విజయవాడలో నిర్మిస్తున్న కనకదుర్గమ్మ వారధి నిర్మాణానికి సంబంధించి కాలువ ప్రవాహాన్ని ఆపడానికి జల వనరుల శాఖతో మాట్లాడామని, రేపటి నుంచి సంబంధిత పనులను ఆరంభిస్తామని అధికారులు చెప్పారు. హైదరాబాద్ పీవీ ఎక్స్‌ప్రెస్ ఫ్లయ్‌వోవర్ తరహాలో విజయవాడ నగరంలో కీలకమైన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సి వుందని మంగళవారం రాత్రి సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో సీయం చంద్రబాబు చెప్పారు. నిర్మాణ సంస్థ చేతకానితనం, అసమర్ధత వల్ల రాష్ట్ర ప్రభుత్వం పరువు పోతోందని ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. వంతెన పైభాగాన్ని 13వ పిల్లర్ వరకు పూర్తిచేసి మార్చి నాటికి ప్రధాన రహదారిపై రాకపోకలు పునరుద్ధరించకపోతే తీవ్ర చర్యలు తీసుకోవాల్సివస్తుందని హెచ్చరించారు. నిర్మాణ సంస్థ కోరినట్టుగా రూ.10 కోట్ల ఇవ్వడానికి ముఖ్యమంత్రి అంగీకరించారు.

cbn 31012018 2

అలాగే, విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ ను నిడమానూరు వరకు పొడిగించే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ పీవీ ఎక్స్‌ప్రెస్ ఫ్లై ఓవర్ తరహాలో విజయవాడ నగరంలో కీలకమైన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సి వుందని మంగళవారం రాత్రి సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన చెప్పారు. చెన్నయ్-కోల్‌కత్తా ఐదవ నెంబర్ జాతీయ రహదారి మార్గంలోని 1025 కిలోమీటర్ల మేర జరుగుతున్న రహదారి అభివృద్ధి పనుల పురోగతిపై జాతీయ రహదారుల శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో ముఖ్యమంత్రికి వివరాలు అందించారు. విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లయ్‌వోవర్ నిర్మాణం నవంబర్ నాటికి పూర్తవుతుందన్నారు. విజయవాడ నగర అవసరాల దృష్ట్యా ప్రస్తుత ప్రతిపాదిత మార్గాన్ని మరికొంత దూరం పొడిగించాలని ముఖ్యమంత్రి వారికి చెప్పారు.

ఔటర్ రింగ్ రోడ్: సవరించిన అలైన్‌మెంట్ ప్రకారం 189 కిలోమీటర్ల మేర అమరావతి బాహ్యవలయ రహదారిని రూ.17,762 కోట్ల అంచనాతో నిర్మాణాన్ని చేపడుతున్నామని అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకి వివరించారు. హైదరాబాద్ పీవీ ఎక్స్‌ప్రెస్ ఫ్లయ్‌వోవర్ తరహాలో విజయవాడ నగరంలో కీలకమైన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సి వుందని మంగళవారం రాత్రి సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన చెప్పారు. దీనికోసం 3,404 హెక్టార్ల మేర భూమి అవసరం వుంటుందని చెప్పగా, సాధ్యమైన మేరకు భూ సమీకరణ విధానంలోనే భూములను తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ బాహ్యవలయ రహదారి మార్గంలో జి.కొండూరులో 5.5 కి.మీ, పేరేచర్లలో 800 మీటర్ల మేర టన్నల్స్ నిర్మాణం జరగాల్సి వుంటుందని అధికారులు చెప్పారు. 87 గ్రామాలు ఈ రహదారి పరిధిలోకి వస్తాయని వివరించారు.

