మహాసంప్రోక్షణ జరిగే ఆగస్టు 11 నుంచి 16 వరకు పరిమితంగా భక్తులను దర్శనానికి అనుమతి ఇస్తూ టీటీడీ నిర్ణయం తీసుకొంది. ఆ సమయంలో మూలవర్ల దర్శనానికి సమయం చాలా తక్కువగా ఉంటుందని పాలక మండలి చైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో తీసుకొన్న నిర్ణయాలను వీరిరువురు మీడియాకు వివరించారు. ఎక్కువ మందికి దర్శనం కల్పించలేని పరిస్థితుల్లో ఎలా చేస్తే బాగుంటుందనేది భక్తుల నుంచి అభిప్రాయాలను సేకరించామన్నారు. ఇందులో ఎక్కువశాతం మంది సర్వదర్శనం ద్వారా క్యూలైన్‌లో అనుమతించాలని సూచించారన్నారు.

ttd 2507208 2

11న అంకురార్పణం రోజున 9 గంటలు, 12, 13 తేదీల్లో 4 గంటలు, 14న 6గంటలు, 15న 5 గంటలు, 16న 4 గంటలు మాత్రమే దర్శనాలకు అవకాశం ఉంటుందన్నారు. యాగశాల ఏర్పాటువల్ల విమాన ప్రాకారంలో సగభాగం ఆక్రమిస్తుందని, దాంతో దర్శనం చేసుకున్న భక్తులు కొద్దికొద్ది మంది మాత్రమే ముందుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఈ సమయాలను అనుసరించి రోజులో ఎంతమందిని అనుమతించాలన్న సంఖ్యను త్వరలో ప్రకటిస్తామన్నారు. ఆ సంఖ్య చేరుకొన్న తర్వాత క్యూలైన్‌ను మూసివేస్తామన్నారు.

 

ttd 2507208 3

ఈ సమాచారానికి విస్తృతంగా ప్రచారం కల్పిస్తామని చెప్పారు. వీఐపీ బ్రేకు దర్శనాలు పూర్తిగా ఉండవని, రూ.300, ఆర్జితసేవలు ఇప్పటికే నిలిపివేశామని, ప్రత్యేక దర్శనాలు, స్లాట్‌ దర్శనాల రద్దుకు నిర్ణయించామన్నారు. ఆ ఆరు రోజులూ టీటీడీ చైర్మన్‌, సభ్యులు, అధికారులతో సహా ఎవరి సిఫారసులూ పని చేయవని స్పష్టం చేశారు. పుష్కరకాలానికో మారు నిర్వహించే వైదిక క్రతువు నిర్విఘ్నంగా జరిగేందుకు భక్తులు సహకరించాలని బోర్డు విజ్ఞప్తి చేసింది. టీటీడీ ఇచ్చిన నోటీసులకు స్పందించని శ్రీవారి ఆలయం మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు, వైసీపీ ఎంపీ విజయ్‌సాయిరెడ్డిలపై తదుపరి న్యాయపరమైన చర్యలకు నిర్ణయం తీసుకొన్నట్లు టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు.

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పై వైసీపీ అధ్యక్షుడు, విపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పవన్‌ పై వ్యక్తిగత విమర్శలకు దిగారు. "పవన్‌ కల్యాణ్‌ ఆరు నెలలకోసారో ఏడాదికోసారో బయటకు వస్తాడు. ఒకరోజు ఒక ట్వీటిస్తాడు. లేకపోతే ఒక ఇంటర్వ్యూ ఇస్తాడు. ఇలాంటి వ్యక్తి కూడా రాజకీయాల్లో మాట్లాడడం మొదలు పెడితే, దాని గురించి కూడా మనం సమాధానం చెప్పాలంటే, నిజంగా ఎక్కడివీ విలువలు!? విలువల గురించి తాను మాట్లాడతాడు. నిజంగా ఎక్కడున్నాయండీ తనకు విలువలు? నలుగురు నలుగురు పెళ్లాలు. కొత్త కారును మార్చినట్టు పెళ్లాన్ని మారుస్తాడు. నాలుగేళ్లకోసారి ఐదేళ్లకోసారి పెళ్లాన్ని మారుస్తాడు. ఇలాంటి పనిని నేనో నువ్వో మరొకరో చేసి ఉంటే.. ఏమందురు!? నిత్య పెళ్లికొడుకని చెప్పి జైల్లో వేసేవారా కాదా!? ఇది పాలిగామీ (బహు భార్యత్వం) కాదా? ఇలాంటోళ్లు ఎన్నికలకు ఆరు నెలల ముందు బయటకు వచ్చి తానేదో సచ్చీలుడినని మాట్లాడడం.. వాళ్లను సీరియ్‌సగా తీసుకుని వాళ్ల గురించి కూడా విశ్లేషించుకోవడం అంటే బాధేస్తుంది’’ అని వ్యాఖ్యానించారు.

