విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు బయోపిక్ ‘ఎన్టీఆర్‌’ను భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. బాలకృష్ణ ఇందులో ఎన్టీఆర్‌గా, విద్యాబాలన్‌ బసవతారకంగా నటిస్తున్నారు. క్రిష్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందుకురి నిర్మాతలు. ఎం.ఎం. కీరవాణి బాణీలు అందిస్తున్నారు. తెలుగుతోపాటు హిందీలోనూ సినిమాను రూపొందిస్తున్నారు. కాగా, ఈ సినిమా సెట్‌లో రానా అడుగుపెట్టారు. దీంతో నిన్న అమరావతి వచ్చి, ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన నివాసంలో కలిసారు. కథానాయకుడు బాలకృష్ణ, దర్శకుడు క్రిష్‌, నటుడు దగ్గుబాటి రానా ఆయనను కలిసిన వారిలో ఉన్నారు. చిత్ర షూటింగ్‌లో భాగంగా ఎన్టీఆర్‌, బసవతారకం సొంత ఊర్లయిన నిమ్మకూరు, కొమరవోలుల్లో లోకేషన్లను యూనిట్‌ శనివారం పరిశీలించనుంది. ఈ నేపథ్యంలో సీఎంను చిత్రబృందం కలిసింది.

rana 04082018 2

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధికి సానుకూలమైన వాతావరణం ఉందని, దీనికి ప్రభుత్వం తరఫు నుంచి ప్రోత్సాహం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో సినీపరిశ్రమ అభివృద్ధిపై చర్చించారు. అందమైన సహజ వనరులు, ఆకర్షణీయ సుందర దృశ్యాలతో కూడిన అనేక ప్రదేశాలు రాష్ట్రంలో ఉన్నాయని, ఇవే సినీ పరిశ్రమకు చాలా ఉపకరిస్తాయని ముఖ్యమంత్రి చెప్పారు. కొత్త రాజధాని అమరావతితో పాటు అనేక ప్రదేశాలు ఎంతో ఆకట్టుకుంటాయని ముఖ్యమంత్రితో వీరు అన్నారు. అందుకు తగ్గట్టుగా సినీ పరిశ్రమ అభివృద్ధి చెంది నిలదొక్కుకోవడానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయని దర్శకులు క్రిష్, హీరో రానా అభిప్రాయపడ్డారు.

rana 04082018 3

ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల ఉపాధి అవకాశాలు కూడా చాలా వస్తాయని ముఖ్యమంత్రి వివరించారు. ఉన్నత ప్రమాణాలతో ఫిల్మ్ అండ్ టీవీ ఇనిస్టిట్యూట్ నెలకొల్పడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా ఉన్న అనేక పర్యాటక ప్రాంతాలను చూస్తే సినీ టూరిజం అనే కొత్త తరహా ఆకర్షణను కూడా ప్రముఖంగా ప్రోత్సహించవచ్చని ముఖ్యమంత్రి చెప్పారు. ఇందుకు తగిన విధానాన్ని రూపొందిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. దీనిపై సినీ ప్రముఖులు స్పందిస్తూ ఇక్కడ పరిశ్రమ అభివృద్ధి చేయడానికి తాము కూడా తగిన సహకారం అందిస్తామని చెప్పారు.

మానవత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తత్వం...ప్రజలకు ఏ కష్టమొచ్చినా, వాళ్ళ బాధను తన బాధగా భావించి తన దృష్టికి వచ్చినంతనే క్షణాల్లో తీరుస్తూ సాంత్వన కలిగించడానికి గ్రామ దర్శిని, గ్రామ వికాసం ఎంతో ఉపయుక్తం అవుతున్నయనడానికి ఇవే ఉదాహరణలు...పసి బిడ్డల నుంచి పండు టాకులలాంటి వృద్ధులకు చేరువగా ఆప్యాయంగా అక్కున చేర్చుకుంటూ...మంచి పంచుతూ పెద్దకొడుకుగా ఆదుకుంటూ ఆత్మీయ ఆశీర్వాదం పొందుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన శాంతికి, సహనానికి, సానుకూలతకు, ఆదర్శానికి వేదికగా మారింది.

