మొన్నటి వరకు బహిరంగ వేదికల పై, మీడియా ముఖంగా, ఆంధ్రప్రదేశ్ కు ప్రధాని మోడీ చేసిన అన్యాయాన్ని నిలదీసిన చంద్రబాబు, ఇప్పుడు దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సాక్షిగా, నిలదీయటానికి రెడీ అవ్తున్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయం, కేంద్రం చేసిన అన్యాయంపై నీ తి ఆయోగ్‌ సమావేశంలో నిలదీయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. రాష్ట్రానికి వివిధ కేంద్ర పథకాల కింద వచ్చిన నిధులు.. వాటిలో జరిగిన అన్యాయం.. వ్యవసాయం, విద్య, వైద్య తదితర రం గాల్లో కేంద్రం చేసిన సాయం తదితర వివ రాలన్నీ సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రధాని మోదీ, అ న్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉన్న నీతి ఆయోగ్‌ పాలకమండలి సమావేశం ఈ నెల 16న ఢిల్లీలో జరగనుంది. అయితే అదే రోజు రంజాన్ కావటంతో, తేదీ మార్చమని ఇప్పటికే చంద్రబాబు కోరినా, కేంద్రం నుంచి స్పందన లేదు.

modi 14062018 2

ఈ సమావేశంలో రాష్ట్రం తరపున ఏయే అంశాలు లేవనెత్తాలన్న దానిపై చంద్రబాబు బుధవారమిక్కడ సచివాలయంలో ఉన్నతాధికారులు, కొందరు శాఖాధిపతులతో సమావేశం నిర్వహించారు. బీజేపీతో తెగతెంపులు చేసుకుని, కేంద్రం నుంచి వైదొలగిన అనంతరం ప్రధాని మోదీకి చంద్రబాబు ఎదురుపడనున్న సమావేశం ఇదే. నీతి ఆయోగ్‌ రాజ్యాంగబద్ధ సంస్థ అని, కేంద్ర-రాష్ట్రాల మధ్య పన్నుల ఆదాయం పంపిణీకి దాన్ని ఏర్పాటు చేశారని, దానిపై కేంద్రం పెత్తనం తగదని చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేస్తారని సమాచారం. రాష్ట్రాలకు పన్నుల ఆదాయాన్ని నీతి ఆయోగ్‌ స్వతంత్రంగా పంపిణీ చేయాలని, కానీ కేంద్రమే నిబంధనలు విధించి దానిప్రకారమే చేయాలని చెప్పడాన్ని ఆయన తప్పుబడతారు.

modi 14062018 3

1971 జనాభా లెక్కలను కాకుండా, తాజా లెక్కలను పరిగణలోకి తీసుకోవడం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు న ష్టం జరుగుతుందని స్పష్టం చేస్తారు. జనాభా ని యంత్రణను సమర్థంగా అమలుచేసి, బాగా పని చేసిన రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని గట్టిగా చెబుతారు. విభజన అంశాలు, కేంద్ర ప్రాజెక్టులకు అందిస్తున్న నిధులతో నివేదిక అందించాలని, అవసరమైన జిల్లాలకు ప్రత్యేక సహాయం అందుతున్న తీరుపై నీతి ఆయోగ్ చర్చనీయాంశాల్లో ఉందని, అందువల్ల సమగ్ర వివరాలతో నివేదిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కోరారు. నీతి ఆయోగ్ గత సమావేశపు కార్యప్రణాళిక ప్రకారం రాష్ట్రంలో కేంద్ర పథకాల అమలుకు కేంద్రం నుంచి ఏమేరకు సహకారం అందుతుందో తనకు సవివరంగా నివేదిక ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నిధులు ఏమేరకు వినియోగించాం, ఇంకా కేంద్రం నుంచి ఎంత రావాలి? అనే వివరాలను, అలాగే వైద్య ఆరోగ్యశాఖ ద్వారా అమలు జరుగుతున్న కేంద్రపథకాల తాజా స్థితిని చంద్రబాబు సమీక్షించారు.

