ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడుగా పరకాల ప్రభాకర్‌ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. జగన్ చేస్తున్న వ్యాఖ్యలకు నొచ్చుకుని, చంద్రబాబుకు ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో, పరకాల ఆ పదవికి రాజీనామా చేసి, దూరంగా ఉంటున్నారు. దాదాపు పరకాల ప్రభాకర్‌ నాలుగేళ్ళ పాటు ఆయన ఆ పదవిలో కొనసాగారు. ఈ నేపధ్యంలో, ఆయన అమరావతి నుంచి వెళ్ళిపోయి, హైదరాబాద్ లో ఉంటున్నారు. ఈ నేపధ్యంలో, పరకాల ప్రభాకర్‌ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే విషయం పై ఊహాగానాలు మొదలయ్యాయి. రానున్న రోజుల్లో ప్రభాకర్‌ రాజకీయ పరంగా ఏ నిర్ణయం తీసుకుంటారన్న దానిపై ఇటు ఆయన ఆనుచరులతో పాటు ఇతర పార్టీల్లోనూ ఆసక్తికరమైన చర్చ నెలకొంది.

parakala 09072018 2

పరకాల ప్రభాకర్‌ ఫ్యామిలీ అంతా రాజకీయలతో ముడి పడి ఉంది. గతంలో పరకాల కుటుంబానికి నరసాపురంలో రాజకీయపరంగా ఎంతో పట్టు ఉంది. ఇప్పటికీ ఆయన కుటుంబం పై, అక్కడ మంచి పేరు ఉంది. పరకాల ప్రభాకర్‌ తండ్రి శేషావతరం రెండు సార్లు కాంగ్రెస్‌ హయాంలో మంత్రిగా పనిచేశారు. పరకాల ప్రభాకర్‌ తల్లి కాళికాంబ కూడా ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ప్రభాకర్ సతీమణి నిర్మలా సీతారామన్‌ కేంద్ర కేబినెట్‌లో కీలక పదవి నిర్వహిస్తున్నారు. ఆమె నరసాపురంలోని తూర్పుతాళ్ళు, పీఎంలంక గ్రామాలను దత్తత తీసుకుని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దారు. ఇటు ప్రభాకర్‌ కూడా ప్రభుత్వ సలహాదారు హోదాలో సీతారాంపురం గ్రామానికి దత్తత తీసుకుని అభివృద్ధి చేపట్టారు.

parakala 09072018 3

అయితే ప్రభాకర్‌ ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేసిన తరువాత మౌనం వహించారు. తన భవిష్యత్‌ రాజకీయాలపై ఎటువంటి ప్రకటన చేయలేదు. నాలుగేళ్ళ కాలం నుంచి ఆయన పార్టీలకు దూరంగా ఉంటూ సీఎం సలహాదారుడిగా వ్యవహరించారు. ఈనేపథ్యంలో రానున్న రోజుల్లో ప్రభాకర్‌ మళ్లీ రాజకీయాల్లోకి వస్తారా.? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో ప్రభాకర్‌ నరసాపురం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఒకసారి స్వల్ప మెజార్టీతో ఓటమి చెందారు. ఇక కాంగ్రెస్‌ పార్టీలో పలు పదవులు నిర్వహించారు. ఆ తరువాత బీజేపీలో చేరారు. నరసాపురం పార్లమెంట్‌ అభ్యర్థిగా ఆపార్టీ తరుపున పోటీ చేశారు. ఆ తరువాత ఉభయగోదావరి జిల్లాలా ఎమ్మెల్సీ స్ధానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు.

