పల్లె, పట్టణం, నగరం తేడా లేదు! ఇక... ఊరూరా ఉచితంగా వైఫై! త్వరలోనే గూగుల్‌ ఈ సేవలను రాష్ట్రమంతటా విస్తరించనుంది. ఈ మేరకు గూగుల్‌తో రాష్ట్ర ఫైబర్‌ నెట్‌ కార్పొరేషన్‌ మంగళవారం ఒప్పందం చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం పిలిచిన టెండర్లలో గూగుల్‌ కూడా పాల్గొని విజయవంతంగా ఈ పనులను దక్కించుకుంది. బుధవారం దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఏపీఎస్ ఎఫ్ ఎల్‌ సీఈవో దినేశ్‌ కుమార్‌ బుధవారం ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ప్రస్తుతం ప్రధాన రైల్వే స్టేషన్‌లలో ‘రైల్‌ టెల్‌’ పేరిట గూగుల్‌ వైఫై సేవలను అందిస్తోంది.

google 31082018 2

ఈ సేవలను వినియోగించుకోవాలనుకునే ప్రయాణికుడి మొబైల్‌కు వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌ వస్తుంది. 45 నిమిషాలపాటు ఉచితంగా వైఫై వాడుకోవచ్చు. ఇప్పుడు... రాష్ట్రవ్యాప్తంగా 12,900 గ్రామాలతోపాటు పట్టణాలు, నగరాలకు ఈ సేవలు విస్తరించనున్నాయి. ఏపీఎస్ ఎఫ్ ఎల్‌తో కుదిరిన ఒప్పందం ప్రకారం... జీ-స్టేషన్ల వద్ద 45 నిమిషాల నుంచి గంట వరకూ ఒకే సెషన్‌ (దఫా)లో ఉచితంగా ఇంటర్నెట్‌ సేవలు వినియోగించుకోవచ్చు. ఈ సమయం ముగిశాక.. మళ్లీ మరో సెషన్‌కు వెళ్లవచ్చు. ఇలా విడతల వారీగా రోజులో ఎంతసేపైనా నెట్‌ వాడుకోవచ్చు. ఒక్కో ఊరికి రెండు చొప్పున రద్దీ ప్రాంతాలను ఎంచుకుని రూటర్లు ఏర్పాటు చేస్తారు. మునిసిపాలిటీల్లో వార్డుకు రెండు చొప్పన దాదాపు 4000 చోట్ల రూటర్లను ఏర్పాటు చేస్తారు.

google 31082018 3

ఉచిత వైఫై సేవలు అందించేందుకు గూగుల్‌తో ఒప్పందం చేసుకున్న ఏపీఎస్ ఎఫ్ ఎల్‌... రూటర్ల సరఫరా కోసం టెండర్లను ఆహ్వానించింది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాల్లో ప్రధాన కూడళ్ల వద్ద రూటర్లను ఏర్పాటు చేస్తామని ఏపీఎ్‌సఎ్‌ఫఎల్‌ సీఈవో దినేశ్‌ కుమార్‌ చెప్పారు. దీంతోపాటు... గూగుల్‌ యాప్‌ ఉండే ఆండ్రాయిడ్‌ టెలివిజన్‌ ఉన్న వారికి ప్రత్యేక సెట్‌టాప్‌ బాక్సులను అందజేస్తామన్నారు. వీటిద్వారా ‘మీ సేవ’ కింద పౌరులకు అందజేస్తున్న సేవలన్నీ వినియోగించుకునే వీలుంటుందన్నారు. ఇందుకోసం వాయిస్‌ ఓవర్‌ యాప్‌నీ గూగుల్‌ అందజేస్తుందని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన అవకాశం లభించిన సంగతి తెలిసిందే. న్యూయార్క్ లో జరగనున్న ఐక్యరాజ్యసమితి సదస్సులో ప్రసంగించాల్సిందిగా ఆయన్ని యూఎన్ఓ ఆహ్వానించింది. ఐక్యరాజ్యసమితి అంటే, ఈ ప్రపంచంలోనే నెంబర్ వన్ సంస్థ. దేశాలను కూడా శాసించ గల సత్తా ఉన్న సంస్థ. ఇలాంటి సంస్థ, మన రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆహ్వానం ఇచ్చింది అంటే, ఎంతో రీసెర్చ్ చేసి కాని, ఆహ్వానించవు. జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్‌లో ఆంధ్రప్రదేశ్ అనుసురిస్తున్న విధానాలను యూఎన్ఓ ఇప్పటికే ప్రకటించింది.

