చంద్రబాబుని యువతను ఉద్దేశిస్తూ ఎప్పుడూ అంటూ ఉంటారు, కష్టపడాలి పని చెయ్యాలి... ప్రపంచం మీ ముందు ఉంది, అవకాశాలు మీ ముందు ఉన్నాయి, వెతుక్కుంటే వెళ్ళండి, జయించండి, అని చెప్తూ ఉంటారు... కాని కొన్ని రాజకీయ కారణాలు చేత, చంద్రబాబు ఎన్నికల హామీలో, నిరుద్యోగ భృతి ప్రకటించారు... తీవ్ర ఆర్ధిక లోటు ఒక పక్క.... అయినా సరే, ఎలక్షన్ హామీలు ఎలా అయినా తీర్చాలి అనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు చంద్రబాబు... రైతు రుణమాఫీ లాంటి అతి పెద్ద కార్యక్రమం చేస్తూ, 1000 రూపాయలు పెన్షన్ లు ఇస్తూ, ఎలక్షన్ హామీలలోని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ, ముందుకు సాగుతున్న చంద్రబాబు, ఇప్పుడు ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు, నిరుద్యోగ బృతి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

niridyuga bruti 02082018 2

నిరుద్యోగ భృతికి ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 12.26 లక్షల మందికి రూ.1000 చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వాలని కేబినెట్ ఆమోదించింది. ఈ నిరుద్యోగ భృతికి 'ముఖ్యమంత్రి యువనేస్తం' పేరు ఖరారు చేసింది. మరి, వయసులో ఉన్న వారు కూడా, ముసలి వాళ్ళు లాగా, నెల నెలా ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకుంటే, ఇద్దరికీ తేడా ఏంటి ? కష్టపడి పని చేసుకోవాల్సిన వయసులో, ప్రభుత్వం మీద ఆధారాపడి జీవిస్తే ఎలా ? చంద్రబాబు లాంటి విజనరీ నాయకుడు, యువతను ఇలా సోమరిపోతులను చేస్తే ఎలా ? వీటన్నటికీ చంద్రబాబు తనదైన శైలిలో, ఈ పధకాన్ని రూపొందించారు... ముసలి వాళ్ళకు పెన్షన్ ఇస్తున్నట్టు కాకుండా, నిరుద్యుగులు ఈ పధకంతో తమ కాళ్ళ మీద తాము నిలబడేలా, విన్నూతంగా రూపొందించారు... దీని ప్రకారం... నిరుద్యోగులకు భృతి చెల్లిస్తూనే, ఆ సమయంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తారు...

niridyuga bruti 02082018 2

నిరుద్యోగ భృతి దరఖాస్తులను ఆన్‌లైన్‌లోనే తీసుకోనున్నారు. దీనికోసం ప్రత్యేక వెబ్‌పోర్టల్‌ ఏర్పాటు చేస్తారు. నిరుద్యోగ భృతి ప్రకటన ఇచ్చాక... అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు 15 నుంచి 21 రోజుల సమయం ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. దరఖాస్తు సమయంలోనే తనకు ఇష్టమైన రంగాన్ని అభ్యర్థి పేర్కొనాలి. స్వయం ఉపాధి, పరిశ్రమల్లో అప్రెంటిస్ షిప్‌, ఏపీ స్కిల్‌ డెవలప్ మెంట్‌ కార్పొరేషన్‌, వివిధ బీసీ సమాఖ్యలు... ఇలా పలు విభాగాలు ఇప్పటికే అందిస్తున్న శిక్షణ కార్యక్రమాల్లో నుంచి ఒక దాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఆ తర్వాత అర్హులైన వారి వివరాలు, వారు ఎంచుకున్న శిక్షణ రంగాలను జిల్లాల వారీగా... డీఆర్‌డీఏ పీడీలకు పంపిస్తారు.