పవన్ ఏ ప్రకటన చేసినా అందులో కన్ఫ్యూజన్ పీక్స్ లో ఉంటుంది. మొన్నటి దాకా, ప్రజా రాజ్యం పార్టీకి, జనసేనకు సంబంధం లేదు అన్నారు. మరో పక్క చిరంజీవికి రాజకీయంగా ఈ స్థితి పట్టించిన వారిని వదిలిపెట్టం అంటాడు. చిరంజీవి పార్టీని కాంగ్రెస్ లో కలిపేసి, రాజ్యసభ మెంబెర్ అయ్యి, మంత్రి అయితే, దానికి ఎవరినో అనటం ఏంటో, ఎవరికీ అర్ధం కాదు. కాంగ్రెస్ పార్టీని తిడతాడు, కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్న అన్నను మాత్రం ఏమి అనడు. ఇలా అనేక సార్లు, ప్రజా రాజ్యం పార్టీ పతనానికి, కక్ష తీర్చుకోవటం కోసమే, రాజకీయాల్లోకి వచ్చాను అనే విధంగా, పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉంటారు. ఈ రోజుతో, జనసేన = ప్రజారాజ్యం 2 అనేది కన్ఫర్మ్ అయిపొయింది. జనసేన పార్టీ ఎవరిదో కాదని, మెగాస్టార్‌ చిరంజీవి అభిమానుల్లో ఒకరిది అంటూ, చిరంజీవి అభిమానులని, మాజీ ప్రజారాజ్యం కార్యకర్తల్ని, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారిని, ఈ రోజు జనసేనలోకి ఆహ్వానించారు.

janasena 09072018 2

ఇలా ఆహ్వానించటం తప్పు కాదు. ప్రజారాజ్యం నుంచి, జనసేనలోకి రావటం తప్పు కాదు. చిరంజీవే వచ్చి, జనసేనలోకి చేరినా అభ్యంతరం ఎవరికీ ఉండదు. కాని పవన్ కళ్యాణ్ ఇచ్చే బిల్డ్ అప్ లు, చేసే హడావిడి చూస్తే మాత్రం, ప్రజలు కచ్చితంగా ప్రశ్నిస్తారు. పవన్ కళ్యాన్ కు అండగా ఉండేందుకు మెగా ఫ్యామిలీ అభిమానులు అంతా రెడీ అయ్యారు. వీరు ఇది వరకు ప్రజా రాజ్యం పార్టీలో ఉన్నారు. మెగా ఫ్యామిలీ అభిమానులంతా ఒకే గూటికి చేర్చటమే ప్రధాన అంశంగా ఉంటుందని అంటున్నారు. మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్గా ఉంటూనే రాజకీయంగా జనసేన కు జై కొట్టాలనే ఎజెండాతోనే ఈ భేటీ జరుగుతుందని తెలుస్తోంది.

janasena 09072018 3

అయితే చిరంజీవి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నప్పటికీ ఆయన అభిమానులు మాత్రం కాంగ్రెస్ రాజకీయాలకు దూరంగానే ఉంటూ వస్తున్నారని అంటున్నారు. దానికి తోడు చిరంజీవి మళ్లీ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించే పరిస్థితిలు కూడా కన్పించటంలేదు. ప్రజారాజ్యానికి అండగా నిలిచి పార్టీకోసం వని చేశారు. పవన్ కళ్యాణ్ పార్టీని స్థాపించి పూర్తి టైం రాజకీయాలకు కేటాయిస్తున్న నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ అంతా ఆయనకు అండగా నిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. మెగా ఫ్యామిలీలో అందరూ రాజకీయాల్లో పాల్గొనక పోయినప్పటికీ వారంతా పవన్ కళ్యాణ్ స్థాపించిన పార్టీకే అండగా నిలిచే అవకాశం ఉందని చిరంజీవి అభిమాని ఒకరు వ్యాఖ్యానించారు. అయితే, మొన్నటి దాకా, నా దారి వేరు, చిరంజీవి దారి వేరు అని చెప్పిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు సడన్ గా ప్లేట్ మార్చటం వెనుక భారీ ప్లాన్ ఉంది అంటున్నారు. చివరి సీన్ లో, జనసేన సినిమాలోకి, చిరంజీవి ఎంట్రీ ఇస్తారని, అందుకే ముందుగా గ్రౌండ్ వర్క్ రెడీ చేస్తున్నారని అంటున్నారు. ఈ పరిణామాలు అన్నీ చూస్తుంటే, మూసేసిన కంపెనీ, తెరుచుకున్నట్టు, ప్రజా రాజ్యం పార్టీ - 2 మళ్ళీ ప్రజల ముందుకు వస్తుంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న రాజకీయ వైరం నేపధ్యంలో, పోలవరం ప్రాజెక్ట్ కు నెలకున్న ప్రధాన అడ్డంకి తొలగింది. పోలవరం స్టాప్‌ వర్క్‌ ఆర్డర్‌పై స్టే కొనసాగింపునకు కేంద్ర ప్రభుత్వం, జూలై 2న ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. అయితే, దీని పై రెండు మూడు నెలల ముందు నుంచే, అధికారులు ఫాలో అప్ అవుతున్నా, కేంద్రం పట్టించుకోలేదు. గడువు దగ్గర పడే టైంకి, ఒకసారి కేంద్ర అధికారులు విదేశీ పర్యటనలో ఉంటే, ఒకసారి మంత్రి విదేశీ పర్యటనలో ఉన్నారు. జూలై 2 తరువాత కూడా, కేంద్రం ఉత్తర్వులు ఇవ్వకపోవటంతో, రాష్ట్ర ప్రభుత్వానికి టెన్షన్ మొదలైంది. దీన్ని కూడా ఎదో ఒక సాకు చూపి, ఆర్డర్స్ ఇవ్వరు అని కంగారు పడ్డారు. అయితే, దాదాపు వారం రోజులు టెన్షన్ పెట్టి, కేంద్ర ప్రభుత్వం, మరో సంవత్సరం పాటు, పోలవరం స్టాప్‌ వర్క్‌ ఆర్డర్‌పై స్టే కొనసాగిస్తూ, ఈ రోజు ఉత్తర్వులు ఇచ్చింది.

