నవ్యాంధ్రలో మెల్లమెల్లగా ఐటీ రంగం జోరందుకుంటోంది. ఐటీ కంపెనీలతో పాటు... వాటిని పెట్టాలనుకునేవారికి పెట్టుబడులు సమకూర్చే సంస్థలు, వాటిలో పనిచేయాలనుకునే యువతకు శిక్షణ ఇచ్చే ఏజెన్సీలు... ఇలా అన్నింటితో కూడిన సమగ్రమైన ‘ఐటీ వాతావరణం’ వస్తోంది. అలాగే రాజధాని అమరావతి ప్రాంతంలో ఐటీ సంస్థల సందడి మరింత పెరగనుంది. రేపు, అనగా 17వ తేదీన, 16 చిన్న, మధ్య తరహా ఐటీ కంపెనీలు ప్రారంభంకానున్నాయి... రేపు ఉదయం 9 గంటలకు మంగళగిరి లోని ఫై కేర్ ఐటి పార్క్ మరియు ఎన్ఆర్టి టెక్ పార్క్ లో మంత్రి నారా లోకేష్ 16 ఐటి కంపెనీలను ప్రారంభించనున్నారు…

mangalagiri it 16012018 2

మంగళగిరి సమీపంలోని ఏపీ ఎన్‌ఆర్‌టీ టెక్‌పార్కులో 13 కంపెనీలు, మంగళగిరిలోని పైకేర్‌ ఐటీ పార్కులో మరో మూడు కంపెనీలు ఏర్పాటవుతున్నాయి. ఇవన్నీ ఏపీ ఎన్‌ఆర్‌టీ సంస్థ చొరవతో వస్తున్న కంపెనీలు. వీటిలో 90 శాతం అమెరికా కంపెనీలు, బ్రిటన్‌కు చెందినవి ఒకటి రెండు, మన దేశంలో వేరే ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలు ఉన్నాయి.. ఈ కంపెనీలు రావడంతో తక్షణం ఆరు వందల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఈ కంపెనీలు పూర్తి స్థాయిలో పనిచేయడం మొదలు పెట్టాక సుమారు 1800 మందికి ఉపాధి లభిస్తుంది. మరో 20 వరకు కంపెనీలు ఇక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.

mangalagiri it 16012018 3

mangalagiri it 16012018 4

16 కంపెనీల వివరాలు ఇలా ఉన్నాయి... సిగ్నం డిజిటల్ నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్, చారువికెంట్ ఐటీఈఎస్ ప్రైవేటు లిమిటెడ్, అద్వైత్ అల్గారిథం, స్క్రిప్ట్ బీస్, స్వరా సాఫ్ట్, సన్ స్వెట్, పిక్సీ, సువిజ్, డీఎఫ్ఐ స్విస్, ఎక్సెల్లార్, మెక్ మై క్లినిక్, బీవీజీ ఇండియా కంపెనీలు ఉన్నాయి.. ఇందులో మూడు స్టార్ట్ అప్ కంపెనీలు ఉన్నాయి.. ఈ కంపెనీల్లో మెక్ మై క్లినిక్, ఎక్సెల్లార్, బీవీజీ ఇండియా కంపెనీలు పైకేర్ ఐటి పార్కులో ఏర్పాటుఅవుతున్నాయి... మిగతా 13 కంపెనీలు ఎన్ఆర్టీ ఐటీ పార్కులో వస్తున్నాయి..

ప్రముఖ తమిళ నటుడు సూర్య, తన చిత్రం గ్యాంగ్ సినిమా ప్రమోషన్ లో భాగంగా అన్ని టీవీ చానల్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు... ఈ సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి టీవీ ఛానల్ సాక్షిలో కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు... ఈ సందర్భంగా, సినిమా గురించి ప్రశ్నలు కాకుండా, జగన్ గురించి నాలుగు ముక్కలు చెప్పమని సాక్షి టీవీ యాంకర్ అడిగితే, సూర్య జగన్ పాదయాత్ర చేస్తున్నారు అని, అల్ ది బెస్ట్ అని అన్నారు... దీన్ని పట్టుకుని సాక్షి టీవీ ఊదరగొట్టింది... తన ఛానల్ కు పిలిపించుకుని, సినిమా గురించి కాకుండా, నా గురించి చెప్పండి అంటే, ఎవరైనా ఏమి చెప్తారు ? నువ్వు దొంగవి, జైలుకు వెళ్లి, బెయిల్ పై బయట తిరుగుతున్నావ్ అనరు కదా ? నాలుగు మంచి ముక్కలు చెప్తారు... అదే సూర్య చెప్పాడు...

