ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ధర్మ పోరాట దీక్ష అంటూ, మోడీ చేస్తున్న మోసం పై, తన పుట్టిన రోజు నాడే దీక్ష చేస్తున్నా అని ప్రకటించారు... అయితే, చంద్రబాబు దీక్ష అని అనౌన్స్ చేసిన వెంటనే, జాతీయ స్థాయిలో పెద్ద చర్చ మొదలైంది... ముందుగా జాతీయ స్థాయి నేతలను కూడా, ఈ దీక్షకు ఆహ్వానిస్తున్నారని వార్తలు వచ్చాయి... దీంతో, బీజేపీ పెద్దలు నష్ట నివారణ చర్యలు ప్రారంభించారు.. అందులో భాగంగా, జగన్ చేత మరో డ్రామా ఆడించి, చంద్రబాబు దీక్షని డైవర్ట్ చేసే ప్లాన్ చేసారు... దీనిలో భాగంగా, కృష్ణా జిల్లాలో పాదయాత్రలో ఉన్న జగన్, హుటాహుటిన ముఖ్య నాయకులని, కృష్ణా జిల్లాకు రమ్మని కబురు పంపించారు... మరో పక్క ప్రశాంత్ కిషోర్ చేత, సోషల్ మీడియాలో చంద్రబాబుని కించ పరుస్తూ, పోస్ట్లు పెట్టాలని ప్లాన్ చేసారు...
జగన్ ప్లాన్ లో భాగంగా, సరిగ్గా జాతీయ స్థాయి నాయకులు వచ్చే దీక్షలో పాల్గునే టైంకి, తన ఎమ్మల్యేల చేత కూడా రాజీనామా చేపించే ప్లాన్ వేసాడు.., అయితే, చంద్రబాబు దీక్షలో జాతీయ స్థాయి నేతలు పాల్గుంటే, అది రాజకీయంగా మారుతుందని, రాష్ట్రానికి న్యాయం కోసం దీక్ష చేస్తున్నట్టు అవ్వదని భావించి, చంద్రబాబు చివరి నిమిషంలో, జాతీయ స్థాయి నేతలను ఇప్పుడు రావద్దని, మరో సందర్భంలో మీరు వచ్చి సంఘీభావం ప్రకటించ వచ్చు అని చెప్పారు... దీంతో జగన్ కూడా ప్లాన్ మార్చుకున్నాడు... చంద్రబాబు ఎప్పుడైతే, పెద్ద ఎత్తున నిరసన ప్లాన్ చేస్తారో, అప్పుడే తన ఎమ్మల్యేల చేత రాజీనామా చేపించవచ్చని నిర్ణయించారు... జగన్ ప్రతిపాదనను ఢిల్లీ పెద్దలు కూడా, ఒప్పుకున్నారు... అందుకే, చంద్రబాబు దీక్ష డైవర్ట్ చేసే బాధ్యత పవన్ కళ్యాణ్ కు అప్పచెప్పారు...
పవన్ కళ్యాణ్ సరిగ్గా ఢిల్లీ పెద్దలు చేసినట్టే చేసారు... శ్రీ రెడ్డి వివాదంలో, తన తల్లి ప్రస్తావన రావటంతో, ఇదే అవకాశంగా మలుచుకున్నారు... మూడు రోజుల తరువాత, తన తల్లి తిట్టారు అంటూ బయటకు వచ్చి, శ్రీ రెడ్డి ఉదంతం, చంద్రబాబు చేపిస్తున్నారు అంటూ, ఒక కట్టు కధ అల్లారు... సరిగ్గా చంద్రబాబు దీక్ష రోజునే, అదీ తన తల్లిని తిట్టిన మూడు రోజుల తరువాత వచ్చి హంగామా చేసారు... శ్రీ రెడ్డి ఉదంతాన్ని, చంద్రబాబుకి ముడి పెట్టే ప్రయత్నం చేసి, సెన్సేషన్ చేసే ప్రయత్నం చేసారు.. దీనికి తోడూ కొంత మంది టీవీ వాళ్ళని కూడా ఈ రొచ్చులోకి లాగి, చంద్రబాబు, టీవీ9, ABN, లోకేష్, TV5, మహా టీవీ అందరూ తన మీదకి శ్రీ రెడ్డిని పంపించారు అంటూ, ప్రజలని మభ్యపెట్టే ప్రయత్నం చేసారు... మొత్తానికి ప్లాన్ ప్రకారం, చంద్రబాబు దీక్షను జగన్ డైవర్ట్ చెయ్యాల్సి ఉంటే, చివరి నిమిషంలో ఢిల్లీ పెద్దలు, పవన్ ని రంగంలోకి దించి, డ్రామాలు ఆడించే ప్రయత్నం చేసి, చంద్రబాబు దీక్షని డైల్యుట్ చేసే ప్రయత్నం చేసి, విఫలం అయ్యారు...