సరైన మనుషులకు అయితే ఒకసారి చెప్తే అర్ధమవుతుంది.. కొంచెం తిక్క ఉన్న వాళ్ళకు ఒకటికి రెండు సార్లు చెప్తారు, చివరకు వింటారు.. కొన్ని వింత జీవులు, ఎన్ని చెప్పినా, ఎన్ని చూపించనా వినరు.. అలాంటి వారికి, వారికి అర్ధమయ్యే భాషలో చెప్పాలి అంటే, కొంత డోస్ పెంచాలి.. అందుకే జీవీఎల్ విషయంలో, కుటుంబరావు గారు, కొంచెం డోస్ ఎక్కువ పెంచారు. ఇప్పుడైనా, పాపం తగ్గుతుందో లేదో.. గత నాలుగు రోజులుగా జీవీఎల్ ఎంత చిత్ర విచిత్రంగా ప్రవర్తించి, ట్వీట్లు వేసి, వరుసపెట్టి బురద జల్లాడో చూసాం. దానికి విరుగుడు ఇవ్వటానికి, కుటుంబరావు గారు ప్రెస్ మీట్ వాయించారు. జీవీఎల్ నరసింహారావు మతిభ్రమించి మాట్లాడుతున్నారని సి.కుటుంబరావు ధ్వజమెత్తారు.
‘జీవీఎల్ ఓ కొత్తకోతి. కోతికి కొబ్బరిచిప్ప ఇచ్చినట్లు.. బీజేపీ ఆయనకు రాజ్యసభ పదవి ఇచ్చింది. వారాంతంలో ఢిల్లీ నుంచి వచ్చి, ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేసి, తిరిగి ఢిల్లీ వెళ్లిపోవడం ఆయనకు ఆలవాటైపోయింది. సస్టెయినబుల్ ఇండియా ఫైనాన్స్ ఫెసిలిటీ కింద(ఎస్ఐఎ్ఫఎఫ్) ఫ్రాన్స్‌కు చెందిన ప్రఖ్యాత బ్యాంకు బీఎన్పీ పారిబా నుంచి ఏపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా అప్పు తీసుకోలేదు. అయినా రూ.16వేల కోట్ల అప్పు తీసుకుందని జీవీఎల్ ఆరోపిస్తారా? అందుకే ఐక్యరాజ్యసమితిలో చంద్రబాబు మాట్లాడేందుకు అవకాశమిచ్చారని అంటారా? ఏమైనా అర్థముందా? జీవీఎల్ రోగ్ పొలిటీషియన్.. రోగ్ ఎంపీ.. ఆయనపై రాజ్యసభ కమిటీకి ఫిర్యాదు చేస్తాం’ అని తెలిపారు. కాగా, అబద్ధపు ప్రచారాలతో గోబెల్స్‌నే మించిపోయిన జీవీఎల్‌ను జనం ఒక వింత జీవిగా చూస్తున్నారని శాప్ మాజీ చైర్మన్ పీఆర్ మోహన్ ఎద్దేవా చేశారు.
సుస్థిర భారత ఆర్థిక విధానం కింద యూఎన్ఈపీతో జూన్ 2న రాష్ట్ర ప్రభుత్వం పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుందన్నారు. దీని కింద ఏపీ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని చెప్పారు. రూ.16వేల కోట్లు అప్పుచేసినందునే ముఖ్యమంత్రికి ఐరాసలో మాట్లాడే అవకాశం ఇచ్చారని జీవీఎల్ వ్యాఖ్యానించడంలో అర్థం లేదన్నారు. ఒక స్టాక్బ్రోకర్ను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడ్ని చేశారని తనను విమర్శించారని.. ఒకప్పుడు స్టాక్‌బ్రోకర్‌గా ఉన్న అమిత్‌షా భాజపా అధ్యక్షుడు కాలేదా అన్నారు. అగ్రిగోల్డ్‌తో తనకు సంబంధముందని ఆరోపించిన వైకాపా నాయకుడు పార్థసారథి తక్షణమే రుజువు చేయాలని, లేకుంటే ఆయనపై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు.