తెలంగాణా నుంచి మరో కేంద్ర సంస్థ, ఆంధ్రప్రదేశ్ వచ్చేస్తుంది... ప్రయాణికులకు అతి తక్కువ ధరల్లో స్వచ్ఛమైన తాగునీటిని అందజేయాలన్న లక్ష్యంతో రూపొందిన రైల్ నీర్ ప్రాజెక్టు, తెలంగాణా నుంచి ఆంధ్రప్రదేశ్ కు వచ్చేసింది... ఐదువేల మందికి ప్రత్యక్షంగా, మరో ఐదువేల మందికి పరోక్షంగా ఉపాధినివ్వగలిగే ఈ ప్రాజెక్టును హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు 2012 లోనే సన్నాహాలు మొదలయ్యాయి. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ఆధ్వర్యంలో రూ.50 కోట్లకు పైగా అంచనాలతో రూపొందించిన ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం ఇప్పటివరకూ భూమిని, వనరులను కేటాయించలేదు.

rail neer 13012018 2

దాంతో ప్రతిష్టాత్మ కమైన ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ కు వచ్చేసింది. నూజివీడు దగ్గర దీన్ని నిర్మించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐఆర్సీటీసీకి ఎకరం భూమిని కేటాయించింది. దీంతో తెలంగాణాలో నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టు పై ఆశలు వదులుకున్నట్టే అయింది... రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు అధిక ధర వెచ్చించి ప్రైవేటు మినరల్ వాటర్ కొనుగోలు చేయాల్సి వచ్చేది. ఈ క్రమంలో ప్రయాణికులకు తక్కువ ధరలో మినరల్ వాటర్ను అందజేసే ఉద్దేశంతో తెలంగాణాలో వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు ఐఆర్సీటీసీ ముందుకొచ్చింది.. రోజుకు లక్ష లీటర్ల మంచినీటిని శుద్ధి చేసే ప్లాంటు ఏర్పాటు చేస్తామని 2012లోనే అప్పటి ఉమ్మడి ప్రభుత్వానికి నివేదిక అందజేసింది.

rail neer 13012018 3

ఫ్యాట్ సిటీ వద్ద 4ఎకరాల స్థలం ఇవ్వడంతో పాటు మంచినీటి పైప్ లైన్ కూడా ఏర్పాటు చెయ్యాలని రైల్వే శాఖ కోరింది... అప్పటి ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది. కానీ ఆ తరువాత తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు వెనక్కు వెళ్లింది. ఇప్పుడు వచ్చిన తెలంగాణా ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్ట్ పై శ్రద్ధ తీసుకోలేదు... దీంతో ఈ ప్రాజెక్ట్ పై ఆంధ్రప్రదేశ్ రంగలోకి దిగి, భూమి కూడా ఇవ్వటానికి రెడీ అయ్యింది... ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తే ప్లాంట్ లోనే కాక, ప్రాజెక్ట్ నుంచి రైల్వే స్టేషన్లకు, రైళ్లకు వాటర్ బాటిళ్లను సరఫరా చేసేందుకు రవాణా వ్యవస్థ, సిబ్బంది అవసరం ఉంటుంది. వాటర్ బాటిళ్ల విక్రయం పైనా పలువురు ఉపాధి పొందుతారు.

టెక్నాలజీ... ఆధునిక పరిపాలనా వ్యవస్థలో పాలకులకు ఒక అస్త్రం. సమస్యలకు ఒక సులభ పరిష్కార వినియోగ వ్యవస్థ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కాల్ సెంటర్లు అవినీతి అధికారుల పై ప్రజలు నేరుగా ఘుళిపించే కొరడాగా మారుతున్నాయి... 'ప్రజలే ముందు పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ప్రారంభించిన 1100 కాల్ సెంటర్ వల్ల ఆసక్తికరమైన వివరాలు వెల్లడవుతున్నాయి... లంచాల సొమ్ము వెనక్కు ఇవ్వటం చూసాం... సమస్యలు పరిష్కారాలు చూస్తున్నాం... ఇప్పుడు ఏకంగా ఆత్మహత్య చేసుకోవాలనుకున్న కుటుంబాన్ని కాపాడింది 1100... రెప్ప పాటులో, ఒక్క నిమషం ఆలస్యం అయినా, ఒక కుటుంబం బలి అయిపోయేది... పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి...

