ఈ రోజు బీజేపీ ఎంపీ సి.ఎం రమేష్ కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్ర పోలీసు వ్యవస్థ పై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేసారు. రాష్ట్ర పోలీసులు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారని ఆయన మండిపడ్డారు. వాళ్ళు చేసే ప్రతి పనిని కేంద్ర హోం శాఖ గమనిస్తూనే ఉందని ఆయన చెప్పారు. త్వరలోనే పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేసేలా కేంద్రం చర్యలు తీసుకుంటుదని సి.ఎం రమేష్ స్పష్టం చేసారు. పార్టీలు అధికారంలోకి వస్తాయి.. పోతాయి.. వ్యవస్థలు ముఖ్యమని , ఎవరు ఎలా ఉన్న పోలీస్ వాళ్ళ విధులను వాళ్ళు కరెక్ట్ గా నిర్త్వర్తించాలి కదా, అంతే కాని మీ ఇష్టానికి చేస్తే ఎలా అని ప్రశ్నించారు. మీరు ఆ రాష్ట్రానికే శాస్వతం కాదు,అవసరమైతే కొందరు ఐపీఎస్‍లను కేంద్రం రీకాల్ చేస్తుంది, ఈ రాష్ట్ర పోలీసులు తీరును మార్చుకోవాలిసిన అవసరం చాలా ఉందని, ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈనెల 28న బీజేపీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు సి.ఎం రమేష్ తెలిపారు. యువకుడు, తెలుసుకుంటాడని, ఫెడరల్ వ్యవస్థలో కేంద్రం జోక్యం మంచిది కాదని, ఇన్నాళ్ళు ఆగమని, కేంద్రం ఏపి పోలీస్ తీరుని, టెలిస్కోప్ లో గమనిస్తుందని, త్వరలోనే మార్పులు ఉంటాయని అన్నారు.
news
పోలీసుల ఓవరాక్షన్ పై, కోర్టు ఆగ్రహం...
ఈ రోజు తుళ్లూరులో పోలీస్ ల ఓవరాక్షన్ పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తుళ్లూరు పోలీసులపై మంగళగిరి కోర్టు జడ్జి ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఐ దుర్గాప్రసాద్ సహా పలువురు పోలీసులపై చర్యలకు ఆదేశించారు. జరిగిందేంటే, నిన్న రాత్రి ఒక కేసులో నిందితులను అరెస్ట్ చేసారు. జడ్జి ముందు ప్రవేశ పెట్టకముందే వారిని చిత్రహింసలుకు గురిచేసారు. ఆ తరువాత వారిని జడ్జి ముందుకు తీసుకు వెళ్లారు. ఇదే విషయాన్ని నిందితులు కోర్టుకు చెప్పారు. పోలీసులు తమను చిత్రహింసలకు గురిచేసారని జడ్జి ఎదుట చెప్పటంతో వెంటనే వాళ్లకు వైద్య పరీక్షలు నిర్వహించాలని మంగళగిరి కోర్టు జడ్జి ఆదేశించారు. నిందితులను వెంటనే జీజీహెచ్‍కు తరలించి, వైద్య పరీక్షలు నిర్వహించగా జీజీహెచ్ వైద్యులు నిందితులకు గాయాలు ఉన్నట్లు నివేదిక ఇచ్చారు. దీనితో ఆ 8 మంది నిందితుల రిమాండ్ రద్దు చేసి వెంటనే విడుదల చేయాలని జడ్జి ఆదేశాలు జారి చేసారు. నిందితులను కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి ఆదేశించారు.
విజయసాయి రెడ్డికి సిబిఐ కోర్టు షాక్...
కోర్టు విచారణకు రాకుండా, మినహాయింపులు కోరటం పై, మొన్న జగన్ మోహన్ రెడ్డికి కోర్టు జర్క్ ఇస్తే, నేడు విజయసాయి రెడ్డికి కోర్టు షాక్ ఇచ్చింది. సిబిఐ కోర్టులోజగన్ అక్రమాస్తుల కేసులో విచారణ నిన్న కూడా కొనసాగింది . రెండు రోజుల క్రితమే సిబిఐ కేసులో ఉన్నటువంటి A1 జగన్ మోహన్ రెడ్డి, A2 విజయ సాయి రెడ్డి విచారణకు హాజరు కాకపోవడంతో చాల సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నిన్న మరోసారి జగతి పుబ్లికేషన్ ఈడి కేసుల్లో విచారణ పెటీషన్ పైన వాదనలు కొనసాగాయి . విజయసాయి రెడ్డి విచారణకు ఎందుకు హాజరు కాలేదు అంటూ CBI కోర్టు ప్రశ్నించింది. అయితే విజయ సాయి రెడ్డి న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ పార్లమెంట్ సమవేసాలు కోసం డిల్లికి వెళ్ళినందున విచారణకు హాజరు కాలేదు అని సమర్ధించారు. అయితే విచారణకు విజయ సాయి రెడ్డి తప్పకుండా హాజరు కావాలని సిబిఐ కోర్టు స్పష్టం చేసింది. విజయసాయి రెడ్డి న్యాయవాదులు తమ క్లైంట్ పార్లమెంట్ సమవేసాలు వళ్ళ రాలేదని మెమో దాఖలు చేసారు. దీనికి సంబదించి ఈ కేసును, సిబిఐ కోర్టు ఈ నెల 30 కి వాయిదా వేయడం జరిగింది. మరోవైపు హిందు టెక్ డిశ్చార్జ్ పిటీషన్ పై ఉన్నటువంటి జగన్ వాదనలు కూడా నిన్న ముగిసాయి. దీనిని కూడ ఈ నెల 30 కి వాయిదా వేయడం జరిగింది.
