ఘోర రోడ్డు ప్రమాదం జరిగి చావు బతుకుల మధ్య లో హరికృష్ణ - సెల్ఫీ పిచ్చి లో కామినేని ఆస్పత్రి సిబ్బంది.ఇదేనా రాక్షసానందం అంటే ఏ ముహూర్తాన మొబైల్ కంపెనీలు ఫ్రంట్ కెమెరా తీసుకు వచ్చినది తెలియదుగానీ రానురాను ప్రజల్లో సెల్ఫీ పిచ్చి ముదిరిపోయింది.సెల్ఫీ అనేది ఎక్కడ తీయాలో ఎక్కడ తీయకూడదు అనే విషయం తేలుసుకోలేని పరిస్థితుల్లో కామినేని ఆసుపత్రి సిబ్బంది. ప్రమాదం జరిగి చావు బతుకుల మధ్య హరికృష్ణ ఉంటే ట్రీట్మెంట్ చేయాల్సింది పోయి ఆ పరిస్థితుల్లో ఉన్న హరికృష్ణతో సెల్ఫీ దిగడం అంటే ఏ స్థాయికి దిగజారి ఆ పని చేశారు అర్థమవుతుంది.ఈ సెల్ఫీ దిగిన సిబ్బందిపై తక్షణమే కామినేని ఆసుపత్రి యాజమాన్యం చర్యలు తీసుకోవాలి.

hospital 31082018 2

హరికృష్ణ భౌతిక కాయంతో ఆస్పత్రి సిబ్బంది టెన్షన్ పడకుండా సెల్ కెమెరావైపు చూస్తూ సెల్ఫీలు తీసుకోడం చర్చనీయాంశమవుతోంది. అంబులెన్స్ శబ్దం వినిపిస్తే రోడ్డుపై వెళ్లేవాళ్లు వీలైనంత వరకు దారి ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. తాము ఎంత అర్జంట్ పనిమీద ఉన్నా పక్కకు తప్పుకుంటారు. కానీ ఆస్పత్రిలో సిబ్బంది ఏం చేస్తున్నారు. రోగి చికిత్స విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. అదే వీఐపీ రోగులు అయితే సెల్ఫీలు కూడా తీసుకుంటున్నారు. కామినేని ఆస్పత్రిలో అదే జరిగింది. దీనిపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.

 

రాష్ట్రంలో మరో రెండు మూడు నెలల్లో ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు తీయనున్నాయి. ముందుగా విజయవాడలో పైలెట్ ప్రాజెక్టుగా రెండు బస్సులను నడపనున్నారు. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే మరో రెండు బస్సులు నడపడంతో పాటు రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమను నెలకొల్పనున్నారు. ఈ ఏడాది విశాఖపట్నంలో జరిగిన సీఐఐ పార్టనర్ సమ్మిట్ లో ఎలక్ట్రిక్ బస్సుల ఉత్పత్తిపై ఏపీఎస్‌ ఆర్టీసీ, ఏపీ ట్రాన్స్ కో, నెడ్ క్యాప్‌తో బెలారస్‌కు చెందిన యాక్సిస్ మొబలిటీ సంస్థ ఎంవోయూ కుదుర్చుకుంది. దీనిలో భాగంగానే వెల‌గ‌పూడిలోని సచివాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో యాక్సిస్ మొబలిటీ సంస్థ ప్రతినిధులతో ఏపీఎస్ ఆర్టీసీ, ట్రాన్స్‌కో, నెడ్‌క్యాప్ అధికారులు చర్చించారు.

పర్యావరణ పరిరక్షణతో పాటు డీజిల వినియోగం తగ్గించడమే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్‌ తెలిపారు. దీనిలో భాగంగా ఏపీలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగించాలని నిర్ణయించామన్నారు. ముఖ్యంగా ప్రజారవాణాలో ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకురానున్నామన్నారు. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ, సామర్థ్యం గురించి యాక్సిస్ అధికారులను అడిగి ఆయన తెలుసుకున్నారు. ఎలక్ట్రిక్ బస్సుల పనితీరుపై ఆ సంస్థ ప్రతినిధి రవికుమార్ రెడ్డి పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఎలక్ట్రిక్ బస్సుల తయారీలో తమ సంస్థకు 40 ఏళ్లకు పైగా అనుభవముందని ఆ సంస్థ ప్రతినిధి రవికుమార్ రెడ్డి తెలిపారు. 9 మీటర్లు, 12 మీటర్లు, 18 మీటర్లు పొడవు కలిగిన మూడు మోడళ్లను ఉత్పత్తి చేస్తున్నామన్నారు. వాటిలో 12 మీటర్ల పొడవు కలిగిన బస్సులు ఏపీ రోడ్లకు సరిపోయే విధంగా ఉంటాయన్నారు. ఈ బస్సులో 75 నుంచి 87 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించడానికి అవకాశం కలుగుతుందన్నారు. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 25 కిలోమీటర్ల వరకూ బస్సు ప్రయాణిస్తుందన్నారు.