poalvarma 09072018 2

ఇదీ నేపధ్యం... పోలవరం ప్రాజెక్టుపై ఒడిసా, చత్తీ‌సగఢ్‌ అభ్యంతరాల నేపథ్యంలో నిర్మాణ పనులు ఆపేయాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) 2015 చివరిలో ‘స్టాప్‌ వర్క్‌’ ఆదేశాలిచ్చింది. అప్పటి కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిగా ఉన్న ప్రకాశ్‌ జావడేకర్‌ ఆ ఆదేశాల పై 2016లో స్టే ఉత్తర్వులిచ్చారు. దీంతో.. 2017 జూన్‌ 2వ తేదీ దాకా పనులు కొనసాగించే అవకాశం కలిగింది. ఈ గడువు ముగిసేలోగా మరోసారి స్టేను పొడిగించాలని రాష్ట్రప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా జావడేకర్‌తో మాట్లాడి స్టేను పొడిగించాలని కోరారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించి.. ఏకంగా రెండేళ్లపాటు స్టే పొడిగిస్తూ ఫైలుపై సంతకం చేశారు. ఇది అమల్లోకి వచ్చి ఉంటే 2019 దాకా స్టే ఉత్తర్వు కొనసాగేది.

poalvarma 09072018 3

అయితే.. ఈ స్టే ఉత్తర్వు జారీ చేసేలోగా జావడేకర్‌ను మానవ వనరుల అభివృద్ధి శాఖకు మార్చారు. ఆయన స్థానంలో కేంద్ర అటవీ పర్యావరణ శాఖ బాధ్యతలను అనిల్‌ దవే స్వీకరించారు. స్టే కాలపరిమితిపై పలు సందేహాలు వ్యక్తం చేసి.. చివరకు స్టాప్‌ ఆర్డర్‌పై స్టేను ఏడాదికే పరిమితం చేశారు. ఇప్పుడు మరోసారి, సంవత్సరం పాటు కేంద్రం దీన్ని పొడిగించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం, ఇలా ఏడాడి ఏడాడి కాకుండా, ప్రాజెక్ట్ పూర్తి చేసేంతవరకు, ఉత్తర్వులు ఇవ్వాలని, ఎంత కోరినా, కేంద్రం మాత్రం దానికి ఒప్పుకోలేదు. దీని వెనుక రాజకీయ కారణం కనిపిస్తుంది. ఇలా అయితే, రాష్ట్రం ఆయువపుట్టు తన చేతిలో ఉంచుకోవచ్చు అని కేంద్రం భావాన. అందుకే సంవత్సర కాలం పాటే, పర్మిషన్ ఇస్తూ, ప్రతి సంవత్సరం టెన్షన్ పెడుతుంది.

