ప్రతిష్టాత్మక వరల్డ్ ఎకనమిక్ పోరమ్ ఆహ్వానం పై ఇండియా ఎకనమిక్ సమ్మిట్-2017 లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రసంగించనున్నారు. గురువారం న్యూఢిల్లీలో జరగనున్న ఈ సదస్సులో 'పౌష్టిక ఆహార వ్యవస్థ" అనే అంశం పై ఇంటరాక్టివ్ ప్యానెల్ సెషన్లో ఉపన్యాసించనున్నారు.
సిఐఐ సహకారంతో నిర్వహిస్తున్న ఈ అంతర్జాతీయ సదస్సుకు దేశవిదేశాల ప్రతినిధులు హాజరవుతున్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం భవిష్యత్ తరాలకు ఆహార భద్రత , వ్యవసాయం అనే అంశం పై చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి, రాయిటర్స్ మార్కెట్ లైట్ వ్యవస్థాపకులు అమిత్ మెహ్ర, నెస్లే ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ నారాయణ, యుపిఎల్ లిమిటెడ్ సిఇవో జైష్రాఫ్, ఐడిఎఫ్సి సిఇవో రూబెన్ అబ్రహం తదితర ప్రముఖులు సదస్సులో పాల్గొంటున్నారు..
ఆహార ර రంగంలో ఎదురవుతున్న సవాళ్లు, మాంసం ఉత్పత్తుల నుంచి మొదలుకుని సాధారణ ఆహారం, సాంకేతిక పరిష్కరాలు తదితర అంశాల పై సదస్సులో లోతుగా చర్చిస్తారు. ఈ రంగంలో సాంకేతిక ఉన్న అవకాశాలు, కొత్త వ్యాపార అవకాశాలు, రూపొందించాల్సిన విధానాలు, తదితర అంశాలపై దృష్టిసారిస్తారు.
ఆహర పౌర సరఫరాల రంగంలో సాంకేతిక పరిజానాన్ని ఉపయోగించడంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది. ప్రత్యేకించి రేషన్ దుకాణాల్లో ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్, రియల్ టైమ్ గవర్నెన్స్ అమలు చేయడంలో ప్రభుత్వం గణనీయ ఫలితాలు సాధిస్తోంది. వ్యవసాయ అనుబంధ రంగాల్లో తొలి త్రైమాసిక ఫలితాల్లో 27.6 శాతం వృద్ధిని నమోదు చేసింది. వ్యవసాయ రంగానికి ఊపనిచ్చేందుకు నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఈ రంగంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతోంది. ఈ అంశాలన్నింటిని సీఎం చంద్రబాబునాయుడు తన ప్రసంగంలో ప్రస్తావించే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి.
వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహిస్తున్న పలు సదస్సులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. వ్యాపార రంగంలోని దిగ్గజాలతో సమావేశమై రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని పెట్టుబడుల అవకాశాల పై ప్రపంచ వేదికల పై ప్రస్తావిస్తూ ప్రగతికి బాటలు వేస్తున్నారు.