jagan 25072018 2

అయితే ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారమే రేపాయి. ఇప్పటి వరకు ఎన్నో వ్యక్తిగత విమర్శలు చూసినా, ఇలా మరీ ఓవర్ గా ఎవరూ చేయలేదు. దీని పై వైసీపీ నేతలు రెండు కారణాలు చెప్తున్నారు. మంగళవారం తను పిలుపు ఇచ్చిన బంద్‌ సక్సెస్ కాకపోవడంతోనే జగన్ ఈ స్థాయిలో వ్యాఖ్యానించారని వైసీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. బంద్‌ను విజయవంతం చేయకపోవడంపై సొంత పార్టీ నేతలను తీవ్రంగా నిలదీసినట్టు సమాచారం. దీనికి తోడు ప్రెస్ మీట్ చివరలో పవన్ కల్యాణ్ గురించి అడగడంతో జగన్ కంట్రోల్ తప్పారని.. అందుకే అలాంటి వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.

jagan 25072018 3

మరో కారణం, పవన్ కళ్యాణ్ రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలతో జగన్ ఇగో దెబ్బతిందని, పవన్ లాంటి వాడు నన్ను ప్రశ్నిస్తాడా అనే జగన్ అంటున్నారు అని వైసిపీ నేతలు అంటున్నారు. రెండు రోజుల క్రితం పవన్ మాట్లాడుతూ, ‘‘జగన్‌ ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా రాజకీయం చేస్తున్నారు. ముఖ్యమంత్రి అయ్యేదాకా ఆగాలని చెప్పడమే తప్ప... ప్రజా సమస్యలపై ఆయన పోరాడటం లేదు. బంగారంలాంటి అవకాశాలను వినియోగించుకోవడంలేదు. నేను ఉండి ఉంటే... అసెంబ్లీలో వైసీపీలాగా పారిపోయేవాడిని కాదు. ఈరోజు రోడ్లమీద కూర్చుని పోరాడాల్సి వస్తోంది. కానీ, నాకు పది మంది సభ్యులు ఉంటే సభను ఆపేసేవాడిని. ఇంత బంగారంలాంటి అవకాశాన్ని జగన్‌ దుర్వినియోగం చేశారు.’ అని అన్నారు.

జగన్ మోహన్ రెడ్డి ఇన్నిరోజులు ప్రత్యేక హోదా పేరుతో కాకమ్మ కబుర్లు చెప్పి కాలం వెల్లబుచ్చారు.... నిన్న పార్లమెంటులో తెలుగుదేశం ఎంపిల పోరాటం చూసాక గుండెల్లో దడపుట్టి ప్రజలు పార్టీని మరిచిపోతారేమో అనే భయంతో బంద్ కి పిలుపునిచ్చారు... దీని వల్ల ప్రత్యేకహోదా వస్తదా..? కనీసం బడి పిల్లలైనా మీ బంద్ కి సహకరిస్తారా..? ఈ బంద్ వల్ల ఉపయోగమైనా ఉందా...? ఇలాంటివి ఏవి పట్టించోకోకుండా, తన నాయకుల చేత కొన్ని చోట్ల బలవతంగా బంద్ చేపించే ప్రయత్నం చేసారు. చిరు వ్యాపరులు ఒకరోజు తమ వ్యాపారాన్ని వదిలి ఇంట్లో కుర్చోవాల్సిన పరిస్థితి.. అయితే తను, తన భార్య నిర్వహించే భారతి సిమెంట్స్ మాత్రం, ఈ రోజు యధావిధగా పని చేసింది. తను మాత్రం బాగుండాలి, ప్రజలు మాత్రం పోవాలి అనే అనుకునే జగన్ నైజం బయట పడింది.

bharati 24072018 2

బంద్ ప్రభావం పాక్షికంగా కనిపిస్తోంది. విజయవాడలో అయితే జనజీవనం యధావిధిగా ఉంది. కేవలం విద్యాసంస్థలకు మినహాయించి మిగిలినవన్నీ యాధావిధిగా జరుగుతున్నాయి. బంద్ ప్రభావం అంతగా కనిపించలేదు. ఇలా బంద్‌లు చేయడంకంటే ఢిల్లీ స్థాయిలో నిరసనలు తెలియజేయడం, కేంద్రంపై ఒత్తిడి చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ బంద్ వల్ల రాష్ట్రానికే నష్టమని, కేంద్రానికి ఎటువంటి ఇబ్బంది లేదనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని ఏ పార్టీ కూడా వైసీపీకి మద్దతు ఇవ్వలేదు. వైసీపీ ఇటువంటి బంద్‌లు మానీ ఢిల్లీ స్థాయిలో పోరాటం చేస్తే బాగుంటుందని, టీడీపీ ఎంపీలు ఏ స్థాయిలో పోరాటం చేస్తున్నారో అదే స్థాయిలో వైసీపీ పోరాటం చేస్తే ఫలితం ఉంటుందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు.