1100 call center 13012018 2

కృష్ణా జిల్లా మండల కేంద్రమైన జి.కొండూరులో అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడబోతున్న ఒక కుటుంబాన్ని సకాలంలో స్పందించిన ఎస్ఐ డి.రాజేష్ రక్షించారు. జి.కొండూరులో నివసిస్తున్న ఒక కుటుంబ యజమాని తన భార్య, ఇద్దరు కుమార్తెలతో కలసి పరుగు మందును గ్లాసుల్లో పోసుకుని తాగేందుకు సిద్ధమయ్యారు. ముందుగా తన సమస్యను 1100 టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసి, తనకు సీఎం అపాయింట్మెంట్ కావాలని కోరాడు.

1100 call center 13012018 3

అతను చెప్పిన విధానాన్ని బట్టి బాధిత కుటుంబం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని గుర్తించి వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీని పై శరవేగంగా స్పందించిన ఎస్ఐ డి.రాజేష్ బాధితుని ఇంటి వద్దకు వెళ్ళాడు. అక్కడ ఇంటికి తలుపులు వేసి ఉండటాన్ని గుర్తించి వాటిని పగులగొట్టి లోపలికి వెళ్ళి చూడగా పరుగుమందుతో ఉన్న కుటుంబం కనిపించింది. బాధిత కుటుంబానికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇటువంటి చర్యలకు పాల్పడకూడదని, ఆత్మస్టైర్యంతో ఉండాలని ఎస్ఐ పేర్కొన్నారు. సకాలంలో స్పందించిన ఎస్ఐ రాజేష్ స్థానిక పోలీసుల పనితీరును పలువురు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.

సంక్రాంతి వేళ కృష్ణా జ్జిల్లాలో కోడి పందాలు, ఎడ్ల పోటీలే కాదు... పడవల పోటీలు కూడా ఉంటాయి... ఎక్కడో తెలుసా... కృష్ణాజిల్లాలో కృష్ణా నది సముద్రంలో కలిసే నాగాయలంక, హంసలదీవి సమీపంలో సంక్రాంతిని పురస్కరించుకుని పడవల పోటీలు కూడా జరుగుతాయి. ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ పోటీలు జర్గుతున్నా పెద్ద గుర్తింపు ఉండేది కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, స్థానిక పండుగలను, రాష్ట్రవ్యాప్త ప్రచారం కల్పించి పర్యాటకులను ఆకర్షించాలని అనే ఉద్దేశంతో క్రిందటి ఏడాది, ఏపీ పర్యాటకశాఖ ఈ పోటీలను నిర్వహించింది. ఈ ఏడాది కూడా, పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతున్నాయి...

padava poteelu 13012018 2

తరతరాలుగా సముద్రాల్లోను, నదుల్లోనూ సంప్రదాయ పడవల్లో సంచరిస్తూ చేపలను వేటాడే విధానం మత్స్యకారులది. మరుగున పడిపోతున్న మత్స్యకారుల ప్రాచీన సంస్కృతిని ప్రపంచానికి చాటి, వారిలో మానసికోలాసాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర స్థాయి దివిసీమ సంప్రదాయ పడవల పోటీలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. కేరళ రాష్ట్రంలో నిర్వహించినట్లే ప్రతి సంక్రాంతికీ నాగాయలంకలో సంప్రదాయ పడవల పోటీలను నిర్వహించనుండటంతో అన్ని వర్గాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. పడవల పోటీలకు నాగాయలంక శ్రీరామపాదక్షత్రం పుష్కరఘాట్ లో నిర్వహిస్తున్నారు.

