తెలుగుదేశం పనిచేయాల్సి ఉంటుందని, చంద్రబాబుపై ఉన్న సానుభూతి, రాష్ర్టం బాగుపడాలనే సెంటిమెంట్ ప్రజాప్రతినిధులపై ఉన్న వ్యతిరేకతను అధిగమిస్తుందని లగడపాటి విశ్లేషిస్తున్నట్లు తెలిసింది.

lagadapati 14062018 3

ఈ సారి ఓట్లు, కులాల పోలరైజేషన్ ఎక్కువగా ఉంటుందని, బీజేపీ పై పెరుగుతున్న వ్యతిరేకత చంద్రబాబుకు అనుకూలంగా మారుతుందని పరిశీలకులు చెబుతున్నారు. పట్టణాల్లో తెలుగదేశంపార్టీకి బాగున్నప్పటికీ, పల్లెల్లో మాత్రం కొంత డల్‌గా ఉందని, ఇప్పుడిప్పుడే పల్లెల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు కనిపిస్తున్నాయని, రోడ్లు, డ్రైనేజిలో, వ్యవసాయానికి నీరు, ఇవన్నీ పల్లెల్లో ప్రజలు అర్ధం చేసుకుంటున్నారని, ఇలాగే పాజిటివ్ ఫీల్ కంటిన్యూ అయితే, పల్లెల్లో కూడా సంపూర్ణంగా తెలుగుదేశం వైపు మొగ్గే అవకాసం ఉంటుంది అని, అదే సమయంలో కులాల మధ్య కుంపట్లు పెట్టే కుట్రను జాగ్రత్తగా ఎదుర్కోవాలని, లగడపాటి, చంద్రబాబుకు చెప్పారని సమాచారం..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో ఎనిమిదిన్నరేళ్ల క్రితం సంచలనం సృష్టించిన చిన్నారి పలగాని నాగవైష్ణవి అపహరణ, హత్య కేసులో విజయవాడలోని మహిళా సెషన్స్ న్యాయస్థానం గురువారం తీర్పు వెలువరించింది. ముగ్గురు నిందితులు మోర్ల శ్రీనివాసరావు, యంపరాల జగదీశ్‌, వెంకటరావుగౌడ్‌లకు న్యాయమూర్తి జీవిత ఖైదు విధించారు. హత్య, అపహరణ నేరాలు రుజువు కావడంతో నేరస్తులకు జీవిత ఖైదు విధిస్తున్నట్లు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. న్యాయస్థానం తీర్పు పట్ల నాగవైష్ణవి బంధువులు, విద్యార్థి, ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే తీర్పు కోసం ఏకంగా ఎనిమిదిన్నరేళ్లు పట్టడంపై మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. న్యాయం కోసం పోరాడిన నాగవైష్ణవి తల్లి నర్మదాదేవి గతేడాది మృతిచెందారని.. ఆమె బతికుండగానే తీర్పు వస్తే ఆ కుటుంబానికి స్వాంతన కలిగేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

naga 14062018 2

విజయవాడలో 2010లో జరిగిన ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్లే.. బీసీ సంఘం నేత, మద్యం వ్యాపారి పలగాని ప్రభాకర్ తన అక్క కూతురు వెంకటరామమ్మను వివాహం చేసుకున్నాడు. వీరికి దుర్గాప్రసాద్ అనే కుమారుడు జన్మించిన తర్వాత, నిజామాబాద్ జిల్లాకు చెందిన నర్మదను ప్రభాకర్ రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి సాయితేజేష్, నాగవైష్ణవి ఇద్దరు సంతానం కలిగారు. వైష్ణవి పుట్టిన తర్వాత ప్రభాకర్ దశ తిరిగింది. కుమార్తె పేరుతో ఆస్తులు కూడబెడుతున్నాడని మొదటి భార్య వెంకటరామమ్మ సోదరుడు వెంకటరావు బలంగా నమ్మాడు.

naga 14062018 3

దీంతో వైష్ణవిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా చిన్నమ్మ కుమారుడు శ్రీనివాసరావుతో కోటి రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. జనవరి 30న వైష్ణవిని కిడ్నాప్ చేసి చంపేశారు. తర్వాత ఆమె మృతదేహాన్ని ఇనుమును కరిగించే బాయిలర్‌లో వేసి బూడిద చేశారు. వైష్ణవి మరణవార్తతో కలత చెందిన ప్రభాకర్ తర్వాత గుండెపోటుతో మృతి చెందాడు. ఆ తర్వాత కారు డ్రైవర్ హత్యకు గురయ్యాడు. ఆరేళ్లు గడిచిపోయినా కేసు విచారణ ఇంకా సాగడంతో నర్మదాదేవి మరింత కుంగిపోయింది. దీనికి తోడు బ్రెయిన్ క్యాన్సర్ కూడా రావడంతో యేడాదిన్నర క్రితం మరణించారు. కుటుంబంలో తల్లి, తండ్రి, చెల్లెలిని కోల్పోయిన ఇద్దరు అబ్బాయిలు మిగిలిపోయారు. వారు కూడా ఈషాక్ నుంచి ఇంకా తేరుకోలేక పోతున్నారు.

Advertisements

Latest Articles

Most Read