ఐదు నిమిషాల్లో ఛార్జింగ్ పూర్తవుతుందన్నారు. ఎలక్ట్రిక్ బస్సుల వినియోగంతో ఎటువంటి కాలుష్య ఉండదన్నారు. విజయవాడలో ప్రయోగాత్మకంగా రెండు ఎలక్ట్రిక్ బస్సులు నడపనున్నట్లు తెలిపారు. ఇందుకు నగరంలో ఒక ఛార్జింగ్ సెంటట్ ను నెలకొల్పనున్నామన్నారు. డీజిల బస్సు కంటే ఎలక్ట్రిక్ బస్సు నిర్వహణ మూడో వంతు మాత్రమే వ్యయమవుతుందన్నారు. బస్సులోకి వీల్ చైర్ తో వెళ్ల విధంగా ప్లాట్ ఫాం కూడా రూపొందించామన్నారు. కిలో మీటర్ కు రూ.40ల వరకూ వ్యయమవుతుందన్నారు. దీన్ని రూ.35లకు తగ్గించే విధంగా సాంకేతిక వ్యవస్థను రూపొందిస్తున్నామన్నారు. ఏసీ సౌకర్యంతో పాటు వై ఫై, జీపీఎస సిస్టమ్ ఉంటుందన్నారు. ఈ బస్సు కాలపరిమితి 15 ఏళ్ల అని తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సు స్పీడ్ లిమిట్ గంటకు 60 కిలో మీటర్లని వివరించారు. రెండు మూడు నెలల్లో రెండు బస్సులను వినియోగంలోకి తీసుకొస్తామన్నారు. మిగిలిన రెండు బస్సులు మరో రెండు నెలల్లో నడపనున్నామన్నారు. బస్సులను ఉచితంగా అందజేస్తున్నందున్న వాటి దిగుమతికయ్యే కస్టమ్స్ డ్యూటీని రాష్ట్ర ప్రభుత్వం మినహాయించాలని ఆయన కోరారు. ఈ విషయమై, సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లనునట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తెలిపారు.

విభజన హామీల్లో కేంద్రానికి రూపాయి ఖర్చు లేనిది, ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకుంటే ఇచ్చేసేది, విశాఖ రైల్వే జోన్ అంశం. కాని, నాలుగేళ్ల నుంచి, దీని పై తేల్చటం లేదు. పైగా, ఒరిస్సా రాష్ట్రం పై తోస్తున్నారు. రైల్వే మంత్రి పియూష్ గోయల్ ఏమో, పరిశీలించమని చట్టంలో ఉంది, పరిశీలిస్తూనే ఉంటాం అని వెటకారపు సమాధానం చెప్తారు. అయితే, నిన్న ఒరిస్సా రాష్ట్రం చెప్పిన విషయంతో, కేంద్రం డ్రామాలు అన్నీ బట్టబయలు అయ్యాయి. విశాఖ కేంద్రంగా కొత్త రైల్వేజోన్‌ ఏర్పాటు చేయడానికి తమకేమీ అభ్యంతరంలేదని ఒడిశా అధికార బిజూ జనతాదళ్‌ సీనియర్‌ ఎంపీ ప్రసన్నకుమార్‌ పట్సానీ పార్లమెంటు స్థాయీసంఘం ముందే కుండబద్దలు కొట్టారు.

modi 31082018 2

ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం అమలుపై గురువారం సాయంత్రం పార్లమెంటు భవనంలోని 63వ నంబర్‌ మందిరంలో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం నేతృత్వంలో పార్లమెంటు స్థాయీసంఘం సమీక్ష నిర్వహించింది. ఇందులో శ్రీకాకుళం ఎంపీ కె.రామ్మోహన్‌నాయుడుతోపాటు, 13 కేంద్రమంత్రిత్వశాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంలో, బీజేడీ ఎంపీ ప్రసన్నకుమార్‌ పట్సానీ మాట్లాడుతూ ‘‘విశాఖపట్నం మంచి నగరం. దానికి కొత్త రైల్వేజోన్‌ ఇవ్వడానికి మాకేమీ అభ్యంతరంలేదు. రైల్వేశాఖ దగ్గర కూడా డబ్బులున్నాయి. జోన్‌ ఏర్పాటుచేయడానికి ఇంకెందుకు ఆలస్యం’’అని కేంద్ర రైల్వేశాఖ అధికారులను అందరి ముందు ప్రశ్నించారు.

