ఎప్పుడు సౌమ్యంగా, ఆచి తూచి మాట్లాడే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రిపబ్లిక్ టీవీ చెప్పిన సర్వే వివరాల పై అసహనం వ్యక్తం చేసారు... రిపబ్లిక్ టీవీ సీ-ఓటర్ సర్వే ఓ బూటకమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ‘‘అడిగినవన్నీ చేశాం. అడగనివి కూడా చేశాం. తీవ్ర ఆర్థిక సమస్యల్లో ఉండి కూడా అన్ని రంగాల్లో వృద్ధి చూపించాం. ఎన్నో వినూత్న సంక్షేమ పథకాలు తెచ్చాం. అన్ని చేసినప్పుడు ప్రజల్లో వ్యతిరేకత ఎందుకు ఉంటుంది? అసంతృప్తి ఎందుకు ఉంటుంది?’’ అని ప్రశ్నించారు

cbn 21012018 2

బీజేపీ పార్టీకి అసోసియేట్ గా ఉన్న రిపబ్లిక్ టీవీ, దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ రాష్ట్రంలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో, సర్వే అంటూ ప్రకటించింది... మన రాష్ట్రానికి ఉన్న 25 ఎంపీ సీట్లలో, జగన్ పార్టీకి 13 సీట్లు వస్తాయి అని చెప్పాడు... అంటే సగానికి పైగా పార్లమెంట్‌ సీట్లు గెలుచుకుంటే...అసెంబ్లీ స్థానాల్లో ఖచ్చితంగా మెజార్టీ మార్కు దాటుతుందని అర్నబ్ అంచనా వేసి అలా అయినా కొన్ని రోజులు జగన్ ను సియం భ్రమలో ఉంచింది...

cbn 21012018 3

2014 లో జగన్ కు వచ్చిన ఎంపీ సీట్లు 8... ఇప్పుడున్న పరిస్థితుల్లో కడప పార్లిమెంట్ తప్ప, ఎక్కడా కన్ఫర్మ్ సీట్ లేదు... అటు తిప్పి, ఇటు తిప్పి చూసినా, మహా అయితే 3 నుంచి 5 సీట్లు వస్తాయి అనేది ఇక్కడ ఉన్న వారి అంచనా... మరో పక్క చంద్రబాబు అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి రెండిటిలో సమానంగా దూసుకుపోతున్నారు... అలాంటిది ముఖ్యమంత్రి చంద్రబాబును కాదని, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్‌ కావాలని ఎవరైనా కోరుకుంటారా ? అసలు ఈ సర్వే కామెడీ ఇది... 543 పార్లమెంట్ నియోజకవర్గాల్లో అర్నబ్ రిపబ్లిక్, సీ వోటర్ సర్వే చేసింది 60,000 మందిని... అంటే సగటున ఒక నియోజకవర్గానికి కేవలం 110 మంది... 25 నియోజకవర్గాలకు గానూ ఆంధ్ర ప్రదేశ్ ఓటర్లు 3.68 కోట్లు... అంటే సగటున ఒక నియోజక వర్గానికి 14 లక్షల 72 వేల మంది ఓటర్లు... 14,72,000 ఓటర్లకు గానూ 110 మందిని సర్వే చెయ్యడం అంటే సర్వే శాంపిల్ సైజు 0.0074%.. ఇదో సర్వే.. మళ్ళీ దీనికో పెద్ద బిల్డ్ అప్...

2017 మే నెలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటన చేసారు... ఆ సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ప్రెసిడెంట్, సిఓఓ జెన్నిఫర్ జాన్సన్ ను కలిసి, ఫిన్‌టెక్, డేటా సెంటర్స్, ప్రాసెసింగ్ రంగాల్లో విశాఖ దూసుకెల్తుంది అని, అక్కడ కంపనీ పెట్టాలని చంద్రబాబు కోరారు.. అప్పట్లో ఈ వార్త వచ్చినప్పుడు, కొంత మంది హేళన చేసారు... ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లాంటి కంపెనీ మన రాష్ట్రానికి ఏమి చూసి వస్తుంది ? చంద్రబాబు మధ్య పెడుతున్నారు అని విషం చిమ్మారు....

