‘నేను తీసుకున్నది రైట్‌ టర్న్‌! యూ టర్న్‌ తీసుకున్నది మీరే. కుట్రలు చేసింది మీరే’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ‘తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారు’ అని పార్లమెంటులో ప్రధాని చేసిన వ్యాఖ్యలను సూటిగా తిప్పికొట్టారు. ‘‘మా రాష్ట్రానికి అన్యాయం జరిగింది. న్యాయం చేయండి. న్యాయం చేయకపోతే దేశానికీ మంచిదికాదు’’ అని మొదటి నుంచీ చెబుతున్నానని చంద్రబాబు తెలిపారు. ఐదు కోట్ల మంది ఆంధ్రులంటే లెక్కలేనితనమా అని కేంద్రాన్ని నిలదీశారు. ‘మేం కూడా ఈ దేశంలో భాగమే’ అని నినదించారు. గురువారం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో నిర్వహించిన ‘నగర దర్శిని’ కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగించారు.

cbn 27072018 2

‘‘మోదీ దారుణంగా మాట్లాడారు. నేను వైసీపీ ట్రాప్‌లో పడ్డానని చెప్పారు. వాళ్లే వైసీపీ ట్రాప్‌లో పడ్డారని నేను అప్పుడే మోదీకి చెప్పాను. నేను తీసుకున్నది రైట్‌ టర్న్‌ అని స్పష్టం చేశాను’’ అని తెలిపారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని నినదించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం ఎక్కడ, ఎప్పుడు చెప్పిందో రుజువు చేయాలని సవాల్‌ విసిరారు. అవినీతిలో మునిగిన వైసీపీని నమ్ముకుంటే ఒకటో, రెండో సీట్లు వస్తాయని బీజేపీ కక్కుర్తిపడిందని మండిపడ్డారు. ‘‘భయపడాల్సిన అవసరం నాకు లేదు. ఇంకా గట్టిగా పోరాడతాను. బీజేపీ మినహా అన్ని పార్టీలు మనకు అండగా నిలిచాయి. వైసీపీ ఒక్కటే బీజేపీ వెంట ఉంది’’ అని తెలిపారు.

 

cbn 27072018 3

శుక్రవారం టీడీపీ ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. ఇక్కడ కూడా మోడీ చేసిన వ్యాఖ్యల పై ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో బీజేపీదే యూటర్న్ తప్ప టీడీపీ కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ‘ఏపీకి ఇచ్చిన రూ.350 కోట్లు వెనక్కి తీసుకోవడం యూటర్న్ కాదా?...మేనిఫెస్టోలో చెప్పింది చేయక పోవడం యూ టర్న్ కాదా?...పదేళ్లు హోదా ఇస్తామని ఇప్పుడు ఇవ్వం అనడం యూ టర్న్ కాదా?’ అంటూ సీఎం ప్రశ్నించారు. రాజస్థాన్ పెట్రో కాంప్లెక్స్‌కు వీజీఎఫ్ సగం తగ్గించారని..అయితే కాకినాడ పెట్రో కాంప్లెక్స్‌కు రూ.5,361 కోట్లు ఏపీనే కట్టమనడం యూ టర్న్ కాదా? అని చంద్రబాబు నిలదీశారు. ‘ఢిల్లీ-ముంబై కారిడార్‌కు ఒక న్యాయం?...విశాఖ-చెన్నై కారిడార్ కో న్యాయం? ఇది బీజేపీ యూ టర్న్ కాదా?, థొలెరా నగరానికి పుష్కలంగా నిధులిచ్చి...అమరావతికి అన్యాయం చేయడం యూ టర్న్ కాదా?’ అంటూ సీఎం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

రాష్ట్రంలోని ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి మధ్యాహ్నా భోజన పథకం అమలు కానుంది. ఈ మేరకు ఉత్తర్వులను ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్‌దాస్‌ బుధవారం విడుదల చేశారు. ఈ పథకానికి రూ.56.53కోట్లు రాష్ట్రప్రభుత్వం కేటాయించింది. ఆహారం వండేందు కు రూ.23.75కోట్లు, కోడిగుడ్ల సరఫరా కోసం రూ.13.08కోట్లు, వంట వారికి, హెల్పర్లకు పది నెలలకు కలిపి రూ.1.90కోట్లు, రవాణ ఖర్చుల కింద రూ.17.80కోట్లు చొప్పున ప్రభుత్వం కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 450 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న 1,74,683 విద్యార్థులకు ఈ పథకం అమలు కానుంది.