ఏపీ ఎన్ఆర్టీ కృషి ఫలించింది. ప్రవాసాంధ్రులు ఎంతగానో ఎదరు చూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టు త్వరలోనే ప్రారంభం కాబోతోంది. రాజధాని అమరావతిలోని పరిపాలనా నగరంలో ఐదెకరాల విస్తీర్ణంలో నిర్మించే ‘ఎన్‌ఆర్‌టీ ఐకాన్‌ టవర్‌’ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 22న శంకుస్థాపన చేయనున్నారు. 33 అంతస్తుల ఈ టవర్‌ను ఏపీఎన్‌ఆర్‌టీ సంస్థ నిర్మిస్తోంది. పూర్తిగా ప్రవాసాంధ్రుల పెట్టుబడితో, వారి కోసమే నిర్మిస్తున్న టవర్‌ ఇది. రాయపూడి సమీపంలో నిర్మించే ఈ భవనం ముందు ఏపీఎన్‌ఆర్‌టీ సంస్థ 40 దేశాలకు చెందిన జాతీయ పతాకాలతో ఒక పెవిలియన్‌ను ఏర్పాటు చేసింది. ఈ పెవిలియన్‌ శాశ్వతంగా ఉంటుంది.

apnrt tower 14062018 2

9 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పుతో 50 అడుగుల ఎత్తున ఏర్పాటు చేసిన జెండాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ భవనం ఆకృతుల్ని కొరియాకు చెందిన స్పేస్‌ గ్రూప్‌ సంస్థ ఇప్పటికే రూపొందించింది. అమరావతిని ప్రతిబింబించేలా ఆంగ్ల అక్షరం ‘ఎ’ ఆకారంలో ఆకృతి ఉంటుంది. రెండు టవర్ల మధ్యలో ఏర్పాటు చేసిన గ్లోబ్‌లో రివాల్వింగ్‌ రెస్టారెంట్‌ ఉంటుంది. 120 దేశాల్లోని ప్రవాసాంధ్రుల ఉనికికి చిహ్నంగా గ్లోబ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీఎన్‌ఆర్‌టీ అధ్యక్షుడు రవికుమార్‌ వేమూరు తెలిపారు. ఈ భవనంలో 8 లక్షల చ.అడుగుల నిర్మిత ప్రాంతం ఉంటుందని, 100 కంపెనీల ఏర్పాటుకు వీలుంటుందని వెల్లడించారు. 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు.

apnrt tower 14062018 3

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి ఏపీ అభివృద్ధికి పాటు పడుతున్న ఎన్ఆర్టీ.. నూతన రాజధాని అమరావతిలో ఐకానిక్ టవర్ నిర్మించాలని దాదాపు రెండేళ్లుగా ప్రయత్నిస్తోంది. అయితే కొన్ని అడ్డకుంలు ఏర్పడినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోత్సాహంతో వాటిని అధిగమించి ఇప్పుడు ఐకానిక్ టవర్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతోంది. విదేశీ హంగులతో, అంతర్జాతీయ స్థాయిలో నిర్మించబోయే ఈ ఐకానిక్ టవర్ అమరావతికే ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

పులివెందుల పులి బిడ్డ అంటూ, చెప్పుకునే జగన్ పై, ఆయన సలహాదారుడు ప్రశాంత్ కిషోర్ సర్వే చేసారు. అన్ని నియోజకవర్గాల్లో చేసినట్టే, జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల పై కూడా సర్వే చేసారు. అయితే ఈ రిపోర్ట్ చూసి అందరూ షాక్ అయ్యారు. ఇదే షాకింగ్ రిపోర్ట్ తీసుకెళ్ళి జగన్ కు ఇచ్చాడు ప్రశాంత్ కిశోరే. అయితే, ఈ సర్వే పై జగన్ అసహనం వ్యక్తం చేసినట్టు, మళ్ళీ సర్వే చెయ్యమన్నట్టు వార్తలు వచ్చాయి. నేనే సియం అని ఆంధ్రా అంతా అనుకుంటుంటే, ఇదేమి సర్వే అంటూ జగన్ అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. జగన్ ఎంత చెప్పినా వినడు కాబట్టి, మరో సారి సర్వేకి సన్నాహాలు చేస్తున్నారు ప్రశాంత్ కిషోర్.. ఇదేదో సామెత ఉన్నట్టు, అక్కడ ఉన్నది వస్తుంది కాని, లేనిది ఎక్కడ నుంచి వస్తుంది.. ఇంతకీ ఆ సర్వే ఏంటో చూద్దాం...

