ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా జరిగిన ఎన్నికలు గమనించారా ? మోడీ-షా స్ట్రాటజీ ఏంటో ఒకసారి చూడండి. నిన్న కాక మొన్న జరిగిన కర్ణాటక ఎన్నికలు గుర్తు తెచ్చుకుని, వీళ్ళ ఎత్తుగడలు ఎలా ఉంటాయో గమనించండి. ప్రతి ఎన్నికలలో మోడి హవా ఉంది అని మీడియా తెగ గోల చేస్తుంది, దాని లో నిజం ఏమిటో తెలుసుకుందాం. అన్ని రాష్ట్రాల ఎన్నికల్లో ఇప్పటి వరకు ఇదే జరిగింది. కచ్చితంగా ఎన్నికల రేను, నెలలు ముందు బిజెపి వాళ్ళు RSS సర్వే ఒకటి విడుదల చేస్తారు. ఆ సర్వేలో బిజెపి ఓడిపోతుంది అని బిజెపి 50 - 60 ఎమ్మల్యేలను కూడా గెలవదు అని ఉంటుంది. ఆ తరువాత అసలు ఆట మొదలెడతారు బిజెపి వాళ్ళు. 50000 మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దిగుతారు. ఎన్నికల జరుగుతున్న రాష్ట్రానికి , రోజూ గుళ్ళ ముందు ప్రచారం మొదలెడతారు. హిందూ ఓటర్లను రెచ్చగొడతారు. ఆ తరువుత అమిత్ షా తో పాటు బిజెపి నాయకులు అంతా ప్రచారంలో కి దిగుతారు. అప్పుడు మీడియాని, నయానో భయానో భయపెట్టి, లాలించి బిజెపి బలం విపరీతంగా పెరిగింది, గట్టి పోటి ఇచ్చే స్థాయికి వచ్చింది అని వార్త ఛానల్ లో ఊదర కొడతారు. 

modishah 29072018 2

ఇక చివరిగా 15 రొజులు ముందు మోడి రంగంలోకి దిగుతాడు. ఇంకా ఏమి ఉంది సుడిగాలి పర్యటనలు రహుల్ గాంధీని కసి తీరా తిట్టటం, నోటికి వచ్చిన అబద్ధాలు ఆడటం, నేను పేదవాడిని, నన్ను చంపేస్తారు అని చెప్పటంతో చివర ఘట్టానికి ప్రచారం వస్తుంది. అప్పుడు మళ్ళీ మీడియాని దింపుతారు. మోడి హవా విపరీతంగా పెరిగిపోయంది, గెలుపు బిజెపిది అని ఊదరగొట్టటం మొదలెడతారు. అసలు కధ, ఇప్పుడే ఉంది. ఎందుకు అంటే ఎక్కడ అయిన తటస్థ ఓటర్లు 30 % మంది వుంటారు, వాళ్ళు 15 రొజులు మందు కాని వార్తలు చూడరు. ఆ 15 రొజులులో వార్తలు చూసిన తటస్థ ఓటర్లు బిజెపి గెలుస్తుంది కాబట్టి, బిజెపి కి ఓట్ల గుద్దేస్తారు. ఇంకా పోల్ మానేజ్మెంట్ గురించి మీకు తెలియంది కాదు. తటస్థ ఓట్లు సహయం తో బిజెపి గెలుస్తుంది. ఇంకా మీడియా హడావిడి మీడియాదే. ఇదే మోడి హవా. చివరగా మోడి హవా విపరీతంగా ఉంది అనే మాటకు సార్ధకత లభిస్తుంది. కర్ణాటకలో జరిగింది కూడా ఇదే. మోడీ సభలకు ఖాలీ కుర్చీలు అని మొదట్లో చూపించారు. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ, మోడీ హవా అని మొదలు పెట్టారు.