surya 16012018 2

ఇది పట్టుకుని, సాక్షి టీవీతో పాటు సోషల్ మీడియాలో కూడా, చూసారా మా జగనన్నకు సినిమా హీరోలు కూడా ఫాన్స్ ఉన్నారు అని చెప్తూ, చంద్రబాబు పాలన ఎంత చెత్తగా ఉందో, సూర్య చెప్పాడు అంటూ వక్ర భాష్యం చెప్పి, తమకు చేతనైన ఫేక్ ప్రచారం మొదలు పెట్టారు... అయితే ఈ అల్పసంతోషుల ఆనందం, సూర్య 24 గంటలు కూడా ఉంచలేదు... తన సినిమా గ్యాంగ్ ప్రమోషన్ లో భాగంగా, రాజమండ్రి, ఏలూరు, విజయవాడలో పర్యటించారు.... ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సూర్య మాట్లడారు...

surya 16012018 3

అవినీతి అంతమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం 1100 ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తూ, పరిష్కారం చూపటం చాలా మంచి విషయం అని నటుడు సూర్య అభినందించారు... అవినీతి అంతం గురించి పదే పదే సూర్య మాట్లాడారు.. అలాగే ముఖ్యమంత్రిని కూడా అభినందిస్తూ, చంద్రబాబు చేస్తున్న కృషిని కొనియాడారు... చంద్రబాబు ఇక్కడ చేస్తున్న అన్ని మంచి పనులను స్వాగతిస్తున్నామని సూర్య అన్నారు... మొత్తానికి, జగన్ ఫాన్స్ సూర్యని అడ్డుపెట్టుకుని, చంద్రబాబు మీద బురద జల్లుదాము అనుకున్న సంతోషం 24 గంటలు కూడా లేదు...

ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంక్రాంతి పండుగ ఎంత వైభవంగా జరుపుకుంటారో చెప్పాల్సిన పని లేదు... మనకి ఇదే పెద్ద పండుగ... ఉద్యోగరిత్యా ఎక్కడ ఉన్నా, అన్నీ వదిలిపెట్టి, సొంత ఊరు వచ్చేసి, ఈ మూడు రోజులు అన్నీ మర్చిపోయి సంక్రాంతి పండుగ జరుపుకుంటాం... అంతగా మనం ఈ పండుగకు కనెక్ట్ అయిపోయాము.. అలాగే తెలంగాణాలో మనంత జరుపుకోకపోయినా, అక్కడ కూడా పండుగ జరుపుకుంటారు... దేశ వ్యాప్తంగా, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, పంజాబ్, ఇలా వివిధ రాష్ట్రాల్లో పొంగల్ అని, లోహ్రి అని, ఉత్తరాయణ్ అని, ఇలా వివిధ రకాల పేర్లతో సంక్రాంతి పండుగ జరుపుకుంటారు...

modi 15012018 2

విషయం చెప్పే ముందు ఒక విషయం గుర్తు చేసుకుందాం... ఇటీవల ప్రధాని మోడీ, బీజేపీ ఎంపీలకు క్లాసు పీకారు... నేను మీకు గుడ్ మార్నింగ్ విషెస్ పంపిస్తే, మీరు నాకు తిరిగి ఎందుకు గుడ్ మార్నింగ్ చెప్పారు అని... ఇంత చిన్న విషయానికి మోడీ హర్ట్ అయ్యారు.... ఇప్పుడు అసలు విషయానికి వద్దాం... ఇక్కడ విషయం ఏంటి అంటే, మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, నిన్న తమిళనాడు,గుజరాత్, మరాఠీ, పంజాబ్, నార్త్ ఇండియన్ సోదరుల అందరికి పండుగ శుభాకాంక్షలు చెప్పారు... అది చుసిన చాలా మంది తెలుగు వారు, మనకి అసలు పండుగ ఇవాళ కదా ఈ రోజు అయినా తెలుగు వారికి చెప్తారు అనుకున్నారు... ఈ రోజు మన పక్కనే ఉన్న కర్నాటక వారికి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు ప్రధాని... నిన్న, ఇవాళ కూడా వారి వారి భాషల్లో తమిళ్, కన్నడ, పంజాబీ ఇలా వేరు వేరు భాషల్లో ట్వీట్ చేసారు.... కాని మన తెలుగు వారు జరుపుకొనే సంక్రాంతి మాత్రం మర్చిపోయారు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో, వివిధ రాష్ట్రాల్లో, దేశాల్లో ఉన్న తెలుగువారికి, వారి తెలుగు భాషలో కాని, ఇంగ్లీష్ లో కాని, పండుగ శుభాకాంక్షలు చెప్పలేదు ప్రధాని....