cm relief 03082018 2

గ్రామదర్శినిలో ముఖ్యమంత్రి చంద్రబాబు సహాయం ప్రకటిస్తే సీఎంఆర్ ఎఫ్ విభాగ ముఖ్యమంత్రి సహాయ కార్యదర్శి రామసుబ్బయ్య రియల్ టైమ్ గవర్నెన్స్ సాయంతో సాయంత్రానికే ఆ సహాయం చెక్కును రోగికి పంపించడం విశేషం. గ్రామదర్శిని లో భాగంగా కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలం తాతకుంట్లలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రిని గౌరంపాలేనికి చెందిన కోలేటి జ్యోతి అనే మహిళ కలసి తన అనారోగ్య సమస్యను విన్నవించింది. పెద్దమనసుతో స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పటికప్పుడే రూ.50, 000 సహాయం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

cm relief 03082018 3

ముఖ్యమంత్రి ఆదేశాలతో రియల్ టైమ్ గవర్నెన్స్ స్ఫూర్తితో ముఖ్యమంత్రి సహాయ కార్యదర్శి రామసుబ్బయ్య నేతృత్వంలో సీఎంఆర్ ఎఫ్ కార్యాలయం తక్షణం ఆయన ఆదేశాలను అమలు చేసింది. ఆస్పత్రి ఖర్చులకోసం ఇచ్న రూ.50 వేలకు చెక్ (నెం: 080025)‌ను జారీ చేసింది. ‘మీకు కష్టం వచ్చినప్పుడు మీ కుటుంబాన్ని పెద్దకొడుకుగా ఆదుకుంటానని మాటిచ్చాను. అన్నమాట నిలుపుకొంటూ ఆస్పత్రి ఖర్చుల కోసం కొలేటి జ్య్తోతికి రూ.50 వేల చెక్ ఇస్తున్నాను’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు రోగి కోలేటి జ్యోతికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

అమరావతి రాజధాని మాస్టర్‌ ప్లాన్‌కు అనుగుణంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. మూడేళ్ల క్రితం సామాజిక మాధ్యమాల్లో పెట్టిన మాస్టర్‌ప్లాన్‌ నమూనాలు చూసి ప్రతిపక్షాలు విమర్శలు చేసిన విషయం విదితమే. అయితే ఆ విమర్శలకు సమాధానంగా ఇప్పటివరకు జరిగిన పనులకు సంబంధించిన శాటిలైట్‌ చిత్రాలను సీఆర్‌డీఏ ఇంటర్నెట్‌లో పెట్టింది. అచ్చు మాస్టర్‌ ప్లాన్‌లో ఉన్న విధంగానే రోడ్లు, భవన నిర్మాణాలు జరుగుతుండడం అందరినీ ఆకర్షిస్తోంది. ప్లాన్‌ కాపీతోపాటు గూగుల్‌ ఎర్త్‌ శాటిలైట్‌ ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్టుచేస్తున్న నెటిజన్లు సీఆర్‌డీఏ వాస్తవ చిత్రాలను ఆవిష్కరిస్తోందంటూ కామెంట్‌లు పెడుతున్నారు.

amaravati 03082018 2

రాజధానిలో రవాణా వ్యవస్థకు ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబునాయుడు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. రోడ్లు ఎలాంటి వంపులు లేకుండా గీత గీసినట్లు ఉండాలని స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగానే సింగపూర్‌ సంస్థ మాస్టర్‌ప్లాన్‌లో రోడ్ల నిర్మాణానికి సంబంధించిన ప్లాన్‌ను రూపొందించింది. ఆ ప్రకారమే రాజధానిలో రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్లాన్‌లో చూపించిన విధంగానే లేఅవుట్‌లు, గ్రీన్‌ప్యాచ్‌ల నిర్మాణాలను క్షేత్రస్థాయిలో చేపడుతున్నారు. రోడ్ల విషయంలో ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకపోవడం వల్లే అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతోందని అధికారులు చెబుతున్నారు.

 

amaravati 03082018 3

ఇది సీఎం పిలుపునకు స్పందించి రూ. వేల కోట్ల విలువ చేసే భూములు ఇచ్చిన రైతుల నమ్మకాన్ని, తమ నిబద్ధతని చాటిచెబుతోందని, ఈ నమ్మకాన్ని తాము నిలబెట్టుకుం టామని టీడీపీ శ్రేణలు చెబు తున్నాయి. మరోవైపు హైదరా బాద్‌లో అప్పటి సీఎం వైఎస్‌ హయాంలో అవుటర్‌ రింగు రోడ్డు విషయంలో మలుపులు తిప్పడానికి సంబంధించి వచ్చిన అవినీతి ఆరోపణలను టీడీపీ నాయకులు ఈ సందర్భంగా గుర్తుచేశారు. అభివృద్ధి విషయంలో తమ ప్రభుత్వానికి, ఇతర ప్రభుత్వాలకు మధ్య వ్యత్యాసం ఇదేనని స్పష్టం చేశారు.