modishah 29072018 3

రేపు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇదే ప్లాన్ చేస్తున్నారు. కాకపొతే, ఇక్కడ సీన్ లో పవన్-జగన్ ఉంటారు. ముందుగా చంద్రబాబు స్వీప్ అంటూ సర్వేలు వేస్తారు. తరువాత పవన్-జగన్ ని కలుపుతారు. తరువాత మోడి వచ్చి కొంత డబ్బు, కొన్ని హామీలు ఇవ్వటం మనం కళ్లు మూసి తెరిచే లోపులో జరిగిపోద్ది. ఇప్పుడు ఇంకో సర్వే వస్తుంది, దానిలో టిడిపి 90 స్థానాలుకి దిగజారింది అని ఉంటుంది. ఇక ఎన్నికలు అప్పుడు, పవన్-జగన్-మోడీ జోడి అబ్బో చూడటానికి రెండు కళ్లు కూడా సరిపోవు. ఎన్నికలకి కొన్ని రొజులు ముందు ఇంకొ సర్వే దాని లో టిడిపి కి 60 ఇస్తారు. ఇది చూసి తటస్థ ఓటర్లు, ఈ కూటమి వైపు మొగ్గుతారనేది మోడీ-షా వ్యూహం. అయితే, అన్ని రాష్ట్రాల్లో వర్క్ అవుట్ అయినట్టు, మన రాష్ట్రంలో ఈ స్ట్రాటజీ వర్క్ అవుట్ కాదని, విశ్లేషకులు అంటున్నారు. మన రాష్ట్రంలో మోడీ వ్యతిరేక పవనాలు బలంగా ఉన్నాయి. ఇక్కడ మోడీతో జత కలిస్తే, మట్టి కొట్టుకుపోయే వాతావరణం ఉంది. ఏది ఏమైనా, ప్రజలు ఇలాంటి జిమ్మిక్కలు నమ్మకుండా, వాస్తవం చూడాల్సిన అవసరం, జరుగుతున్నవై అవగాహన పెంచుకుని, అలోచించి నిర్నయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ప్రజలను, బీజేపీ నాయకులు ఎలా మభ్యపెడుతున్నారు అనేదానికి, ఇదే ఒక ఉదాహరణ. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ ఏర్పాటుపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ రాజ్యసభలో సానుకూల ప్రకటన చేశారని.. అందుకు కృతజ్ఞత తెలిపేందుకు, రాష్ట్ర బీజేపీ నేతలు, బీజేఎల్పీ నేత, విశాఖ ఉత్తర స్థానం ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు సారథ్యంలోని తొమ్మిదిమంది సభ్యుల బృందం, ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీ వెళ్లారు. విశాఖకు జోన్ ఇచ్చేసారు, ఈ ప్రకటన చేసిన రాజ్‌నాథ్‌సింగ్‌ కు కృతజ్ఞత చెప్తున్నాం అంటూ, పెద్ద పెద్ద బ్యానర్లు కట్టుకుని, వెళ్లారు. దశాబ్దాల కాలంగా ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకుంటున్న రైల్వేజోన్‌ ఏర్పాటుకు అంగీకారం తెలుపుతూ రాజ్‌నాథ్‌ రాజ్యసభలో ప్రకటన చేయడం ఎంతో ఆనందానికి గురి చేస్తుంది అని చెప్తున్నారు.. ఇది ఒక వైపు... మరి రెండో వైపు ఏంటో తెలుసా ?

bjp 29072018 2

కేంద్ర హోంశాఖ సుప్రీం కోర్ట్ కి ఇచ్చిన అఫిడవిట్‌ లో, రైల్వే జోన్‌ సాధ్యం కాదని తేల్చిచెప్పింది. ఓ పక్క రైల్వే జోన్‌ హామీ నెరవేరుస్తామని సాక్షాత్తూ కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ మొన్నటికిమొన్న పార్లమెంటు ఉభయసభల్లో ప్రకటించగా.. ఇప్పుడు దానికి విరుద్ధంగా ఆయన శాఖే సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ వేసింది. ఈ ఏడాది మార్చి 12న జరిగిన సమావేశంలో రైల్వే జోన్‌పై రైల్వే శాఖ ప్రతినిధి తమ వైఖరిని స్పష్టం చేశారని అందులో తెలిపింది. ‘ఈ అంశంపై సాధ్యాసాధ్యాల పరిశీలనకు సీనియర్‌ రైల్వే అధికారులతో కమిటీ ఏర్పాటు చేశాం. ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. అయినప్పటికీ పార్లమెంటు సభ్యులు, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర భాగస్వాముల అభిప్రాయాలు తీసుకున్నాకే తుది నిర్ణయం తీసుకుంటాం. కాగా దేశంలో ఇప్పటికే 16 రైల్వే జోన్లు ఉన్నాయి. మరో జోన్‌ ఏర్పాటుకు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. సమర్థ నిర్వహణ (ఆపరేషనల్లీ ఎఫిషియంట్‌) సాధ్యం కాకపోవడమే దీనికి కారణమని రైల్వే ప్రతినిధి చెప్పారు’ అని పేర్కొంది.

