చాలా రోజుల తరువాత, గవర్నర్ నరసింహన్, చంద్రబాబుతో భేటీ కానున్నారు... ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది... ఇప్పటికే రాజ్ భవన్ వేదికగా, ఆంధ్ర రాష్ట్రం పై కుట్రలు జరుగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి... పవన్ కళ్యాణ్ ని, బీజేపీకి దగ్గర చేసింది నరసింహన్ అని, కేంద్ర పెద్దల ఆదేశాల ప్రకారం, పవన్ తో స్క్రిప్ట్ నడిపించే బాధ్యత గవర్నర్ తీసుకునట్టు, మీడియాలో కూడా ప్రచారం సాగుతుంది... మరో పక్క, చంద్రబాబు కంద్రంలో నుంచి బయటకు వచ్చి, ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి, పెద్ద ఎత్తున కేంద్రం పై ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే... ఈ పరిణామాల నేపధ్యంలో, గవర్నర్ విజయవాడ వచ్చి, చంద్రబాబుతో భేటీ కావటంతో, అందరూ ఇటు వైపు చూస్తున్నారు...
గవర్నర్ ఏదన్నా, రాయబారంతో వస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి... ప్రధాని మోడీ, విదేశి పర్యటన ముగించుకుని వచ్చిన తరువాత, ఆయనకు ఇచ్చిన బ్రీఫింగ్ లో, మొదటిది చంద్రబాబు దీక్ష గురించి... పెద్ద ఎత్తున జాతీయ మీడియా కూడా కవర్ చెయ్యటం, చాలా మంది జాతీయ నాయకులు, ట్విట్టర్ ద్వారా, చంద్రబాబుకి సంఘీభావం ప్రకటించిన విషయం బీజేపీ పెద్దలను కలవర పెడుతుంది... అన్నిటికి అంటే మించి, ఇప్పుడు జాతీయ స్థాయిలో కొత్త పరిణామం చోటు చేసుకోబోతుంది... ఎప్పుడూ లేనిది, దేశంలో అన్ని విపక్షాలు కలిసి, ఆంధ్రప్రదేశ్ విభజన హామీల పై, ప్రధానికి లేఖ రాయనున్నాయి... ఇలా ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు... చంద్రబాబు, ఈ దిశగా అన్ని పార్టీలని ఒప్పించటంలో సఫలం అయ్యారు... ఇలా జరిగితే, ప్రధాని కచ్చితంగా దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది...
ఈ అన్ని పరిణామాలు నేపధ్యంలో, చంద్రబాబుకి ఎమన్నా రాయబారం అందించటానికి గవర్నర్ వస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. అయితే తెలుగుదేశం వర్గాలు మాత్రం, ఏది ఏమైనా, విభజన హామీల పై స్పష్టత, అన్నిటికీ చట్ట బద్దత, టైం బౌండ్ గా హామీలు ఉంటేనే, ఏమైనా స్పందిస్తామని, లేకపోతే అసలు చర్చలే ఉండవని, ఈ విషయం ఇది వరుకే కేంద్రానికి తెగేసి చెప్పమని అంటున్నాయి.. 11 గంటలకు చంద్రబాబు, గవర్నర్ ఒక హోటల్ లో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా విభజన హామీలు, ప్రత్యేక హోదా, రాష్ట్రం పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరి తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏపీలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై ప్రధానంగా చర్చించవచ్చని సమాచారం. గవర్నర్ తో సమావేశం అనంతరం మీడియాతో చంద్రబాబు మాట్లాడే అవకాశం ఉంది.