padava poteelu 13012018 3

2016లో జరిగిన కృష్ణా పుష్కరాలకు నాగాయలంకలో జరిగిన పడవ పోటీలు, కృషాతీరం యాత్రికులను, ప్రభుత్వాన్ని విశేషంగా ఆకర్షించాయి. దీంతో ఇక్కడ సంప్రదాయ పడవల పోటీలను నిర్వహించేందుకు పర్యాటకశాఖ తొలి అడుగేసింది. తొలుత 2017 సంక్రాంతికి పడవల పోటీలను నిర్వహించగా, విశేష స్పందన లబించింది. దీంతో ప్రతి ఏడాదీ ఇక్కడ పోటీలను నిర్వహించాలని సంకల్పించింది. ఈ నేపధ్యంలో జలక్రీడల అకాడమీని మంజూరు చేసింది. నదులు, సముద్రంతో అనుబంధమున్న మత్స్యకార సామాజికవర్గంలోని యువతరానికి వివిధ అంశాల్లో శిక్షణనిచ్చి అంతరాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు నాగాయలంక కేంద్ర బిందువు కానుంది. దివిసీమ సంప్రదాయ పడవల పోటీలు నాగాయలంకలో నిర్వహించటంతో దివిసీమలో పండుగ వాతావరణం నెలకొంది. పుష్కరషూట్ ను శోభాయమానంగా అలంకరించారు. నాగాయలంక సెంటర్ నుంచి ఘాట్ వరకు రహదారికిరువైపులా బాదులను పాతి, విద్యుత్ తోరణాలతో ముస్తాబు చేశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తమిళనాడు ప్రజలకు సంక్రాంతి కనుక లాంటి విలువైన గిఫ్ట్ ఇచ్చారు... చంద్రబాబు ఏంటి, తమిళనాడు ప్రజలకు సహయం చెయ్యటం ఏంటి అనుకుంటున్నారా ? చెన్నైలో తాగు నీటి అవసరాలకు ఇబ్బంది పడుతున్న ప్రజలను చూసి, చెన్నై తాగు నీటి అవసరాలకు 3.33 TMC నీరుని విడుదల చేసారు... కండలేరు జలాశయం నుంచి చెన్నై తాగునీటి అవసరాలకు ఈ సీజన్‌లో 3.33 టీఎంసీల నీరు విడుదల చేసేందుకు అనుమతిస్తూ జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు...

sankaranti 13012018 2

తమిళనాడు ప్ర భుత్వ అభ్యర్థన మేరకు కండలేరు నుంచి పూండి రిజర్వాయరులోకి 3.33 టీఎంసీలను విడుదల చేస్తూ ఆ శాఖ కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ శుక్రవారం ఉత్తర్వు జారీ చేశారు. తెలుగుగంగ నుంచి చెన్నై నగరానికి 5 టీఎంసీల కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అందించాలని ఒప్పందంలో ఉంది... అయితే రాష్ట్ర విభజన తరువాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 3.33 టీఎంసీలు, మిగతాది తెలంగాణా నుంచి ఇవ్వాలి అని రాష్ట్ర విభజన చట్టంలో ఉంది. అయితే ఇలాంటి ఒప్పందాలు ఏ రాష్ట్రాలు పాటించవు... తెలంగాణా కూడా పూర్తి స్థాయిలో నీళ్ళు వదిలిన దాఖలాలు లేవు... చంద్రబాబు మాత్రం, పక్క రాష్ట్రాలతో సఖ్యత ముఖ్యం అనుకుని, ఒప్పందం ప్రకారం, ప్రతి సంవత్సరం తమిళనాడు అడిగిన ప్రతిసారి, మొత్తం నీరు విడుదల చేస్తున్నారు..

sankaranti 13012018 3

చెన్నై నగరానికి నీటిని సరఫరా చేసే జలాశయాల్లో ప్రస్తుతం 46 శాతం నీటి నిల్వలో లోటు ఉంది. వర్షాలు లేకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని పేర్కొంటూ అక్కడి చీఫ్‌ ఇంజినీరు తెలుగుగంగ చీఫ్‌ ఇంజినీరుకు లేఖ రాశారు. చెన్నై ప్రాంతీయ చీఫ్‌ ఇంజినీరు వినతి మేరకు, రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకంది. ఆ మేరకు ప్రభుత్వం చర్చించి తక్షణమే నీటిని కండలేరు నుంచి విడుదల చేయాలని నిర్ణయించింది. దీంతో చెన్నై వాసులకు తాగు నీటి కష్టాలు తీరనున్నాయి... పోయిన సంవత్సరం కూడా చంద్రబాబు, ఒప్పందం ప్రకారం చెన్నై కు నీళ్ళు ఇచ్చారు... పోయిన సంవత్సరం కూడా, ఆ రాష్ట్ర ముఖ్యంత్రిగా ఉన్న పన్నీరు సెల్వం అభ్యర్ధన మేరకు, చంద్రబాబు నీళ్ళు విడుదల చేసారు..

Advertisements

Latest Articles

Most Read