గన్నవరం అంతర్జాతీయ ఎయిర్ పోర్టు నుంచి దేశంలోని పలు ప్రధాన నగరాలకు విమాన సర్వీసులు నడపటానికి దేశీయ దిగ్గజ విమానయాన సంస్థ ఇండిగో విజయవాడ విమానాశ్రయం నుంచి స్లాట్ కోరింది... ఇండిగో నుంచి స్లాట్ ఆభ్యర్ధన రావటమే తరువాయి, విజయవాడ ఎయిర్ పోర్టు ఉన్నతాధికారులు స్లాట్ కల్పిస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విమానాశ్రయ అధికారులకు ఇంకా ఆధికారికంగా విమాన షెడ్యూలను ఇవ్వలేదు. నెల రోజుల ముందు ఎప్పుడైనా ఇవ్వవచ్చు కాబట్టి సమస్య లేదు. తన షెడ్యూల్ ను అధికారికంగా ఇవ్వ కపోయినా... ఇండిగో సంస్థ అధికారికంగా తన ఆగమనాన్ని ప్రకటించింది.

indigo 30012018 2

మార్చి 2 నుంచి విజయవాడ నుంచి దేశీయంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలకు విమాన సర్వీసుల షెడ్యూలను ప్రకటించింది. విజయవాడ నుంచి హైదరాబాదకు ప్రతిరోజూ 12.10, 18.45, 21.35 సమయాలలో మూడు ఫ్లైట్స్ బయలుదేరనున్నాయి. ఆలాగే విజయవాడ నుంచి బెంగళూరుకు 10. 15 గంటలకు ఫ్లైట్ బయలుదేరుతుంది. విజయవాడ నుంచి బెంగళూరుకు 8 గంటలకు ఒక విమానం నడుస్తుంది. ఇవి ఇక్కడి నుంచి బయలుదేరే సమయాలు మాత్రమే. ఇవే సర్వీసులు గమ్యస్థానాల నుంచి ఇక్కడికి రాకపోకలు సాగించటాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. విజయవాడ అంతర్జాతీయ ఎయిర్పోర్టు నుంచి 'ఇండిగో ' సంస్థ దశల వారీగా విమానాలను నడుపుతుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం మొదటి దశ షెడ్యూలను మాత్రమే ప్రకటించడం జరిగింది. మొదటి దశ షెడ్యూల్ ప్రకారం ఈ సంస్థ మొత్తం రానుపోను కలిపి రోజుకు 10 సర్వీసుల చొప్పున విమానాల రాకపోకలు ఉంటాయి.

indigo 30012018 3

ఇటీవల 'ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్' సంస్థ దేశ ఆర్థిక రాజధాని ముంబాయి మహా నగరానికి విమాన సర్వీసును ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇండిగో సంస్థ ప్రకటించిన షెడ్యూల్తో ఇక విజయవాడ ఎయిర్ పోర్టు ఆత్యంత బిజీగా మారిపోనుంది. ఇండిగో భారీ ఆపరేషన్స్ షెడ్యూల్ తో ప్రైవేటు విమానయాన సంస్థలు కూడా నివ్వెరపోతున్నాయి. ఇప్పటి వరకు విజయవాడ ఎయిర్ పోర్టు నుంచి మోనోపలీగా ఉన్న విమానయాన సంస్థలకు ఇక చెక్ పడనుంది. మోనోపలీ కారణంగా విమాన ధరలు ఆకాశానికంటుతున్నాయి. హైదరాబాద్ కు రూ. 18 వేల టిక్కెట్ ధర పలుకుతోంది. ఇలాంటి పరిస్థితులలో ప్రయాణీ కులు బావురు మంటున్నారు. ఇండిగో ప్రవేశంతో విమానయాన సంస్థల మధ్య పోటీ ఏర్పడబోతోంది. ఇండిగో సంస్థ తన ఛార్జీల వివరాలను కూడా ప్రకటించింది. విజయవాడ నుంచి బెంగళూరుకు రూ. 2097 గా ఛార్జీని నిర్ణయించగా... బెంగళూరు నుంచి విజయవాడకు రూ. 1826గా నిర్ణయిం చింది. విజయవాడ నుంచి చెన్నైకు రూ 1179, చెన్నై నుంచి విజయవాడకు రూ. 1283గా నిర్ణయించారు. విజయవాడ నుంచి హైదరాబాద్క రూ. 1099, హైదరాబాద్ నుంచి విజయవాడకు రూ.1699గా ఛార్జీలను నిర్ణయిస్తూ అధికారికంగా ఇండిగో ప్రకటించింది.