రాముడి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన, సినీ విమర్శకుడు కత్తి మహేష్‌పై హైదరాబాద్ పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. కత్తి మహేష్‌ను హైదరాబాద్ నుంచి బహిష్కరిస్తూ డీజీపీ మహేందర్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా కత్తిమహేశ్ వ్యాఖ్యలు చేశారని డీజీపీ తెలిపారు. సీటీ పోలీస్ యాక్ట్, నేరగాళ్ల నియంత్రణ చట్టం ప్రకారమే కత్తిపై నగర బహిష్కరణ వేటు వేశామని చెప్పారు. మహేష్‌ను ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లలో వదిలేస్తామని తెలిపారు. బహిష్కరణను అతిక్రమించి నగరంలోకి అడుగుపెట్టే ప్రయత్నం చేస్తే మూడేళ్లపాటు శిక్షపడే నేరమవుతుందని అన్నారు. అందుకే ఆరు నెలల పాటు, తను హైదరాబాద్ రాకూడదు అని, ఆంధ్రప్రదేశ్ లో దింపేస్తున్నామని అన్నారు.

kathi 09072018 2

అయితే, ఈ విషయం పై ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా చాలా కఠినంగా ఉన్నారు. తెలంగాణాలో తప్పు చేసిన వ్యక్తిని, హైదరాబాద్ నుంచి బహిష్కరించారు బాగానే ఉంది కాని, అతన్ని ఆంధ్రప్రదేశ్ కి తీసుకురావటం ఏంటి అని అంటున్నారు. తప్పు ఎక్కడ చేసినా తప్పే అని, అలాంటిది అక్కడ శిక్షించకుండా, ఆంధ్రప్రదేశ్ మీద వదిలేయటం ఏంటి అని అంటున్నారు. కత్తి మహేష్ ను మరెక్కడైనా దింపుకోండి అని, తెలంగాణా పోలీసులకు చెప్పినట్టు సమాచారం. తప్పు చేసాడు అని చెప్తూ, అతన్ని మా మీదకు వదలటం ఏంటి అని, మీరు అతన్ని ఆంధ్రప్రదేశ్ లో విడిచి పెడితే, మేము తీసుకొచ్చి మళ్ళీ అతన్ని హైదరాబాద్ లోనే విడిచిపెడతాం అని ఆంధ్రా పోలీసులు, తెలంగాణా పోలీసులకు చెప్పినట్టు తెలుస్తుంది.

kathi 09072018 3

కత్తి మహేశ్‌ భావవ్యక్తీకరణ పేరుతో టీవీ ఛానళ్లను వేదికగా చేసుకుని మెజార్టీ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలకు నిరసనగా కొన్ని హిందూ ధార్మిక సంస్థలు తీవ్రంగా స్పందించాయి. భావ వ్యక్తీకరణ అనేది ప్రాథమిక హక్కు అయినప్పటికీ.. దానివల్ల సమాజంలోని ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా వ్యవహరించాలి. అయితే హైదరాబాద్ పోలీసులు అక్కడ శిక్షలు వెయ్యకుండా, అతన్ని ఆంధ్రాలో తీసుకొచ్చి పడేయటం వెనుక, రాజకీయ కుట్ర లేకపోలేదని పోలీసు వర్గాలు కూడా భావిస్తున్నాయి. అతని మీద చర్యలు తీసుకునేలా ఆంధ్రప్రదేశ్ మీద ఒత్తిడి తేవటం, చర్యలు తీసుకుంటే ఒకలా, తీసుకోకుంటే ఒకలా, ఆందోళన చెయ్యటానికి కుట్ర పన్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే ఆంధ్రా పోలీసులు ఈ తలనొప్పి మాకెందుకని, మీరు ఎక్కడైనా అతన్ని తీసుకెళ్ళండి కాని, ఆంధ్రప్రదేశ్ లో దింపితే మాత్రం, అతన్ని తీసుకొచ్చి హైదరాబాద్ లో దింపేస్తాం అని చెప్పినట్టు సమాచారం..

Advertisements

Latest Articles

Most Read