bharati 24072018 3

మీరు ఇలా ఎంజాయ్ చేస్తుంటే, మీ స్వార్ధ రాజకీయాల కోసం, ప్రజలు బలి అవ్వాలా ? ఒక సమస్య పై, ఒకసారి బంద్ చేస్తారు.. కాని నెలకు ఒకసారి ఏంటిది ? అదీ ఢిల్లీ స్థాయిలో తేల్చుకునే విషయం, మన రాష్ట్రంలో నీ వీరత్వం చుపించటమేంటి ? ఒక్క రెండు రోజులు పాదయాత్ర వాయిదా వేసి, పార్లమెంట్ ముందు ధర్నా చేస్తాను, మీరు రండి అని పిలుపు ఇవ్వండి, అప్పుడు ప్రజలు సహకరిస్తారు. అంతే కాని, రాష్ట్రంలో ఉన్న ప్రజలను ఇబ్బంది పడితే, మోడీకి పోయేది ఏమి ఉంటుంది ?వారికి కావాల్సింది కూడా, రాష్ట్రం ఇలా అల్లకల్లోలంగా ఉండటమే... మనం ఎందుకు వారి ఉచ్చులో పడాలి ? నువ్వు చేసే బంద్ కు, ఒక్క పార్టీ కూడా, నీకు మద్దతు ఇవ్వలేదు అంటే, మీరు చేస్తున్న పోరాటం ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు... ఇకనైనా ఈ గల్లీ వేషాలు మాని, ఢిల్లీలో పోరాడండి, లేకపోతే మీ పాదయాత్ర చేసుకోండి...

రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల రాజకీయం రోజు రోజుకీ దిగాజారి పోతుంది. ఒకాయిన నాకు ఎవరో చెప్పారు, వాళ్ళెవరో అనుకుంటున్నారు అని ఆరోపణలు చేస్తాడు... ఇంకో ఆయన, నీలు ఇన్ని పెళ్ళిళ్ళు, నువ్వా నాకు చెప్పేది అని వ్యక్తిగత విమర్శలు చేస్తాడు... కాని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం, అటు ఢిల్లీతో పోరాటం, ఇటు అభివృద్ధి, పరిపాలాన, కుట్రలు, ఇలా అన్ని ఎదుర్కుంటూ, ప్రజలకు అన్ని సౌకర్యాలు అందుతున్నాయో లేదో చూస్తున్నారు. ఈ రోజు, విద్యాధరపురంలో, అనిల్ కుంబ్లే సహా, వివిధ ప్రముఖ క్రీడాకారుల సమక్షంలో, ప్రాజెక్ట్ గాండీవ ప్రారంభమయింది. ఆ కార్యక్రమం పూర్తయిన తరువాత, చంద్రబాబు నేరుగా ఇంటికి వెళ్లి పడుకోలేదు.. పేదల దగ్గరకు వెళ్లారు. నిరు పేదలు వారు..

anna 24072018 2

విజయవాడలోని విద్యాధరపురంలో అంతర్జాతీయ క్రీడాప్రాంగణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఉండవల్లిలోని నివాసానికి తిరుగు ప్రయాణమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 11న భవానీపురంలో ప్రారంభించిన అన్న క్యాంటీన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు పలు సూచనలు చేశారు. అన్నక్యాంటీన్ కు మూడు వైపులా ఉన్న ఖాళీ ప్రదేశాన్ని అందంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. పచ్చదనంతో ఆహ్లాదకరమైన వాతావారణాన్ని కలిగించాలని అధికారులకు సూచించారు.

anna 24072018 3

పనులు ఆలస్యం చేయకుండా త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులకు చెప్పారు. ఈ సందర్భంగా అన్న క్యాంటీన్ తీరుతెన్నులపై పలువురి అభిప్రాయాలు తెలుసుకున్నారు. స్థానికులను కలిసి మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉండవల్లిలోని తన నివాసానికి ముఖ్యమంత్రి పయనమయ్యారు. ఇలా రాష్ట్రం పట్ల, పేద ప్రజల పట్ల నిత్యం అప్రమత్తతతో చంద్రబాబు పరిపాలన కొనసాగిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు చెయ్యాల్సిన పని కూడా తానే చేస్తూ, అందరికీ ఆన్నీ సమకూర్చుతూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళ్తున్నారు. మన ప్రతిపక్షం ఒకరి మీద ఒకరు, వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ, పబ్బం గడుపుతున్నారు.

Advertisements

Latest Articles

Most Read