గత వారం రోజులుగా, పార్లమెంటులో బడ్జెట్ సమావేశాల సందర్భంగా టీడీపీ ఎంపీలను దారిలోకి తెచ్చుకోవటానికి, చంద్రబాబు పై బీజేపీ మూడంచెల వ్యూహాన్ని అమలు చేసింది... తొలుత దబాయింపు, బెరింపులకు దిగింది... చంద్రబాబు ఏ మాత్రం తగ్గకపోగా, మరింత దూకుడుగా వెళ్ళటంతో ఆ తర్వాత సంప్రదింపులకు దిగి, చివరకు సముదాయింపులకు దిగింది... 4 రోజుల క్రితం సభలో మొదటిసారి ప్రకటన చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ పార్లమెంటు సెంట్రల్‌ హాల్లో కొందరు పాత్రికేయులతో చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

cbn 100220188 2

‘‘ఆయన ఏపీ రాజధానికి 3 లక్షల కోట్లు, 5 లక్షల కోట్లు కావాలంటారు! అంతడబ్బు ఎక్కడుంది? ఎవరిస్తారు? ఆంధ్రప్రదేశ్‌కు చాలా నిధులిచ్చాం. ఏ పద్దు కింద ఎన్ని ఇచ్చామో లెక్కలు పెడతాం. తర్వాత వాళ్లే ఇబ్బంది పడతారు’’ అంటూ పరోక్షంగా హెచ్చరించారు. రెవెన్యూ లోటును కూడా ఏపీ ఎక్కువ చేసి చూపిస్తోందని, వాళ్లు అడిగినంత ఇవ్వడం సాధ్యం కాదని తేల్చేశారు. ఈ బెదిరింపుల సంగతి తెలిశాక... చంద్రబాబు ఎంపీలతో ఆందోళన మరింత తీవ్రం చేయించారు. దీంతో బీజేపీ నేతలు ‘సంప్రదింపుల’ పర్వం మొదలుపెట్టారు. ఉభయ సభల్లో ప్రధాని ప్రసంగానికి అడ్డుపడకుండా... కేంద్ర హోం మంత్రి రాజనాథ్‌, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా స్వయంగా చంద్రబాబుకు ఫోన్‌ చేసి మాట్లాడారు.

cbn 100220188 3

సంవత్సరం నుంచి ఒక ముఖ్యమంత్రికి కనీసం అపాయింట్మెంట్ ఇవ్వని ఢిల్లీ పెద్దలు, వరుస పెట్టి చంద్రబాబుని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేసారు.. మిత్రపక్షంగా ఉంటూ, ప్రధాని ప్రసంగం అడ్డుకుంటే, మా పరువు పోతుంది అని బతిమాలారు... ఢిల్లీ నుంచి బీజేపీ ప్రముఖులు ఎవరు ఫోన్‌చేసినా... ‘ఆందోళనలు విరమిస్తాం. హామీల అమలు బాధ్యత మీరు తీసుకుంటారా’ అని సీఎం సూటిగా ప్రశ్నించారు. వారు సమాధానం చెప్పలేకపోయారు. విభజన హామీల అమలు బాధ్యత చూస్తున్న రాజ్‌నాథ్‌ గురువారం 3 గంటలపాటు తన కార్యాలయంలో భేటీ నిర్వహించారు. వివిధ శాఖల అధికారులను పిలిపించి ఒకో హామీ ఏ దశలో ఉందో చర్చించారు.. నిన్న ఏకంగా ఆర్ధిక మంత్రి జైట్లీ రంగంలోకి దిగారు... విభజన హామీల్లో అన్ని విషయాల పై రోడ్ మ్యాప్ రెడీ చేస్తున్నారు... సోమవారం నుంచి, ఒక్కో ప్రకటన రానున్నట్టు ముఖ్యమంత్రికి సమాచారం అందించారు...