inter 27072018 2

331 జూనియర్‌ కళాశాలలకు వాటికి అనుబంధంగా ఉన్న ఉన్నత పాఠశాలల నుంచి ఆహారం అందించడం జరుగుతుంది. మిగిలిన 119 కళాశాలలకు దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశా లల నుంచి అందిస్తారు. ఈ బాధ్యతలను కూడా కేంద్రీయ వంట శాలలు, ఎన్జీవోలకు ప్రభుత్వం అప్పగించనుంది. ఇప్పటివరకూ 1 నుంచి 10వ తరగతి వరకే మధ్యాహ్న భోజనాన్ని సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యాన అమలు చేస్తున్నారు. 2018-19 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ వారికీ..దీన్ని విస్తరిస్తున్నారు. ఈ విద్యా సంవత్సర బడ్జెటును రూ.23 కోట్లు కేటాయించినట్లు తెలిసింది. ఒక్క కృష్ణాజిల్లాలోనే 25 ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల నుంచి 15వేల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని వడ్డించనున్నారు. రాష్ట్రంలో ఇంటర్ విద్యను మరింత బలోపేతం చేయాలని, పేద, మధ్య తరగతి విద్యార్థులను ఆదుకోవాలనే లక్ష్యంతో..మధ్యాహ్న భోజన పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

inter 27072018 3

దీనివల్ల ఇంటర్ ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లో ప్రవేశాలు పెరుగుతాయని అధికారులు ఆశిస్తున్నారు. ఏపీలో మధ్యాహ్న భోజన పథకాన్ని 1982 నుంచి అమలు చేస్తున్నారు. 2003 నుంచి దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల కోసం(1-5 తరగతులు) ప్రారంభించారు. 2008లో 6 నుంచి 8 తరగతులకు, ఆ తర్వాత 9, 10 తరగతులకు దీన్ని విస్తరించారు. 2010-11 నుంచి ప్రత్యేక స్కూళ్ల విద్యారులకూ అమలు చేస్తున్నారు. 2012-13 నుంచి 220 పని దినాల్లోనూ విద్యార్థులకు భోజనం వడ్డిస్తున్నారు. విద్యార్థులు బడికి సక్రమంగా రావడం, హాజరుశాతం పెంపుదల, బాలబాలికలకు పౌష్టికాహారం అందించాలనేదీ.. ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. ప్రాథమిక, మాథ్యమిక విద్యార్థులకు సోమవారం-కోడిగుడ్డు, సాంబారు, మంగళవారం-కూరగాయలు, బుధవారం - పప్పు, కూరగాయలు, కోడి గుడ్డు, గురువారం-సాంబారు, శుక్రవారం-కూరగాయాలు, కోడిగుడ్డు, శనివారం-పప్పు, కూరగాయలతో భోజనాన్ని వడిస్తున్నారు. ఇదే మేనునూ కొంచెం మార్పులతో ఇంటర్ విద్యార్థులకూ అమలు చేస్తారని తెలుస్తోంది.

నేడు సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని ఈరోజు మూసివేయనున్నారు. ఈ శతాబ్దిలోనే ఇది అతి సుదీర్ఘమైనదిగా పండితులు చెబుతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాష్ట్రంలోని అన్ని ఆలయాలను మూసివేయనున్నారు. చంద్రగ్రహణంతో శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. అలాగే అన్నప్రసాదం, లడ్డూ వితరణ కేంద్రం కూడా మూసివేయనున్నారు. దాంతో ఈరోజు వృద్ధులు, వికలాంగులకు దర్శనాలను రద్దు చేశారు. ఆలయశుద్ధి, పుణ్యావచనం తర్వాత శనివారం ఉదయం 4.30 గంటలకు తిరిగి శ్రీవారి ఆలయాన్ని టీటీడీ అధికారులు ఆలయాన్ని తెరవనున్నారు.

srivari 27072018 2

చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వరాలయంలో గ్రహణ కాలాభిషేక పూజలు నిర్వహించడంతో పాటు ఆలయాన్ని శుక్రవారం యథావిధిగా తెరిచి ఉంచనున్నారు. శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల ఉభయ దేవాలయాల్లో శనివారం ఉదయం 7 గంటల నుంచి భక్తులకు దర్శనాలు, ఆర్జిత సేవలు నిర్వహించుకునే అవకాశం కల్పిస్తారు. . దేశవ్యాప్తంగా ఈ సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుంది. ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం పాక్షికంగా కనిపించనుంది. గ్రహణం మొదలైన తర్వాత ఏదైనా తింటూ సెల్ఫీలు తీసుకుని సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు అప్‌లోడ్‌ చేయాలని, తద్వారా మూఢనమ్మకాలను పారద్రోలాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