పోలవరం విషయంలో దాదాపు మూడు నెలలు నుంచి ఉన్న ప్రతిష్టంభన తొలిగిపోయింది... ప్రాజెక్టు స్పిల్‌ వే, స్పిల్‌ చానల్‌ కాంక్రీట్‌ పనులు, కాంట్రాక్టర్ మార్పు తదితర విషయాల్లో ఎదురైన అవరోధాలు తొలిగిపోయాయి... చంద్రబాబు ఎట్టకేలకు తన పంతం నెగ్గించుకున్నారు... కొత్త టెండర్లను కేంద్రం అడ్డుకున్న సంగతి తెలిసిందే... చంద్రబాబు దసరా పండుగ రోజు, నాగపూర్ లోని నితిన్ గడ్కరీ ఇంటికి వెళ్లి మరీ, టెండర్ల ప్రక్రియ అడ్డుకోవద్దు అని, అవి ఎందుకు అవసరమో మొత్తం వివరించారు... అయినా మూడు నెలలు నుంచి కేంద్రం తాత్సారం చేస్తూ వచ్చింది... ఇవాళ కేంద్ర ప్రభుత్వం స్వయంగా ఈ విషయాలు అన్నిటి పై ఆమోదించింది...

polavram cbn 30012018

స్పిల్‌వే కాంట్రాక్టు పనులను నవయుగకు అప్పగించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్పిల్‌వే కాంక్రీట్, స్పిల్‌వే చానల్ పనులను ఇక నవయుగ సంస్థే చేపట్టనుంది. పాత ధరలకే ఈ పనులను చేయనుంది. మంగళవారం ఢిల్లీలో ఏపీ అధికారులతో జరిగిన సమావేశంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పోలవరం పనులను సమీక్షించారు. పోలవరం పనులకు గాను ఏపీ ప్రభుత్వం టెండర్లును పిలవగా.. పాత ధరలకే పనులు చేస్తామని నవయుగ ముందుకురాగా.. ప్రభుత్వం టెండర్లను నిలిపివేసింది. ఇవాళ ఏపీ అధికారులతో సమావేశం అయిన గడ్కారీ ఈ మేరకు ఆమోదం తెలిపారు...

polavram cbn 30012018 2

మూడు నెలల నుంచి, కేంద్రం నుంచి ఆ కమిటీ అని, ఈ కమిటీ అని, ఒకరి తరువాత ఒకరు వచ్చారు... ఒకరు కాఫర్ డ్యాం కావాలి అంటారు... ఇంకొకరు అక్కర్లేదు అంటారు.. ఇలా రెండు నెలలు కాలయాపన చేసారు... చంద్రబాబు రంగంలోకి దిగి కాఫర్ డ్యాం లేకుండా ఏ పెద్ద డ్యాం అయినా నిర్మాణం జరిగిందా, ఇది కాఫర్ డ్యాం వల్ల ఉపయోగం అని ఎంత చెప్పినా, అటు నుంచి రియాక్షన్ లేదు... ఎక్కడ నొక్కారో కాని, చంద్రబాబు తీవ్ర ఒత్తిడి మాత్రం కేంద్రం మీద తెచ్చారు అనేది అర్ధమవుతుంది... చివరకు మూడు నెలలు క్రిందట చంద్రాబాబు ఏదైతే చెప్పారో, వాటి అన్నిటికీ ఈ రోజు కేంద్రం ఒప్పుకుంది... చివరకు మనకు పోలవరం పనులు పై మూడు నెలల విలువైన సమయం కోల్పోయాం.. అంతకు మించి, అటు కేంద్రానికి ఒరిగింది ఏమి లేదు... బహుసా, రాజకీయ ఆటలో భాగంగా, ఈ మూడు నెలలు సమయం కావాలని కేంద్రం జాప్యం చేసిందా అని ఆలోచిస్తే, పరిణామాలు అవును అనే అంటున్నాయి..