దీనిపై సిబిఐ కోర్టు 30 న ఒక కీలకమైన నిర్ణయం తీసుకోనే అవకాసం ఉంది. ఇక ఈ ఎపిసోడ్లో ప్రదానంగా నమోదైనటువంటి కేసులు కావచ్చు, రోజు వారి విచారణ కావచ్చు, వీటి పై త్వరలోనే ఒక నిర్ణయం వెలువడే అవకాసం ఉంది. A1 గా ఉన్నటువంటి జగన్ మోహన్ రెడ్డి, A2 విజయ సాయి రెడ్డి విచారణకు వ్యక్తిగతంగా హాజరుకాక పోవడంతో ఇప్పటికే పలుమార్లు CBI కోర్టు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. తదుపరి విచారణకు హాజరు అవుతారా లేదా అనే విషయం పై క్లారిటీ రావలిసిన అవసరం ఉంది. ఇప్పటికే హైకోర్ట్లో కూడా జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని కూడా హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు చేసారు. దానిపై కూడా వాదనలు ముగిసాయి. ఆ తీర్పు కోసం కూడా వెయిట్ చేస్తున్నామంటూ కూడా గత రెండు రోజుల క్రితమే CBI కోర్టుకు కూడా చెప్పడం జరిగింది. తీర్పు వచ్చిన తరువాత విచారణకు హాజరు కావలా, వద్దా అనేది హైకోర్ట్ ఇచ్చే ఉత్తర్వులు మీద ఆదారపడి ఉంటుందని వారు చెప్పారు. ఇంకా తీర్పు రాకముందే మీరు ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారని, తీర్పు వచ్చేవరకు మీరు తప్పకుండ విచారణకు మీరు హాజరు కావాలని CBI కోర్టు చురకలు అంటించింది.
హీరో నానికి మద్దతుగా గళం విప్పిన మరో హీరో... డైరెక్ట్ గా మంత్రుల అవినీతి టార్గెట్ గా వ్యాఖ్యలు...
ఒక పక్క ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల రగడ కొనసాగుతూ ఉండగానే, ఇప్పుడు ఈ వివాదంపై హీరో సిద్ధార్థ సంచలన వాఖ్యలు చేసారు. ఏపీ మంత్రులపై ఆయన ఘాటు విమర్శలు చేసారు. ఇదే విషయం పై హీరో నాని చేసిన వాఖ్యలు తీవ్ర దుమారం చేసిన సంగతి తెలిసిందే. దియటర్ల వాల్ల పది మందికి ఉద్యోగం దొరుకుతుందని అలాంటి దియటర్ల పై ఏపి ప్రభుత్వ తీరును నాని తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. దీని వల్ల దియటర్లకు చాలా నష్టం కలుగుతుందని , అయితే దియటర్ల కలక్షన్ కంటే కిరాణా కొట్ల కలక్షన్ నయం అని వాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే నాని పై ప్రభుత్వ పెద్దలు ఎదురు దా-డి చేయటంతో, హీరో సిద్ధార్థ, ననికి బాసటగా వచ్చి, ఇదే వివాదంపై తీవ్ర వాఖ్యలు చేసారు.ఈ విషయం సిద్ధార్థ ఏపి మంత్రులపై విరుచుకుపడ్డారు. ఏపీ మంత్రులు ముందు వారి విలాసాలను వదులుకోవాలని, మీ విలాసాలకు డబ్బులు ఇస్తున్నది మేమే అని, అవినీతితో మీరు వేల కోట్లు సంపాదిస్తున్నారు విలాసాలు తగ్గించుకుని తర్వాత డిస్కౌంట్‍లు ఇవ్వండని హీరో సిద్ధార్థ తీవ్ర విమర్శలు చేసారు. ఈయన ఈ విమర్శసలతో ఈ వివాదం ఇంకెంతో ముదురుతుందో చూడాలి. ఇపటికే ఇలాంటి వాఖ్యలు చేస్తున్నారనే కక్ష్య తోనే ఏపీ ప్రభుత్వం సినిమా దియటర్ల పై దాడులు చేస్తున్నది అనే అభిప్రాయం ప్రజల్లో ఉన్న విషయం తెలిసిందే. మరి ఇప్పుడు హీరో సిద్ధార్థ చేసిన ఈ వాఖ్యలతో ఈ వివాదం ఎంత దూరం వెళ్తుందో చూడాలి.