franklin 20012018 2

అప్పుడు మొదలైన చర్చలు, ఆంధ్రప్రదేశ్ ఐటి మంత్రి నారా లోకేష్ డిసెంబర్ నెలలో, చేసిన అమెరికా పర్యటనలో, సాన్ ఫ్రాన్సిస్కో లోని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కేంద్ర కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆలోక్ సేతి,సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జొయ్ బోయిరియో ని కలిసి డీల్ క్లోజ్ చేసారు... ఇవాళ జరిగిన క్యాబినెట్ లో కూడా దీనికి ఆమోదం లభించింది... ఐఐటి పాలసీ లో భాగంగా వర్తించే ప్రత్యేక రాయితీలను ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థ కు కల్పించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది...

franklin 20012018 3

పరిశోధన మరియు అభివృద్ధి, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డెవలప్మెంట్ సెంటర్, కమర్షియల్ స్పేస్, ఉద్యోగస్తులకు ఇల్లు అన్ని కలిపి ఒకే చోట ఉండేందుకు అవకాశం కల్పిస్తూ ఐఐటి పాలసీ ఉంది... విశాఖపట్నం లో ఏర్పాటు అయ్యే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్లో 5 వేల మందికి మొదటి దశ లో ఉద్యోగాలు లభించనున్నాయి... ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ 170 దేశాల్లో తన కార్యకలాపాలను విస్తరించింది. 1947లో స్థాపించిన ఈ కంపెనీ ఇప్పుడు 74000 కోట్ల డాలర్ల ఆస్తులు కలిగి ఉంది. 1996లో 650 మందికిపైగా ఇన్వె్‌స్టమెంట్‌ ప్రొఫెషనల్స్‌తో టెంపుల్టన్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌గా దేశంలో తన కార్యకలాపాలను చేపట్టింది...

ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయ సంఘం ఆధ్వర్యంలో బెంజిసర్కిల్‌ వద్ద గల సర్వోత్తమ భవన్‌లో ఈ నెల 20, 21 తేదీల్లో ఉచితంగా పుస్తకాలను అందచేస్తున్నారు... పుస్తకాలను విజ్ఞాన వారధులని, అలాంటి పుస్తకాలు కేవలం అలమరకే పరిమితం కాకుండా నలుగురికి జ్ఞానాన్ని అందించేందుకు ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంస్థ ఏర్పాట్ల చేస్తోంది. బెంజిసర్కిల్ సమీపంలోని సర్వోత్తమ గ్రంథాలయం ఆధ్వర్యంలో పుస్తకాల పంపిణీ పండుగ జరుగుతుంది. ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా ఈ నెల 20, 21వ తేదీల్లో పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేయడానికి నిర్వాహకులు ఏర్పాట్ల చేశారు.

free books 20012018 2

103 ఏళ్లుగా గ్రంధాలయ సేవలందిస్తూ, స్వాతంత్యోద్యమానికి బాసటగా నిలిచి ప్రజలను చైతన్య పరచడానికి దోహద పడిన ఈ సంస్థ అందరినీ ఆకర్షిస్తుంది.. ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా అనూహ్య స్పందన లభిస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పలువురు ఔత్సాహికులు తమ వద్ద ప్రస్తకాలు ఉన్నాయంటూ.. మాకు ఫలానా పుస్తకం కావాలని కోరుతున్నారు. ఈ ప్రయత్నాన్ని చాలా మంది ప్రశంసిస్తూ వారి వద్ద ఉన్న పుస్తకాలను అక్కడ అందిస్తున్నారు. అలా సేకరించిన పుస్తకాలే ఇప్పుడు ఇలా ఉచితంగా పంచుతున్నారు...