అమరావతిని ఆపటానికి, నష్టం చెయ్యటానికి, హైదరాబాద్ బ్యాచ్ చెయ్యని ప్రయత్నాలు లేవు. ఒక పక్క జగన్ ఎలాంటి పనులు చేస్తున్నాడో చూసాం, ఇప్పుడు జగన్ కు తోడుగా పవన్, వీళ్ళిద్దరీకి తోడుగా బీజేపీ తయారయ్యింది. 5 శాతం మంది కోసం, 95 శాతం మందిని ఇబ్బంది పెడుతున్నారు. అమరావతికి రాచమార్గంగా అభివర్ణితమవుతున్న సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు పవన్ కళ్యాణ్ ప్రకటనతో ఆటంకం ఏర్పడింది. రాజధానిని చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారికి అనుసంధానించడమే కాకుండా అమరావతిలో పడమర కొసన ఉన్న దొండపాడు వరకు సాగే ఈ రహదారికి ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. కనకదుర్గమ్మ వారధి నుంచి దొండపాడు వరకు మొత్తం సుమారు 21.2 కిలోమీటర్ల పొడవున నిర్మించదలచిన ఈ రహదారికి ఇరువైపులా లెక్కకు మిక్కిలిగా ప్రాజెక్టులు రానున్నాయి.

seed access 03082018 2

దీంతో రాజధానిలో గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌కు సమీపాన ఉన్నంత డిమాండ్‌ సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు పక్కన ఉన్న ప్లాట్లకు ఉంది. అమరావతిలో స్థలాలను ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్న ప్రముఖ సంస్థల్లో చాలావాటి ప్రథమ ఛాయిస్‌ సీడ్‌ యాక్సెస్‌కు చేరువలోనే అంటే దీనికి ఉన్న ప్రాధాన్యం అర్థమవుతుంది. ఇంతవరకూ బాగానే ఉన్నప్పటికీ.. ఈ అత్యంత కీలక రహదారి ఎప్పటికి పూర్తవుతుందో తెలియని సందిగ్ధత నెలకొంది. 2 ప్యాకేజీలుగా విభజించిన ఈ రోడ్డులోని దాదాపు 18 కిలోమీటర్ల పొడవైన మొదటి ప్యాకేజీ (దొండపాడు- వెంకటపాలెం మధ్య) పనులు చురుగ్గా సాగుతూ, మరికొన్ని నెలల్లోనే పూర్తవనున్నాయి. కానీ 2వ ప్యాకేజీ అయిన సుమారు 3.2 కి.మీ. పొడవుండే భాగంలో నిర్మాణం మాత్రం ఇప్పటికీ ప్రారంభమే కాలేదు. ఎప్పటికి అవుతుందో తెలియదు.

seed access 03082018 3

వెంకటపాలేనికి చెందిన కొద్దిమందితో పాటు పెనుమాక, ఉండవల్లి రైతుల్లో పలువురు ఈ భాగానికి అవసరమైన భూములను సమీకరణ ప్రాతిపదికన ఇచ్చేందుకు ససేమిరా అంటుండడమే దీనికి కారణం. అధికారులు ఎంతగా నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నా, ఎప్పటికప్పుడు ఎల్పీఎస్‌ కింద వారి భూములను తీసుకునే గడువును పొడిగించుకుంటూ పోతున్నా, ఇవేవీ ఫలించేలా లేవన్న అభిప్రాయంతో భూసేకరణకు నోటీసులు జారీచేసినా పరిస్థితిలో అంతగా మార్పు రావడం లేదు. ఈ నేపథ్యంలో ఇటీవల రాజధానికి వచ్చిన జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ రైతులను భయపెట్టి భూములను తీసుకుంటే సహించేది లేదని రాష్ట్రప్రభుత్వాన్ని హెచ్చరించారు. దీంతో ఇది రాజకీయ టర్న్ తీసుకుంది. అమరావతికి ఇప్పటి వరకు అంతా ప్రశాంతంగా జరిగిపోయిన టైంలో, పవన్ చేస్తున్న ప్రకటనలతో, ప్రభుత్వం కూడా అలోచించి అడుగులు వేస్తుంది. దీంతో ఈ పరిస్థితిలో మార్పు తెచ్చి, సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుకు అవసరమైన భూములను సేకరించేందుకు అధికార యంత్రాంగం ఏవిధంగా ముందుకు వెళ్తుందోనన్న దానిపై చర్చలు సాగుతున్నాయి.

Advertisements

Latest Articles

Most Read