ఆంధ్రప్రదేశ్ విభజన హామీలపై ఏపి ప్రభుత్వం కేంద్రం పై ఒత్తిడి కొనసాగిస్తోంది... కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీతో నిన్న రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగిన భేటి, ఇవాళ ఉదయం నుంచి కూడా కొనసాగుతుంది... కేంద్రమంత్రి సుజనా చౌదరి, ఎంపీ సీఎం రమేష్ భేటీ అయ్యారు.... రెవెన్యూ లోటు, రైల్వే జోన్, ఈఏపీ ప్రాజెక్టులపై చర్చించారు... ఏపీకి నిధుల విడుదలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.... ఈ నేపధ్యంలో ముందుగా, విభజన చట్టంలో అతి ముఖ్యమైన రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం దిగివచ్చింది...

railway zone 10022018 2

వారం, పది రోజుల్లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది... ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లను విశాఖ రైల్వేసెక్షన్‌తో కలిపి రైల్వే జోన్ ఏర్పాటు చేయడానికి కేంద్రం మొగ్గు చూపినట్టు సమాచారం... అయితే వాల్తేరు డివిజన్‌లోని కొంత భాగాన్ని, ఒరిస్సాకి ఇస్తేనే, సహకరిస్తామని ఒరిస్సా ప్రజా ప్రతినిధులు అంటునట్టు సమాచారం... అందుకే, విశాఖ ఒక్కటే కాకుండా, గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లను కూడా వైజాగ్ రైల్వే జోన్ పరిధిలోకి తెస్తున్నట్టు సమాచారం...

railway zone 10022018 3

ఈ ప్రతిపాదనతో, ఒడిశాకు చెందిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో సుజనా చర్చలు జరిపారు. ఈ చర్చలు సఫలీకృతమైనట్లు, దాంతో వెంటనే రైల్వేజోన్ ప్రకటనకు రంగం సిద్ధం చేయాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు అమిత్‌షా చెప్పినట్టు సమాచారం. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకుని, వచ్చే వారం ప్రకటన చేసే అవకాసం ఉందని సమాచారం.. ఆంధ్రప్రదేశ్‌లో 3,704 కిలోమీటర్ల మేర రైలు మార్గాలు ఉన్నాయి. కానీ ఇక్కడ రైల్వే జోన్‌ లేదు... దీంతో తమ రాష్ట్రానికి ఎందుకు జోన్‌ ఏర్పాటు చేయట్లేదంటూ ఏపీ నేతలు ఆందోళన చేస్తున్నారు... ప్రస్తుతం ఈ డిమాండ్ల విషయంలోనూ పార్లమెంట్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి....

వారం రోజులు నుంచి, కేంద్రం మన రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం పై, రాష్ట్రంలో ఆందోళనలు జరుగుతున్నాయి... ఉభయ సభల్లో ఎంపీలు ఆందోళన చేసారు... వార్తలు అన్నీ, వీటి చుట్టూతా తిరిగాయి... ఇలాంటి సమయంలో, పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది...పోలవరం ప్రాజెక్టు పనుల్లో నవయుగ భాగస్వామి అయింది. శుక్రవారం నవయుగ కంపెనీ డైరెక్టర్‌ వై.రమేశ్‌ భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. స్పిల్‌వే ప్రాంతంలో పోలవరం ప్రాజెక్ట్‌ ఎస్‌ఈ వీఎస్‌ రమేశ్‌బాబుతో కలిసి పూజలు నిర్వహించారు.

polavaram 10022018

ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడైన పోలవరాన్ని 2019 నాటికి పూర్తి చేయాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పం. అందులో భాగంగా పోలవరం పనుల్లో జాప్యాన్ని నివారించేందుకు నవయుగకు పనులను అప్పగించారు. ఇప్పటి వరకు చేస్తున్న ట్రాన్స్‌స్ర్టాయ్‌ యంత్రాలతోపాటు నవయుగ యంత్రాలు, అదనపు సిబ్బంది, కార్మికులు పోలవరం పనుల్లో నిమగ్నం కానున్నారు. పోలవరం ప్రాజెక్టులో పని చేస్తున్న కూలీలు తమకు జీతాలు ఇవ్వలేదంటూ రెండో రోజు ఆందోళన వ్యక్తం చేశారు.