ఒక పక్క కనకదుర్గా ఫ్లై ఓవర్ పనులు నెమ్మదిగా జరుగుతూ, ప్రజల సహనాన్ని పరీక్షిస్తుంటే, బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌ పనులు మాత్రం యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి.. జూన్ 12, 2017న ప్లై ఓవర్ పనులకు శ్రీకారం చుట్టగా, ఏడు నెలల కాలంలో, చాలా పురోగతి కనిపిస్తుంది... దిలీప్‌ బిల్డ్‌కాన్‌ సంస్థ జెట్‌ స్పీడ్‌గా పనులు చేస్తుంది... మరో ఏడె నిమిది నెలల్లోనే అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది... ఆగస్టు, సెప్టెంబర్‌ నాటికి ఫ్లైఓవర్‌ను అప్పగిస్తామని కాంట్రాక్టు సంస్థ ఎన్‌హెచ్‌ అధికారులకు చెబుతోంది...

benz circel 30012018 2

ఇప్పటి వరకు బెంజిసర్కిల్‌ పార్ట్‌-1 మొదటి వరుస పనులు, ఏడు నెలల్లో 22 శాతం మేర పనులు పూర్తయ్యాయి... ఫ్లై ఓవర్‌ పార్ట్‌-2 పనులకు నవంబర్‌ రెండవ వారంలో టెండర్లు పిలవనున్నారు. పార్ట్‌-1, మొత్తం 600 మీటర్ల పొడవున నిర్మలా కాన్వెంట్‌ జంక్షన్‌ నుంచి, ఎస్‌వీఎస్‌ ఫంక్షన్‌ హాల్‌ జంక్షన్‌ వరకు పూర్తిగా ఏర్పాటు చేసిన బ్యారికేడింగ్‌ మధ్యన పనులు జరుగుతున్నాయి. ఈ ఫ్లైఓవర్‌ నిర్మాణానికి మొత్తంగా 354 ఫైల్స్‌ వేయా ల్సి ఉంది. ఇప్పటి వరకు 242 ఫైల్స్‌ వేశారు. ఫైల్స్‌ అన్నవి భూమిలో వేసే పిల్లర్లు. ఫైల్స్‌ తర్వాత దశలో వీటన్నిం టినీ కలిపి భూమి నుంచి పైకి మొత్తం 49 ఫైల్‌ క్యాప్స్‌లను ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 18 ఫైల్‌ క్యాప్స్‌ పనులను పూర్తి చేశారు.

benz circel 30012018 3

ఫ్లైఓవర్‌కు ప్రధాన మైన పియర్స్‌ (పిల్లర్లు) మొత్తం 49 కాగా.. ఇప్పటి వరకు 11 పూర్త య్యాయి. పియర్స్‌ క్యాప్స్‌ అంటే పిల్లర్ల మీద వేసే తలలు మొత్తం 49 కాగా ఇప్పటి వరకు రెండు పూర్తయ్యాయి. మరో 10 తలల నిర్మాణానికి ఐరన్‌ ఫ్రేమింగ్‌ చేశారు. ఆ తర్వాత దశలో గడ్డర్ల తయారీ జరగాలి. మొత్తం 240 గడ్డర్లను తయారు చేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 93 గడ్డర్లు పూర్తయ్యాయి. కీలకమైన పియర్స్‌, క్యాప్స్‌ పనుల ఘట్టం ప్రారంభమైంది! నిర్మాణ పనులు ఈ ఏడాది నవంబర్‌ నాటికి పూర్తి కావాల్సి ఉండగా రెండు నెలలు ముందుగానే ఆగస్టు నాటికి అప్పగించటానికి కాంట్రాక్టు సంస్థ దిలీప్‌ బిల్డ్‌ కాన్‌ సమాంతర పనులు ప్రారంభించింది..

 

Advertisements

Latest Articles

Most Read