modi 15012018 3

ప్రధాని మోడీకి ఇవాళ మన తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి అని తెలీదా ? గుర్తు రాలేదా? లేక వచ్చినా, అవసరం లేదు అనుకున్నారా? ఇవాళ తెలుగు వారికి సంక్రాంతి అన్న విషయం తెలియకపోతే,పెద్ద ఇబ్బంది ఏమి లేదు.. అదే కావాలి అని చేస్తే, మాత్రం ఇప్పుడు ఇప్పుడే అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న, అయిదు కోట్ల ఆంధ్రులు ఆలోచించుకొని, జాగ్రత్తపడవలసినది చాలా ఉంది అనుకునే స్థితి కల్పిస్తున్నారు.... కనీసం వచ్చే సంవత్సరం అయినా చెప్పండి... ఎందుకంటే వచ్చే ఏడాది మాకు ఎలక్షన్స్ ఉన్నాయి... ఇంకో కొస మెరుపు ఏంటి అంటే, ప్రధాని కావాలి అని ఆశ పడుతున్న రాహుల్ గాంధీ, కేవలం కర్ణాటక రాష్ట్రానికి మాత్రమే విషెస్ చెప్పారు... ఎందుకంటే కర్ణాటకలో త్వరలో ఎన్నికలు ఉన్నాయి కదా... ఎలాగూ ఆంధ్రప్రదేశ్ లో భూస్థాపితం అయిపోయారుగా, ఇంకా ఎందుకు అనుకున్నారో ఏమో... ఇలా ఉంది, మన తెలుగువారి మీద ప్రేమ, ప్రధానికి, ప్రధాని కావాలని ఆరాటపడే ఆయనకు...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో సారి ఢిల్లీ వెళ్ళనున్నారు... మరో సారి ప్రధాని మోడీతో భేటీ కానున్నారు... ఈ నెల 12న చంద్రబాబు, ప్రధాని మోడీని కలసిన విషయం తెలిసిందే... దాదాపు సంవత్సరం తరువాత ఆ భేటీ జరిగింది... ఆ భేటీలో చంద్రబాబు రాష్ట్రానికి రావలసిన అన్ని విషయాల పై మాట్లాడారు... సమగ్ర నివేదికలు కూడా ఇచ్చారు... చంద్రబాబు, మోడీ భేటీ గురించి ప్రజలు చాలా ఆశక్తిగా ఎదురు చూసారు... ప్రధాని అన్ని విషయాల పై చోరావ తీసుకుని, సమస్యలు పరిష్కరిస్తాను అని చెప్పినట్టు చంద్రబాబు చెప్పారు... రొటీన్ సమాధానమే అయినా, ఢిల్లీలో పరిణామాలు గురించి తెలిసినవారు మాత్రం, సమావేశం సీరియస్ గా జరిగినట్టు, సమస్యలు పరిష్కారం అవుతాయనే ఆశాభావంతోనే ఉన్నారు....

cbn 16012018 2

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 17న మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో 17న జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు- 2018 సన్నాహక సమావేశంలో సీఎం పాల్గొంటారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పలువురు కేంద్ర మంత్రులు పాల్గొంటారని తెలుస్తోంది.

cbn 16012018 3


కాగా సమావేశం అనంతరం ఆర్థిక మంత్రి, జలవనరుల శాఖ మంత్రి, హోం శాఖ మంత్రితో భేటీ అయ్యి విభజన హామీల విషయమై నిశితంగా చర్చించనున్నారు. ముఖ్యంగా పోలవరం, ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన నిధుల విషయమై ప్రధాని మోదీతో కూడా చంద్రబాబు సమావేశమవుతారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

 

Advertisements

Latest Articles

Most Read