cbn 31082018 2

అయితే, దీని పై వైసీపీ స్పందన వింటే, మనకు మైండ్ పోతుంది... ఇదేదో సాక్షి టీవీ అనుకున్నారో ఏమో కాని, చంద్రబాబు ఐక్యరాజ్యసమితిని మ్యానేజ్ చేసారు అంటూ, నిస్సిగ్గుగా ప్రకటించింది. వీళ్ళ తెలివి ఇలా ఏడ్చింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షులు ఎంవీఎస్ నాగిరెడ్డి మాట్లాడుతూ, మోసం చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అంతర్జాతీయ స్థాయికి ఎదిగారన్నారు. ప్రకృతి సేద్యానికి చంద్రబాబు ఎంతగానో కృషి చేస్తున్నారట... ఈ విషయం మన రైతులు, ప్రజలకు తెలియదు కానీ, ఐక్యరాజ్య సమితి గుర్తించి ప్రసంగించేందుకు ఆయనను ఆహ్వానించారట అని ఎద్దేవా చేశారు.

cbn 31082018 3

చంద్రబాబుకు అసలు వ్యవసాయ విషయంలో అంతర్జాతీయ గౌరవం పొందే అర్హత ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నారని చెప్పడం మరీ చోద్యం అన్నారు. 2024 నాటికి ఏపీలో 60 లక్షల ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారట, ఈ విషయం మన రైతులకు, మన దేశంలోని వారికి తెలియదు కానీ, ప్రభుత్వం ఐక్యరాజ్య సమితి వారికి ఏం చెప్పిందో కానీ ప్రకృతి వ్యవసాయానికి చంద్రబాబు ఏవో సేవలు చేస్తున్నారని భావించి ప్రసంగించాలని కోరారని విమర్శించారు. అయితే, వైసీపీ స్పందన చూస్తుంటే, వీళ్ళకు ఉన్న జ్ఞానం ఏపాటిదో అర్ధమవుతుంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇంత అరుదైన గౌరవం ఇస్తుంటే, తట్టుకోలేక పోతున్నారు.

గుంటూరులో ఈనెల 28న ముఖ్యమంత్రి పాల్గొన్న ‘నారా హమారా- తెదేపా హమారా’ సభలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు జగన్ పార్టీ పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేసారు. గురువారం తన కార్యాలయంలో ఎస్పీ ఈ కుట్రకు సంబంధించిన వివరాలను విలేకరులకు వివరించారు. సభలో సీఎం ప్రసంగిస్తుండగా సాయంత్రం 5.54 గంటల సమయంలో కొంతమంది ప్లకార్డులు చేతపట్టి సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారని అన్నారు. పోలీసులు అప్రమత్తమై వారిని శాంతింపజేశారని తెలిపారు. దీనిపై 29న తెదేపా నాయకుడు షేక్‌ మీరావలీ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని వెల్లడించారు. సభ జరుగుతుండగా సరిగ్గా 5.45 గంటలకు అక్కడున్న ఒకరి సెల్‌ఫోన్‌కు సభను భగ్నం చేయాలనే సంక్షిప్త సమాచారం వచ్చిందని తెలిపారు. దర్యాప్తులో భాగంగా దీన్ని గుర్తించామన్నారు.

jagan 31082018 2

కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన వైకాపా రాష్ట్ర మైనారిటీ సెల్‌ కార్యదర్శి షేక్‌సయ్యద్‌ అబీబుల్లా ఈ కుట్రకు సూత్రధారని వెల్లడించారు. అదే ప్రాంతానికి చెందిన షేక్‌జుబేర్‌, షేక్‌ మహబూబ్‌బాషా, షేక్‌ జుబేర్‌అహ్మద్‌, సయ్యద్‌ అబీద్‌, షేక్‌అక్తర్‌ సల్మాన్‌ జక్రియ, షేక్‌ ఇలియాజ్‌, షేక్‌ ముక్తు, మహ్మద్‌ ముజావుద్దీన్‌లను ఉద్దేశపూర్వకంగా సభను భగ్నం చేయడానికి రైలులో గుంటూరుకు అబీబుల్లా పంపించాడని తేలిందన్నారు. అలజడితో ప్రజలు, అధికారులు, మీడియా దృష్టిని ఆకర్షించాలనేది వారి పథకమని తేలిందని వెల్లడించారు. తొమ్మిది మంది నిందితులపై రౌడీషీట్లు నమోదు చేస్తామని వివరించారు.