bjp 29072018 3

ఏపీ విభజన చట్టంపై నాలుగు రోజుల క్రితం రాజ్యసభలో జరిగిన స్వల్పకాలిక చర్చకు కేంద్ర హోం మంత్రి సమానమిస్తూ రైల్వే జోన్‌ ఇస్తామని చెప్పడం, ఇక్కడ బీజేపీ నేతలు ట్రైన్ వేసుకుని బయలుదేరటం, ఇవన్నీ రాష్ట్ర ప్రజలను పిచ్చోళ్లని చెయ్యటానికే. వీళ్ళు ఇలా ట్రైన్ ఎక్కారో లేదో, ఈ వార్తా బయటకు వచ్చింది. ఇది చూస్తుంటే, ఢిల్లీ నేతలు, పాపం రాష్ట్ర బీజేపీ నేతలను కూడా పిచ్చోళ్లని చేసి, ప్రజల్లో ఫూల్స్ ని చేస్తున్నారేమో అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. ఇలా రకరకాల మాటలతో ప్రజలను మభ్య పెడుతున్న బీజేపీ నాయకులకు, ప్రజలే సరైన బుద్ధి చెప్తారు.

రాష్ట్రాన్ని అన్ని విధాలుగా తొక్కేస్తుంది కేంద్రం.. చట్టంలో ఉన్న విభజన హామీల దగ్గర నుంచి, మనకు వచ్చే నిధులు దాకా అన్నిట్లో వివక్షే చూపిస్తుంది. తాజాగా మరో వివాదం కూడా రేగింది. మనం కష్టపడి చేసుకుంటున్న వాటి పై కూడా కక్ష సాధిస్తుంది కేంద్రం. ఆక్వా రంగంలో, ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ వన్ గా ఉన్న సంగతి తెలిసిందే. మనలను ఇబ్బంది పెట్టటానికి, మన నుంచి ఉత్పత్తి అయ్యే చేపలను నిషేదిస్తూ కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి. రాష్ట్రంలో పండే చేపల్లో ఫార్మాలిన్ ఉంటుంది అనే సాకు చూపించి, బిజెపి పాలిత రాష్ట్రాలు మన రాష్ట్రం నుండి కొనుగోళ్ళు ఆపేశాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలకు మనం ఎక్కువ ఎగుమతి చేసుకుంటాం.

cbn letter 29072018 2

ఈ పరిణామాల పై ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించారు. ఈశాన్య రాష్ట్రాల అయిన, అసోం, నాగాలాండ్‌, మేఘాలయ ముఖ్యమంత్రులకు ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. చేపల నిల్వ కోసం ఫార్మాలిన్ కెమికల్ కలుపుతున్నారంటూ కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఏపీలో చేపల నాణ్యతను పరిశీలించి ఫిష్‌ క్వాలిటీ టెస్ట్‌ సర్టిఫికెట్‌ ఇస్తామన్నారు. అసోంలో ఏపీ నుంచి వచ్చిన చేపలను అధికారుల సమక్షంలో పరీక్షించగా కేన్సర్ కారకమైన ఫార్మాలిన్ లేదని తేలిందని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. మీరు తీసుకున్న నిర్ణయం ఒకసారి పునఃసమీక్షించుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులను కోరారు.