modi 31082018 3

విభజన చట్టం అమలు సమీక్ష సమయంలో రైల్వేజోన్‌ అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు ప్రసన్న కుమార్‌ పట్సానీ మాట్లాడుతూ విశాఖ రైల్వేజోన్‌ను తామేమీ వ్యతిరేకించడంలేదని స్పష్టం చేశారు. అప్పుడు రామ్మోహన్‌నాయుడు జోక్యం చేసుకుంటూ ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ ఎంపీలు ఇద్దరూ ఇక్కడే ఉన్నాం... ఇద్దరూ ముక్తకంఠంతో జోన్‌ ఏర్పాటుచేయాలని కోరుతున్నప్పుడు మీరెందుకు నిర్ణయం తీసుకోరని రైల్వే అధికారులను ప్రశ్నించారు. అందుకు ఆ శాఖ తరుఫున హాజరైన డైరక్టర్‌ స్థాయి అధికారులు స్పందిస్తూ రైల్వేజోన్‌ ఆర్థికంగా లాభదాయకం కాదని నివేదిక వచ్చిందని, అయినప్పటికీ తమ మంత్రి దానిపై కసరత్తు చేస్తున్నారని పాత సమాధానమే ఇచ్చారు. సమావేశంలో పాల్గొన్న అధికారులను స్థాయీ సంఘం సభ్యులంతా పెండింగ్‌ అంశాల అమలు తీరుపై ఆరాతీశారు.

చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగా, ఎంతో ముందు చూపుతో, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించారు. కాని, ఆ ఫలాలు అందుకునే టైంలో, ఆయన ఓడిపోయారు. తరువాత రాజశేఖర్ రెడ్డి గద్దెనెక్కారు. చంద్రబాబు పెంచిన ఫలాలు అన్నీ రాష్ట్రాభివృద్ధి కాక, తన సొంత ప్రయోజనాలకి వాడుకున్నారు. ఇక కొడుకు చేసిన దోపిడీ అయితే అంతే లేదు. ఇలాంటి దోపిడీల్లో ఒకటి ఎర్రచందనం. అప్పట్లో చంద్రబాబు ముందు చూపుతో అలోచించి, ఎర్రచందనానికి విదేశీ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది అని, అందుకే నల్లమల్ల ఆడవులలో వీటిని పెంచి, రాష్ట్ర ఖజానాకు ఆదయవనరుగా మార్చాలని అనుకున్నారు. దానికి తగ్గ పరిశోధనలు జరిపి, నల్లమల్ల అడవుల్లో, ఎర్రచందనం పెంచేలా చేసారు. కాని తరువాత రాజశేఖర్ రెడ్డి తన మనుషుల చేత ఏమి చేసాడో అందరికీ తెలుసు.

yerra 310820182

ఈ ఎర్రచందనం దొంగలు, కొంత మందిని ఎమ్మల్యేలను కూడా చేసాడు రాజశేఖర్ రెడ్డి. అయితే, మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత సీన్ మారిపోయింది. వరుస ఎన్కౌంటర్లతో, స్మగ్గలర్లని వెంటాడారు. దీంతో కొంత మేరకు స్మగ్గ్లింగ్ తగ్గింది. ఈ పట్టుబడిన ఎర్రచందనం ఇప్పుడు, రాష్ట్ర ఖజానాకు ఆదాయ వనరుగా మారింది. ఇప్పటికే 10 విడతల అమ్మకం పూర్తయ్యింది. తాజాగా, 11వ విడత వేలం కూడా చేసారు. 11వ విడత వేలంలో 355 టన్నుల ఎర్రచందనం విక్రయించారు. దీంతో ఏపీ ప్రభుత్వ ఖజానాకు రూ.141 కోట్ల ఆదాయం వచ్చింది.

yerra 31082018 3

ప్రపంచ వ్యాప్తంగా ఎర్రచందనానికి మంచి డిమాండ్ ఉంది. దీంతో కొందరు స్మగ్లర్లు నల్లమల్ల అడవుల్లోకి చొర‌బ‌డి దొంగచాటుగా ఎర్రచందనం చెట్లను నరికి అక్రమ రవాణా చేస్తుంటారు. ఈ నేపథ్యంలో పోలీసులకు పట్టుబడిన ఎర్రచందనం దుంగలను తాజా వేలంలో విక్రయించారు. ఏపీ ప్రభుత్వం ఎర్రచందనం రవాణాను నిషేధించిన విషయం తెలిసిందే. ఈ చెట్టు కలపతో చేసే వాయిద్యాలను జపాన్‌ వాసులు సంగీత సాధనంగా ఉపయోగిస్తారు. ఆ సంగీత సాధనం ప్రతి ఇంటిలో ఉండటం వాళ్లు ఆచారంగా భావిస్తారు. అందుకే ఈ కలపను చైనా ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది. ఈ కలపతో వారు బొమ్మలు, సంగీత పరికరాలు తయారు చేసుకుంటారు. అంతేకాకుండా వీరు ఎర్రచందనంతో చేసిన పరికరాలు ఇంట్లో ఉంటే వారికి అదృష్టం కలిసి వస్తుందని భావిస్తారట.

Advertisements

Latest Articles

Most Read