niridyuga bruti 02082018 4

ఏ జిల్లాకు ఆ జిల్లాలో నెల రోజులపాటు శిక్షణ ఏర్పాటు చేస్తారు. శిక్షణ కోసం ఒక్కో అభ్యర్థికి రూ.12వేలు ఖర్చు చేయనున్నారు. దీన్ని ప్రభుత్వమే భరిస్తుంది. అదేవిధంగా వెబ్‌పోర్టల్‌లో నమోదైన యువత వివరాలను కంపెనీలకూ అందిస్తారు. ఆయా కంపెనీల్లో ఉద్యోగావకాశాలకు తగినవారుంటే ఎంపిక చేసుకునేలా సమన్వ యం చేస్తారు. మొత్తం నిరుద్యోగ భృతి కింద నమోదై న వారందరికీ శిక్షణ ఇస్తారు. వేతన ఉపాధిలో 1.5 లక్షల మంది, స్వయం ఉపాధిలో 2.7 లక్షల మంది, పరిశ్రమల్లో అప్రెంటిస్ లుగా 1.5 లక్షలు, కృషీ విజ్ఞాన కేంద్రాలు, పశుపోషణ, ప్రాథమిక రంగాల్లో ఐదు లక్షలమందికి శిక్షణ ఇవ్వాలని అనుకుంటున్నారు.

ఏపీలో కాపు రిజర్వేషన్ అంశం... ఎన్ని ఉద్రిక్తతల్ని రాజేసిందో తెలుసు. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ సర్కార్ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. దీనిపై కేంద్రం నుంచి ఇంకా నిర్ణయం రాలేదు. కానీ ఇంతలోనే కాపు రిజర్వేషన్ల అంశంపై కాక రేపారు విపక్ష నేత జగన్‌. కాపు రిజర్వేషన్ల డిమాండ్‌తో ఉద్యమానికి పురిటిగడ్డగా నిలిచింది తూర్పుగోదావరి జిల్లా. జగ్గంపేట నియోజకవర్గంలోని కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ల కోసం పోరాడారు. అలాంటి జిల్లాకు, అందునా జగ్గంపేటకొచ్చి మరీ కాపు రిజర్వేషన్లు సాధ్యం కాదని తేల్చేశారు వైసీపీ అధినేత. జగన్ కాపుల పై చేసిన ప్రకటనలు, పవన్ కళ్యాణ్ ఏది స్పష్టంగా చెప్పకోవటం, తెలుగుదేశం బిల్ పెట్టి కేంద్రానికి పంపించటం, వీటన్నిటి పై ముద్రగడ తన అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.

mudragada 02082018 2

తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం స్వగృహంలో బుధవారం తూర్పు, పశ్చిమ, విశాఖ జిల్లాల కాపు జేఏసీల సంఘం రహస్య సమావేశం నిర్వహించుకున్నారు. రాష్ట్ర పరిధిలో లేనివి మేము చేయలేమని చెబుతున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రత్యేకతను సంతరించుకుంది. అయితే ఈ సమావేశానికి మీడియాను అనుమతించలేదు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కాపులను బీసీల్లో చేర్చినట్టు ప్రకటించిన నేటికి కేంద్రం, సుప్రీంకోర్టు పరిధిలో ఉండిపోయిందంటూ ఎవరికివారు తమ యుక్తులు పదర్శిస్తూ కాలక్షేపం చేస్తున్నారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.

mudragada 02082018 3

కాపులకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు చిత్తశుద్ధితో ముందుకొచ్చేవారికే 2019 ఎన్నికల్లో తాము మద్దతిస్తామని ముద్రగడ తెలిపినట్టు సమాచారం.. ఎక్కడైనా మీడియా ప్రశ్నిస్తే బీసీల్లో చేర్చడానికి ఎవరు ముందు కొస్తారో వారికే మద్దతిస్తామని తెలపాలని సమావేశంలో సంఘ నాయకులకు సూచించినట్టు తెలిసింది. ఎవరుకు వారు పత్రికలతో ఇష్టాసారంగా ప్రకటనలు చేయవద్దని ఈ రహస్య భేటీలో తెలుపుకున్నట్టు సమాచారం. ఒక్కోచోట ఒక్కోలా మాట్లాడుతూ కాపు రిజర్వేషన్‌పై ఎవరికీ చిత్తశుద్ధిలేనట్టుగా తెలుస్తోంది.. స్పష్టమైన ప్రకటన చేసిన వారికే మద్దతు ఇవ్వాలంటూ చర్చించుకున్నట్టుగా తెలిసింది. ఈ భేటీలో ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణు,వాసురెడ్డి ఏసు దాసు, తుమ్మలపల్లి రమేష్‌, కలవకొలను తాతాజి, తోట రాజేష్‌, ఆలేటి ప్రకాష్‌, స్వామి పాల్గొన్నట్టు సమాచారం.