cbn letter 29072018 3

చంద్రబాబు రాసిన లేఖపై స్పందించిన అసోం, మణిపూర్‌ ముఖ్యమంత్రులు.. చేపల దిగుమతిపై నిషేధం ఎత్తివేసినట్లు.. ఏపీ మత్స్యశాఖ అధికారులకు సమాచారమిచ్చాయి. చంద్రబాబు రంగంలోకి దిగటంతో, అన్నీ సర్దుకున్నాయి. ఈ విషయం పై, లేఖ రాసిన ముఖ్యమంత్రి, తరువాత స్టేజిలో ఢిల్లీ పెద్దలు, రాష్ట్రాన్ని ఎలా చేస్తున్నారో చూడండి అంటూ వివిధ రాష్ట్రాలకి లేఖలు రాయటానికి రెడీ అయ్యారు. ఇదే విషయం పై పార్లమెంట్ లో కూడా నిలదీయటానికి రెడీ అయ్యారు. దీంతో ఢిల్లీ పెద్దలు రంగలోకి దిగారు. ఇప్పటికీ చంద్రబాబు దెబ్బతో పరువు పోయిందని, ఇలాంటివి కూడా బయటకు వస్తే, ఉన్న కాస్త పరువు పోయి, మిగతా రాష్ట్రాలు కూడా ఎదురుతిరిగే అవకాశం ఉందని గ్రహించి, ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు.

నిత్యం అబద్ధాలతో, గోబెల్స్ ప్రచారం చేస్తున్న బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుతో పాటు, బీజేపీ నాయకులకు, ప్రతి సారి ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు గట్టి జర్క్ ఇస్తూ ఉంటారు. అబద్ధాలను, నిజాలు చెయ్యటంతో దిట్ట ఈ జీవీఎల్. అందుకే మొన్న రాజ్యసభలో, టీఎంసీ ఎంపీ ఒబ్రియాన్ మాట్లాడుతూ, ఢిల్లీలో జీవీఎల్ కు ఆధార్ కార్డు ఉంది, ఆయన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నారు అంటూ, జీవీఎల్ గాలి తెసేసారు. జీవీఎల్ నరసింహారావు నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే, ఒక్కటి కూడా నిజం ఉండదు. ఇలాంటి తియ్యని అబద్ధాలు చెప్తున్నాడు కాబట్టే, ఇతన్ని రాజ్యసభలో కూర్చోబెట్టాడు అమిత్ షా..

gvl 29072018 2

అయితే, ప్రతి రోజు కుటుంబరావు గారి చేతిల్లో దొరికిపోవటం ఎందుకు అనుకున్నాడో ఏమో, ఈ రోజు ABN ఛానల్ లో వచ్చిన మార్నింగ్ డిబేట్ లో, అక్కడి వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పారిపోయాడు జీవీఎల్. పదవ షెడ్యూల్ లోని సంస్థలను విడదీసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వటానికి మీకు ఇబ్బంది ఏంటి ? దీనికి ఒక్క పైసా ఖర్చు అవ్వదు ? దీని కోసం మీరు నాలుగేళ్ళు ఎందుకు తీసుకున్నారు అని అక్కడి వాళ్ళు అడిగితే, ఇది కరెక్ట్ కాదు, కాంగ్రెస్, తెలుగుదేశం కలిసిపోయి నా మీద అనవసరంగా దాడి చేస్తున్నాయి అని చెప్పి, అక్కడి వారి సమాధానాలు చెప్పలేక, జీవీఎల్ నరసింహరావు, మైక్ తీసేసి డిబేట్ లో నుంచి పారిపోయారు.

gvl 29072018 3

ఎందుకుంటే పదవ షెడ్యూల్‌ సంస్థల పై ద్రుష్టి పెట్టమని, రాష్ట్ర ప్రభుత్వం అనేకసార్లు కేంద్రాన్ని కోరింది. ఈ విషయం పై ఇప్పటికే సుప్రీం కోర్ట్ కూడా ఆదేశాలు ఇచ్చింది. షెడ్యూల్ 9,10 సంస్థల విభజన, ఉన్నతవిద్యామండలి విషయంలో సుప్రీం కోర్టు తీర్పు ఆధారంగా ఈ సంస్థల ఆస్తులను, అప్పులను పంచుకోవాలని ఏపీ వాదిస్తోంది. పదవ షెడ్యూల్‌లో పొందుపర్చిన సంస్థల వివరాలతో అధికారులు అనేకసార్లు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టినా, కేంద్రం పట్టించుకోలేదు. దీంతో ఇదే అంశం ఈ రోజుకి టీవీ చర్చల్లో రావటం, అక్కడ వారు అడిగిన ప్రశ్నకు సమాధానాలు చెప్పలేక, పారిపోయాడు జీవీయల్. వీడియో ఇక్కడ చూడచ్చు. https://youtu.be/xQJYTKGHKI0

Advertisements

Latest Articles

Most Read