దేశంలో పోలవరం సహా ఐదు అత్యంత ప్రాధాన్యత కలిగిన జాతీయ నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య దోరణిపై కంప్ట్రోలర్‌ ఆడిటర్‌ జనరల్‌' (కాగ్‌) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 2017 మార్చి నాటికి ఈ ఐదు ప్రాజెక్టులపై కేంద్రం రూ.13,299 కోట్లు ఖర్చు చేసిందని, ఏ ఒక్క ప్రాజెక్టు పనులు కూడా ముందుకు సాగటం లేదని, పనులు ఇలాగే సాగితే... ఎన్నటికి పూర్తవుతాయని మోడీ సర్కార్‌ తీరును 'కాగ్‌' నిలదీసింది. రాష్ట్రంలోని పోలవరం, గోసిఖాండ్‌ (మహారాష్ట్ర), షాహిపూర్‌ కాండీ డ్యామ్‌ (పంజాబ్‌), సరయు నాహర్‌ పరియోజన (ఉత్తరప్రదేశ్‌), తీస్తా బ్యారేజ్‌ (పశ్చిమ బెంగాల్‌) ప్రాజెక్టుల పనులు నత్తనడకన సాగుతున్నాయని తెలిపింది.

caag 27072018 2

వీటి అంచనా వ్యయం మాత్రం 2,341 శాతం పెరిగిపోగా వీటి వల్ల అంత ప్రయోజనం దక్కుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయని కాగ్‌ పేర్కొంది. ఈ ప్రాజెక్టుల నివేదిక తయారీ, అనుమతులు, సర్వే, భూ సేకరణ నుంచి అమలు వరకు ప్రతి దశలోనూ అనేక లోపాలున్నాయని తెలిపింది. నిర్వహణా లోపాలు, కాంట్రాక్ట్‌ పనుల్లో తీవ్రమైన జాప్యం వంటి అనేక కారణాలు ఈ ఐదు ప్రాజెక్టులు పూర్తికాకుండా అడ్డుకుంటున్నాయని కాగ్‌ తెలిపింది. గంగానది శుద్ధీకరణ సాగుతున్న తీరును కూడా తప్పుబడుతూ కాగ్‌ నివేదిక వెలువరించిన సంగతి తెలిసిందే. ఎంతో ప్రాధాన్యత, జాతి ప్రయోజనాలతో ముడిపడి ఉన్న ఈ ప్రాజెక్టులు పూర్తికాకపోవటం దేశంపై ప్రతికూల ప్రభావం చూపిందని, రూ.13 వేల కోట్లు ఖర్చు చేశారు, విద్యుత్‌ ఉత్పత్తి అయ్యే పరిస్థితి లేదు, తాగునీరు రిజర్వాయర్లు నిర్మించలేదు, కనీసం ఆ లక్ష్యాలకు సమీపంగా ప్రాజెక్టులు వెళ్లలేకపోయాయని కాగ్‌ అభిప్రాయపడింది.

caag 27072018 3

దేశంలో 16 సాగునీటి, విద్యుత్‌ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతులు ఇవ్వగా దశాబ్దకాలం తర్వాత కేవలం ఐదు మాత్రమే అవి కూడా నిర్మాణం దశలోనే ఉన్నాయని కాగ్‌ తీవ్రంగా ఆక్షేపించింది. 2008 ఫిబ్రవరిలో అప్పటి కేంద్ర క్యాబినేట్‌ పలు సాగునీటి, విద్యుత్‌ ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. పోలవరంలో చంద్రబాబు అవినీతి చేసేందుకే, పోలవరం కొత్త అంచనా అయిన 55 వేల కోట్లు చూపిస్తున్నారు అనే వారికి కూడా కాగ్ తన రిపోర్ట్ తో సమాధానం చెప్పినట్టు అయ్యింది. కొత్త భూసేకరణ చట్టం వలెనే కొత్త అంచనాలు 55 వేల కోట్లుకు పెరిగాయని రిపోర్ట్ ఇచ్చింది. మరో విషయం ఏమిటి అంటే కాగ్ రిపోర్ట్ లో జాతీయ హోదా పొందిన పోలవరం ప్రాజెక్ట్ ఖర్చును 55 వేల కోట్లుగా చూపించారు.

Advertisements

Latest Articles

Most Read