పార్లమెంట్‌ సాక్షిగా ప్రధాన నరేంద్ర మోడీ తెలుగుదేశం పార్టీ ఎంపీల ను బెదిరించారు. మాపై కేసులు పెడుతారా..? టీడీపీ ఎలాంటి కేసులకూ భయపడదు. మోడీనే కాదు కొండనైనా ఢీకొనే సత్తా మాకుం దని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. రాజకీయాల్లో నేనే సీనియర్‌ని. మోడీకంటే ముందే ముఖ్యమంత్రినయ్యాను. అవకాశం వచ్చి ఆయన ప్రధాన మంత్రి అయ్యారు. వారికేమో పెద్ద మెచ్యూరిటీ ఉన్నట్లు నన్ను విమర్శిస్తున్నారు. ప్రధాని వైకాపా మాయలో పడి హుందాతనాన్ని కోల్పోతున్నారని ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లా రామగిరి మండలం పేరూరు ప్రాజెక్టుకు కృష్ణా జలాలను తరలించే ఎత్తిపోతల పథకానికి ఆయన బుధవారం శంకుస్థాపన చేశారు. ప్రత్యేక విమా నంలో పుట్టపర్తి చేరుకున్న ఆయన హెలికాప్టర్‌లో పేరూరు కు విచ్చేశారు. పేరూరు ప్రాజెక్టు పరిశీలించిన అయన పైలాన్‌ ఆవిష్కరించడంతో పాటు అక్కడే నిర్మిం చిన అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం పేరూరు గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామదర్శిని కార్య క్రమంలో ప్రజలతో ముచ్చటించారు.

cbn 02082018 2

కేంద్రం సహకరించకపోయినా.. పోలవరం ప్రాజెక్టు పనులు కొన సాగిస్తున్నామన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆదాయం అంతా హైదరాబాద్‌కే వెళ్తోంది. అయినా.. ఎక్కడా వెనక డుగు వేయకుండా సంక్షేమాభివృద్ధి పథకాలను పటిష్టంగా అమలు చేస్తున్నామన్నారు. రైల్వే జోన్‌ ఇస్తామని కేంద్ర హోమ్‌ శాఖ మంత్రి రాజనాథ్‌ సింగ్‌ పార్లమెంట్‌లో చెబితే.. ఇవ్వలేమని కోర్టులో పిటిషన్‌ వేశారన్నారు. మోడీ అవినీతి ప్రక్షాళాన ఏమైందని.. ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ. 15 లక్షలు ఇంత వరకు ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. ఏటిఎంల్లో డబ్బు రాదని.. డబ్బు డ్రా చేసుకునేందుకు బ్యాంకులకు వెళ్తే ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొచ్చింది మోడీ కాదా అని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న తనను ప్రధాని మోడీ విమర్శించడం దురదృష్టకరమన్నారు. మోడీ కన్నా ముందే ముఖ్యమంత్రిని అయిన వాడిని.. అలాంటి నాకు మీరు రాజకీయాలు నేర్పిస్తారా అన్నారు. మీకు అవకాశం వచ్చి ప్రధానమంత్రి అయ్యారు. తమను కించపరిచే విధంగా మాట్లాడితే సహించే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు.

cbn 02082018 3

దగా పడ్డ రాష్ట్రం కోసం.. నా ప్రజల కోసమే ఎన్డిఎలో చేరానన్నారు. అయితే.. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే ఎలా వైదొలగకుండా ఉంటామన్నారు. యూ టర్న్‌ తీసుకున్నది తాను కాదని.. తెలుగు ప్రజలకు ఇచ్చిన మాట తప్పి బిజేపియే యూటర్న్‌ తీసుకుందన్నారు. తాను రైట్‌ టర్న్‌లో ఉన్నానన్నారు. వైసిపి ట్రాప్‌లో పడ్డానని మోడీ చెబుతున్నారు. వాస్తవానికి వైసిపి అవినీతి కుడితిలో పడింది బిజేపియేనన్నారు. అవినీతిని రూపుమాపుతామని చెప్పిన ప్రధాన మంత్రి ఇప్పుడు అవినీతి కేసులున్న వైసిపితో స్నేహం చేయడం అవకాశవాద రాజకీయం కాదా అని ప్రశ్నించారు. ఏ1, ఏ2లను తన కార్యాలయంలో ఉంచుకుని అవినీతిని ఏవిధంగా నిర్మూలిస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టిన వైసిపి బిజేపికి వూడిగం చేస్తోందని మండిపడ్డారు.