pulivendula 14062018 2

నాలుగు దశాబ్దాలుగా, పులివెందుల అంటే వైఎస్‌ ఫ్యామిలీకి కంచుకోట... ఈ విషయం అందరికీ తెలిసిందే. పులివెందుల మెజారిటీ పైనే, కడప ఎంపీ సీటు కూడా ఆధారపడి ఉంటుంది అంటే, అంత మెజారిటీ వస్తు ఉండేది. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు వైఎస్‌ తన మార్క్‌ని ప్రదర్శించేవారనీ, అవసరమైతే సామ- దాన- భేద- దండోపాయాలను ప్రయోగించేవారనీ రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. అయితే జగన్ హాయంలో అంతా రివర్స్ లో ఉంది వ్యవహారం.. చివరకి సొంత బాబాయ్ ని కూడా గెలిపించుకోలేని దీని స్థితికి పడిపోయాడు జగన్.. ఎప్పుడూ లేనిది వైఎస్ ఫ్యామిలీకి కడపలో ఓటమి అంటే ఏంటో తెలిసి వచ్చింది. దీనికి ప్రధాన కారణం జగన్ వైఖరి. ఈ మైనస్ ఉండగానే, చంద్రబాబు అభివృద్ధి అనే మంత్రంతో, పాజిటివ్ ఫీల్ తో పులివెందుల ప్రజలకు చేరువ అయ్యారు.

pulivendula 14062018 3

నాలుగు దశాబ్దాలుగా వైఎస్‌ ఫ్యామిలీ పాలనలో ఉన్న పులివెందులకు సరైన తాగు- సాగునీటి సదుపాయం లేదు. ఇదే ఇక్కడి ప్రధాన సమస్య కూడా. వైఎస్‌ కుటుంబం పరిష్కరించలేని ఈ సమస్యని చంద్రబాబు ఓ కొలిక్కి తెచ్చారు. గండికోట ప్రాజెక్టుకి కృష్ణాజలాలను తరలించి.. అక్కడనుంచి పులివెందుల ప్రాంతంలోని చిత్రావతి, పైడిపాలెం ప్రాజెక్టులకు నీరందించారు. తద్వారా పులివెందుల కెనాల్స్‌కు నీటిని విడుదల చేశారు. దీంతో పులివెందుల ప్రజలకు తాగు- సాగునీటికి కొదవ లేకుండా పోయింది. వ్యవసాయపరంగా ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయగలిగింది తెలుగుదేశం ప్రభుత్వం. ఇదే అక్కడ ప్రజలను ఆకట్టుకునేలా చేస్తుంది. ఎప్పుడూ లేనిది, పులివెందులలో తెలుగుదేశం పార్టీ సమావేశాలు నిర్వహిస్తే.. భారీ సంఖ్యలో జనం తరలివస్తున్నారు. మరో పక్క సంక్షేమం కూడా పీక్స్ లో ఉంది. ఇవన్నీ ఇప్పుడు పులివెందుల ప్రజలు ఆలోచించేలా చేస్తున్నాయి.

జగన వైఖరి, చంద్రబాబు అభివృద్ధితో, పులివెందులలో వైఎస్ ఫ్యామిలీ కంచు కోటకు బీటలు ఇప్పటికే వచ్చాయి. వైఎస్ వివేక ఓటమితోనే అది రుజువైంది. అయితే, ఈ పరిణామాల్లో సర్వే చేసిన ప్రశాంత్ కిషోర్ కు, షాకింగ్ రిజల్ట్ కనిపించింది. ఈ సారి జగన్ మెజారిటీ 10 వేలు కూడా దాటదు అని సర్వే రిజల్ట్ వచ్చింది. దీని ప్రభావం, కడప ఎంపీ సీటు పై పడి, అది ఓడిపోయే ప్రమాదం కూడా ఉందని చెప్తున్నారు. ఇంకా సంవత్సర కాలం ఉండగానే, ఇలా ఉంటే, ఎన్నికల సమయానికి ఇంకా పోజిటివ్ ఓటు పెరుగుతుంది అని, పులివెందుల సీటుకే ఎసరు రావచ్చని, మరో సీట్ పై కూడా కన్నేసి ఉంచాలని, ప్రశాంత్ కిషోర్ ఒక రిపోర్ట్ తయారు చేసి, జగన్ కు ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే, జగన్ మాత్రం తన సహజ స్వభావాన్ని చూపించి, పులివెందుల ఈ సారి లక్ష మెజారిటీ వస్తుంది, ఈ సర్వే తప్పు, మరో సారి సర్వే చెయ్యమని, ప్రశాంత్ కిషోర్ కు చెప్పినట్టు తెలుస్తుంది.