free books 20012018 3

తత్వశాస్త్రం, మతాలు, ఆధ్యాత్మికత, సాంఘిక, భాష, ఇంజినీరింగ్ వైద్యం, విజ్ఞాన శాస్త్రాలు, కళలు, తెలుగు, ఆంగ్ల సాహిత్య గ్రంధాలు, చరిత్ర, బాల సాహిత్యం, వ్యక్తిత్వ వికాసం తదితర విషయాలకు చెందిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని గ్రంధాలయ సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గ్రంధాలయ సంస్థ ఆధ్వర్యంలో 2015 నుంచి పుస్తకాలు పంపిణీ జరుగుతోంది. ఇప్పటి వరకు లక్ష పుస్తకాల వరకు పంపీణీ జరిగింది. తొలి ఏడాది కేవలం 8 వేల పుస్తకాలతో ప్రారంభమైన ఈ మహా పుస్తక యజ్ఞంలో,ఈ ఏడాది 50 వేల పుస్తకాలు సిద్ధంగా ఉన్నాయి. 2015లో 6 వేలు, 2016లో 42 వేలు, 2017లో 48 వేల పుస్తకాలు పంపిణీ చేశారు. నగరంలోని బెంజిసర్కిల్ సమీపంలో ఉన్న సర్వోత్తమ గ్రంధాలయ ప్రాంగణంలో ఈ నెల 20, 21వ తేదీల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల పరకు ఉచిత పుస్తకాల పంపిణీ ఉంటుంది.

సమాజం లోని అన్ని వర్గాల ఆర్ధిక అభివృద్దికి కృషి చేయాలని, అందుకోసం అగ్రవర్ణ పేదలకు ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో S.C , S.T. , B.C. , మైనారిటీ వర్గాలకు అనేక ప్రభుత్వ పధకాలు ఆయా కార్పొరేషన్ ల ద్వారా అందుబాటులో ఉన్నాయి. శతాబ్దాలు గా అభివృద్దికి నోచుకోని వర్గాలకు ప్రభుత్వం చేయూత ఇవ్వాలి అనే నిర్ణయంతో, గత కొన్ని సంవత్సరాలుగా అన్ని ప్రభుత్వాలు, వీటిని అమలుపరిచి, ఆ వర్గాలకు అండగా నిలిచాయి. చంద్రబాబు ప్రభుత్వం కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్ లు కూడా ఏర్పాటు చేసారు...

ebc corporatoion 20012018 2

మిగతా కులాలలో ( రెడ్డి , కమ్మ , వైశ్య , వెలమ , క్షత్రియ ) కూడా పేదలు ఉన్నారు. ప్రభుత్వం తమను ఎందుకు పట్టించుకోవటం లేదన్న భావన వీరిలో రోజు రోజుకీ బలపడుతుంది. రాష్ట్రంలోనే కాదు, దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఈ తరుణంలో, బలహీన వర్గాల తరహా లోనే ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకూ కార్పొరేషన్ అమలు చేసి అగ్రవర్ణ పేదలకు చేయూతనివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు... పోయిన ఏడాది ఈబీసీ కార్పొరేషన్ ద్వారా వారిని ఆడుకున్నారు... ఈ సంవత్సరం కూడా ఈబీసీ కార్పొరేషన్ ద్వారా ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రవర్ణాల్లో పేదలకు స్వయం ఉపాధి రుణాలు మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం సంక ల్పించింది. ఒక్కో యూనిట్ కు రూ.2 లక్షలు ఇవ్వనుండగా, అందులో రూ. లక్ష రాయితీ, రూ. లక్ష బ్యాంకు రుణం ఉంటుంది.

ebc corporatoion 20012018 3

ఎస్సీ ఎస్టీ, బీసీ, ఎం. బి.సి, మైనారిటీ, క్రిస్టియన్, బ్రాహ్మణ కులాలకు చెందిన వారు మినహా, ఇతర కులాల్లోని ఆర్థికంగా వెనుకడిన వారు ఈ నెల 31వ తేదీ లోపు http://apobmms.cgg.gov.in అనే వెబ్సైటులో రిజిస్టర్ చేసుకోవాలి. దరఖాస్తుతో పాటు ఆధార్, రేషన్ కార్డు, మీ సేవా కేంద్రం నుంచి పొందిన కుల ధ్రువీకరణ పత్రం జత చేయాల్సి ఉంటుంది... ఈ పథకానికి 21 నుంచి 50 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన వారు వీటికి అర్హులు... రేషన్ కార్డు, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రాలతో పాటు ఫొటోతో మీ-సేవా, ఇంటర్నెట్, ఎంపీడీవో/మున్సిపల్ కమిషనర్ కార్యాలయాల్లో, లేకపోతే ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి... http://apobmms.cgg.gov.in...

Advertisements

Latest Articles

Most Read