మాకు ఎదురు తిరిగాడు అనే కోపంతో, చంద్రబాబుని దించటానికి, మూడు నెలల క్రితం ఆపరేషన్ గరుడని, బీజేపీ మొదలి పెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో అనేక మందిని కూడగట్టి, చంద్రబాబుని అన్ని వైపుల నుంచి నిరాధార ఆరోపణలతో, నిందించే ప్రయత్నం చేసి, ప్రజల్లో ఆ అబద్ధాలు, నిజం అనే ప్రచారం చేపిస్తుంది బీజేపీ.. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ, తిరుమల గొడవ... ఇప్పటికే పవన్ కళ్యాణ్, జగన్, ముద్రగడ, ఐవైఆర్, ఉండవల్లి లాంటి ఉద్దండులను ఈ ఆపరేషన్ గరుడలోకి తీసుకువచ్చిన బీజేపీ, ఇప్పుడు తాజాగా తెలంగాణా నాయకుడు మోత్కుపల్లిని కూడా, ఆపరేషన్ గరుడలో ఆక్టివ్ రోల్ ఇస్తుంది.. ఇందులో భాగంగా ఆయన, మోత్కుపల్లి ఈ రోజు, పవన్ కళ్యాణ్ తో భేటీ కానున్నారు.

motkupalli 02082018

ఇప్పటికే మోత్కుపల్లిని ముద్రగడ, విజయసాయి రెడ్డి కలిసారు. ఎలా ఏమి చెయ్యాలో ప్లాన్ చెప్పారు. ఆ ప్లాన్ లో భాగంగా, మోత్కుపల్లి జనసేనలోకి వేల్తునట్టు తెలుస్తుంది. తనను చంద్రబాబు మోసం చేసాడని, గవర్నర్ పదవి నాకు ఇవ్వకుండా, ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాడని, అందుకే చంద్రబాబు అంతు చూస్తా అంటూ, గత రెండు నెలల నుంచి మోత్కుపల్లి రంకెలు వేస్తున్నారు. చంద్రబాబుని దించేలానే మీ ప్రయత్నంలో నేను భాగస్వామిని అవుతానని, ఇప్పటికే విజయసాయి రెడ్డికి, బీజేపీ పెద్దలకు అభయం ఇచ్చారు. ఆపరేషన్ గరుడలో నేను భాగస్వామి అవ్వటం, మీలాంటి గొప్ప నేతలు, ఐవైఆర్, పవన్, జగన్, సోము వీర్రాజు లాంటి ఉద్దండులతో కలిసి పని చెయ్యటం నాకు ఎంతో సంతోషంగా ఉందని, మీరు ఏమి చెప్తే, ఎలా చెప్తే అలా చెయ్యటానికి సిద్ధం అని మోత్కుపల్లి, ఇప్పటికే చెప్పారు.

motkupalli 02082018

ఇందులో భగంగానే, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌‌తో మోత్కుపల్లి నరసింహులు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు భేటీ కానున్నారు. ఈ భేటీపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. తెలంగాణ టీడీపీలో కీలక నేతగా ఉండి.. పార్టీ అధినేతపైనే విమర్శలు చేయడంతో బహిష్కరణకు గురైన మోత్కుపల్లి.. జనసేనలో చేరేందుకు పవన్ కల్యాణ్‌తో భేటీ కాబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ మోత్కుపల్లి జనసేనలో చేరితే ఆయనకు ఏ పదవి ఇస్తారనే అంశం కూడా చర్చకు వస్తోంది. తెలంగాణలో జనసేనకు కీలక నేతలు ఎవరూ లేరు కాబట్టి మోత్కుపల్లిని జనసేన తెలంగాణ అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. పూర్తి వివరాలు, ఈ భేటీ తరువాతే తెలిసే అవకాశం ఉంది.

Advertisements

Latest Articles

Most Read