jagan 31082018 3

అయితే ఈ కుట్ర అంతా జగన్ కనుసనల్లోనే జరిగిందనే ప్రచారం జరుగుతుంది. తన తండ్రి లాగా మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్లాన్ వేసాడు జగన్. ఈ నిందితులు అంతా, శిల్పా మోహన్ రెడ్డి అనుచరులుగా గుర్తించారు. అయితే వీరి అందరి పై ఇప్పటికే, కర్నూల్, నంద్యాలలో వివిధ కేసులు ఉన్నాయి. క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్ళని వాడుకుని, జగన్ పార్టీ, ఈ కుట్రకు తెర లేపింది. బహిరంగ సభ భగ్నం చెయ్యటానికి వైసిపి ప్లాన్ చేసింది. ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి మండిపడ్డారు. ప్రధాని మోదీ, జగన్ మధ్య స్నేహం ఎక్కువైందన్నారు. రాయలసీమ యువకులతో గుంటూరు మైనార్టీ సభను భగ్నం చేయాలని జగన్ కుట్ర పన్నారని ఆయన ధ్వజమెత్తారు. మోదీకి మైనార్టీలు దూరమవుతున్నారని జగన్ బాధ పడుతున్నారని విమర్శించారు. వైసీపీ నేతలే సభకు పంపారని పోలీసుల దర్యాప్తులో గుంటూరు మైనార్టీ సభలో అల్లరి చేసిన యువకులు ఒప్పుకున్నారని కేఈ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తమిళనాడు ప్రజలకు గుడ్ న్యూస్ వినిపించారు. చంద్రబాబు ఏంటి, తమిళనాడు ప్రజలకు సహయం చెయ్యటం ఏంటి అనుకుంటున్నారా ? చెన్నైలో తాగు నీటి అవసరాలకు ఇబ్బంది పడుతున్న ప్రజలను చూసి, చెన్నై తాగు నీటి అవసరాలకు నీరుని విడుదల చేసారు... కృష్ణా జలాల్లో చెన్నై కోటా కింద 15 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని జలనవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ ఆదేశించారు.

cbn chennai 31082018 2

ఇప్పటికే చెన్నై తాగునీటికి 12 రోజులుగా శ్రీశైలం వెనుక జలాలను వదులుతున్నారు. కర్నూలు జిల్లా వెలుగోడు జలాశయం నుంచి గాలేరు-కుందు- సోమశిల ద్వారా చెన్నైకు నీరు పంపుతున్నారు. దీంతో చెన్నై వాసులకు తాగు నీటి కష్టాలు తీరనున్నాయి... పోయిన సంవత్సరం కూడా చంద్రబాబు, ఒప్పందం ప్రకారం చెన్నై కు నీళ్ళు ఇచ్చారు... పోయిన సంవత్సరం కూడా, ఆ రాష్ట్ర ముఖ్యంత్రిగా ఉన్న పన్నీరు సెల్వం అభ్యర్ధన మేరకు, చంద్రబాబు నీళ్ళు విడుదల చేసారు.. మరో పక్క, నాగార్జున సాగర్‌కు జలకళ సంతరించుకుంది. సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులకు గానూ ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలతో సాగర్‌కు భారీగా వరద నీరు చేరుతోంది.

cbn chennai 31082018 3

శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర వరద ప్రవాహన్ని బట్టి ఎప్పటికప్పుడు గేట్లు ఎత్తివేసి నీటిని వదలడంతో సాగర్‌లో ప్రస్తుత నీటిమట్టం 582 అడుగులకు చేరింది. మరికొన్ని గంటల్లో ఇది 585 అడుగులకు చేరే అవకాశం ఉంది. దిగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. అది క్రమంగా పెరుగుతోంది. పైన ఉన్న అల్మట్టి ప్రాజెక్టుకు లక్షా 6వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంటే.. దిగువకు లక్షా 35వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టుకు లక్షా 35వేల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో ఉండగా దిగువకు లక్షా 38వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. జురాలకు లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంటే, దిగువకు 80వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలానికి వరద ప్రవాహం పెరిగింది.

Advertisements

Latest Articles

Most Read