కేంద్రం కోర్ట్ లో మరో కీలక ప్రాజెక్ట్ ఉంది.. గన్నవరంలో నిర్మించే హెచ్‌సిఎల్ కంపెనీకి అనుమతి ఇప్పుడు కేంద్రం చేతిలో... మరి కేంద్రం ఏమి చేస్తుందో చూడాలి. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ వద్ద రూ. 408.48 కోట్లతో నెలకొల్పనున్న ప్రత్యేక ఆర్థిక మండలికి (సెజ్) అనుమతి ఇవ్వాలని హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ కేంద్రాన్ని కోరింది. ఇక్కడ ఐటి, ఐటి ఆధారిత సేవల సంస్థలను నెలకొల్పేందుకు సెజ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు హెచ్‌సిఎల్ పేర్కొంది. ఈ ప్రతిపాదనను వాణిజ్య శాఖ పరిశీలిస్తోంది. ఈ నెల 1వ తేదీన వాణిజ్య అంతరంగిక బోర్డు సమావేశమవుతోంది. ఈ బోర్డు సమావేశానికి వాణిజ్య శాఖ కార్యదర్శి రీతా టియోటియా అధ్యక్షత వహిస్తారు. సుమారు 10.43 హెక్టార్లలో సెజ్‌ను ఏర్పాటు చేయాలని హెచ్‌సిఎల్ ప్రతిపాదనలు సమర్పించింది.

hcl 14062018 2

హిందుస్తాన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌సీఎల్‌) ఆర్టీసీ జోనల్‌ ట్రైనింగ్‌ కళాశాలకు చెందిన 27 ఎకరాల్లో ఏర్పాటుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అక్కడ చెట్ల తొలగింపు, నేల చదును పనులను సంస్థ ముమ్మరం చేసింది. ఈ పనులు ఒక కొలిక్కి రాగానే సెజ్‌లో భాగంగా ప్రాజెక్టును ఏర్పాటకు, కేంద్రానికి దరఖాస్తు చేస్తుకుంది. టవర్‌ నిర్మాణ పనులు పూర్తి కావటానికి ఎంత లేదన్నా ఏడాదికి పైగా సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు ఆగకుండా తక్షణం కార్యకలాపాలు ప్రారంభించటానికి వీలుగా హెచ్‌సీఎల్‌ సంస్థ మరో అడుగు ముందుకు వేసింది. ఒక వైపు టవర్‌ నిర్మాణ పనులతో పాటే మరోవైపు ‘మేథ’ టవర్‌లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా చర్యలు తీసుకుంది.

hcl 14062018 3

కళంకారీ నేత, కొండపల్లి బొమ్మలను ప్రతిబింబించేలా అమరావతి బౌద్ధ శిల్ప నిర్మాణ శైలిలో హెచ్‌సీఎల్‌ ఐటి టవర్ నిర్మాణం జరగనుంది.. గన్నవరం విమానాశ్రయం సమీపంలో నిర్మించనున్న ఈ భవనాలను విమానాలు దిగే సమయంలో ఆకాశంలో నుంచి చూస్తే ఈ నిర్మాణాలు అద్భుతంగా కనిపిస్తాయి.. దాదాపు వెయ్య మంది వరకు, ఇక్కడ ఉద్యోగాలు చేసే అవకాసం ఉంది. 2019 జూన్ నాటికి రాష్ట్రంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నూతన క్యాంపస్ కొలువుదీరుతుందని, ఇప్పటికే హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అధినేత, ఐటీ దిగ్గజం శివనాడార్ చెప్పారు... మరో పక్క, గన్నవరంలోనే కాక, అమరావతిలో కూడా మరో ఐటి టవర్ నిర్మించేందుకు హెచ్‌సీఎల్‌ ప్రణాలికలు రూపొందిస్తుంది... మరి ఇప్పుడు కేంద్రం చేతిలో ఉన్న ఈ సెజ్ అప్రూవల్, వస్తుందో లేదో అన్న టెన్షన్ తో ప్రభుత్వం ఉంది.

Advertisements

Latest Articles

Most Read