polavaram 10022018

రూ. 1400 కోట్ల వ్యయంతో స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ పనులను నవయుగ చేపట్టనుంది... ఈ సందర్భంగా నవయుగ సంస్థ ఎండీ, చింతా శ్రీధర్‌ మాట్లాడుతూ, ‘‘పోలవరం కాంక్రీటు పనుల కోసం ఇరవై వేల మంది కార్మికులను రంగంలోకి దించుతాం. రాత్రీ పగలు పనులు జరుగుతాయి. వచ్చే ఏడాది మార్చి నెల అంటే దాదాపు ఏడాది కాలం ఉంది. అప్పటి లోగా దీన్ని పూర్తి చేస్తాం. గడువులోగా పూర్తి చేస్తే ఇది ప్రపంచ రికార్డు అవుతుంది’’అని కాన్ఫిడెంట్ గా చెప్పారు... పోలవరం ప్రాజెక్టు కాంక్రీటు పనులు పరుగులు తీయడమే లక్ష్యంగా అదనంగా ఆర్థిక భారం పడకుండా, రాష్ట్ర ప్రభుత్వ ఆందోళనను దూరం చేసేలా చంద్రబాబు రంగంలోకి దిగి, పోలవరం విషయాన్ని ఒక కొలిక్కి తెచ్చారు...

కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ కు జరిగిన నిర్లక్ష్యం నేపధ్యంలో, మిత్రపక్షం అయిన టీడీపీ, కేంద్రం పై గత వారం రోజులుగా నిరసన తెలుపుతూ, చట్ట సభల్లో, బయట కూడా ఆందోళన చేస్తూ, కేంద్రం పై ఒత్తిడికి ప్రయత్నం చేసింది... మరో పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రజలందరూ కలిసి ఒక రోజు బంద్ కూడా చేసి, కేంద్రం పై తమ నిరసన తెలియచేసారు... మరో పక్క, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంతో వివిధ మార్గాల్లో ఒత్తిడి తెస్తూ, నిరంతర ప్రక్రియ కొనసాగిస్తుంది... ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వివిధ ప్రాజెక్ట్ ల కింద గత రెండు రోజుల్లో, రూ.1,269 కోట్లు విడుదల చేసింది...

money 10022018 2

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం గ్రాంట్స్ కింద పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తంలో రూ.417.44 కోట్లు విడుదలకు కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ విడుదల చేసేంది... ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ద్వారా రూ .4,329 కోట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ .7,200 కోట్లు ఖర్చు చేసింది... రూ .3,217.63 కోట్లు ఖర్చు చేసాం అని, ఇవి కూడా ఇవ్వాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే, కేంద్రానికి లెక్కలు పంపించింది... ఈ నిధులు కూడా వచ్చే వారం విడుదల అయ్యే అవకాసం ఉంది...

money 10022018 3

అలాగే 14 వ ఆర్థిక కమిషన్ సిఫారసు కింద, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు కోసం అని రూ.369.16 కోట్లు విడుదల చేసింది... ఆర్ధిక లోటు పై, గత రెండు రోజులుగా రాష్ట్ర అధికారులు, కేంద్రం మధ్య చర్చలు జరుగుతున్నాయి... ఇవి ఒక కొలిక్కి వస్తే కాని, ఆర్ధిక లోటు కింద, కేంద్రం ఎంత ఇస్తుంది అనేది స్పష్టం కాదు... మరో పక్క, స్టేట్ అర్బన్ లోకల్ బాడీస్ బేసిక్ గ్రాంట్ కోసమని రూ.253.74 కోట్లు విడుదల చేసింది... అనంగవాడీ సర్వీసెస్ పథకం కింద రూ .196.92 కోట్లు, ఎన్ఆర్ఈజీఏ పథకం కింద రూ.31.76 కోట్లు కేంద్రం విడుదల చేసింది. మొత్తంగా, ఈ రెండు రోజుల్లో రూ.1,269 కోట్లు విడుదల చేసింది...

Advertisements

Latest Articles

Most Read